కువైట్ అగ్ని ప్రమాదంలో మృత్యుంజయులు
కువైట్ అగ్ని ప్రమాదంలో మృత్యుంజయులు
హైదారాబాద్ జూన్ 14:
జూన్ 12న తెల్లవారు జామున కువైట్ లో జరిగిన ఘోర అగ్ని ప్రమాదం నుంచి తప్పించుకుని ప్రాణాలను దక్కించుకుని ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మంచిర్యాల జిల్లాకు చెందిన కొట్టె గంగయ్య..
రాజన్న సిరిసిల్ల జిల్లా నెరేళ్ల, మెదక్ జిల్లా దుబ్బాక కు చెందిన ఇద్దరు వ్యక్తులు మొదటి అంతస్తు నుంచి లుంగీల సాయంతో కిందకు దిగారు. ఆసుపత్రిలో వారికి ప్రాథమిక చికిత్స అందించి పంపించారు.
మంచిర్యాల జిల్లా లక్షెటిపేట మండలం పాత కొమ్ముగూడెం గ్రామానికి చెందిన కొట్టె గంగయ్య (49) కువైట్ లోని 'హైవే సూపర్ మార్కెట్' లో గత పన్నెండు ఏళ్లుగా హెల్పర్ గా పనిచేస్తున్నాడు.
సూపర్ మార్కెట్ యాజమాన్యం తన సిబ్బంది కోసం కువైట్ లోని మంగాఫ్ ప్రాంతంలో ఒక రెసిడెన్షియల్ బిల్డింగ్ లో వసతి సౌకర్యం (లేబర్ అకామడేషన్) ఏర్పాటు చేసింది.
రెండవ అంతస్తులో ఒక రూములో గంగయ్యతో పాటు మరో తెలుగు వ్యక్తి, ఇద్దరు కేరళ వాళ్ళు ఉంటారు. ఆరోజు మార్నింగ్ డ్యూటీకి వెళ్లాల్సిన ఒక కేరళ అతను ఉదయాన్నే నిద్రలేసి స్నానం చేసి వచ్చి 4.15 ని.లకు చేసిన అరుపులు విన్న మిగతా ముగ్గురు ఘాడ నిద్ర నుంచి లేచారు. గది బయటకు వచ్చి చూడగా దట్టమైన పొగ, చిమ్మ చీకటి. గంగయ్య రూమ్మేట్స్ ముగ్గురు రెండవ అంతస్తు నుంచి కిందికి దూకారు. వాళ్ళ కాళ్ళు విరిగాయి. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
రెండవ అంతస్తు నుంచి కిందికి దూకడానికి ధైర్యం చాలని గంగయ్య తన మొబైల్ ఫోన్ లోని టార్చ్ లైట్ వెలుగులో పరిసరాలను గమనించాడు. దట్టమైన పొగ వలన కళ్ళు మండినా, చిమ్మ చీకటిలో గోడను పట్టుకుని మెల్ల మెల్లగా కిటికీ వద్దకు వెళ్లి కేబుల్ వైరు సహాయంతో కింది అంతస్తు లోని రేకులపై దూకాడు. పక్క బిల్డింగ్ వాళ్ళు వేసిన నిచ్చెన సాయంతో కిందికి దిగాడు.
ఆసుపత్రిలో చేరిన గంగయ్యకు స్కానింగ్, ఎక్స్-రే తదితర పరీక్షలు చేసి వైద్యం అందిస్తున్నారు. శరీరానికి అక్కడక్కడ చిన్న గాయాలయ్యాయి. టెన్షన్ లో గుండె వేగంగా కొట్టుకోవడం, బీపీ పెరగడం లాంటివి జరిగాయి. ప్రస్తుతం ఆరోగ్యం నిలకడగా ఉందని సమాచారం
More News...
<%- node_title %>
<%- node_title %>
వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి అవగాహన కలిగి ఉండాలి

ఇజ్రాయిల్ నుండి స్వగ్రామానికి మృతదేహం

గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి

కీర్తిశేషులు ఎడమల మల్లారెడ్డి స్మారకాఅర్థం విద్యార్థినిలకు ప్రోత్సాహకాలు

సీనియర్ సిటీజేన్లకు ప్రభుత్వం అండ.. - ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్.

వైద్యుల పరిరక్షణ బాధ్యత ప్రజలదే -మాతా శిశు కేంద్ర సూపరింటెండెంట్ సుమన్ రావు

సిగాచి పరిశ్రమలో గాయపడిమావారిని ఆస్పత్రిలో పరామర్శించిన ఎమ్మెల్సీ కవిత

ఎంపీ రఘునందన్ రావును పరామర్శించిన బీజేపీ స్టేట్ చీఫ్
.jpg)