శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానము, కొండగట్టు లో ఘనంగా ప్రారంభమైన పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు.

On
శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానము, కొండగట్టు లో ఘనంగా ప్రారంభమైన పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

మల్యాల మే 30 (ప్రజా మంటలు)

 శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానము, కొండగట్టు శ్రీ స్వామి వారి పెద్ద జయంతి ఉత్సవములు తేది: 30-05-2024 నుండి 01-06-2024 వరకు అత్యంత వైభముగా నిర్వహించుట జరుగుచున్నది.

అందులో భాగంగా

  • మొదటి రోజు తేది: 30 గురువారం శ్రీస్వామి వారికి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము, భద్రాచలం నుండి ఆనవాయితీగా పట్టు వస్త్రములు కార్యనిర్వహణాధికారి మరియు అర్చక స్వాములు తీసుక వచ్చినారు.
  • ఉ॥9:00 గంటలకు దేవాలయము తరుపున ప్రత్యేక అధికారులు / కార్యనిర్వహణాధికారి, అర్చక స్వాములు / సిబ్బంది వారిని సాదరముగా ఆహ్వానించి 12 రకములైన కళా బృందములతో, నాద స్వరముతో, కోలాటములు, యక్షగానము, 108 దీపాల ప్రదర్శనతో, ఒగ్గు డోలు ప్రదర్శనతో శోభాయాత్రతో శ్రీ స్వామి వారికి పట్టు వస్త్రములు సమర్పించుట జరిగినది.
  • తదుపరి యాగశాల నందు ఉదయము యాగశాల శుద్ధి, పుణ్యహవచనము, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, స్వస్తి వాచనము, రక్షభందనము, ఋత్విక్ వరణము, అరుణి మదనము, దేవతాహ్వనము, అగ్ని ప్రతిష్ట ,హవనము, అభిషేకములు, ద్వజారోహణము, నవగ్రహస్థాపన, పారాయణములు, నైవేధ్యము తీర్ధప్రసాదములు వినియోగము మరియు సాయంత్రము హెూమం, మహానైవేధ్యము, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగము తదుపరి సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించబడినవి.

దేవాలయ కోనేరునందు పాతనీరు తీసి క్రొత్తనీరు ఎప్పటికప్పుడు మార్చబడినది.

ఎల్లవేళల పరిశుభ్రత నిమిత్తం సానిటేషన్ సిబ్బంది సర్వీస్ (3) షిఫ్టుల ద్వారా 200 మంది చొప్పున వినియోగించి పనులు చేపట్టుట జరిగినది.

నేటి నుండి నుండి (3) రోజులు మాల విరమణ మండపము నందు భక్తులకు మాల విరమణ చేయబడుచున్నది.

భక్తుల సౌకర్యార్ధము ( 20 ) ప్రదేశములలో త్రాగు నీరు కేంద్రాలు ఏర్పాటు చేయబడినవి.

నేటి నుండి నుండి భక్తులతో పాటు వివిధ డిపార్ట్ మెంట్ ద్వారా డిప్యూట్ చేయబడిన సిబ్బందికి దేవస్థానము నుండి అన్నదానము ఏర్పాటు చేయబడినది.

జిల్లా కలెక్టర్, జగిత్యాల వారి ఉత్తర్వుల ప్రకారము వివిధ శాఖల అదికారులు వారి వారి విధుల నిర్వర్తించుచున్నారు.

ప్రత్యేకముగా దేవస్థానము నుండి ఏర్పాటు చేయబడిన పార్కింగ్ స్థలముల నుండి దేవాలయం వద్దకు 4 బస్సుల ద్వారా భక్తులకు ఉచితముగా రవాణ సౌకర్యము కల్పించబడినది.

భక్తులు ఉపయోగించుకొనుటకు కోరుచున్నాము.

హెల్త్ డిపార్ట్మెంట్ వారి నుండి దేవాలయ ప్రాంగణములలో (6) ప్రదేశములలో ఉచిత మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయబడినవన్నారు.

ప్రత్యేక కౌంటర్ల నందు మ్రొక్కుబడి టిక్కెట్లు దీక్షా / కేశ ఖండన / ప్రత్యేక దర్శనము మరియు లడ్డు, పులిహోర ప్రసాదములు విక్రయించబడుచున్నవి.

భక్తులు క్యూపద్దతి పాటించి వినియోగించుకొనుటకు కోరుచున్నామని తెలిపారు. గురువారం రోజు శోభ యాత్ర భక్తుల ద్వారా ప్రత్యేక అధికారుల సమక్షములో కళాబృందములతో, నాట్య విన్యాసముల ద్వారా దేవాలయ అర్చక మరియు పరిపాన సిబ్బంది పాల్గోని దిగ్విజయముగా నిర్వహించబడినది.

(3) రోజులుభక్తులు దీక్ష పరులు శ్రీ స్వామి వారిని దర్శించి తరించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరడమైనది.

భక్తులు దీక్షపరులు దేవాలయ కౌంటర్ల వద్ద క్యూ పద్దతి పాటించి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సూచనలను పాటిస్తూ మీ యొక్క మ్రొక్కులు చెల్లించుకొని దేవాలయమునకు సహకరించగలరని కోరారు.

కమీషనర్ దేవాదాయ శాఖ, హైదరాబాద్ వారి ఉత్తర్వుల ప్రకారము ఇద్దరు ఫెస్టివల్ ఆఫీసర్స్ నిరంతరము ఏర్పాట్లను పర్యవేక్షించుచున్నారు.

Tags