జగిత్యాల నియోజకవర్గానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు ఎన్ని కంపెనీలు తీసుకువచ్చారు ??
- బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డాక్టర్ బోగ శ్రావణి.
(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963339493/9348422113).
జగిత్యాల జూన్ 15 (ప్రజా మంటలు )
నియోజకవర్గంలో 4520 మందికి డబుల్ బెడ్ రూమ్ ఇల్లు సాంక్షన్ అయ్యి నిరుపయోగం గా వుంటే వాటి గురించి పట్టించుకోకుండా కేవలం వారికి కావలసిన వర్గానికి కావాల్సిన వారి కోసమే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ఇద్దరూ పాకులాడుతున్నారు.
ఎమ్మెల్సీ మరియు ఎమ్మెల్యే ఇద్దరు నాయకులను సూటిగా ప్రశ్నిస్తున్న జగిత్యాల కి మీరిద్దరూ కలిసి ఎన్ని కంపెనీలు తీసుకొచ్చారు ఎంతమంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించారు ఎన్ని ఇంటర్నేషనల్ కంపెనీలు జగిత్యాలకు తీసుకువచ్చారు శ్వేత పత్రం విడుదల చేయగలరా??
బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు జగిత్యాల్ నియోజకవర్గ ఇన్చార్జ్ డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ...
జీవన్ రెడ్డి 4వ వార్డ్ లో ఒక ఇంటి నిర్మాణాన్ని అక్రమ కట్టడం అని కలెక్టర్ కి కంప్లైంట్ ఇచ్చారు మరి అదే వార్డులో అదే ఇంటి ముందు ఇంకో ఇల్లు కట్టడం జరుగుతుంది. మరి దానిపై మీరు ఎందుకు స్పందించలేదు ...?
ఒక వర్గానికి చెందిన వారిపై ప్రేమ.?
అక్రమ కట్టడంపై వార్డులో ఒక వ్యక్తికి నోటీసులు వచ్చినప్పుడు అదే ఇంటి ముందు జరుగుతున్న ఇంకో అక్రమ కట్టడానికి ఎందుకు నోటీసులు ఇవ్వడం లేదు.
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ అక్రమ కట్టడాలు ఎవరు కట్టిన చర్యలు తీసుకోవాలి కేవలం మీ అనుచరుడిని వెనుక వేసుకుని వస్తే ఎలా
నచ్చితే సక్రమం నచ్చకపోతే అక్రమం అనేది ఎమ్మెల్యే మీకు వర్తిస్తుంది
ఈ మాటలు చూస్తే దయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉంది
ఒక ఎమ్మెల్యే ఎమ్మెల్సీ హోదాలో ఉండి మీరు ఈ అక్రమ కట్టడాలను ఎంకరేజ్ చేస్తున్నట్టే కదా...?
ఒక అక్రమ కట్టడం గురించి ఒక ఎమ్మెల్యే ఒక ఎమ్మెల్సీ స్థాయి వ్యక్తులు ఇలా మాట్లాడడం జగిత్యాల ప్రజలు విడ్డురంగా చుస్తునారు,
జగిత్యాల్ కి ప్రతిష్టాత్మకంగా నిర్మించినటువంటి 4,520 డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల పరిస్థితి ఏంటి...?
వాటికి కనీస వసతులు కూడా లేవు కరెంట్, రోడ్లు,డ్రైనేజీ మరియు తాగునీటి వ్యవస్థ సరిగ్గా లేదు కరెంటు మీటర్లు రాక చెప్పులు అరిగేలా కరెంట్ ఆఫీస్ చుట్టూ తిరుగుతున్నారు కనీసం పట్టించుకునే నాయకుడు లేడు కనీసం నీటి వసతి కూడా అక్కడ సరిగ్గా లేదు కేవలం మున్సిపల్ వాటర్ ట్యాంక్ వచ్చి పోస్తే తప్ప వారికి నీళ్లు లేవు వారి గురించి మీరు ఎవరైనా మాట్లాడారా...
ఎమ్మెల్యే ఎమ్మెల్సీ దీనికి సమాధానం చెప్పండి...?
జీవన్ రెడ్డి మీ ప్రభుత్వం అధికారంలో ఉంది డబుల్ బెడ్ రూమ్ ఇండ్ల గురించి ఒక్కసారి అన్న సీఎం ని అడిగారా రిప్రజెంటేషన్ ఇచ్చారా అని ప్రశ్నించారు.
6 గ్యారంటీల అమలు ఏమైంది నియోజకవర్గ సమస్యలపై స్పందించండి అన్నారు.
1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఉన్న తెలుగు పుస్తకలలో ముందు మాట కె సి ఆర్ పేరు వుంది అని వెనక్కు తీసుకోవడం ఏంటి అన్నారు.
ఆంద్రప్రదేశ్ లో పాత సి ఎం ఫొటో వుంటే అవే పంచండి ప్రభుత్వ సొమ్ము వేస్ట్ చేయకండి అని ఎన్ డి ఏ భాగస్వామ్య సీఎం చంద్రబాబు నాయుడు అన్నారు
700 కోట్లతో కో-కో -కోలా కంపెనీ పక్కన ఉన్న పెద్దపెల్లి జిల్లాకు అక్కడ మంత్రి తీసుకువెళ్తే మీరు ఏం చేస్తున్నారు
జగిత్యాల జిల్లా కి అన్ని హంగులు ఉండి ముఖ్యంగా ముడి సరుకు అయిన అతిపెద్ద మ్యాంగో మార్కెట్ జగిత్యాలో ఉంది అదే కంపెనీ జగిత్యాలకు వస్తే సుమారు 2000 మంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించిన వారు అవుతారు రైతులకు మేలు చేసిన వారు అవుతారు
ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఇది మీ ఎన్నికలహామీ మీరు మర్చిపోయారా??
జీవన్ రెడ్డి మీ ప్రభుత్వంలో ఉండి మీరు జగిత్యాలకు ఏం చేస్తున్నారు ఏ కంపెనీ ఎందుకు రాలేదు జగిత్యాలకి
జగిత్యాల కు ఎమ్మెల్యే ఏంఎల్సీ ఎన్ని ఉద్యోగాలు తీస్కోచ్చారు శ్వేత పత్రం విడుదల చేస్తారా??? అని డాక్టర్ బోగ శ్రావణి ప్రశ్నించారు
ఈ కార్యక్రమంలో జగిత్యాల రూరల్ మండల అధ్యక్షుడు నలువాల తిరుపతి, జగిత్యాల పట్టణ ప్రధాన కార్యదర్శిలు ఆముదరాజు, సిరికొండ రాజన్న, మాజీ పట్టణ అధ్యక్షులు వీరభత్తిని అనిల్ కుమార్, జిల్లా ఓబీసీ మోర్చా అధ్యక్షులు కొక్కు గంగాధర్, జగిత్యాల్ పట్టణ ఇన్చార్జ్ మ్యాదరి అశోక్, పట్టణ మహిళా మోర్చా అధ్యక్షురాలు దురిశెట్టి మమత, పట్టణ ఉపాధ్యక్షులు గాదాసు రాజేందర్, మల్లేశ్వరి సింగం పద్మ మరియు తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
తెలంగాణ జల ద్రోహానికి కాంగ్రెస్ ప్రభుత్వం బాధ్యత వహించాలి: హరీష్ రావు
హైదరాబాద్, జనవరి 30 (ప్రజా మంటలు):
రాజకీయాలకన్నా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలే తమకు ముఖ్యమని మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ నేత హరీష్ రావు స్పష్టం చేశారు. శుక్రవారం తెలంగాణ భవన్‌లో అత్యవసరంగా ప్రెస్మీట్ నిర్వహించిన ఆయన… రాష్ట్రానికి జరుగుతున్న తీవ్రమైన జల ద్రోహాన్ని దేశరాజధాని ఢిల్లీ కేంద్రంగా ప్రజల ముందుకు తీసుకొచ్చామని తెలిపారు. ఈ పరిస్థితిని... భారతదేశ ఆర్ధిక రంగ ముఖచిత్రమే ఆర్ధిక సర్వే
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పార్లమెంట్లో ప్రవేశపెట్టిన ఆర్థిక సర్వే 2025–26 భారత ఆర్థిక వ్యవస్థ యొక్క వాస్తవ స్థితిని సంఖ్యలతో స్పష్టంగా చూపిస్తోంది. ప్రభుత్వ ప్రచార వాదనలకు భిన్నంగా, ఈ సర్వే భారత ఆర్థిక నిర్మాణంలో ఉన్న బలహీనతలను బహిర్గతం చేస్తోంది.
ఎగుమతులు–దిగుమతులు: అసమతుల్యత స్పష్టం
ఆర్థిక సర్వే గణాంకాల ప్రకారం, భారత... ఎన్నికల లబ్ది కోసమే ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు : కవిత
హైదరాబాద్, జనవరి 29 (ప్రజా మంటలు):
ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత స్పందించారు. ఎన్నికలు ఉన్నందునే కేసీఆర్ గారికి నోటీసులు ఇచ్చారని ఆమె వ్యాఖ్యానించారు.
ఫోన్ ట్యాపింగ్ వంటి అత్యంత బాధాకరమైన అంశంపై ప్రభుత్వం నిజంగా సీరియస్గా లేదని అన్నారు.... ప్రభుత్వ ఖర్చులతో స్వదేశానికి చేరిన గల్ఫ్ కార్మికుని మృతదేహం
హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు.
ఓమాన్లో మృతి చెందిన నిజామాబాద్ జిల్లా నవీపేట మండలం యాంచా గ్రామానికి చెందిన గల్ఫ్ కార్మికుడు గొల్ల అబ్బులు మృతదేహం తెలంగాణ ప్రభుత్వ ఖర్చులతో హైదరాబాద్కు చేరింది. డిసెంబర్ 9న ‘ఇబ్రి’ ఎడారిలో మృతి చెందిన ఆయన మృతదేహం 52 రోజుల అనంతరం స్వదేశానికి వచ్చింది.
కుటుంబం... ఫోన్ ట్యాపింగ్ కేసు: మాజీ సీఎం కేసీఆర్కు సిట్ నోటీసులు
హైదరాబాద్, జనవరి 29 – ప్రజా మంటలు.
తెలంగాణలో సంచలనంగా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసులో మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (కేసీఆర్) కు ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) నోటీసులు జారీ చేసింది. ఈ మేరకు సిట్ అధికారులు నందినగర్లోని కేసీఆర్ నివాసానికి వెళ్లి నోటీసులు అందజేశారు.
నోటీసుల్లో భాగంగా,... జాతీయ జనగణనలో బీసీలను పక్కన పెట్టే కుట్ర – రౌండ్ టేబుల్ సమావేశంలో తీవ్ర విమర్శలు
కేంద్ర ప్రభుత్వ డాక్యుమెంట్ ప్రమాదకరం : కల్వకుంట్ల కవిత కులగణనలో బీసీలకు కేంద్రం ద్రోహం : కల్వకుంట్ల కవిత
హైదరాబాద్, జనవరి 29 (ప్రజా మంటలు):
దేశవ్యాప్తంగా జరుగుతున్న జనగణన–కులగణన ప్రక్రియలో కేంద్ర ప్రభుత్వం బీసీలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఆరోపించారు. జాతీయ జనగణనలో కులగణనపై సమగ్ర చర్చ కోసం నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె ప్రసంగించారు.
బిసి కాలం తొలగించడం అన్యాయం
పదేళ్లకు ఒకసారి జరగాల్సిన... ఎమ్మెల్యే సంజయ్ అవినీతితో జగిత్యాల మున్సిపాలిటీ బ్రష్టు : మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, జనవరి 28 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీని ఎమ్మెల్యే సంజయ్ అవినీతి, అక్రమాలతో బ్రష్టు పట్టించారని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆరోపించారు. ఇందిరా భవన్‌లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ, గత ఐదేళ్లలో 16 మంది కమిషనర్లు మారటం, 8 మంది ఉద్యోగులు జైలు పాలవడం, ఏసీబీ–విజిలెన్స్ దాడులే ఎమ్మెల్యే... మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం
హైదరాబాద్, జనవరి 28 (ప్రజా మంటలు):
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ‘సింహం’ గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆల్ ఇండియా... ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
మెట్‌పల్లి/కోరుట్ల జనవరి 28 (ప్రజా మంటలు)మెట్ పెల్లి మరియు కోరుట్ల మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా... గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్
జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు)2027 లో గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ లు మరియు సంబందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జగిత్యాల జిల్లా నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి... 