తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు తెలంగాణ ఉద్యమకారులకు ఆహ్వానం

తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం లో పాల్గొనాలని ఉద్యమకారులకు పిలుపు

On

జైలుకెళ్లిన ఉద్యమకారులకు ప్రత్యేక ఆహ్వానం

భీమదేవరపల్లి జూన్ 1 (ప్రజామంటలు) :

రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు మండలంలోని తెలంగాణ ఉద్యమకారులకు ప్రత్యేక ఆహ్వానం అందింది. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు డ్యాగల సారయ్య, కాశిరెడ్డి ఆదిరెడ్డి మాట్లాడుతూ, 2009 నుండి 2014 వరకు వివిధ దశలలో జేఏసీ పిలుపు మేరకు అన్ని రకాల నిరసన కార్యక్రమాలలో భీమదేవరపల్లి తెలంగాణ ఉద్యమకారులు ఉన్నారని, గల్లీ నుండి ఢిల్లీ వరకు వెళ్లి కోట్లాడిన ఘనత మండల ఉద్యమకారులదని అన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మంత్రి శిల్పా మోహన్ రెడ్డిని తరిమికొట్టిన ఘనత, గవర్నర్ రాకను అడ్డుకున్న ఘనత, ఢిల్లీలో సంసద్ యాత్రలో అరెస్ట్ అయిన ఘన చరిత్ర మండల ఉద్యమకారులదని అన్నారు. తెలంగాణ ఉద్యమ చరిత్రలో భీమదేవరపల్లి ప్రత్యేక స్థానం పొందడం మండలానికి గర్వకారణం అని అన్నారు.

Tags