కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్  ప్రభుత్వమే.  -ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

On
కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్  ప్రభుత్వమే.  -ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్  ప్రభుత్వమే. 
-ఐటీ మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు

గొల్లపల్లి మే 09 (ప్రజా మంటలు) : గత పదేళ్ల పాలన కాలంలో నరేంద్ర మోడీ కార్పొరేట్లకు తప్ప సామాన్య జనానికి చేసింది ఏం లేదని,! ఈ విషయాన్ని సామాన్య జనం గుర్తించి కాంగ్రెస్ పార్టీ  చేతి గుర్తుకు ఓటు  వేయడం ద్వారా అతి త్వరలో కేంద్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఐటీ మంత్రి  దుద్దిల్ల శ్రీధర్ బాబు

 పేర్కొన్నారు. గొల్లపల్లి మండల కేంద్రంలోని స్థానిక బస్టాండ్ లో పెద్దపల్లి కాంగ్రెస్ పార్టీ ఎంపీ అభ్యర్థి గడ్డం వంశీకృష్ణకు మద్దతుగా  ప్రభుత్వ విప్ ,  విధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ తో కలిసి కార్నర్ మీటింగ్లో మంత్రి పాల్గొన్నారు.

 

ఈ సందర్భంగా శ్రీధర్ బాబు మాట్లాడుతూ, గడ్డం వంశీ గారిని పెద్దపెల్లి పార్లమెంటు ఎంపి గా భారీ మెజారిటీతో గెలిపించాలని,బి .ఆర్.ఎస్,బీజేపీ పార్టీ నాయకుల మోసపూరిత హామీలను ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమానికి కట్టుబడి ఉందని,! ఎన్నికల సందర్భంగా ఇచ్చిన ఆరు గ్యారెంటీ పథకాలను కచ్చితంగా అమలు చేసి తీరుతామని పేర్కొన్నారు. కళ్ళుండి చూడలేని కబోదులు టిఆర్ఎస్,  బిజెపి అని! వారి మాయమాటలను ప్రజలు నమ్మి మరోసారి మోసపోవద్దని హెచ్చరించారు.  పెద్దపల్లి  ఎంపీగా గడ్డం వంశీకృష్ణను భారీ మెజార్టీతో గెలిపించి సీఎం రేవంత్  రెడ్డికి ప్రియ శిష్యుడైన ప్రభుత్వ విప్,  ధర్మపురి ఎమ్మెల్యే అడ్డూరి లక్ష్మణ్ కుమార్ కు రిటర్న్ గిఫ్ట్ గా ఇవ్వాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. రాహుల్ గాంధీ  ఇచ్చిన పంచ న్యాయలను అమలు చేసి తీరుతామని,  ప్రతి ఒక్కరూ హస్తం గుర్తుకు ఓటు వేసి వంశి నీ గెలిపించాలని ఈ సందర్భంగా కోరారు

ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ! అధ్యక్షులు నిశాంత్ రెడ్డి,  జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్ చంద్రశేఖర రావు, తాండ్ర సురేందర్ , భీమ సంతోష్ ,యూత్ అధ్యక్షులు ఓరగంటి తిరుపతి, ఎంపిటిసి లంబ! దనవ్వ లక్ష్మణ్, పట్టణ అధ్యక్షులు నేల మహేష్, ఓర్స్ విజయ్, గురజాల బుచ్చిరెడ్డి, కొక్కుల జలంధర్, కట్ట లక్ష్మణ్, గాజగ్గి సత్తయ్య ,నాయకులు కార్యకర్తలు యువకులు నాయకులు  తదితరులు పాల్గొన్నారు.

----------------------------------------

Tags