జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్చడం సరైన సమయంలో సరియైన నిర్ణయమేనా?
జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ పార్టీ మార్చడం సరైన సమయంలో సరియైన నిర్ణయమేనా?
కాంగ్రెస్ పార్టీలో కలవరం లేపిన సంజయ్ చేరిక
ఇది రెడ్డి - రావుల కలయికా? కలహమా?
ఎమ్మెల్యే కాంగ్రెస్లో చేరిక బిజేపి కి లాభామా ?
(సిరిసిల్ల రాజేందర్ శర్మ 9348422113)
జగిత్యాల జూన్ 24 (ప్రజా మంటలు) : జగిత్యాల కాంగ్రెస్ పార్టీలో అనుకోని కుదుపు. నాలబై ఏళ్లుగా ఎదురులేని జీవన రెడ్డికి పోటీగా వెలమ సామాజిక వర్గం నుండి పోటీ రావడం ఆయన జీర్ణించుకోలేకపోతున్నారని అనుకొంటున్నారు. జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమర్ కాంగ్రెస్ పార్టీ హవాలో సైతం గెలవడం ఆయనకు వ్యక్తిగతంగా, వైద్యునిగా ఉన్న మంచి పేరు బహుశా సంజయ్ కి కలిసి వచ్చి రెండవసారి సైతం గెలువగలిగాడు అనే వాళ్ళు లేకపోలేదు. ఇదిలా ఉండగా డా. సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం పట్ల పలువురు ఆశ్చర్యం ప్రకటిస్తున్నప్పటికీ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఐదు సంవత్సరాల పాటు రాజకీయ నిరుద్యోగిగా ఉండడం ఎలాంటి నియోజకవర్గ అభివృద్ధి పనులు చేసే పరిస్థితులు కష్టమవుతుందేమోనని ఆ ఉద్దేశంతోనే సంజయ్ పార్టీ మారినట్లు పలువురు నియోజకవర్గ ప్రజలు భావిస్తున్నారు.ఈ ఇద్దరు నాయకులు ఒకే పార్టీలో ఉంది తగువులాడుకోవడం వల్ల బిజేపి లాభపడవచ్చని చర్చించుకొంటున్నారు.
కాంగ్రెస్ పార్టీలో సంజయ్ సమన్వయంతో పనిచేయగలుగుతాడా? అని పలువురు సంజయ్ పార్టీ మార్పు పట్ల చర్చించుకుంటున్నారు. ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్లోకి వెళ్లడం వ్యక్తిగతంగా ఆయనకు ప్రయోజనం జరగవచ్చుకానీ తనను నమ్ముకున్న వారికి మోసగించి కాంగ్రెస్ పార్టీలోకి చేరినారని బారాస నాయకులు కార్యకర్తలు బాహాటంగానే విమర్శిస్తూ సోమవారం డా. సంజయ్ దిష్టిబొమ్మను తగలబెట్టి తమ ఆవేదనను, ఆగ్రహాన్ని వ్యక్తం చేయడమే కాకుండా పెద్ద మొత్తంలో కాంగ్రెస్ పార్టీ లోకి మారినందుకు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ కు కోట్ల రూపాయలు ఆయన బ్యాంకు ఖాతాలో కాంగ్రెస్ పార్టీ జమ చేసిందని ధర్నా లో పాల్గొన్న పలువురు బారాస నాయకులు విమర్శించడం కొసమెరుపు . కాగా రాజకీయ దిగ్గజమైన ప్రస్తుత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి తో సమన్వయము డా. సంజయ్ కి కుదురుతుందా? మొదటి నుండి ఎమ్మెల్సీ జీవన్ రెడ్డికి సంజయ్ కుమార్ కు పార్టీలపరంగా మరియు ఒకరిపై ఒకరు వ్యక్తిగత విషయాలపై కూడా దుమ్మెత్తి పోసుకున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో జీవన్ రెడ్డితో సంజయ్ కుమార్ చివరి వరకు కొనసాగుతారా? అనే సందిగ్ధాన్ని సంజయ్ అభిమానులు చర్చించుకుంటున్నారు.
చివరి వరకు పార్టీ మార్చే విషయాన్ని చాలా రహస్యంగా ఉంచి పార్టీ క్యాడర్ కు ఎలాంటి సంకేతాలు లేకుండా ముఖ్యమంత్రి రేవంత్ ను కలిసి కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకోవడం అటు కాంగ్రెస్ పార్టీలోని కొందరు జీర్ణించుకోలేకపోతున్నారు. అదేవిధంగా జెడ్పి చైర్ పర్సన్ దావ వసంత, బారాస నాయకులు ,కార్యకర్తలు సోమవారం జిల్లా కేంద్రములోని తాసిల్ చౌరస్తా వద్ద సంజయ్ కుమార్ దిష్టిబొమ్మ దగ్ధం చేసి ఆగ్రహం వ్యక్తం చేశారు. డా .సంజయ్ కుమార్ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత జరిగే పరిణామాలు ఏ విధంగా ఉంటాయి మిలియన్ డాలర్ల ప్రశ్నగా మిగులుతుందా? ఎన్నో సంవత్సరాలుగా గెలుపు ఓటములను లెక్కచేయకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగుతున్న జీవన్ రెడ్డి ఎమ్మెల్యే డా సంజయ్ రాకను స్వాగతిస్తారా? లేదా తాను ఎమ్మెల్సీగా కొనసాగడమా? రాజీనామా చేయడమా? అనే ఆలోచనలో పడ్డట్టు పలువురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు చర్చించుకుంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ జగిత్యాల నియోజకవర్గం పలుమార్లు రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వం ఒకటైతే శాసనసభ్యులు వేరే పార్టీ వారు ఉండడం అభివృద్ధి నోచుకోక పోయిందని అపవాది ఉండేది. సంజయ్ కుమార్ కాంగ్రెస్ లోకి ప్రవేశించడంతో తాను గతంలో బారాస ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు చేయలేని పెండింగ్ పనులు కాంగ్రెస్ పార్టీలోకి వచ్చిన తర్వాత చేయడానికి, నియోజకవర్గానికి కావలసిన నిధులు తేవడానికి ఎంతవరకు ఉపయోగపడుతుందో చూడాల్సిందేనని నియోజకవర్గ ప్రజలు చర్చించుకుంటున్నారు. నాలుగురైదుగురు ఎమ్మెల్యేలు, మంత్రి శ్రీధర్ బాబు వచ్చి సముదాయించినా, జీవన రద్దీ తన నిర్ణయాన్ని వాయిదావేసుకొన్నారే కానీ, వారి ప్రతిపాదనలకు ఒప్పుకోలేదని తెలుస్తుంది.
ఒక వేళ ఈ ఇద్దరూకాంగ్రెస్ పార్టీలోనే కొనసాగితే ఇటు కార్యకర్తలు, అటు అధికారులు ఇబ్బందులను ఎదుర్కొనక తప్పని పరిస్థితులు ఏర్పదనున్నాయి. ఇద్దరు వెనిక్కి తగ్గే స్వభామ లేకపోవడం, రాజకీయ అనుభవంతో రాష్ట్ర స్థాయిలో నెగ్గుక రాగళననే ధీమాతో ఉన్న జీవన రెడ్డి, ఎమ్మెల్యే అనే అధికార భావనతో సంజయ్ కుమార్ లు వ్యవహరించడం వల్ల జగిత్యాల అభివృద్ధి కుంటుపడుతుందో లేక మరిన్ని ఎక్కువ నిధులతో అభివృద్ధి చెందుతుందా అనేది కాలమే చెపుతుందని ప్రజలు భావిస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
రాజన్న సిరిసిల్లలో తల్లి–కొడుకు ఆత్మహత్య : కానిస్టేబుల్ అభిలాష్ విషాద మరణం
సిరిసిల్ల నవంబర్ 28 (ప్రజా మంటలు):
సిరిసిల్ల పట్టణంలోని మానేరు వాగులో తల్లి–కొడుకు ఇద్దరూ ఆత్మహత్య చేసుకున్న ఘటన జిల్లాలో తీవ్ర విషాదాన్ని నింపింది. మహిళ ఆత్మహత్యను తట్టుకోలేక ఆమె కుమారుడు కూడా ప్రాణాలు తీసుకున్న ఈ సంఘటన స్థానికులను కలచివేసింది.
తల్లి లలిత మానేరు వాగులో దూకి ఆత్మహత్య
సిరిసిల్లలోని మానేరు వాగులో లలిత... తెలంగాణ పంచాయతీ ఎన్నికలను వెంటనే రద్దు చేయాలి - బిసి కమీషన్ చైర్మన్ నిరంజన్
హైదరాబాద్ నవంబర్ 28 (ప్రజా మంటలు):
తెలంగాణ పంచాయతీ ఎన్నికల్లో బీసీలకు అన్యాయం జరిగిందని, ఈ ఎన్నికలను వెంటనే రద్దు చేసి, రిజర్వేషన్లను సరిచేసి మళ్లీ నిర్వహించాల్సిందేనని బీసీ కమిషన్ చైర్మన్ జి. నిరంజన్ తీవ్రంగా డిమాండ్ చేశారు.
“2019లో 22.78% ఇచ్చి… ఇప్పుడు అదికూడా తగ్గించడం ఏ న్యాయం?” – నిరంజన్ ప్రశ్న
2019... మహాత్మ జ్యోతిరావు పూలే వర్ధంతి – కాంగ్రెస్ నేతల ఘన నివాళులు
కరీంనగర్, నవంబర్ 28 (ప్రజా మంటలు):
మహాత్మ జ్యోతిబా పూలే వర్ధంతి సందర్భంగా డిసిసి కార్యాలయం మరియు శాతవాహన యూనివర్సిటీ వద్ద జిల్లా కాంగ్రెస్ బీసీ సెల్ ఆధ్వర్యంలో ఘన కార్యక్రమాలు జరిగాయి.
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు పులి ఆంజనేయులు గౌడ్, కార్పొరేషన్ కాంగ్రెస్... తండ్రి హత్యకు ప్రతీకారంగా మాజీ నక్సలైట్ నర్సయ్యను హతమార్చిన కొడుకు
సిరిసిల్ల నవంబర్ 28 (ప్రజా మంటలు):
రాజన్న సిరిసిల్ల జిల్లా తంగళ్లపల్లి మండలం గండి లచ్చపేటకు చెందిన మాజీ నక్సలైట్ బల్లెపు సిద్దయ్య అలియాస్ నర్సయ్య (46) దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన వేములవాడ అర్బన్ మండలం అగ్రహారం గుట్ట వద్ద జరిగింది.
జగిత్యాల పట్టణానికి చెందిన సంతోష్ అనే వ్యక్తి నర్సయ్యను హతమార్చి,... వృద్దుల కోసం జెరియాట్రిక్ వైద్య సేవలు -జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్.
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు):
వయో వృద్ధులు (సీనియర్ సిటిజెన్లు ) ప్రత్యేక జెరియాట్రిక్ వైద్య సేవలు, కన్సల్టేషన్ కార్యక్రమాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా సంక్షేమాధికారి డాక్టర్ బి. నరేష్ కోరారు. శుక్రవారం ప్రభుత్వ జనరల్ ఆస్పత్రిలో వయో వృద్ధుల కోసం ప్రభుత్వం ఏర్పాటు చేసిన జెరియాట్రిక్ ఉచిత వైద్య సేవల విభాగాన్ని జిల్లా... కామారెడ్డిలో కల్వకుంట్ల కవిత అరెస్ట్ - హైదరాబాద్ తరలింపు
కామారెడ్డి నవంబర్ 28 (ప్రజా మంటలు):
కామారెడ్డి రైలు రోకో కార్యక్రమంలో పాల్గొన్న బీఆర్ఎస్ నేత కల్వకుంట్ల కవితను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు అనంతరం ఆమె తీవ్రంగా స్పందించారు.ఆమెను హైదరాబాద్ తరలించారు.
బీజేపీకే స్పష్టమైన హెచ్చరిక
“రైల్ రోకో చేసి ఢిల్లీ వరకు మెసేజ్ పంపిస్తున్నాం.”
“కచ్చితంగా బీజేపీ దిగిరావాలి… బీజేపీ ఎంపీలు... స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై సమీక్ష
హైదరాబాద్, నవంబర్28 (ప్రజామంటలు):
రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి స్వర్గీయ డా. మర్రి చెన్నారెడ్డి 29వ వర్ధంతి కార్యక్రమాల ఏర్పాట్లపై బేగంపేట్లోని బీజేపీ కార్యాలయంలో శుక్రవారం సాయంత్రం సమీక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మాజీ మంత్రి, NDMA మాజీ ఉపాధ్యక్షులు, బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యులు శ్రీ మర్రి శశిధర్ రెడ్డి నేతృత్వం వహించారు.
డిసెంబర్... బాపు నగర్ సమగ్రాభివృద్ధికి చర్యలు తీసుకుంటాం - పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ
సికింద్రాబాద్, నవంబర్ 28 (ప్రజామంటలు) :
సనత్ నగర్ నియోజకవర్గంలోని పలు ప్రాంతాల్లో పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్ నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ శుక్రవారం బస్తీ పర్యటన నిర్వహించారు. ప్రజా సమస్యలపై పర్యటన చేసిన కోట నీలిమ సనత్ నగర్ నియోజకవర్గంలోని అమీర్ పేట్ డివిజన్ లోని బాపు... గాంధీ ఆసుపత్రి ఆర్థోపెడిక్స్ విభాగానికి పరికరాల విరాళాలు
గాంధీకి వచ్చే పేద రోగులకు సాయమందించండి..
సికింద్రాబాద్ నవంబర్ 28 (ప్రజామంటలు) :
పేద రోగులు వచ్చే గాంధీ ఆసుపత్రిలో వారికి మరింత మెరుగైన వైద్య సౌకర్యాలు అందించేందుకు గాను కార్పొరేట్, స్వచ్చంద సంస్థలు ముందుకు రావాలని గాంధీ మెడికల్ కాలేజీ ప్రిన్సిపాల్ డా.ఇందిరా, సూపరింటెండెంట్ డా.వాణి లు పిలుపు నిచ్చారు. శుక్రవారం గాంధీ ఆసుపత్రి... బాల్యవివాహాల రహిత భారత దేశం కోసం విద్యార్థులచే ప్రతిజ్ఞ
మహిళా భివృద్ధి శిశు సంక్షేమ శాఖ జగిత్యాల ఆధ్వర్యంలో (అంకం భూమయ్య)
గొల్లపల్లి నవంబర్ 28 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండలంలోని రాపల్లి గ్రామంలో జడ్పీహెచ్ఎస్ హైస్కూల్ మరియు నందిపల్లి పంచాయతీ ఆవరణలో బాల్యవివాహాల నిరోధం పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు జిల్లా బాలల పరిరక్షణ విభాగం నుండి పరిరక్షణ అధికారి పడాల సురేష్, జాన్సన్... సూర్య ధన్వంతరి ఆలయంలో కాలభైరవాష్టమి సందర్భంగా ప్రత్యేక కుంకుమ పూజలు
.
జగిత్యాల నవంబర్ 28(ప్రజా మంటలు) పట్టణము లోని శ్రీ సూర్య ధన్వంతరి దేవాలయం లో శ్రీ ధనలక్ష్మి సేవా సమితి అధ్వర్యంలో శుక్రవారం కాలభైరవాష్టమి పర్వదినం పురస్కరించుకొని, మాతలు పాల్గొని అమ్మవారికి ప్రత్యేక కుంకుమార్చన, లలితా సహస్ర నామాల స్థోత్ర పారాయణం చేసారు.
పారాయణం అనంతరం మాతలు అమ్మ వారికి ఒడి బియ్యం సమర్పించారు.కుంకుమ... మర్యాద పూర్వకముగా ఎమ్మెల్యే ను కలిసిన డి సి సి అధ్యక్షుడు నందయ్య
జగిత్యాల నవంబర్ 28 (ప్రజా మంటలు)జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ ని వారి నివాసం లో మర్యాదపూర్వకంగా కలిసి పుష్ప గుచ్చన్ని అందజేసి,శాలువా తో సత్కరించిన జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులుగా నూతనంగా నియామకం అయిన గాజెంగి నందయ్య ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నందయ్య కి హార్దిక... 