ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.

On
ఎస్సీ స్టడీ సర్కిల్ లో ఘనంగా తెలంగాణ ఆవిర్భావ వేడుకలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113). 

జగిత్యాల జూన్ 2 (ప్రజా మంటలు) : 

తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా జగిత్యాల జిల్లా షెడ్యూల్ కులాల శాఖ ఆధ్వర్యంలో ఎస్సి స్టడీ సర్కిల్ లో వేడుకలు ఘనంగా జరుపుకున్నారు.

అమరవీరుల స్థూపానికి అధికారులు పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ సహకారంతో SC స్టడీ సర్కిల్ లో రక్తదాన శిబిరం ఏర్పాటు చేయగ పలువురు విద్యార్థులు రక్తదానం చేశారు. 

ఈ సందర్భంగా జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారి రాజ్ కుమార్, జిల్లా పంచాయతీ రాజ్ అధికారి దేవరాజ్ మాట్లాడుతూ.....

ఎందరో త్యాగ మూర్తుల త్యాగ పలంగా తెలంగాణ రాష్ట్రం సాదించుకున్నామని తెలిపారు. స్వరాష్ట్ర ఏర్పడటం వల్ల మన నీళ్లు, నిధులు, నియామకాలు మనకే దక్కుతున్నాయని అన్నారు. విద్యార్తులు క్రమశిక్షణ తో చదివి తల్లిదండ్రులకు ఉపాధ్యాయులకు మంచి పేరు తీసుకురావాలని కోరారు. అన్ని రకాల పోటీ పరీక్షల్లో పాల్గొనాలని చూచించారు. రక్తదానం చేయడం వల్ల అత్యవసర పరిస్థితుల్లో రక్తం అవసరమైన వారికి ఉపయోగపడుతుందని చెప్పారు. రక్తదానం చేసేవారు ఎలాంటి అపోహలు పెట్టుకోవద్దని ప్రతి ఒక్కరూ రక్తదానం చేసి ఇతరులకు ప్రాణదాతలు కావాలని కోరారు. 

ఈ కార్యక్రమంలో ఎస్సి స్టడీ సర్కిల్ డైరెక్టర్ నరేష్, ఇండియా రెడ్ క్రోస్ సొసైటీ కార్యదర్శి మంచాల కృష్ణ, రెడ్ క్రాస్ సొసైటీ సభ్యులు సిరిసిల్ల శ్రీనివాస్, రోటరీ క్లబ్ అధ్యక్షుడు చారి, రోటరీ క్లబ్ మాజీ అధ్యక్షులు టీవీ సూర్యం, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.

Tags