మాజీ ఎంపిపి, ఎంపీటీసీ సుగుణాకర్ రావు, పుష్పలతాదేవి బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా
మాజీ ఎంపిపి, ఎంపీటీసీ సుగుణాకర్ రావు, పుష్పలతాదేవి బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా
మెటుపల్లి ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) :
ఇబ్రాహీం పట్నం మండలానికి చెందిన మాజీ ఎం పీపీ, ఎం పీటీసీ వెల్ముల సుగుణాకర్ రావు వెల్ముల పుష్పలతాదేవి లు బి ఆర్ ఎస్ పార్టీకి రాజీనామా చేశారు. పార్టీలో ఉన్నా పార్టీ నాయాఉయ్యకులు, ఎమ్మెల్యే తమకు ఎలాంటి సమాచారం ఇవ్వకుండానే మండలంలో పర్యటించడం, పార్టీ కార్యక్రమాలకు ఆహ్వానించకపోవడం వల్ల మనస్తాపం చెంది, పారీలో ఉన్నా ఎలాంటి లాభం లేదని ఆరోపిస్తూ, జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే కల్వకుంట్ల విద్యాసాగర్ రావుకు లేఖ రాసారు.
ఈలేఖలో, జెడ్పిటిసి నుంచి మీరు ఎమ్మెల్యేగా గెలిచే వరకు మరియు మీ కొడుకు సంజయ్ ఎమ్మెల్యేగా గెలిచే వరకు మేము మా కుటుంబం రాత్రి పగలు కష్టపడి మీ విజయానికి కృషి చేశాము. మేము ఎంత కష్టపడ్డా గాని మీ దగ్గర తగిన గుర్తింపు లేకపోవడం వల్ల, కనీస సమాచారం ఇవ్వకుండా మండల్లో పర్యటిస్తూ, చిన్న సమాచారం ఇవ్వకుండా మీకోసం కష్టపడ్డ మాలాంటి కుటుంబాలకు మీరు తీరని నష్టం కలిగించారని ఆరోపినహారు. మీ కన్నా ముందు రాజకీయాల్లో వెల్ముల పుష్పలత దేవి సుగుణాకర్ రావు అనే మేము మండల ప్రెసిడెంట్ గా, మూడుసార్లు ఎంపీటీసీగా, ఒకసారి సిడిసి చైర్మన్ గా ఉన్నాము. ఒకసారి జడ్పిటిసి గా పోటీ చేసి ఓడిపోయాం. మేము రాజకీయాల్లో ఉంటూ, ఇంకొకరికి శ్రేయస్సు కోరాము ఇంకొకరు ఎదుగుదలకు కృషి చేశాము. కానీ మీలాగా మీ రాజకీయ భవిష్యత్తు కొరకు ఇతరులను వాడుకొని వారి రాజకీయ భవిష్యత్తును కక్షగట్టి ఎవరిని నాశనం చేయలేదు. మీరు ప్రతిసారి కుటుంబం కుటుంబం అనుకుంటూ మా కుమారుడు వెల్ముల శ్రీనివాసరావును కూడా పూర్తిగా మీ రాజకీయ జీవితానికి , ఆయన జీవితాన్ని కూడా నాశనం చేశారు. కార్యకర్తల్లో ప్రజల్లో ఎవరు మా వెంట తిరిగిన, వారిని ఫాలోఅప్ చేసుకుంటూ తిరగకుండా చేయడం మరియు మా రాజకీయ జీవితాన్ని పూర్తిగా సమాధి కట్టారు. మా కుటుంబం ప్రజలు మీద అభిమానంతో మేము ఇప్పటివరకు ఓపిక పట్టినాము మాకు పార్టీ మారే ఉద్దేశం లేదు మా కుటుంబం ఇప్పటికీ ప్రజలతోనే ఉంది చివరి శ్వాస వరకు ప్రజాసేవ చేస్తూనే ఉంటాం ప్రజల మధ్యనే ఉంటాం కాబట్టి మాకు ప్రజలకు సేవ చేయాలని భావంతోనే మీతో ఉంటే ప్రజలకు సేవ చేయలేమని మీరు డబ్బు ఉన్నవారికి తప్ప మిగతా వారిని గుర్తించరని, మాకు మీ దగ్గర ఎలాంటి రాజకీయ భవిష్యత్తు లేదు అని మేము బిఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేస్తున్నామనీ లేఖలో పేర్కొన్నారు. ఈ ఇద్దరు బియరెస్ జిల్లా అధ్యక్షకుని కన్నా ముందు నుండే తెలుగుదేశం పార్టీలో అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
గవర్నర్లను రాజకీయ సాధనాలుగా మార్చిందని కేంద్రంపై స్టాలిన్ విమర్శ

గాంధీనగర్ పీఎస్ పరిధిలో కమ్యూనిటీ పోలీసింగ్

దేశ, విదేశాలలో జరిగిన ఈనాటి ప్రధాన వార్తల ముఖ్యాంశాలు

బీసీల బంద్ కు మద్దతుగా తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఖైరతాబాద్ చౌరస్తా లో మానవహారం

తెలంగాణలో బీసీ సంఘాల జాక్ ప్రకటించిన బంద్ ప్రశాంతంగా కొనసాగుతుంది

జగిత్యాల లో ప్రశాంతంగా స్వచ్ఛందంగా కొనసాగుతున్న బంద్.

బాలపెల్లి గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి రవీందర్ రెడ్డి జిల్లా కాంగ్రెస్ అధ్యక్ష పదవికి దరఖాస్తు దాఖలు

OTT లో విడుదలైన "కిష్కిందపురి"

బ్యాంకింగ్ ఒడిదుడుకుల నడుమ US స్టాక్లు కోలుకొంటున్నాయి

కవిత అక్కకు బీసీలు ఇప్పుడు గుర్తొచ్చారా? - బీజేపీ రాష్ట్ర నాయకురాలు ఎం. రాజేశ్వరి.

సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి పై దాడిచేసిన నిందితుడిని శిక్షించాలి

బీసీ బంద్ శాంతియుతంగా జరుపుకోండి - డీజీపీ శివథర్ రెడ్డి సూచన
