పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత - కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజయ్ కుమార్.

On
పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత - కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజయ్ కుమార్.

(సిరిసిల్ల రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

జగిత్యాల జూన్ 6 (ప్రజా మంటలు) :

సహజ వనరుల సంరక్షణ ప్రజలందరి బాధ్యత... సుస్థిరమైన పర్యావరణానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలి.... సహజ వనరులను భూమాతను కాపాడి సస్యశ్యామలమైన భారతాన్ని సృష్టించాలి.

స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల జగిత్యా ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్ట్స్ మరియు సైన్స్ కళాశాల, ప్రభుత్వ డిగ్రీ అండ్ పీజీ కళాశాల లక్షెట్టిపేట, ప్రభుత్వ డిగ్రీ కళాశాల సైన్స్ ఆదిలాబాద్.. వృక్ష శాస్త్ర విభాగము, విద్యా విభాగం, గ్రీన్ ఆడిట్ సెల్ మరియు జాతీయ సేవా పథకము ఆధ్వర్యంలో ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఆన్లైన్ సెమినార్ నిర్వహించడం జరిగింది.

దీనికి కన్వీనర్ గా డాక్టర్ పడాల తిరుపతి అసిస్టెంట్ ప్రొఫెసర్, వృక్ష శాస్త్ర విభాగము ప్రభుత్వ మహిళ డిగ్రీ కళాశాల జగిత్యాల మరియు కోఆర్డినేటర్ ఇంటిగ్రేటెడ్ టీచర్ ఎడ్యుకేషన్ ప్రోగ్రాం, విద్యా విభాగము ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లక్షెట్టిపేట వ్యవహరించారు.

దీనికి ఆర్గనైజింగ్ సెక్రటరీగా డాక్టర్ రౌతు రాధాకృష్ణ, అసిస్టెంట్ ప్రొఫెసర్ వృక్షశాస్త్ర విభాగాధిపతి ఎస్ కే ఎన్ ఆర్ హాట్ అండ్ సైన్స్ కళాశాల జగిత్యాల వ్యవహరించారు.

దీనికి సహా అధ్యక్షులుగా డాక్టర్ జి చంద్రయ్య వృక్షశాస్త్ర విభాగాధిపతి, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల వివరించగా, ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ మహిళ డిగ్రీ కళాశాల ఇది 25వ జాతీయస్థాయి వేబినారు అని, ప్రకృతి పట్ల, జీవవైవిద్యo పట్ల, పరిసరాల పట్ల పర్యావరణం పట్ల అవగాహన కోసం అనేక ఆన్లైన్ సెమినార్లు నిర్వహించడం వృక్ష శాస్త్ర విభాగాన్ని అభినందించారు. ఎస్ కే ఎన్ ఆర్ ప్రభుత్వ ఆర్సెన్షన్స్ కళాశాల, నోడల్ కళాశాల ప్రిన్సిపల్ ప్రొఫెసర్ అరిగెల అశోక్ మాట్లాడుతూ సుస్థిరమైన పర్యావరణం కోసం పేర్కొన్నారు.

డాక్టర్ జై కిషన్ ఓజా ప్రిన్సిపల్, ప్రభుత్వ డిగ్రీ మరియు పీజీ కళాశాల లక్షెట్టిపేట గారు మాట్లాడుతూ రాష్ట్రస్థాయిలో గ్రీన్ ఛాంపియన్ అవార్డు పొందడం చాలా ఆనందంగా ఉందని దీని వెనుక ప్రతి ఒక్క అధ్యాపకుడి కృషి ఉందని, విద్యార్థులందరూ భాగస్వామ్యం అయ్యారని పర్యావరణం పచ్చదనం కోసం ప్రతి ఒక్కరు గా పని చేయాలని పేర్కొన్నారు. డాక్టర్ అచ్చి శ్రీనివాస్ ప్రిన్సిపల్ గవర్నమెంట్ డిగ్రీ కళాశాల సైన్స్, ఆదిలాబాద్ మాట్లాడుతూ ప్రపంచ పర్యావరణం కోసం అన్ని దేశాలు కలిసికట్టుగా పనిచేయాలని అందులో భారతదేశం ముందంజలో ఉండాలని వారు పేర్కొన్నారు.

అనంతరం కేరళ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ అజయ్ కుమార్ గారు కీలక ఉపన్యాసం చేస్తూ రెండు గంటల పాటు పర్యావరణం కోసం పచ్చదనం కోసం ఆహ్లాదకరమైన పర్యావరణాన్ని ఏర్పాటు చేయడం కోసం ప్రజలు అనాది కాలము నుంచి వేద కాలు నుంచి ఇప్పటివరకు ఏ విధంగా సంరక్షిస్తూ వచ్చారని పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా చాలా చక్కగా వివరించారు.

ఈ కార్యక్రమంలో డాక్టర్ ఈ జ్యోత్స్న అసిస్టెంట్ ప్రొఫెసర్ ఇంగ్లీష్ కోఆర్డినేట్ చేశారు, డాక్టర్ కుమార్ స్వామి, డాక్టర్ ఒడిటి వినయ్ కుమార్, డాక్టర్ జాడీ ఇందు, మహమ్మద్ అష్రాఫ్ అలీ డాక్టర్ పి శ్రీనివాస్, డాక్టర్ బి సంధ్యారాణి, అసిస్టెంట్ ప్రొఫెసర్ ఆఫ్ బాటని కి నోట్ స్పీకర్ను పరిచయం చేశారు. వివిధ విశ్వవిద్యాలయాల ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు, లెక్చరర్లు, రీసెర్చ్ కాలర్లు, టీచర్లు వివిధ కళాశాలల విద్యార్థులు, ఎన్ఎస్ఎస్ వాలంటీర్లు పాల్గొన్నారు.

Tags