ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనకి చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనకి చేసిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జూన్ 20 (ప్రజా మంటలు)
రోగులకు అందుతున్న వైద్య సేవలు పరిశీలించడానికి ఆసుపత్రి సందర్శన చేయడం జరిగిందని జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ అన్నారు. గురువారం రోజున స్థానిక ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిని కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఆసుపత్రిలోని పలు వార్డులను ఆయన సందర్శించి వైద్యులకు పలు సూచనలు అందించారు. ఆసుపత్రిలోని ఎమర్జెన్సీ వార్డు, ఐ.సి.యు. , ఆపరేషన్ థియేటర్, మేల్, ఫిమేల్ వార్డులు, సిటీ స్కాన్, స్కానింగ్ రూమ్, ఎక్స్-రే, క్యాన్సర్ రోగుల చికిత్స కేంద్రాన్ని, వయో వృద్ధుల ఫిజియో థెరపీ సేవ కేంద్రంలను కలెక్టర్ పరిశీలించారు. ఆయా వార్డులలోని రోగులతో ముచ్చటిస్తూ అందుతున్న వైద్య సేవలను అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి ప్రాంగణంలో ప్రైవేట్ జీవనాధార మందుల దుకాణం ఏర్పాటుపై వైద్యులను అడిగి తెలుసుకుని వెంటనే తోలగించాలని సూచించారు. ఆసుపత్రిలో శానిటేషన్ నిర్వహణపై అసంతృప్తి వ్యక్తం చేస్తూ రేపటిలోగా చెత్త చెదారాన్ని, పనికిరాని స్క్రాప్ ను తొలగించాలని శానిటేషన్ ఇంచార్జీని ఆదేశించారు.
కలెక్టర్ వెంట ఆసుపత్రి సూపరింటెండెంట్ రాములు, ఆర్.ఎం.ఓ. రాజేంద్ర ప్రసాద్, వైద్యులు, వైద్య సిబ్బంది ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీసాయి సప్తాహం ముగింపువేడుకలు

మృతుల కుటుంబాలను పరామర్శించిన మాజీ శాసనసభ్యులు అలిగిరెడ్డి ప్రవీణ్ రెడ్డి

నేడు అధికారభాష హిందీ గోల్డెన్ జూబ్లీ వేడుకలు

కిమ్స్-సన్షైన్ హాస్పిటల్స్, బేగంపేటలో కేవలం 3 నెలల్లో 50 రోబోటిక్ సర్జరీలు

ఉద్యోగులు సామాజిక సేవా కార్యక్రమాల్లోనూ పాల్గొనాలి

ఆరోగ్యవంతులైన బాలికలే దేశ భవిత

మీ హామీలపై చర్చిద్దాం రండి - సీఎం రేవంత్ రెడ్డికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సవాల్

కొండగట్టు 30.వ.గిరిప్రదక్షిణ ఆదివారం మద్యం, మాంసం మానేద్దాం'

కేజీవీలతో ట్రాక్టర్లు తారు రోడ్డుపై తిరిగితే కేసులు నమోదు - ఎస్ఐ, కృష్ణ సాగర్ రెడ్డి

బాల్య వివాహాల నిర్మూలనపై అవగాహన కార్యక్రమం

షిరిడి సాయి మందిరంలో ఘనంగా గురు పూర్ణిమ వేడుకలు

జగిత్యాల జిల్లా జర్నలిస్ట్ సంఘ్ అధ్యక్షునిగా చీటీ శ్రీనివాస్ రావు
