ఘనంగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో ఘనంగా వీడ్కోలు సమావేశం.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348421113)
జగిత్యాల ఏప్రిల్ 28 ( ప్రజా మంటలు)
స్థానిక ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలలో డిగ్రీ ఫైనలియర్ చదువుతున్న విద్యార్థులకు మొదటి సంవత్సరం మరియు ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఘనంగా వీడ్కోలు సమావేశం ఏర్పాటు చేశారు.
ఈ కార్యక్రమంలో అధ్యక్షుడిగా ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ వై సత్యనారాయణ మాట్లాడుతూ....., విద్యార్థుల్లో దాగివున్న ప్రతిభను వెలికి తీసి, రానున్న పోటీ పరీక్షలలో విజయదుందుభి మ్రోగించి ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల పేరు ప్రతిష్టలు నిలబెట్టాలని, అలాగే ప్రథమ ద్వితీయ సంవత్సరం చదువుతున్న విద్యార్థులు ఫైనల్ ఇయర్ విద్యార్థుల నుంచి అనుభవాలను నేర్చుకోవాలని సూచించారు.
కళాశాల సాధించిన గత ఐదు సంవత్సరాల కాలంగా ప్రగతిని ప్రభుత్వ నివేదించారు.
దీనిలో పీఎం ఉష కింద కళాశాలకి ఐదు కోట్ల రూపాయలు మంజూరు అయ్యాయని, 12 తరగతి గదులను, రెండు కంప్యూటర్ ల్యాబ్ లను, 100 కంప్యూటర్లను కళాశాలకు కేటాయించినందుకు కళాశాల ఉన్నత విద్యా కమిషనకు ధన్యవాదాలు తెలియజేశారు.
కళాశాలలో అత్యున్నతమైన ప్రతిభావంతులైన విద్యార్థులను తయారు చేసే మానవ వనరులైన కళాశాల అధ్యాపకులు, నిష్ణాతులైన అధ్యాపకులు, విద్యార్థులకు అనునిత్యం విద్యా బోధనతోపాటు, సమాజ బాధ్యతను, పోటీ ప్రపంచాన్ని పరిచయం చేస్తున్నారని, కళాశాలలో అన్ని రకాల కరికలర్, కోకరిక్యులర్, ఎక్స్ట్రా కరీకులర్ ఆక్టివిటీస్ జరుగుతున్నాయని, ఎన్ఎస్ఎస్ 3 యూనిట్ల వాలంటీర్లు మల్లన్న స్వామి జాతర, పెద్దాపూర్. కొండగట్టు చిన్న హనుమాన్ జయంతి ఉత్సవాలు, అదేవిధంగా ధర్మపురి శ్రీ లక్ష్మీనరసింహస్వామి బ్రహ్మోత్సవాలలో పాల్గొంటున్నారని కళాశాలలో రక్తదాన శిబిరాన్ని కూడా ఏర్పాటు చేశారని, కళాశాల నుంచి ఎన్నికల విధుల్లో అందరూ అధ్యాపకులు సెక్టోరల్ ఆఫీసర్లుగా పాల్గొంటున్నారని, అదేవిధంగా కళాశాల నుంచి రాష్ట్రస్థాయి మాస్టర్ ట్రైనర్ గా డాక్టర్ పడాల తిరుపతి ని నియమించిన విషయాన్ని గుర్తు చేశారు.
ఈ కళాశాలలో ఈ విద్యా సంవత్సరానికి గాను రాష్ట్రస్థాయి ఉత్తమ అధ్యాపకురాలిగా డాక్టర్ హరిజోత్ కౌర్ ఎంపికయ్యారని అదేవిధంగా జిల్లాస్థాయి ఉత్తమ ఉపాధ్యాయులుగా జంతు శాస్త్ర అధ్యాపకురాలు డాక్టర్ కే కిరణ్మయి తో పాటుగా జిల్లా ఉత్తమ అధ్యాపకులుగా డాక్టర్ పడాల తిరుపతి ఎన్ఎస్ఎస్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఎంపికయ్యారని కళాశాల ప్రిన్సిపల్ అభినందించారు. అనంతరం కళాశాల విద్యార్థులు నృత్య ప్రదర్శనలు, మంచి విందు భోజనం ఆరగించారు.
ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ మసురు సుల్తానా, అకాడమిక్ కోఆర్డినేటర్, అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఏ జ్యోతిలక్ష్మి, ఎగ్జామినేషన్ కోఆర్డినేటర్ డాక్టర్ అంబాల శంకరయ్య, ఐ క్యు ఏసి కోఆర్డినేటర్ డాక్టర్ హరి జ్యోతికౌర్, వృక్ష శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ జి చంద్రయ్య, కల్చరల్ కోఆర్డినేటర్ డాక్టర్ కే కిరణ్ మై, వాణిజ్య శాస్త్ర విభాగాధిపతి డాక్టర్ మల్లారం శ్రీనివాస్ రెడ్డి, ఎన్ఎస్ఎస్ జిల్లా జాతీయ ఎన్ఎస్ఎస్ జగిత్యాల జిల్లా నోడల్ ఆఫీసర్ డాక్టర్ పడాల తిరుపతి, రాపర్తి శ్రీనివాస్, గణిత శాస్త్ర అధ్యాపకురాలు శ్రీమతి తాటి స్వరూప రాణి, ఏ రజిని, వి జమున, డి సునీత, శ్రీమతి ఈ జ్యోత్స్న, ఎస్ సత్యం, ఆర్ మాధవి, సంగీత, సాయి, కొండ సంతోష్, గొల్లపల్లి తిరుపతి, సలీం, నరసయ్య, ఎదునూరి నవీన్, రశ్మిత, సురేష్, ఇర్ఫాన్ ఆ బేగం, యాస్మిన్ సుల్తానా, వాలంటీర్లు, విద్యార్థులు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు
More News...
<%- node_title %>
<%- node_title %>
నేటి తరానికి ఆదర్శంగా ఆకర్షణ *చిన్న వయస్సులో గొప్ప ఆలోచన గ్రేట్ - దమ్మాయిగూడ లో 21వ లైబ్రరీ ఓపెన్

పహాల్గమ్ " ఉగ్రదాడి తీవ్ర విచారకరం *తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం గాంధీ యూనిట్ అధ్యక్షులు డాక్టర్ భూపేందర్ రాథోడ్

కళ్యాణం కమనీయం ...వెంకన్న కళ్యాణం..బోయగూడలో..
.jpg)
మావోయిస్టు లతో శాంతి చర్చలపై జానారెడ్డి,కేశవ్ రావులతో సీఎం రేవంత్ రెడ్డి సమాలోచనలు

సీఎం రేవంత్ రెడ్డిని కలిసిన ప్రధాన కార్యదర్శిగా నియమితులైన కె. రామకృష్ణ రావు

పోల్ బాల్ అంజన్న ఆలయంలో మహా అన్నదానం

ఇస్రాజ్ పల్లె లో కొవ్వొత్తులతో ర్యాలీ

వేసవిలో దాహం తీర్చేందుకు చలివేంద్రం ఏర్పాటు చేయడం ఆభినందనీయం - తాసిల్దార్ వరందన్

మేప్మా ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన జగిత్యాల శాసనసభ్యులు డాక్టర్ సంజయ్ కుమార్

శత రుద్ర సహిత ఏకకుండాత్మక శత చండీ యాగం ఏర్పాట్లకై మహాభాగ్యనగర బ్రాహ్మణ సేవా సమితి బాధ్యుల కర్ణాటక రాష్ట్ర క్షేత్ర పర్యటన

శ్రీ కంచి కామకోటి పీఠం 71వ పీఠాధిపతిగా శ్రీ గణేశ్ శర్మ

ఘనంగా సౌందర్యలహరి పారాయణ కార్యక్రమం
