బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం..

On
బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో అంగరంగ వైభవంగా సీతారాముల కళ్యాణం..

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల ఏప్రిల్ 17( ప్రజా మంటలు) : 

 జగిత్యాల పట్టణంలోని బ్రాహ్మణ వీధి శ్రీరామ మందిరంలో శ్రీ సీతారాముల కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

శ్రీ రామ మందిరం అధ్యక్షులు మొటల. సాయన్న మరియు ధర్మకర్తలు అయిల్నేని. శోభారాణి, బెత్తం లక్ష్మణ్ దంపతులు, గుమ్ముల భూమయ్య, కొంగరి చెన్నారెడ్డి, తదితరులు బ్రాహ్మణ వీధి హరిహరాలయం నుండి కళ్యాణ అక్షితలను మరియు పట్టు వస్త్రాలను మంగళవాద్యాలతో శ్రీరామ మందిరానికి వేంచేపు చేసి ప్రత్యేక వేదికపై ఉత్సవమూర్తులను ఉంచి కళ్యాణాన్ని ఘనంగా నిర్వహించారు.

భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. విచ్చేసిన భక్తులకు కళ్యాణ అనంతరం కళ్యాణ అక్షితలు, తీర్థ ప్రసాద వితరణ ఆశీర్వచనం చేశారు.

వైదిక క్రతువులు పాలెపు వెంకటేశ్వర శర్మ, అల్వాల దత్తాత్రి శర్మ, సభాపతి తిగుళ్ల సూర్యనారాయణ శర్మ ,సిరిసిల్ల రఘుపతి శర్మ బండపల్లి చంద్రశేఖర్ శర్మ, రుద్రాంగి మహదేవ్ శర్మ, తదితరులు నిర్వహించారు రామనామ స్మరణతో మందిరము అంతా మారుమోగింది.

కళ్యాణ వేడుకలు ఆలయ ప్రధాన అర్చకులు బట్టాజి గోపాల్ శర్మ దంపతులు అంగరంగ వైభవంగా నిర్వహించారు.

Tags