పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.
(రాజేష్ బొంగురాల - జగిత్యాల జిల్లా ప్రతినిధి) పెద్దపల్లి పార్లమెంట్ ఎవరికీ దక్కనుంది ????.
-
కాకలు తీరిన కాకా కుటుంబ వారసుడికా ?
- ప్రజలను,నాయకులను నమ్ముకున్న ఈశ్వరుడికా??
- ప్రపంచ దేశాలకు విశ్వ గురువుగా పేరొందిన కాషాయ సైనికుడు గోమాసకా???
జగిత్యాల జిల్లా మే 09 (ప్రజా మంటలు) :
పెద్దపెల్లి లో కమలం వికసించేనా అనే సందేహం స్పష్టంగా కనిపిస్తుండగా,గతంలో నుండి పెద్దపల్లి పార్లమెంట్ లోని మంచిర్యాల, ధర్మపురి, పెద్దపల్లి, రామగుండం నుండి ఇప్పటి వరకు హిందుత్వం, క్రింది స్థాయి కార్యకర్తల సంకల్పం బలంగా ఉన్నప్పటికీ పోలింగ్ సమీపిస్తున్న నాయకులు పెద్దపల్లి పార్లమెంట్ లోని నియోజకవర్గాల ప్రచారంలో భాగస్వాములు కాకపోగా పక్క పార్టీల వైపు తొంగి చూస్తున్నరనే ప్రజల్లో చర్చ ఒక వైపు.
గతంలో వివేకానంద నే తమ పెద్ద దిక్కు గా ఎంపీ గా ,ఎమ్మెల్యే గా తనపై ఆశలు పెట్టుకొని వారితో మమ్మేకమై వారితో బీజేపీ పార్టీలో పని చేసిన సెంటిమెంట్ తో ప్రస్తుతం నాయకులు కాషాయ పార్టీ కోసం పోరాటం చేస్తారా లేదా అనే సందేహం మరోవైపు అన్నట్లుంది.
పెద్దపల్లి పార్లమెంట్ లో కాషాయం ఖాతా తియలేక పార్టీని వదలలేక కార్యకర్తలలో మనో వేదన మొదలైంది.
కారు పార్టీలో జోష్ నింపుతున్న మాజీ సీఎం కెసిఆర్ తరచూ రోడ్డు షో లతో ప్రజలకు దగ్గరవుతున్నరు.మాజీ మంత్రి,తెలంగాణ ఉద్యమకారుడు, సింగరేణి కార్మికులు గా అనుభవం కల్గిన కొప్పుల ఈశ్వర్ మిస్టర్ కూల్ గా రాష్ట్ర స్థాయి నుండి గ్రామ స్థాయి లో తనకున్న మంచి పేరు,వ్యక్తిత్వం, ఆదరణ అభిమానాలు తనని గట్టెకిస్తాయి అని ప్రగడమైన విశ్వసం తో తనతో కలిసి పని చేసిన నాయకులు,తాను చేసిన అభివృద్ధి పనులు తనకు కొండంత అండగా ఉంటాయని నమ్ముతున్నారు.
యువత కు స్ఫూర్తిగా గులాబీ శ్రేణులలో ఉత్సహం నింపుతూ తన కూతురు నందిని ప్రజలతో మాట్లాడుతు ఈ ఒక్కసారి ఆలోచించండి, ప్రజలకు చేదోడు వాదోడుగా ఉంటూ ఈశ్వర్ అన్నగా మీముందుకు వచ్చిండు, మీరు నమ్మిన మీ స్థానిక నాయకులు మిమ్ములను మోసం చేసి ఇబ్బంది పెట్టినారు కానీ నాయకులు మిమ్ములను ఇబ్బంది పెడితే వారికీ స్థానిక ఎలక్షన్ లలో బుద్ది చెప్పండి.
న్యాయం ధర్మం కోసం పరితపించే మీ ఈశ్వరుడు అయిన మా నాన్న కి పెద్దపల్లి ఎంపీ గా అవకాశం ఇవ్వండి అని ప్రజలను వేడుకోవడం చర్చనీయ అంశం.
సీఎం రేవంత్ రెడ్డి జనజాతర సభలకు జనం నిరంజనాలు పలుకుతుండగా పెద్దపల్లి ఎంపీ కాకా కుటుంబానికే దక్కనుందా అనే చర్చ ప్రజల్లో విస్తృత కొనసాగుతుంది.
పెద్దపల్లి పార్లమెంట్ పై పట్టున్న తాత మాజీ కేంద్ర మంత్రి కాకా వెంకట్ స్వామి కుటుంబ నేపథ్యంలో తండ్రి వివేక్ ఎంపీ చేసి ప్రజలతో, నాయకులతో కలసిపోయే బలమైన నాయకులు కాగా మంత్రి శ్రీధర్ బాబు అండదండలు,పార్టీ ఆపదలో ఉన్న సమయం లో నేనున్న అంటూ అప్పటి మాజీ మంత్రి గా, ఎమ్మెల్యే గా ప్రస్తుతం మంత్రి గా మంచిర్యాల, ధర్మపురి, రామగుండం, మంథని, బెల్లంపల్లి, చెన్నూర్, పెద్దపల్లి నియోజకవర్గం లపై పట్టు సాధించిన సౌమ్యులు గా పేరున్న మంత్రి శ్రీధర్ బాబు పార్లమెంట్ ఇంచార్జ్ గా హస్తం భారీ మెజారిటీ తో ప్రభంజనం సృష్టించం కాయంగా ప్రచార హోరు జరుగున్న పరిస్థితులు కనబడటం ఒక ఎత్తు.
పార్లమెంట్ పరిధిలోని ఏడు నియోజకవర్గం లలో శాసనసభ్యులు గా ప్రతిపక్షం కి అవకాశం ఇవ్వకుండా మంచి మెజారిటీ తో గెలిచిన సీనియర్ ఎమ్మెల్యేలు ఉండడం ప్రతి నియోజకవర్గం లో తామే పార్లమెంట్ అభ్యర్థి అన్నట్లుగా ప్రచారాలు ఉదృతం చేయడం అభ్యర్థి గడ్డం వంశీకృష్ణ కి కలిసోచ్చే కాలం గా పార్లమెంట్ పరిధిలో వాతావరణం మారిపోయింది.
పది సంవత్సరాలనుండి కసి తో ఎప్పుడా అని ఎదిరి చూసిన బలమైన నాయకులు, క్రమశిక్షణ తో మేమున్నాం అంటూ పని చేసే కార్యకర్తలు మిగితా పార్టీలకు మేమేమి తీసుపోము అన్నట్లు కార్యకర్తలే ప్రచారం ముమ్మరం చేయడం కాంగ్రెస్ పార్టీకి బలం చేకూరుతుంది.
ఏది ఏమైనప్పటికి గతం లో కంచుకోటగా కాంగ్రెస్ కి, పది సంవత్సరాలు బి ఆర్ యస్ కు అవకాశం ఇచ్చిన పెద్దపల్లి పార్లమెంట్ ఓటర్లు ఈసారి కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీ లకు ఓటు వేస్తారా?
సాగు త్రాగు నీటి ప్రాజెక్టులు,రోడ్లు,ప్రజలకు అందించిన పథకాలు, అన్ని తామే అభివృద్ధి చేశాం అనే బి ఆర్ యస్ కు వేస్తారా?
లేదా నమో మోడి, జై శ్రీరామ్, హిందుత్వం కోసం మేమున్నాం అంటున్న,మోడీ కేంద్ర ప్రభుత్వం హయంలో చేసిన పలు జన సంక్షేమ ప్రయోజనాలు అందించిన బీజేపీ కి ఓటు వేస్తారో వేచి చూడాల్సిందే.
More News...
<%- node_title %>
<%- node_title %>
బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారోత్సవం
బీర్పూర్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు)ఇటీవల జరిగిన గ్రామ పంచాయతీ ఎన్నికలలో గెలుపొందిన నూతన సర్పంచ్ ఉప సర్పంచ్ వార్డ్ మెంబర్ ల ప్రమాణ స్వీకార కార్యక్రమం జగిత్యాల నియోజకవర్గం బీర్పూర్ మండలం తుంగూరు గ్రామపంచాయతీ నూతన పాలకవర్గం ప్రమాణస్వీకారోత్సవం ఘనంగా జరిగింది.
సోమవారం విజయం సాధించిన గ్రామపంచాయతీ సర్పంచ్లు ఉప సర్పంచ్ లు... హరిహరాలయంలో ఘనంగా మూలమూర్తికి అభిషేకం
జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా కేంద్రంలోని బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో పుష్య మాసము తొలి సోమవారం సాయంత్రం మూలమూర్తికి వివిధ ఫల రసాధులచే అభిషేకం నిర్వహించారు. భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు విచ్చేసిన భక్తులకు తీర్థ ప్రసాద వితరణతో పాటు వేద ఆశీర్వచనం చేశారు
ఇదిలా ఉండగా ఏ ఎస్ ఐ... రూ.3855.02 కోట్ల వ్యాపారానికి చేరుకున్న గాయత్రి బ్యాంకు : కొడిమ్యాలలో 68వ శాఖ ప్రారంభం
జగిత్యాల, డిసెంబర్ 23 (ప్రజా మంటలు):
జగిత్యాల కేంద్రంగా పనిచేస్తున్నది. గాయత్రి కో-ఆపరేటివ్ అర్బన్ బ్యాంకు లిమిటెడ్ మరో కీలక మైలురాయిని చేరుకుంది. కొడిమ్యాల మండల కేంద్రంలో బ్యాంకు 68వ శాఖను జగిత్యాల జిల్లా కలెక్టర్ & మెజిస్ట్రేట్ బి. సత్యప్రసాద్ ఐఏఎస్ చేతుల మీదుగా సోమవారం ఘనంగా ప్రారంభించారు.
ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో జిల్లా... కస్టడీ మృతిపై తీవ్ర ఆరోపణలు: విచారణకు ఆదేశించిన TGHRC
హైదరాబాద్ డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
కర్లా రాజేష్ కస్టడీ మృతికి సంబంధించి వచ్చిన తీవ్ర ఆరోపణలను తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) పరిగణనలోకి తీసుకుంది. SR నెం.4129, 4130 ఆఫ్ 2025 కేసుల్లో అక్రమ నిర్బంధం, కస్టడీలో చిత్రహింసలు, తప్పుడు కేసు నమోదు వల్లే రాజేష్ మృతి చెందినట్లు ఆరోపణలు ఉన్నాయని కమిషన్... ప్రజా సమస్యలను పట్టించుకొని కేసీఆర్ : మంత్రి అడ్లూరి లక్ష్మణ్ విమర్శలు
కరీంనగర్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
కరీంనగర్ ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో నిర్వహించిన మీడియా సమావేశంలో రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, సుడ ఛైర్మెన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి పాల్గొన్నారు. జూబ్లీహిల్స్తో పాటు స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు మార్పును కోరుతూ కాంగ్రెస్కు అధికారం ఇచ్చారని తెలిపారు. మాజీ సీఎం... ప్రజావాణిలో వచ్చే ఫిర్యాదులకు సమగ్ర విచారణ జరిపి పరిష్కారానికి చొరవ చూపాలి జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్
జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు)
ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పలు సమస్యల పరిష్కారం కోరుతూ జిల్లా కేంద్రంతో పాటు జిల్లాలోని పలు మండలాల నుండి ప్రజలు సమస్యలు విన్నవించుకోడానికి ప్రజావాణికి వస్తారని, అధికారులు వారి శాఖల వారిగా స్వీకరించిన ఫిర్యాదులపై సానుకూలంగా వ్యవహరించడంతో పాటు సమస్యల పై సమగ్ర విచారణ చేపట్టి... జగిత్యాలలో నూతన సర్పంచులకు జీవన్ రెడ్డి శుభాకాంక్షలు
జగిత్యాల, డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గంలోని లక్ష్మిపూర్, నర్సింగపూర్, చల్గల్, దరూర్, సింగారవుపేట్, అల్లిపూర్, ఉప్పమడుగు, అయోధ్య, మహితపూర్ గ్రామాల్లో నూతనంగా ఎన్నికైన సర్పంచులు, ఉపసర్పంచులు, వార్డు సభ్యులకు మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు.
సర్పంచుల ప్రమాణ స్వీకారోత్సవ కార్యక్రమాల్లో పాల్గొన్న జీవన్ రెడ్డి మాట్లాడుతూ, గ్రామాలతో తనకు... సీపీఆర్ చేసి వృద్ధుడి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్: అభినందించి రివార్డ్ అందజేసిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల డిసెంబర్ 22 (ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని కొత్త బస్టాండ్ చౌరస్తా వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి స్పృహ కోల్పోగా,
అతనికి సీపీఆర్ చేసి ప్రాణాలు కాపాడిన ట్రాఫిక్ హోం గార్డ్ చంద్రశేఖర్ ను సోమవారం మధ్యాహ్నం రెండు గంటలకు. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ శాలువతో సన్మానించి రివార్డును... గద్వాల్ జిల్లాలో అక్షరాస్యత, రోడ్లు, సాగునీటి వైఫల్యాలపై కవిత తీవ్ర విమర్శలు
గద్వాల్, డిసెంబర్ 22 (ప్రజా మంటలు):
జోగులాంబ గద్వాల్ జిల్లాలో తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత విస్తృతంగా పర్యటించారు. సాగునీటి ప్రాజెక్టులు, విద్యా సంస్థలు, నిర్వాసితుల సమస్యలు, రైతుల ఇబ్బందులను ప్రత్యక్షంగా పరిశీలించి ప్రజలతో ముఖాముఖి మాట్లాడారు.
రాజకీయ మార్పే పరిష్కారం
“70 ఏళ్లుగా... యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:?
జగిత్యాల / హైదరాబాద్ డిసెంబర్ 22 ప్రజా మంటలు:
జగిత్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సందర్భంగా యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతా అని ఎమ్మెల్యే... TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సౌజన్యంతో కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం, అదనపు క్లాస్రూమ్స్ను ప్రారంభించారు. టిడిఎఫ్–మన తెలంగాణ బడి ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అందించిన ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి.... 