పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం - అదనపు ఎస్పీ వినోద్ కుమార్..

- పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో సంతోషంగా గడపాలి.

On
పదవీ విరమణ పొందిన పోలీస్ అధికారుల సేవలు స్ఫూర్తివంతం - అదనపు ఎస్పీ వినోద్ కుమార్..

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

 

జగిత్యాల మే 31 ( ప్రజా మంటలు ) : 

 విధి నిర్వహణలో అందరి మన్ననలు అందుకొని పదవీ విరమణ పొందిన ఏ.ఎస్.ఐ సత్యనారాయణ ని శాలువా,పులమాలలతో ఘనంగా సత్కరించి జ్ఞాపికను అందజేసిన అదనపు ఎస్పీ.

శుక్రవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జరిగిన పదవీ విరమణ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన అదనపు ఎస్పీ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడుతూ.. ఎన్నో రకాల త్యాగాలతో పాటు కుటుంబాలకు దూరంగా ఉంటూ ప్రజలకు సేవలందించడం ఎంతో గర్వకారణమన్నారు.

ప్రతి ఉద్యోగి జీవితంలో పదవీ విరమణ తప్పదని అన్నారు. సుమారు 35 సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన ఏ.ఎస్.ఐ సత్యనారాయణ సేవలను ఈ సందర్భంగా గుర్తు చేస్తూ వారి అనుభవం, సేవలు భవిష్యత్ తరాలకు ఎంతో స్ఫూర్తివంతంగా నిలుస్తాయని చెప్పారు.

పదవి విరమణ అనంతరం కుటుంబ సభ్యులతో అనందంగా వారి భావిజీవితం ఆయురారోగ్యాలతో సుఖసంతోషాలతో గడపాలని ఆకాంక్షినారు.

ఈ కార్యక్రమంలో ఆర్ ఐ జానీమియ, ఆర్ ఎస్ ఐ లు కృష్ణ పాల్గొన్నారు.

Tags