కోడిమ్యాల ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
కోడిమ్యాల ఆసుపత్రి ఆకస్మిక తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్
హరిత హారంలో భాగంగా నర్సరీ మొక్కల పరిశీలన
కొడిమ్యాల్ జులై 4 (ప్రజా మంటలు) :
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసి ఆసుపత్రి రికార్డులను, పరిసరాలను జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ పరిశీలించారు.
గురువారం రోజున కోడిమ్యాల మండలంలో ప్రభుత్వ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓ పి సేవలు, ఆన్ లైన్ రిజిస్టర్లను కలెక్టర్ పరిశీలించారు. ఆసుపత్రిలో ప్రసూతి సేవలను, వైద్య సేవలను మెరుగు పరచాలని, డాక్టర్లు సమయ పాలన పాటించాలని కలెక్టర్ ఆదేశించారు. రోజుకు ఎన్ని ఓ.పి.లను చూస్తున్నారు, ఆసుపత్రిలో పేషెంట్లకు శుభ్రమైన త్రాగునీరు అందిస్తున్నారా అని తెలుసుకున్నారు. సీజనల్ వ్యాధులైన మలేరియా, డెంగ్యూ మరియు ఇతర వ్యాధుల పట్ల అప్రమత్తమై పేషెంట్లకు ఇబ్బంది కలుగకుండా వైద్య సేవలు కల్పించాలని సూచించారు. ల్యాబ్ విభాగాన్ని తనిఖీ చేసి టి-హబ్ కి పంపే డయాగ్నోస్టిస్ పరీక్షల రికార్డును కలెక్టర్ పరిశీలించారు. ఐ.సి. యు. కి సంబంధించిన పరికరాలను కలెక్టర్ పరిశీలించారు. ఎమ్మార్వో కార్యాలయాన్ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రికార్డుల నమోదు సరిగా ఉన్నాయా లేదా అని రికార్డులను పరిశీలించారు. అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారు. గ్రామాలలో మురుగు నీరు నిల్వ ఉండకుండా శానిటేషన్ ఎప్పటికప్పుడు చేస్తున్నారా అని తెలుసుకున్నారు. హరిత హారంలో భాగంగా నర్సరీ మొక్కలను కలెక్టర్ పరిశీలించి ఎన్ని మొక్కలు ఉన్నాయి, ఏ మొక్కలు ఎక్కువగా పంపిణీ జరుగుతుంది, ఇంట్లో పెంచుకునే మొక్కలు ఏమేమి ఉన్నాయి అని అడిగారు. మొక్కలకు నీరు పోసి సంరక్షించాలని కలెక్టర్ అధికారులకు సూచించారు. అదే విధంగా డ్రైనేజి వ్యవస్థను కలెక్టర్ పరిశీలించారు. వర్షాకాలంను దృష్టిలో ఉంచుకుని నీటి నిల్వలు ఉండకుండా, ఇండ్లలోకి నీరు వెళ్ళకుండా నీటిని దారి మళ్లించి పెద్ద డ్రైనేజిని నిర్మించడానికి తగిన చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
కలెక్టర్ వెంట జగిత్యాల ఆర్డిఓ మధుసూధన్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి సమీయుద్దీన్, సంబంధిత అధికారులు, ఎమ్మార్వో, ఎంపీడీఓ, మున్సిపాలిటీ సిబ్బంది, వివిధ శాఖ అధికారులు, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మైనర్లు వాహనాలు నడిపితే చర్యలు తప్పవు *పట్టణ సీఐ కరుణాకర్

బి ఆర్ ఎస్ అధినేత కేసీఆర్ పంపిన చెక్కును బీఆర్ఎస్ కార్యకర్తకు అందించిన కోరుట్ల ఎమ్మెల్యే డా. కల్వకుంట్ల సంజయ్ మాజీ ఎమ్మెల్యే సుంకె రవి శంకర్

ప్రజాస్వామ్యంలో జర్నలిస్టులు మూలస్తంబాలు - సీనియర్ సిటీజేన్స్ రాష్ట్ర కార్యదర్శి హరి ఆశోక్ కుమార్.

నవ్య బాలికల కళాశాలలో ఘనంగా స్వాగతోత్సవ వేడుకలు

టీయూడబ్ల్యూజే (ఐజేయు) జగిత్యాల జిల్ల ప్రెస్ నూతన కమిటీని సన్మానించిన బిజెపి రాష్ట్ర సీనియర్ నాయకులు ముదిగంటి రవీందర్ రెడ్డి.

భూ కబ్జాదారుల చేతుల్లో ప్రభుత్వ భూమి

ప్రజలకు అందుబాటులో ఉంటూ మెరుగైన సేవలందించాలి: జిల్లా ఎస్పీ అశోక్ కుమార్

హిందువులు, బౌద్ధులు, సిక్కులు కాకుండా ఇతర వ్యక్తుల ఎస్సీ సర్టిఫికెట్లు రద్దు చేస్తాం:మహారాష్ట్ర సీఎం ఫడ్నవీస్
.jpeg)
సికింద్రాబాద్ ఎలక్ర్టికల్స్ ట్రేడర్స్ ప్రెసిడెంట్ గా సురేశ్ సురానా

గాంధీ మెడికల్ కాలేజీలో బోనాల ఉత్సవాలు
