కిరిమిష్ బాస్కెట్ బాల్ అకాడమీ ఆధ్వర్యంలో కొనసాగుతున్న బాస్కెట్ బాల్ సమ్మర్ క్యాంప్.
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
జగిత్యాల మే 21( ప్రజా మంటలు) :
జిల్లా కేంద్రంలోని మినీ స్టేడియంలో కిరిమిష్ బాస్కెట్ బాల్ అకాడమీ ఆధ్వర్యంలో గత 21 రోజులుగా బాస్కెట్ బాల్ శిక్షణ తరగతులు కొనసాగుతున్నాయి.
క్రీడాకారుల సెలవులు సద్వినియోగం అయ్యేలా మరియు శారీరక దృఢత్వం, క్రీడా స్ఫూర్తి పెంపొందించేలా శిక్షణ ఉచితంగా నిర్వహిస్తున్నట్లు బెంగళూరులోని ఎన్ ఐ ఎస్ డిప్లమో క్వాలిఫైడ్ ట్రేనర్ కే. శ్రీరామ్ తెలిపారు.
శిక్షణ కోసం స్టేడియం కు పంపడానికి క్రీడాకారుల తల్లిదండ్రులు సహకరిస్తున్నారని దీంతో అధిక సంఖ్యలో క్రీడాకారులు గ్రౌండ్ కు రాగలుగుతున్నారని నిరంతరం ఉచితంగా ఈ స్టేడియంలో క్రీడాకారులకు శిక్షణను ఇస్తున్నామన్నారు.
ఇది తనకు ఎంతో సంతృప్తి కలిగిస్తుందని పేర్కొన్నారు.
తీరిక వేళల్లో సెలవుల సమయంలో క్రీడాకారులు దురలవాట్లకు గురికాకుండా ,క్రీడల్లో నిమగ్నము కావడం తో వారిలో నైతిక స్థైర్యం పెంపొందుతుందని అన్నారు.
స్టేడియంలో బాస్కెట్ బాల్ శిక్షణ కోసం తనతో పాటు సీనియర్ క్రీడాకారుల సహకారంతోనే నిరంతర శిక్షణ కొనసాగుతున్నదని సీనియర్ క్రీడాకారులు ఎస్. శశి, డి. అనిల్, టి. లక్ష్మణ్, కే. సామంత్, పి. విజ్ఞాన్, సిహెచ్ .సుధాకర్ మరియు విద్యార్థి (క్రీడాకారుల ) తల్లిదండ్రులకు ట్రేనర్ కె.శ్రీరామ్ ధన్యవాదాలు తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఇబ్రహీంపట్నం పోలీస్ స్టేషన్ ను తనిఖీ చేసిన జిల్లా ఎస్పీ అశోక్

మేడిపల్లి గ్రామ శివారులో ఏడుగురు పేకాట రాయుళ్ల అరెస్ట్.

శ్రీ వీర బ్రహ్మేంద్ర ఆలయ వార్షికోత్సవము- కల్యాణ వేడుకలు

మైనార్టీ నేతలతో కార్పొరేటర్ సమావేశం

సదర్మట్ ప్రాజెక్టు భూ సేకరణ.

బడ్జెట్ లో బడుగు బలహీన వర్గాలకు మొండి చేయి. బి ఆర్ ఎస్ జిల్లా అధ్యక్షులు,పూర్వ జెడ్పీ చైర్ పర్సన్

వైభవంగా ధర్మపురీశుల రథోత్సవ వేడుకలు

అంబరాన్ని అంటిన రవీంద్ర ప్లే స్కూల్ దర్పణ్ - 2K25 సంబరాలు

హరిహర క్షేత్రంలో అంబరాన్ని స్పృశించిన భక్తి పారవశ్యం

ఎస్బి బిల్లు ప్రవేశ పెట్టిన సందర్భముగా ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయము లో సి ఏం చిత్ర పటానికి పాలాభిషేకం

విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించాలి -. జిల్లా విద్యాధికారి రాము.

టెన్త్ విద్యార్థులకు పది పరీక్షలపై అవెర్నెస్ కార్యక్రమం
