బద్రీనాథ్​ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు -పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

On
బద్రీనాథ్​ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు  -పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

బద్రీనాథ్​ దర్శనానికి వెళ్ళి వస్తూ..అనంతలోకాలకు

-పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

   *  వర్షాల ధాటికి విరిగి పడిన కొండచరియలు...
   *  ఇద్దరు హైదరాబాద్​ యాత్రికుల దుర్మరణం
   *  డెడ్​ బాడీలు బాగా డ్యామెజ్ ​కావడంతో అక్కడే అంత్యక్రియలు
   *  పద్మారావునగర్​ స్కందగిరిలో విషాదం

సికింద్రాబాద్​ జూలై 07 (ప్రజామంటలు) :

బద్రీనాథ్​ దైవ దర్శనానికి వెళ్ళిన ఇద్దరు హైదరాబాద్​ యాత్రికులు మృత్యువాత పడ్డారు. స్థానికులు, ఫ్యామిలీమెంబర్స్​ కథనం ప్రకారం..గత వారం క్రితం పద్మారావునగర్​ లోని స్కందగిరికి చెందిన దార సత్యనారాయణ (50), నిర్మల్​ షాహీ (36) తో పాటు మరో ఇద్దరు మొత్తం నలుగురు నార్త్​ ఇండియా యాత్రకు బయలు దేరి వెళ్ళారు.

శనివారం ఉదయం ఉత్తరాఖండ్​ లో రెండు బైక్​లను అద్దెకు తీసుకున్న వీరు బద్రీనాథ్​ ఆలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకొని తిరిగి వస్తుండగా, ఉత్తర ఖండ్​ లోని చమోలీ జిల్లా కర్ణప్రయోగ, గౌచర్​ ల మద్యలో బద్రీనాథ్​ నేషనల్​ హైవేపై కొండచరియలు అకస్మాత్తుగా విరిగి సత్యనారాయణ, నిర్మల్​ షాహీ లు నడుపుతున్న బైక్​ పై పడ్డాయి.

పెద్ద, పెద్ద బండరాళ్ళు పడటంతో వీరిద్దరితో పాటు బైక్​ పూర్తిగా డ్యామేజ్​ అయ్యింది. బండరాళ్ళ తాకిడికి ఇద్దరి శరీరాలు చిధ్రమైపోగా, సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకొని, శిథిలాల కింద నుంచి వారి డెడ్​ బాడీలను బయటకు తీశారు. ఉత్తరాఖండ్​ వ్యాప్తంగా వర్షాలు కురుస్తుండగా, నదులన్నీ ప్రమాదకర స్థితిలో ప్రవహిస్తున్నాయని సమాచారం.

పోలీసులు హైదరాబాద్​ లోని వారి ఫ్యామిలీ మెంబర్స్​ కు ప్రమాద సమాచారం అందించారు. వెంటనే ఇక్కడి వారి కుటుంబసభ్యులు ఫ్లైట్​ లో ఆదివారం తెల్లవారుజామున  హుటాహుటిన ఢిల్లీకి వెళ్ళి, అక్కడి నుంచి ఉత్తరాఖండ్​ వెళ్ళారు. అయితే ఇద్దరి శరీరాభాగాలు బాగా డ్యామేజ్​ కావడంతో అక్కడి పోలీస్​ అధికారుల సూచన మేరకు అక్కడే అంత్యక్రియలను నిర్వహించినట్లు ఫ్యామిలీ మెంబర్స్​  ఫోన్​ లో తెలిపారు.

ప్రమాదం వార్త తెలియగానే స్కందగిరిలో సత్యనారాయణ నివాసం ఉండే  ప్రియా ఆపార్ట్​ మెంట్​ లో విషాదం నెలకొంది. సత్యనారాయణ ఓ ప్రైవేట్​ జాబ్ చేస్తుండగా, అతడి భార్య హేమ చిన్న కిరాణ కొట్టు నడిపిస్తోంది. వీరికి ఒక కుమారుడు నిఖిల్​ ఉన్నారు. 
–––––––

Tags
Join WhatsApp

More News...

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి 

మున్సిపల్ ఎన్నికల నామినేషన్ కేంద్రాలను పర్యవేక్షించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి  జగిత్యాల/ కోరుట్ల/ మెట్పల్లి జనవరి 30 (ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల నామినేషన్ల దాఖలుకు చివరి రోజు కావడంతో, జగిత్యాల, కోరుట్ల,మెట్ పల్లి మున్సిపల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన నామినేషన్ కేంద్రాలను అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి  క్షేత్రస్థాయిలో సందర్శించి భద్రతా ఏర్పాట్లను పర్యవేక్షించారు. విధుల్లో ఉన్న పోలీసు అధికారులు మరియు సిబ్బందికి భద్రతాపరమైన సూచనలు...
Read More...

ఆధార్  సెంటర్ ఆపరేటర్స్ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలి అదనపు కలెక్టర్ బిఎస్ లత

ఆధార్  సెంటర్ ఆపరేటర్స్ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలి అదనపు కలెక్టర్ బిఎస్ లత             జగిత్యాల జనవరి 30 (ప్రజా మంటలు)  జిల్లా కలెక్టరేట్  సమావేశ మందిరము లో  శుక్రవారం రోజున   జిల్లా  కలెక్టర్, బి. సత్యప్రసాద్,  ఆదేశాల క్రమము జిల్లా అదనపు కలెక్టర్ బిఎస్. లత   జిల్లాలోని ఆధార్ సెంటర్ ఆపరేటర్స్ సమావేశం నిర్వహించడం జరిగింది.    యు ఐ డి ఏ ఐ నిర్దేశించిన రుసుములను మాత్రమే తీసుకోవాలని ఎవరైనా...
Read More...
State News 

సమ్మక్క–సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల కోసం పోరాటం: కవిత

సమ్మక్క–సారలమ్మ స్ఫూర్తితో తెలంగాణ ప్రజల కోసం పోరాటం: కవిత మేడారం, జనవరి 30 (ప్రజా మంటలు): సమ్మక్క–సారలమ్మలను దర్శించుకున్న అనంతరం తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మీడియాతో మాట్లాడారు. తెలంగాణ ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని అమ్మవార్లను కోరుకున్నట్లు తెలిపారు. కాకతీయుల వంటి రాజులతో పోరాడిన వనదేవతలు సమ్మక్క–సారలమ్మలు తమ జాతి కోసం నిలబడి పోరాడిన వీరవనితలని అన్నారు. గోవిందరాజు, పడిగిద్దరాజు వంశానికి చెందిన గొప్ప...
Read More...
Local News 

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి అడ్లూరి

అగ్ని ప్రమాద బాధితులను పరామర్శించిన మంత్రి అడ్లూరి గొల్లపల్లి, జనవరి 30 (ప్రజా మంటలు): ధర్మపురి పట్టణంలో ఇటీవల అగ్ని ప్రమాదానికి గురైన స్టార్ బిర్యాణి సెంటర్‌ను రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ శుక్రవారం సందర్శించారు. ఘటన వివరాలను బాధితుల నుంచి తెలుసుకున్నారు. గతంలో కూడా యాజమానికి చెందిన టెంట్ సామగ్రి అగ్ని ప్రమాదంలో నష్టపోయిందని, ఇప్పుడు బిర్యాణి సెంటర్...
Read More...
Local News 

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన సిగ్గుచేటు : జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం

ఎమ్మెల్యే కౌశిక్ రెడ్డి ప్రవర్తన సిగ్గుచేటు : జిల్లా కాంగ్రెస్ మైనారిటీ విభాగం కరీంనగర్, జనవరి 30 (ప్రజా మంటలు): హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి ఒక వీధి రౌడీలా మాట్లాడటం సిగ్గుచేటని జిల్లా కాంగ్రెస్ పార్టీ మైనారిటీ విభాగం తీవ్రంగా హెచ్చరించింది. ఈ మేరకు గురువారం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా కాంగ్రెస్ మైనారిటీ చైర్మన్ మొహమ్మద్ తాజోద్దిన్ మాట్లాడారు. వీణవంకలో...
Read More...
Local News  State News 

మారేడు ఆకుపై అమ్మవార్లు…

మారేడు ఆకుపై అమ్మవార్లు… జగిత్యాల, జనవరి 30 (ప్రజా మంటలు): జగిత్యాలకు చెందిన చిత్రకారుడు, కళాశ్రీ గుండేటి రాజు తన ప్రత్యేక కళా నైపుణ్యంతో మరోసారి అందరి ప్రశంసలు అందుకున్నారు. పవిత్రమైన మారేడు ఆకుపై సమ్మక్క–సారక్క అమ్మవార్ల ప్రతిమలను తన కుంచెతో అద్భుతంగా చిత్రీకరించి భక్తుల మనసులు గెలుచుకున్నారు. శుక్రవారం సమ్మక్క–సారక్క ఇద్దరూ గద్దెపై కొలువుదీరిన సందర్భంగా, అపారమైన భక్తితో...
Read More...
State News 

తెలంగాణ జల ద్రోహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి: హరీష్ రావు

తెలంగాణ జల ద్రోహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి: హరీష్ రావు హైదరాబాద్, జనవరి 30 (ప్రజా మంటలు): రాజకీయాలకన్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో అత్యవసరంగా ప్రెస్‌మీట్ నిర్వహించిన ఆయన… రాష్ట్రానికి జరుగుతున్న తీవ్రమైన జల ద్రోహాన్ని దేశరాజధాని ఢిల్లీ కేంద్రంగా ప్రజల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ పరిస్థితిని...
Read More...

భారతదేశ ఆర్ధిక రంగ ముఖచిత్రమే ఆర్ధిక సర్వే

భారతదేశ ఆర్ధిక రంగ ముఖచిత్రమే ఆర్ధిక సర్వే కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్‌లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025–26 భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ స్థితిని సంఖ్యలతో స్పష్టంగా చూపిస్తోంది. ప్రభుత్వ ప్రచార వాదనలకు భిన్నంగా, ఈ సర్వే భారత ఆర్థిక నిర్మాణంలో ఉన్న బలహీనతలను బహిర్గతం చేస్తోంది. ఎగుమతులు–దిగుమతులు: అసమతుల్యత స్పష్టం ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం, భారత...
Read More...
State News 

ఎన్నికల లబ్ది కోసమే  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు : కవిత 

ఎన్నికల లబ్ది కోసమే  ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్‌కు సిట్ నోటీసులు : కవిత  హైదరాబాద్, జనవరి 29 (ప్రజా మంటలు): ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు. ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత బాధాకరమైన అంశంపై ప్రభుత్వం నిజంగా సీరియస్‌గా లేదని అన్నారు....
Read More...
Local News 

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం

ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు. ఓమాన్‌లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గొల్ల అబ్బులు మృతదేహం తెలంగాణ ప్రభుత్వ ఖర్చులతో హైదరాబాద్‌కు చేరింది. డిసెంబర్ 9న ‘ఇబ్రి’ ఎడారిలో మృతి చెందిన ఆయన మృతదేహం 52 రోజుల అనంతరం స్వదేశానికి వచ్చింది. కుటుంబం...
Read More...
Crime  State News 

ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు

ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్‌కు సిట్ నోటీసులు హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు. తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్‌లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు. నోటీసుల్లో భాగంగా,...
Read More...
Local News  State News 

జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు

జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు కేంద్ర ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రమాదకరం : కల్వకుంట్ల కవిత
Read More...