కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు
కలెక్టర్ ల నిర్లక్ష్యం వల్లే భారీగా నిధుల దుర్వినియోగం
జిల్లా పంచాయతీలో అడ్డగోలుగా అధికార దుర్వినియోగం - చట్టాల ఉల్లంఘన
పన్నెండు మంది అధికారులతో సహా ఇద్దరు కార్యదర్శుల పై లోకాయుక్త కు పిర్యాదు
నిఘా విభాగం అధికారులతో పునర్విచారణ జరిపించాలని కోరిన చుక్క గంగారెడ్డి
బుగ్గారం జిపి పాలక వర్గంపై చర్యలు తీసుకోవాలని విన్నపం
బుగ్గారం/ జగిత్యాల జిల్లా:
ప్రజా పిర్యాదులపై జిల్లా కలెక్టర్ లు సకాలంలో సరైన చర్యలు చేపట్టక, నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లనే గ్రామ పంచాయతీలలో నిధుల దుర్వినియోగం భారీగా జరిగిపోయిందని ప్రముఖ ఉద్యమకారుడు, ఆర్టీఐ కార్యకర్త చుక్క గంగారెడ్డి ఆరోపించారు. ఆయన చేసిన పిర్యాదులపై
హైదారాబాద్ లోని లోకాయుక్త (కోర్టు) లో గురువారం విచారణ జరిగింది. బుగ్గారం గ్రామ పంచాయతీలో జరిగిన భారీ నిధుల దుర్వినియోగంలో బాధ్యులైన ప్రతి ఒక్కరిపై చర్యలు తీసుకోవాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించి, వారి బాధ్యతలను, అధికారాన్ని కూడా దుర్వినియోగం చేసి, చట్టాలను కూడా ఉల్లంఘించిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకొని, కఠినంగా శిక్షించాలని చుక్క గంగారెడ్డి లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా పిర్యాదు చేశారు.
దుర్వినియోగం నుండి రికవరీ అయిన సొమ్మును కూడా అధికారులు లెక్కల్లో సరిగా చూపెట్టలేదన్నారు. లక్షల్లో రికవరీ సొమ్మును రికార్డులలో నమోదు చేయకుండా దాచి ఉంచారని ఆయన ఆరోపించారు.
అనేక పిర్యాదులతో పాటు 2022 సెప్టెంబర్ 21న లోకాయుక్త కు కూడా పిర్యాదులు చేయగా జిల్లా పంచాయతీ అధికారి నామ మాత్రంగా గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా ను, సర్పంచ్ మూల సుమలత ను చివరి దశలో అనగా గత 2024 జనవరి మాసంలో సస్పెండ్ చేసి చేతులు దులుపుకున్నారని ఆయన తెలిపారు. తదుపరి ఎలాంటి చర్యలు చేపట్టలేదన్నారు. ఆధారాలతో సహా మేము చేసిన పిర్యాదులపై కూడా సరైన విధంగా విచారణ చేపట్టక పోవడం చాలా బాధాకరంగా, చాలా అనుమానాస్పదంగా ఉందన్నారు. రాజకీయ ఒత్తిళ్లు, అవినీతి – అక్రమాల వల్లే ఇలా జరిగి ఉంటుందని గ్రామ ప్రజలు ముక్త కంఠంతో ఆరోపిస్తున్నారని ఆయన పేర్కొన్నారు.
1) మేము ఎన్ని పిర్యాదులు చేసినా జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్ లు సరైన విధంగా స్పందించ లేదని ఆవేదన వ్యక్తం చేశారు. చాలా నిర్లక్యంగా వ్యవహరించారని, మా పిర్యాదులు సరిగా పట్టించుకోలేదన్నారు. అందుకే లోకాయుక్త ను ఆశ్రయించాల్సి వచ్చిందన్నారు.
2) జగిత్యాల జిల్లా పంచాయతీ అధికారులుగా పనిచేసిన వేముల శేఖర్, ప్రభాకర్, హరి కిషన్, నరేష్ లతో పాటు ప్రస్తుత డిపిఓ దేవరాజ్ కూడా అన్నీ విషయాలు తెలిసినా, నిధులు భారీగా దుర్వినియోగం అయ్యాయని ఆధారాలు లభించినా… కావాలనే ఉద్దేశ్య పూర్వకంగా, విధుల్లో, వారి బాధ్యతల్లో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. నిధుల దుర్వినియోగం ఋజువు అయినప్పటికీ వీరంతా వారి - వారి పాలనా సమయంలో చర్యలు తీసుకోలేదన్నారు. ఈ అధికారులంతా చట్టాలను ఉల్లంఘించారని, వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారని చుక్క గంగారెడ్డి పేర్కొన్నారు.
3) జగిత్యాల, మెట్ పల్లి - డీఎల్ పీవోలు కనక దుర్గ, శ్రీనివాస్ లు వేర్వేరు గా నిధుల దుర్వినియోగం పై ఉన్నతాధికారుల ఆదేశాలతో రెండు సార్లు తూ.. తూ… మంత్రంగా విచారణ చేపట్టారని అన్నారు. పారదర్శకంగా క్షేత్ర స్థాయిలో.. ప్రజల్లో… సరైన విచారణ జరుపలేదన్నారు. దుర్వినియోగానికి పాల్పడ్డ పాలకులతో కుమ్మక్కై వారికే కొమ్ము కాశారని, వాస్తవాలు వెలుగులోకి వచ్చినప్పటికీనీ… నిధుల దుర్వినియోగాన్ని, వాస్తవాలను పూర్తిగా కప్పి పుచ్చారని ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవ విచారణకు భిన్నంగా తప్పుడు విచారణ నివేదికలు అందజేసి ఉన్నతాధికారులను నమ్మించి, తప్పు దోవ పట్టించారని పేర్కొన్నారు. వారి వృత్తి ధర్మాన్ని, అత్యంత విలువైన వారి విధులను, బాధ్యతలను కూడా దుర్వినియోగం చేశారన్నారు.
4) మిషన్ భగీరథ లో పని చేస్తున్న ఆర్ డబ్లూ ఎస్ అసిస్టెంట్ ఇంజనీర్ వివేక్ అలియాస్ వివేకానంద కూడా బుగ్గారంలో చేయని పనులకు కూడా పనులు చేసినట్లు, బిల్లులు చెల్లించిన పురాతన పనులనే మళ్ళీ రికార్డులలో చూపెట్టి కొత్తగా పనులు చేసినట్లు తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు సృష్టించారని ఆరోపించారు. పంచాయతీ పాలక వర్గానికి అనుకూలంగా ఇష్టమొచ్చినట్లు రికార్డులను
తయారు చేసి అందజేస్తూ నిధుల దుర్వినియోగానికి, దోపిడీకి సహకరించారని వివరించారు. బుగ్గారం మండలంలోని వివిధ గ్రామాలతో పాటు ధర్మపురి నియోజక వర్గంలోని అనేక గ్రామాలలో కూడా తప్పుడు రికార్డులు, దొంగ రికార్డులు అందజేసి భారీగా నిధుల దుర్వినియోగానికి సహకరించారనే ఆరోపణలు కూడా వివేక్ అలియాస్ వివేకానంద పై కో – కొల్లలుగా ఉన్నాయన్నారు. సరైన విచారణ జరిపిస్తే కోట్లాది రూపాయల దుర్వినియోగం బయటపడే అవకాశం ఉందన్నారు.
5) జిపిపై ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాల్సిన బుగ్గారం మండల పంచాయతీ అధికారి అఫ్జల్ తన విధులను, అత్యంత విలువైన తన అధికారాన్ని దుర్వినియోగం చేసి, చట్టాలను ఉల్లంఘించి, ఈ – పంచాయతీ ఆపరేటర్ జీతం పేరును సాకుగా వాడుకొని బుగ్గారం జిపితో పాటు మండలంలోని మరో పది గ్రామ పంచాయతీల నుండి సుమారు రూ.22 లక్షలకు పైగా నిధులు తన ఖాతాల్లోకి మల్లించుకొని భారీగా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు.
6) జిల్లా కలెక్టర్ కార్యాలయంతో సహా జిల్లా పంచాయతీ అధికారి, మండల పంచాయతీ అధికారి కార్యాలయాల్లోని ప్రజా సమాచార అధికారులు, అప్పిలేట్ అధికారులు సమాచార హక్కు చట్టం -2005 ను కూడా ఉల్లంఘించారని వివరించారు. సమాచార కమీషన్ జారీ చేసిన 18 ఫిర్యాదులపై ఆర్డర్లను, మరో 60 వరకు ఆర్టీఐ దరఖాస్తులను, అప్పీల్లను కూడా బే-ఖాతరు చేశారన్నారు. ఏండ్లు గడుస్తున్నా నేటికీ కోరిన సమాచారం ఇవ్వడం లేదన్నారు.
7) గత పంచాయతీ కార్యదర్శి మహబూబ్ పాషా బుగ్గారం జి.పి.లో భారీగా నిధుల దుర్వినియోగం చేయడమే కాకుండా, జి.పి.లో రికార్డులు కూడా దొరుకకుండా మాయం చేసి ఏండ్లు గడుస్తున్నా అధికారులు, ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోవడం లేదన్నారు. అనేక పిర్యాదుల మేరకు కేవలం నామ మాత్రంగా సస్పెండ్ చేస్తున్నట్లు ఉత్తర్వులు జారీ చేసి చేతులు దులుపుకున్నారు తప్పా…. మహబూబ్ పాషా నుండి నేటికీ రికార్డులు స్వాధీనం చేసుకోలేదన్నారు. లక్షల్లో ఉన్న దుర్వినియోగం సొమ్ము కూడా నేటికీ రికవరీ చేయలేదన్నారు.
8) రెండో పంచాయతీ కార్యదర్శి నరేందర్ కూడా నిధుల దుర్వినియోగానికి పాల్పడి సుమారు రూ.70 వేల వరకు రికవరీ కూడా చెల్లించాడన్నారు. మరిన్ని నిధులు కూడా ఆయన నుండి రికవరీ కావలసి ఉందని తెలిసిందన్నారు. బుగ్గారం జి.పి.లో ఆయన అనేక అవినీతి -అక్రమాలకు పాల్పడ్డారని, పాలక వర్గం చేసిన భారీ నిధుల దుర్వినియోగం లో కూడా ఆయన పాత్ర అత్యంత కీలకంగా ఉందన్నారు. అయినా అధికారులు కార్యదర్శి నరేందర్ పై నేటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం శోషనీయం అన్నారు.
9) బుగ్గారం గ్రామ సర్పంచ్ మూల సుమలత, ఆమె భర్త మూల శ్రీనివాస్ గౌడ్ లతో పాటు ఉప సర్పంచ్, పాలక వర్గంలోని కొందరు వార్డ్ సభ్యులు కుమ్మక్కై మూకుమ్మడిగా భారీ గా నిధుల దుర్వినియోగానికి పాల్పడ్డారని ఆరోపించారు. సుమారు కోటి రూపాయలకు పైగానే నిధులు దుర్వినియోగం జరిగి ఉంటాయని గ్రామ ప్రజలు అనేక అనుమానాలను వ్యక్తం చేస్తున్నారని తెలిపారు.
10) ఇలాంటి అనేక సందర్భాలను బట్టి ఎప్పటికప్పుడు జిల్లా కలెక్టర్ కు మేము లిఖిత పూర్వకంగా ఆధారాలతో సహా పిర్యాదులు చేసి, పత్రికా ప్రకటనలు కూడా జారీ చేయడం జరిగిందన్నారు. అయినా అధికారులు, ఉన్నతాధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించారని తెలిపారు .
11) వీటన్నిటికీ కారణం రాజకీయ ఒత్తిళ్లతో పాటు భారీ మొత్తంలో అవినీతి – అక్రమాలు కూడా జరిగి ఉండొచ్చని మాకు అనుమానంగా ఉందన్నారు.
నేటితో నాలుగు పర్యాయాలు తమరి సన్నిధికి అందజేసిన మా పిర్యాదు లను, ఆధారాలను పరిగణనలోకి తీసుకొని వీటన్నింటిపై ప్రత్యేక నిఘా విభాగం ఉన్నతాధికారులచే తగు విచారణ జరిపించాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త ను కోరారు.
జిల్లా కలెక్టర్, అదనపు కలెక్టర్, ఐదుగురు జిల్లా పంచాయతీ అధికారులు, ఇద్దరు డివిజనల్ పంచాయతీ అధికారులు, జిల్లా కలెక్టరేట్, జిల్లా పంచాయతీ ఆపీస్, మండల పంచాయతీ కార్యాలయాల పౌర సమాచార అధికారులపై, అప్పిలేట్ అధికారులపై, ఆర్ డబ్ల్యూ ఎస్ ఎ.ఇ. వివేక్, ఎంపీఓ అఫ్జల్, పంచాయతీ కార్యదర్శులు మహబూబ్ పాషా, నరేందర్ లపై, సర్పంచ్, ఉప సర్పంచ్, పాలక వర్గంలోని వార్డు సభ్యుల పై, నిధుల దుర్వినియోగానికి బాధ్యులైన ఇతర వ్యక్తు లంద రిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకొని ఇలాంటి పరిస్థితులు పునరావృతం కాకుండా శిక్షించాలని ఆయన లోకాయుక్త ను కోరారు.
అలాగే దుర్వినియోగం అయిన బుగ్గారం గ్రామపంచాయతీ నిధులన్నీ రికవరీ చేయించి ప్రజా సొమ్మును కాపాడాలని చుక్క గంగారెడ్డి గురువారం లోకాయుక్త కు లిఖిత పూర్వకంగా విజ్ఞప్తి చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గజ్వేల్ తహశీల్దార్ స్వామి సస్పెండ్.. రైతుపై అనుచిత వ్యాఖ్యలే కారణం
సిద్దిపేట అక్టోబర్ 11, 2026
రైతుపై అనుచిత వ్యాఖ్యలు చేసిన వ్యవహారంలో సిద్దిపేట జిల్లా గజ్వేల్ తహశీల్దార్ పీహెచ్ స్వామిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకున్నారు. రైతుతో మాట్లాడిన తీరుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, జిల్లా కలెక్టర్ కె. హైమావతి ఆయనను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. రెవెన్యూ డివిజనల్ అధికారి... జగిత్యాల మున్సిపాలిటీలో మొక్కల కొనుగోళ్లు, బయోమైనింగ్‌పై విచారణ జరపాలి - హనుమండ్ల జయశ్రే
జగిత్యాల, అక్టోబర్ 10 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీలో వనమహోత్సవం పేరుతో మొక్కల కొనుగోళ్లు, వాటి నిర్వహణ ఖర్చులు, బయోమైనింగ్ పనుల్లో అవకతవకలు జరిగాయనే ఆరోపణలపై సమగ్ర విచారణ జరిపించాలని మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ డిమాండ్ చేశారు. ఈ మేరకు అక్టోబర్ 10న తెలంగాణ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణాభివృద్ధి శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు... శిశువుతో మహిళా జర్నలిస్టుకు సీసీఎస్‌లో గంటల తరబడి విచారణ
హైదరాబాద్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
ఆరు నెలల పసికందును చేతుల్లో ఎత్తుకుని సెంట్రల్ క్రైమ్ స్టేషన్ (సీసీఎస్)కు వెళ్లిన మహిళా జర్నలిస్టు జల్లి రేఖను దాదాపు ఏడు గంటలపాటు అక్కడే ఉంచి ప్రశ్నించారనే ఆరోపణలు హైదరాబాద్‌లో తీవ్ర చర్చకు దారితీశాయి. ఆమె వెంట మూడేళ్ల కుమారుడు కూడా ఉన్నట్లు వార్తా కథనాలు పేర్కొన్నాయి. మహిళా... లక్ష్మీపూర్‌లో కోడి పందాలపై పోలీసుల దాడి
గొల్లపల్లి అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
మండలంలోని లక్ష్మీపూర్ గ్రామ పరిధిలో కోడి పందాలు నిర్వహిస్తున్నారన్న నమ్మదగిన సమాచారంతో గొల్లపల్లి పోలీసులు దాడి నిర్వహించారు.
గొల్లపల్లి పోలీస్‌స్టేషన్ ఎస్ఐ కృష్ణసాగర్ రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి పోలీసులు లక్ష్మీపూర్ గ్రామానికి వెళ్లి తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సుమారు ఎనిమిది మంది వ్యక్తులు, మరికొందరు కలిసి... విద్యుత్ సమస్యల పరిష్కారానికి తక్షణ చర్యలు చేపట్టాలి
ఎల్కతుర్తి, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి, భీమదేవరపల్లి 33/11 కేవీ సబ్స్టేషన్లతో పాటు 132/32 కేవీ భీమదేవరపల్లి సబ్‌స్టేషన్‌ను టీజీ ఎన్పీడీసీఎల్ సీఎండీ కర్ణాటి వరుణ్ రెడ్డి ఐఏఎస్ గురువారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయా సబ్స్టేషన్ల పరిధిలో విద్యుత్ సరఫరా పరిస్థితిని క్షేత్రస్థాయిలో సమీక్షించారు.
విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న... జగిత్యాల మెడికల్ కళాశాల భవనాలు ఎప్పుడు పూర్తి చేస్తారు?
జగిత్యాల, అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
విద్య, వైద్యం ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కులని, వాటిని అందించడం ప్రభుత్వ బాధ్యత అని మాజీ మంత్రి, బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాటిపర్తి జీవన్‌రెడ్డి అన్నారు. జగిత్యాల పట్టణంలోని తెలంగాణ భవన్లో జిల్లా పరిషత్ తొలి చైర్పర్సన్ దావా వసంత సురేష్, బీఆర్ఎస్ నాయకులతో కలిసి నిర్వహించిన... ఆర్టీసీ డిపో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్, డిసిసి అధ్యక్షులు నందయ్య
జగిత్యాల అక్టోబర్ 8 (ప్రజా మంటలు)తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ జగిత్యాల డిపో వద్ద తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న ఆర్ టి సి యూనియన్ ఎన్నికల్లో ఐ ఎన్ టి యు సి ,ఎస్ డబ్ల్యూ యూ, టి డబ్ల్యూయూ, ఎస్ డబ్ల్యూ ఎఫ్ లకు మద్దతుగా బాణం గుర్తుకే ఓటు... ఆలయ నిధులను ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేయడం సరికాదు : బీజేపీ నేత ఖమ్మం వేంకటేశం
కోహెడ, అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
ఆలయాల అభివృద్ధి కోసం భక్తులు, దాతలు సమకూర్చిన నిధులను రాష్ట్ర ప్రభుత్వ నిధులుగా ప్రచారం చేసుకోవడం సరికాదని బీజేపీ సిద్దిపేట జిల్లా ప్రధాన కార్యదర్శి ఖమ్మం వేంకటేశం అన్నారు. గురువారం కోహెడ మండల కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కొత్తకొండ శ్రీ వీరభద్రస్వామి... రోల్లవాగు ప్రాజెక్టు పూర్తికి కృషి: ఎమ్మెల్యే సంజయ్ కుమార్
బీర్పూర్, అక్టోబర్ 8 (ప్రజా మంటలు):
గోదావరి పుష్కరాల నేపథ్యంలో బీర్పూర్ మండలంలోని రంగసాగర్, మంగేలా, కమ్మనూరు, చిత్రవేణిగూడెం, రేకులపల్లి గ్రామాల్లో ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ పర్యటించి పుష్కర ఘాట్ల ఏర్పాట్లను పరిశీలించారు. భక్తులకు ఇబ్బందులు లేకుండా తాగునీరు, పారిశుద్ధ్యం, విద్యుత్, మరుగుదొడ్లు, భద్రతా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు.
మంగేలా ఆశ్రమ పాఠశాలలో... రూ.12 వేల లంచం తీసుకుంటూ అటవీ అధికారి అరెస్ట్
ఖానాపూర్ అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
నిర్మల్ జిల్లా ఖానాపూర్ అటవీ శాఖ కార్యాలయంలో ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. టింబర్ డిపో పర్మిషన్ కోసం ఓ వ్యక్తి నుంచి రూ.12 వేల లంచం తీసుకుంటుండగా ఫారెస్ట్ సెక్షన్ అధికారి రవీందర్‌ను ఏసీబీ అధికారులు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. అధికారులు తదుపరి విచారణ చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ ‘బ్లాక్ డే’
కరీంనగర్ అక్టొబర్ 08(ప్రజా మంటలు):
AICC, TPCC పిలుపు మేరకు కరీంనగర్ కార్పొరేషన్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో గాంధీ రోడ్డులోని మహాత్మా గాంధీ విగ్రహం వద్ద ‘బ్లాక్ డే’ నిరసన చేపట్టారు. ఓటు చోరీకి వ్యతిరేకంగా రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ, ఇండియా కూటమి ఎంపీలపై జరిగిన లాఠీచార్జ్‌ను నిరసిస్తూ నల్ల బ్యాడ్జీలతో ఆందోళన నిర్వహించారు.
కార్పొరేషన్... రేకుల షెడ్డులోనే వైద్య తరగతులా?
జగిత్యాల అక్టోబర్ 08 (ప్రజా మంటలు):
ప్రభుత్వ వైద్య కళాశాల విద్యార్థులు తమకు కనీస వసతులు కల్పించడంలేదని ఆరోపిస్తూ వరుసగా రెండో రోజు ఆందోళనకు దిగారు. కళాశాలలో మౌలిక సదుపాయాలు లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని పేర్కొంటూ తరగతులను బహిష్కరించి నిరసన వ్యక్తం చేశారు.
విద్యార్థుల ఆందోళనలో ప్రధానంగా తరగతి గదులు, మౌలిక వసతుల కొరత... 