YLNS కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ ను గాయత్రి బ్యాంక్ యందు విలీనం
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల జూన్ 9 (ప్రజా మంటలు) :
తెలంగాణ లోని యాదాద్రి భువనగిరి జిల్లా యందలి యాదగిరి లక్ష్మి నరసింహ స్వామీ కో ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు ని తెలంగాణ లోని జగిత్యాల యందు గల గాయత్రి కో ఆపరేటవ్ అర్బన్ బ్యాంక్ యందు విలీనం చేయడానికి సమ్మేళన పథకాన్ని భారతీయ రిజర్వ్ బ్యాంక్ వారు ఆమొదించడం జరిగింది.
ఇట్టి సమ్మేళనం తేదీ 10-06-2024 నుండి అమలులోకి వస్తుంది. 6 శాఖలతో 170.74 కోట్ల వ్యాపారం కలిగిన ఇట్టి YLNS బ్యాంక్ సోమవారం నుండి గాయత్రి బ్యాంక్ యందు విలీనం చేస్తున్నాం. ఇకపై YLNS బ్యాంక్ యొక్క 6 బ్రాంచీలు గాయత్రి బ్యాంక్ యొక్క బ్రాంచీలు గా పని చేస్తాయి.
మీ అందరికీ తెలిసిన విధంగా తేది 11-09-2000 న ప్రారంభించబడిన గాయత్రి బ్యాంక్ తెలంగాణ లో మల్టి స్టేట్ బ్యాంక్ గా గత 24 సంవత్సరాలుగా తెలంగాణ అండ్ ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములలో బ్యాంకింగ్ సేవలందిస్తూ ఉన్నాము.
ప్రస్తుతము 39 బ్రాంచిలతో పని చేస్తున్న గాయత్రి బ్యాంక్ ఇట్టి విలీనంతో 45 బ్రాంచిలకు చేరుకొనున్నము, మరియు ఈ సవత్సరంథానికి 60 బ్రాంచీలు చేరుకోవాలని లక్యంగా పెట్టుకున్నాము.
వ్యాపార పరంగా చూసినట్లయితే, విలీనం అనంతరం రు: 1635.86 కోట్ల డిపాజిట్స్ రు 1177.82 కోట్ల రుణాల తో రు. 2813.68 కోట్ల వ్యాపారానికి చేరుకున్నాము. అలాగే గాయత్రి బ్యాంక్ 7.49 లక్షల కస్టమర్ బేస్ తో సౌత్ ఇండియా లోనే అగ్ర స్థానంలో ఉండగా ylns బ్యాంక్ 23 వేల ఖాతాదారులను కలిగి ఉండగా విలీనం తో 7.69 లక్షలను కలిగి ఉన్నము.
మరియు రాబోవు కాలం లో ఒక మిలియన్ కస్టమర్ బేస్ కి చెరవలేనన్న లక్ష్యం తో పని చేస్తున్నాము.
2000 వ సంవత్సరములో ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రములో చివరి బ్యాంక్ గా ప్రారంభించబడి 24 వసంతాలలో రెండవ పెద్ద బ్యాంక్ గా అవతరించింది. రాబోవు జూన్ క్వార్టర్ ముగింపు నాటికి మొదటి స్థానంలో కి చేరుకోవడానికి కృషి చేస్తున్నాము.
గాయత్రీ బ్యాంక్‌లో, కస్టమర్ సంతృప్తి, ఆవిష్కరణ మరియు నైతిక బ్యాంకింగ్ పద్ధతులపై బలమైన దృష్టితో, బ్యాంక్ విభిన్న శ్రేణి ఆర్థిక ఉత్పత్తులను సేవలను అందిస్తుంది అని నమ్ముతున్నాము.
డిజిటల్‌గా కూడా గాయత్రీ బ్యాంక్ ఆధార్ ఎనేబుల్డ్ పేమెంట్ సర్వీసెస్ (AePS), యూనిఫైడ్ పేమెంట్ ఇంటర్‌ఫేస్ (UP) వంటి ఉత్పత్తుల పరిచయంతో డిజిటల్ కార్యకలాపాల యొక్క అన్ని రంగాలలో ఒక ఆవిష్కర్తగా ఉద్భవించింది.
భద్రతా చర్యలపై 24 x 7 నిఘాతో బ్యాంకింగ్ లావాదేవీల భద్రత ప్రధాన లక్ష్యంగా పని చేస్తున్నాము.
మేము ప్రస్తుతం 432 మంది ఉద్యోగులను కలిగి ఉన్నాము మరియు YLNS బ్యాంక్ నుండి మరో 56 మంది ఉద్యోగులు మా కుటుంబంలో చేర్చబడతారు మరియు మరో 210 మంది ఉద్యోగులను నియమించవలసిన అవసరం ఉంది కాగా మొత్తం 698 మంది ఉద్యోగులకు చేరుకోనున్నారు.
మేము సెంట్రల్ పేమెంట్ సిస్టమ్‌లో ప్రత్యక్ష సభ్యులుగా కూడా మారబోతున్నాము మరియు త్వరలో, షెడ్యూల్డ్ బ్యాంక్‌గా మారడం ద్వారా మేము మరో మైలురాయిని చేరుకుంటాము, దీని కోసం రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా నుండి అనుమతులు రావలసి ఉన్నవి.
బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు గాయత్రీ బ్యాంక్ బృందం మొత్తం నిబద్ధత మరియు అంకితభావంతో ప్రజలకు చేరుకోని సేవ చేయడానికి మరింత బాధ్యతను కలిగి ఉందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము.
మా గాయత్రీ బ్యాంక్, బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లు మరియు స్టాఫ్ మెంబర్‌ల తరపున, విలీనానికి సంబంధించిన స్వచ్ఛంద నిర్ణయం తీసుకున్న YLNS బ్యాంక్ డైరెక్టర్లందరికీ, మరియు మా వాటాదారులు, కస్టమర్లు, శ్రేయోభిలాషులు, మీడియా మరియు ఎలక్ట్రానిక్ మీడియా ప్రతినిధులు, జర్నలిస్టులందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాము.
బ్యాంక్ లక్ష్యాలు మరియు గమ్యాలను చేరుకొని ముందుకు సాగడానికి మీ నిరంతర మద్దతు మరియు ప్రోత్సాహాము ఇలాగే కొనసాగాలని ఆశిస్తున్నాము అని చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వనమాల శ్రీనివాస్ గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ లిమిటెడ్ కోరారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గొల్లపల్లిలో రెండు బైక్ లు డీ - ఇద్దరి మృతి

బిహార్ ఎన్నికల్లో 22మంది బాహుబలి అభ్యర్థులు – రాజకీయ వారసత్వమే ప్రధాన ఆయుధం
.jpg)
బిహార్ అసెంబ్లీ ఎన్నికలు: ఆర్జేడీ 143 మంది అభ్యర్థుల జాబితా విడుదల – 24 మంది మహిళలు బరిలోకి
.jpeg)
బీర్పూర్ లక్ష్మీనరసింహస్వామి ఆలయ కమిటీ పట్ల కాంగ్రెస్ అసంతృప్తి

నిజామాబాద్ లో నిందితుడు రియాజ్ ఎన్కౌంటర్

ఉక్రెయిన్ పై రష్యా నిబంధనలను అంగీకరించమని ట్రంప్ ఒత్తిడి

మళ్లీ ఆర్థిక సడలింపు: కేంద్ర బ్యాంకులు అతిగా వదిలేస్తున్నాయా?
.jpeg)
చీకట్లు చీల్చి వెలుగులు విరజిమ్మే వేడుక దీపావళి పండుగ

ఏయిర్ పోర్టు నుంచి వస్తున్న ఫుష్పక్ ఎలక్ర్టికల్ బస్సులో మంటలు,పొగలు

భారత ప్రధాని మోదీకి బిహార్ ఎన్నికల్లో కఠిన పరీక్ష – నిరుద్యోగం, ఓటర్ల జాబితాలపై అనుమానాలు కీలకం
.jpeg)
శ్రీ గుట్ట రాజేశ్వర స్వామి దేవస్థానం లో శ్రీ అన్నపూర్ణా దేవి, శ్రీ నంది ధ్వజస్తంభ పున ప్రతిష్ట కరపత్రాన్ని ఆవిష్కరించిన శ్రీమాన్ నంబి వేణుగోపాలాచారి కౌశిక

బిసి సంక్షేమ సంఘం జిల్లా మహిళ కార్యనిర్వహక అధ్యక్షురాలుగా అరవ లక్ష్మి ఉత్తర్వులు ఇచ్చిన కృష్ణయ్య
