శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానము, కొండగట్టు లో ఘనంగా ప్రారంభమైన పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు.

On
శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానము, కొండగట్టు లో ఘనంగా ప్రారంభమైన పెద్ద హనుమాన్ జయంతి వేడుకలు.

(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).

మల్యాల మే 30 (ప్రజా మంటలు)

 శ్రీ ఆంజనేయస్వామి దేవస్థానము, కొండగట్టు శ్రీ స్వామి వారి పెద్ద జయంతి ఉత్సవములు తేది: 30-05-2024 నుండి 01-06-2024 వరకు అత్యంత వైభముగా నిర్వహించుట జరుగుచున్నది.

అందులో భాగంగా

  • మొదటి రోజు తేది: 30 గురువారం శ్రీస్వామి వారికి శ్రీ సీతారామచంద్ర స్వామి దేవస్థానము, భద్రాచలం నుండి ఆనవాయితీగా పట్టు వస్త్రములు కార్యనిర్వహణాధికారి మరియు అర్చక స్వాములు తీసుక వచ్చినారు.
  • ఉ॥9:00 గంటలకు దేవాలయము తరుపున ప్రత్యేక అధికారులు / కార్యనిర్వహణాధికారి, అర్చక స్వాములు / సిబ్బంది వారిని సాదరముగా ఆహ్వానించి 12 రకములైన కళా బృందములతో, నాద స్వరముతో, కోలాటములు, యక్షగానము, 108 దీపాల ప్రదర్శనతో, ఒగ్గు డోలు ప్రదర్శనతో శోభాయాత్రతో శ్రీ స్వామి వారికి పట్టు వస్త్రములు సమర్పించుట జరిగినది.
  • తదుపరి యాగశాల నందు ఉదయము యాగశాల శుద్ధి, పుణ్యహవచనము, అంకురార్పణ, అఖండ దీపస్థాపన, స్వస్తి వాచనము, రక్షభందనము, ఋత్విక్ వరణము, అరుణి మదనము, దేవతాహ్వనము, అగ్ని ప్రతిష్ట ,హవనము, అభిషేకములు, ద్వజారోహణము, నవగ్రహస్థాపన, పారాయణములు, నైవేధ్యము తీర్ధప్రసాదములు వినియోగము మరియు సాయంత్రము హెూమం, మహానైవేధ్యము, మంత్రపుష్పము, తీర్థ ప్రసాద వినియోగము తదుపరి సాంస్కృతిక కార్యక్రమములు నిర్వహించబడినవి.

దేవాలయ కోనేరునందు పాతనీరు తీసి క్రొత్తనీరు ఎప్పటికప్పుడు మార్చబడినది.

ఎల్లవేళల పరిశుభ్రత నిమిత్తం సానిటేషన్ సిబ్బంది సర్వీస్ (3) షిఫ్టుల ద్వారా 200 మంది చొప్పున వినియోగించి పనులు చేపట్టుట జరిగినది.

నేటి నుండి నుండి (3) రోజులు మాల విరమణ మండపము నందు భక్తులకు మాల విరమణ చేయబడుచున్నది.

భక్తుల సౌకర్యార్ధము ( 20 ) ప్రదేశములలో త్రాగు నీరు కేంద్రాలు ఏర్పాటు చేయబడినవి.

నేటి నుండి నుండి భక్తులతో పాటు వివిధ డిపార్ట్ మెంట్ ద్వారా డిప్యూట్ చేయబడిన సిబ్బందికి దేవస్థానము నుండి అన్నదానము ఏర్పాటు చేయబడినది.

జిల్లా కలెక్టర్, జగిత్యాల వారి ఉత్తర్వుల ప్రకారము వివిధ శాఖల అదికారులు వారి వారి విధుల నిర్వర్తించుచున్నారు.

ప్రత్యేకముగా దేవస్థానము నుండి ఏర్పాటు చేయబడిన పార్కింగ్ స్థలముల నుండి దేవాలయం వద్దకు 4 బస్సుల ద్వారా భక్తులకు ఉచితముగా రవాణ సౌకర్యము కల్పించబడినది.

భక్తులు ఉపయోగించుకొనుటకు కోరుచున్నాము.

హెల్త్ డిపార్ట్మెంట్ వారి నుండి దేవాలయ ప్రాంగణములలో (6) ప్రదేశములలో ఉచిత మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేయబడినవన్నారు.

ప్రత్యేక కౌంటర్ల నందు మ్రొక్కుబడి టిక్కెట్లు దీక్షా / కేశ ఖండన / ప్రత్యేక దర్శనము మరియు లడ్డు, పులిహోర ప్రసాదములు విక్రయించబడుచున్నవి.

భక్తులు క్యూపద్దతి పాటించి వినియోగించుకొనుటకు కోరుచున్నామని తెలిపారు. గురువారం రోజు శోభ యాత్ర భక్తుల ద్వారా ప్రత్యేక అధికారుల సమక్షములో కళాబృందములతో, నాట్య విన్యాసముల ద్వారా దేవాలయ అర్చక మరియు పరిపాన సిబ్బంది పాల్గోని దిగ్విజయముగా నిర్వహించబడినది.

(3) రోజులుభక్తులు దీక్ష పరులు శ్రీ స్వామి వారిని దర్శించి తరించి శ్రీ స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని కోరడమైనది.

భక్తులు దీక్షపరులు దేవాలయ కౌంటర్ల వద్ద క్యూ పద్దతి పాటించి పోలీస్ డిపార్ట్మెంట్ వారి సూచనలను పాటిస్తూ మీ యొక్క మ్రొక్కులు చెల్లించుకొని దేవాలయమునకు సహకరించగలరని కోరారు.

కమీషనర్ దేవాదాయ శాఖ, హైదరాబాద్ వారి ఉత్తర్వుల ప్రకారము ఇద్దరు ఫెస్టివల్ ఆఫీసర్స్ నిరంతరము ఏర్పాట్లను పర్యవేక్షించుచున్నారు.

Tags

More News...

Local News 

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్ 

రాయికల్ మండల కేంద్రంలో సామాజిక ఆరోగ్య కేంద్రంను ఆకస్మిక తనిఖీ చేసిన  జిల్లా కలెక్టర్ బి.సత్య ప్రసాద్  రాయికల్ జులై 3( ప్రజా మంటలు)   రాయికల్ మండల కేంద్రంలో  సామాజిక  ఆరోగ్య కేంద్రం ని జిల్లా కలెక్టర్ ఆకస్మికంగా తనిఖీ చేసి ఓ. పి. సేవలు, ఐపీ సేవలు రికార్డ్స్ ల్యాబ్ రికార్డ్స్ ఐపీ రికార్డ్స్ మెడికల్ ఫార్మసి జిల్లాకలెక్టర్ పరిశీలించారు.   ఆసుపత్రిలో వైద్య సేవలను గురించి నేరుగా పేషంట్లని వివరాలు అడిగివైద్య...
Read More...
Local News 

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు. 

సేవా భారతి ఆధ్వర్యంలో గోరింటాకు వేడుకలు.        జగిత్యాల జూలై 3 (ప్రజా మంటలు ) వాల్మీకి ఆవాసం సేవా భారతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో గురువారం గోరింటాకు వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఆషాడ మాసం సందర్భంగా స్త్రీలు గోరింటాకును ధరించడం ఆనవాయితీగా వస్తుంది. ఉచిత కంప్యూటర్ శిక్షణ కేంద్రంలో శిక్షణ పొందుతున్న మహిళలు, సేవికాసమితి సేవా భారతి కార్యకర్తలు...
Read More...
Local News 

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం  ఎమ్మెల్యే కు వినతి 

పద్మశాలి సేవ సంఘ భవన నిర్మాణానికి నిధుల కోసం  ఎమ్మెల్యే కు వినతి      రాయికల్ జులై 3 ( ప్రజా మంటలు)మోరపల్లి  గ్రామంలో పద్మశాలి సేవా సంఘం భవన నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని వినతి పత్రాన్ని అందజేయగా సానుకూలంగా స్పందించిన ఎమ్మెల్యే నిధులు మంజూరుకు కృషి చేస్తానని అన్నారు.ఈ కార్యక్రమంలో నాయకులు కట్ట రాజేందర్,సదానందం పద్మశాలి సంఘం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.
Read More...
Local News 

మలేసియా సదస్సుకు  జగిత్యాల జిల్లావాసి    గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు 

మలేసియా సదస్సుకు  జగిత్యాల జిల్లావాసి     గల్ఫ్ కార్మికుల స్థితిగతులపై అంతర్జాతీయ సదస్సు  జగిత్యాల జులై 2( ప్రజా మంటలు) మలేసియా రాజధాని కౌలాలంపూర్ లో జరుగుతున్న వలస కార్మికుల అంతర్జాతీయ సదస్సుకు జగిత్యాల జిల్లావాసి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సయిండ్ల రాజిరెడ్డి హాజరవుతున్నారు. ఈ నెల 4, 5, 6 తేదీలలో బిల్డింగ్ అండ్ వుడ్ వర్కర్స్ ఇంటర్నేషనల్ (బిడబ్ల్యుఐ) అనే అంతర్జాతీయ...
Read More...
Local News 

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం

షిర్డీ సాయి మందిరంలో ఘనంగా సాయి చరిత్ర పారాయణం ప్రారంభం జగిత్యాల జులై 3 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రం కృష్ణానగర్ లోని, శ్రీ షిరిడి సాయిబాబా మందిరంలో గురువారం సాయి సచ్చరిత్ర పారాయణం అంగరంగ వైభవంగా ప్రారంభమైంది. గురువారం నుంచి మళ్లీ గురువారం వరకు ఈ పారాయణం  కొనసాగనుంది. ప్రతి సంవత్సరం ఆషాడ పౌర్ణమి పురస్కరించుకొని సామూహిక శ్రీ సాయి సచ్చరిత్ర పారాయణం జరుగుతుంది.   108...
Read More...
Local News 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన శత చండీ యాగం 

మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా ఘనంగా ప్రారంభమైన శత చండీ యాగం  హైదరాబాద్ జులై2( ప్రజా మంటలు) హైదరాబాదులోని మల్లాపూర్ విఎన్ఆర్ గార్డెన్స్ లో మహా భాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి ,శ్రీ శారదచంద్రమౌళీశ్వర రుద్రసేవ పరిషత్ 19వ వార్షికోత్సవ వేడుకల్లో భాగంగా బుధవారం శత చండీ యాగం ఘనంగా ప్రారంభమైంది వివిధ ప్రాంతాల నుండి పండితులు, బాధ్యులు, సభ్యులు కార్యక్రమంలో పాల్గొన్నారు . ఈ కార్యక్రమం ఈనెల...
Read More...
Local News 

శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ

శ్రీనివాసుల సేవా సంస్థ ఆధ్వర్యంలో ధర్మపురిలో చిన్నారులకు స్కూల్ బుక్స్ పెన్నుల పంపిణీ ధర్మపురి జులై 3 (ప్రజా మంటలు) శ్రీనివాసుల సేవా సంస్థ (టి ఎస్ ఎస్ఎస్) జగిత్యాల జిల్లా గాజుల శ్రీనివాస్ వారి మిత్ర బృందం  ఆధ్వర్యంలో ధర్మపురి శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి సన్నిధిలో ఇటీవలే తల్లితండ్రులను కోల్పోయిన  చిన్నారులు శన్ముఖ ప్రియ (12), రిషికేష్ (11) పిల్లల మేనత్త ఐన వకుల దగ్గర వుంటున్నారు....
Read More...
Local News 

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం  -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ

వైభవంగా బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం  -పాల్గొన్న సనత్ నగర్ కాంగ్రెస్ ఇంచార్జి డా. కోట నీలిమ    సికింద్రాబాద్, జూలై 02 ( ప్రజామంటలు) : బల్కంపేట ఎల్లమ్మ రథోత్సవం బుధవారం సాయంత్రం నేత్రపర్వంగా సాగింది. గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సతీమణి సుధాదేవ్ వర్మ, కలెక్టర్ హరిచందనతో కలిసి సనత్ నగర్ నియోజకవర్గ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ పూజలు నిర్వహించి కొబ్బరికాయలు కొట్టి అమ్మవారి రథాన్ని లాగి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా...
Read More...
Local News 

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్

పలు వార్డులలో అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్    జగిత్యాల జూలై 2 ( ప్రజా మంటలు) పట్టణ 29,30, 31 ,3,6 8 వార్డుల్లో 80 లక్షలతో నూతనంగా నిర్మించనున్న సిసి రోడ్డు అభివృద్ధి పనులకు భూమి పూజ చేసిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్ గారు. 44 వ వార్డులో 35 లక్షలతో వేస్తున్న cc రోడ్డు పనులను పరిశీలించారు.30,8వార్డులో...
Read More...
Local News 

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి

మారెమ్మ ఆలయానికి దారి కోసం ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ కు ముదిరాజ్ సంఘం వినతి    జగిత్యాల జులై 2( ప్రజా మంటలు) ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ ని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో కలిసి మారెమ్మ ఆలయానికి దారి కోసం వినతిపత్రాన్ని అందజేసిన జగిత్యాల ముదిరాజ్ యువజన సంఘం సభ్యులు.   జగిత్యాల మోతే గ్రామ శివారులో గల సర్వేనెంబర్ 35 మోతే తాళ్ల దగ్గర మారెమ్మ గుడి దానికి సంబంధించి సానుకూలంగా...
Read More...
Local News 

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన

సామాజిక అంశాలపై జిల్లా పోలీస్ కళ బృందం ద్వారా ప్రజలకు అవగాహన సారంగాపూర్ జూలై 2 (ప్రజా మంటలు) జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్   ఆదేశాల మేరకు సారంగాపూర్  పోలీస్ స్టేషన్ పరిధిలోని పోతారం  గ్రామం లో పోలీస్ కళాబృందం వారు మూఢ నమ్మకాలు, ఆత్మహత్యల నివారణ, రోడ్డు ప్రమాదాలు మరియు ట్రాఫిక్ నియమాలు, గల్ఫ్ ఏజెంట్ ల మోసాలు, సైబర్ మోసాలు,నివారణ పై అవగాహన, సీసీ కెమెరాల...
Read More...
Local News 

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి  అవగాహన కలిగి ఉండాలి

సైబర్ నేరాల, సైబర్ భద్రత పై ప్రతి ఒక్కరికి  అవగాహన కలిగి ఉండాలి   జగిత్యాల జులై 2( ప్రజా మంటలు) సైబర్ నేరాలు, సైబర్ భద్రత పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున సైబర్ జాగౄక్త దివాస్ అనే ప్రత్యేక కార్యక్రమం*నిర్వహిస్తున్నారు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్  ఆదేశాలమేరకు  సైబర్ నేరాల, సైబర్ భద్రత పై అవగాహన గురించి ప్రతి నెల మొదటి బుధవారం రోజున...
Read More...