గ్రూప్ -1 ప్రిలిమినరి పరీక్షకు పటిషమైన పోలీసు బందోబస్తు.

- పరీక్ష కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు. - జిల్లా ఎస్పీ సన్ ప్రీత్ సింగ్ ఐపీఎస్.

On
గ్రూప్ -1 ప్రిలిమినరి పరీక్షకు పటిషమైన పోలీసు బందోబస్తు.

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113) : 

 

జగిత్యాల జూన్ 8 (ప్రజా మంటలు) : 

గ్రూప్-I రాత పరీక్ష కు సంబంధించి జిల్లాలో మొత్తం 22 పరీక్ష కేంద్రాలు ఉన్నాయని ఈ యొక్క పరీక్ష కేంద్రాల వద్ద కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని మరియు పరీక్ష కేంద్రాల సమీపంలో ఉన్న అన్ని జిరాక్స్ సెంటర్స్, ఇంటర్ నెట్ సెంటర్స్, మరియు చుట్టుపక్కల లౌడ్ స్పీకర్లు, మూసి వేయాలని, మరియు పరీక్ష సెంటర్స్ వద్ద నుండి 100 మీటర్ల వరకు ప్రజలు గుమిగూడ వద్దుని ఎస్పీ తెలిపారు.

పరీక్షా కేంద్రాల వద్ద 300 మoది పోలీసులతో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు.

అభ్యర్థులు పరీక్షా సమయాని కంటే 1 గంట ముందే కేంద్రానికి చేరుకోవాలని, మానసికంగా ఎటువంటి ఆందోళన చెందకుండా ప్రశాంతంగా పరీక్ష రాయాలని సూచించారు.

అభ్యర్థులు చివరి నిమిషంలో వచ్చి ఇబ్బంది పడకుండా సకాలంలో పరీక్షా కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు.

పరీక్షా కేంద్రంలోకి బ్యాగులు, సెల్ ఫోన్లు, స్మార్ట్ ఫోన్లు, వాచ్లు, క్యాలిక్యులేటర్ తదితర ఎలక్ట్రానిక్ పరికరాలు అనుమతి లేదు అన్నారు.

Tags