ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తొ ఉప ముఖ్యమంత్రి భట్టి సంప్రదింపులు - సాయంత్రానికి స్పష్టత 

On
ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తొ ఉప ముఖ్యమంత్రి భట్టి సంప్రదింపులు - సాయంత్రానికి స్పష్టత 

ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తొ ఉప ముఖ్యమంత్రి భట్టి సంప్రదింపులు - సాయంత్రానికి స్పష్టత 

హైదారాబాద్ జూన్ 25: 

జగిత్యాల మాజీ శాసన సభ్యులు, ప్రస్తుత ఎమ్మెల్సీ తాటిపర్తి జీవన్ రెడ్డి రాజీనామాను ఉపసంహరించుకోవడానికి ఉప ముఖ్యమంత్రి మళ్ళీ భట్టి బేగంపేట్ లోని జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొన్నారు.

జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్. కాంగ్రెస్ లో తనకు తెలియకుండా చేరడంతో, మనస్థాపం చెందిన జీవన్ రెడ్డి, తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయాలని నిర్ణయించుకున్నట్లు తెలియడంతో మళ్ళీ భట్టి తోపాటు, మంత్రి శ్రీధర్ రెడ్డి, ప్రభుత్వ విప్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ జీవన్ రెడ్డి ఇంటికి చేరుకొన్నారు. 

పార్టీలో మీరు సీనియర్, నాలుగు దశాబ్దాల అనుభవం ఉన్న మీకు తగిన న్యాయం చేస్తామని, రాజీనామా ఆలోచన విరమించుకోవాలని కోరినట్లు తెలుస్తోంది. 

తనను సంప్రదించకుండా ఎమ్మెల్యేను పార్టీలో చేర్చుకోవడం తనను అవమాణించినట్లుగానే భావిస్తున్నామని, జగిత్యాలలో ఆయనతో కలిసి పనిచేయడం సాధ్యం కాదని నిక్కచ్చిగా జీవన్ రెడ్డి భట్టుతో చెప్పినట్లు సమాచారం. ఇంకా సంప్రదింపులు కొనసాగుతున్నాయి. జీవన్ రెడ్డి రాజీనామా ఆలోచన ముఖ్యమంత్రి డిల్లి నుండి వచ్చే వరకు వాయిదా వేసుకోవాలనే మిత్రుల, మంత్రుల సూచనతో, జీవన్ రెడ్డి వెనిక్కి తగ్గవచ్చని అనుకొంటున్నారు. సాయంత్రం వరకు ఈ విషయంలో స్పష్టత రావచ్చు.

Tags