పదవి బాధ్యతలు ముగిస్తూ మొక్కలు నాటిన జడ్పీ చైర్పర్సన్ వసంత
పదవి బాధ్యతలు ముగిస్తూ, మొక్కలు నాటిన జడ్పీ చైర్పర్సన్ వసంత
జగిత్యాల జులై 4 (ప్రజా మంటలు) :
జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా పదవీ బాధ్యతలు ముగుస్తున్న సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయం ఆవరణలో జగిత్యాల జెడ్పీ చైర్ పర్సన్ దావ వసంతసురేష్ మొక్కలు నాటినారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తరువాత రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి గౌ.కెసిఆర్ రాబోయే భవిష్యత్తు తరాలకు నీళ్లను కొనుగోలు చేసే విధంగా గాలిని కొనుగోలు చేసే దుస్థితి రాకుండా ఉండేందుకు గ్రామీణ ప్రాంతాల్లో పచ్చ దనం పరిశుభ్రత పై దృష్టి పెట్టి హరిత-హారం అనే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు.
ప్రతి పల్లెలో పచ్చటి చెట్లతో ఆహ్లాదకరమైన వాతవరణాన్ని సృష్టించిన ఘనత గౌ.తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ కే దక్కుతుందన్నారు..
కెసిఆర్ గారి నాయకత్వంలో ప్రవేశ పెట్టిన అనేక సంక్షేమ కార్యక్రమాల్లో జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గా ఐదు సంవత్సరాల పదవి కాలంలో నాకు చాల ఇష్టమైన కార్యక్రమం హరిత హారం అనే అన్నారు.
ఐదు సంవత్సరాల పదవి కాలంలో దాదాపుగా 380 గ్రామాల్లో పల్లె ప్రకృతి వనాలు,మంకీ ఫుడ్ కోర్టు, అహ్లాదకరమైన చెట్లను నాటి రాష్ట్రంలో జగిత్యాల జిల్లా ప్రథమ స్థానంలో నిలిపి అనేక అవార్డులను పొందామంటే దినంతటికి కారణం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులు మరియు అధికారుల సమన్వయంతోనే సాధ్యం అయిందని అన్నారు.
హరిత హారం అనే కార్యక్రమాన్ని ప్రతి ఒక్కరు సామాజిక బాధ్యతగా భావించి మీ పుట్టిన రోజున కాని మరేదైనా శుభకార్యం రోజున ఒక్క మొక్కను నాటి భవిష్యత్తు తరాలకు స్వచ్చమైన గాలిని ఇవ్వచ్చన్నారు.
గత ప్రభుత్వం చేపట్టిన హరితహరం కార్యక్రమాన్ని కొనసాగింపుగా ఇప్పటి ప్రభుత్వం వనమహోత్సవంగా పేరు మర్చారు.
జగిత్యాల జిల్లా ప్రజలందరం భాగస్వామ్యమై కలిసి కట్టుగా ఇంటిల్లి పాదినీ ఆరోగ్యకరంగా ఉంచుకునేందుకు చెట్లను నాటి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని అన్నారు..
ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ గౌతంరెడ్డి, డిప్యూటీ సీఈఓ రఘువరణ్ పి ఆర్ ఈ ఈ రహమాన్ మరియు జిల్లా పరిషత్, పంచాయితి రాజ్ ఇంజనీరింగ్ విభాగం సిబ్బంది పాల్గొన్నారు...
More News...
<%- node_title %>
<%- node_title %>
అహ్మాదీయ ముస్లిం కమ్యూనిటీ మహిళా విభాగం ఆధ్వర్యంలో బ్లడ్ డోనేషన్

జర్నలిస్టుల సంక్షేమమే ధ్యేయంగా పనిచేయాలి.

బోనాల జాతరలో భక్తులకు సేవ చేయడం అదృష్టం

రాసుల కొద్దీ తెప్పించుకుంటున్నారు...కాని తనకు గోరంత కూడ దక్కడం లేదు- రంగంలో భవిష్య వాణి వినిపించిన స్వర్ణలత

వేలేరు మాజీ జడ్పిటిసి చాడ సరిత అంత్యక్రియల్లో పాల్గొన్న ప్రముఖులు

ఇప్పుడే బుగ్గారం పంచాయతీ ఎన్నికలు వద్దు

తీన్మార్ మల్లన్నపై కఠిన చర్యలు తీసుకోవాలి- మహిళా కమిషన్ కు తెలంగాణ జాగృతి నాయకుల ఫిర్యాదు

ఉపాధ్యాయుల సమస్యలు పరిష్కరించాలి-పీ ఆర్ టీ యు జిల్లా ప్రధాన కార్యదర్శి అమర్ నాథ్ రెడ్డి

ఫుట్ పాత్ అనాధలను ప్రభుత్వం ఆదుకోవాలి

గంగపుత్ర సంఘానికి రూ.4 లక్షల ఎంపీ నిధుల కేటాయింపు

ప్రముఖ నటి బి.సరోజాదేవి కన్నుమూత
.jpg)
ఆడబిడ్డలను గౌరవించే తెలంగాణలో ఇలాంటి వ్యాఖ్యలేంటి- మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే వాళ్లు రాజకీయాల్లోకి ఎలా వస్తరు?
