తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు. జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి
తెలుగు జానపద సాహిత్య పితామహులు బిరుదు. జానపద సాహిత్యానికి బిరుదు రామరాజు ఎనలేని సేవలు ఏప్రిల్ 16... బిరుదు రామరాజు జయంతి
రామ కిష్టయ్య సంగన భట్ల...
9440595494
జానపద సాహిత్య రంగంలో ఆచార్య రామరాజు పేరు తెలియని వారుండరు. తెలుగు జానపద సాహిత్యం గురించి ప్రప్రథమంగా డాక్టరేటు పట్టాకోసం పరిశోధన చేసి, దేశ విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం పై పరిశోధన లకు ప్రవేశం కలిపించడానికి ప్రేరణ అయినారు రామరాజు. ఆయన పరిశోధన భూమికగా ఇతర విశ్వ విద్యాలయాలలో జానపద సాహిత్యం గూర్చి పరిశోధన ప్రారంభమయింది. తెలుగునాట విశ్వ విద్యాలయాల్లో జానపద సాహిత్య శాఖలను రూపొందించి, వాటిలో తమ పరిశోధనాత్మక రచనలతో, బోధనతో, మార్గ నిర్దేశనంతో ఒకతరం జానపద సాహిత్య పరిశోధకులను, అధ్యాపకులను తయారు చేసిన మార్గదర్శకులు ఆయన. భారతీయ విశ్వ విద్యాలయాల్లోని ఆదర్శ ప్రాయమైన, అరుదైన మౌలిక పరిశోధకుల్లో ఆయన అగ్రగణ్యులు. 1955లో ప్రచురించ బడిన ఆయన పరిశోధనా గ్రంథం... 'జానపద గేయ సాహిత్యము' తెలుగు జానపద అధ్యయనాలకు విజ్ఞాన సర్వస్వంగా అందుబాటులో ఉంది.
బిరుదురాజు రామరాజు 1925 ఏప్రిల్ 16 వ తేదీ దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవమ్మ, బిరుదు రాజు నారాయణరాజు దంపతు లకు జన్మించాడు. ప్రాథమిక విద్యను హన్మకొండ శివార్లలోని దేవనూరు, మడికొండలలో పూర్తి చేసి, ఉన్నత చదువుల కోసం ఎనిమిదేళ్లపాటు హన్మకొండకు 14 కిలోమీటర్లు నడిచి వెళ్లాల్సి వచ్చింది. 3వ తరగతి నుండి ఇంటర్మీడియెట్ వరకు ఉర్దూ మీడియంలో చదువుకున్నాడు. మెట్రిక్ చదివేటప్పుడు 11వ ఆంధ్ర మహాసభల సందర్భంగా మహాత్మా గాంధీ వరంగల్ వచ్చినప్పుడు ఆనాటి సభలలో స్వచ్ఛంద సేవలకు అందించాడు. గాంధీజీతో కలిసి పాదయాత్ర చేశాడు. 1947లో కాంగ్రెస్ సత్యాగ్రహ ఉద్యమంలో పాల్గొని జైలు పాలయ్యాడు. చదువు కునే రోజుల్లో ఆర్యసమాజం ప్రభావానికి లోనైనాడు. నిజాం వ్యతిరేక రాజకీయోద్యమాలలో చురుకుగా పాల్గొన్నాడు. నిజాం కళాశాలలో బి.ఎ. చదువుతున్న సమయంలో దాశరథి కృష్ణమా చార్యతో పరిచయం ఏర్పడింది. కాళోజీ నారాయణరావు, టి.హయగ్రీవా చారి, ముదిగొండ సిద్ద రాజలింగం, జమలాపురం కేశవరావు తదితర యువ నాయకులతో కలిసి రజాకార్లకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమం, స్టేట్ కాంగ్రెస్ ఉద్యమాలలో పాల్గొని 1947లో మూడు నెలలపాటు కారాగార శిక్ష అనుభవించాడు. 1947-50ల మధ్యకాలంలో నిజాం కళాశాలలో తెలంగాణా విద్యార్థి సంఘానికి అధ్యక్షుడిగా పని చేశాడు. బి.ఎ.పూర్తయ్యాక న్యాయ శాస్త్రంలో పట్టా పొందాడు. ఉస్మానియా విశ్వవిద్యాలయం ఆర్ట్స్ కాలేజీలో ఎం.ఎ. చదివే రోజులలో విద్యార్థి నాయకుడిగా గుర్తింపు పొందాడు. ఆ సమయం లో సి.నారాయణ రెడ్డితో కలిసి కొంతకాలం రామనారాయణ కవులు పేరుతో జంట కవులుగా కవిత్వం చెప్పారు. మాడపాటి హనుమంతరావు ఆంధ్రసంఘం నెలకొల్పి దానికి బిరుదురాజు రామరాజును అధ్యక్షుడిగా నియమించాడు. తెలంగాణ రచయితల సంఘానికి తొలి కార్యదర్శిగా ఉన్నాడు. కాగా ఆంధ్రరాష్ట్రం ఏర్పడ్డాక ఆంధ్ర రచయితల సంఘంగా మారింది. ఆచార్య ఖండవల్లి లక్ష్మీరంజనం మార్గ దర్శకత్వంలో తెలుగు జానపద గేయసాహిత్యం అనే అంశంపై పరిశోధన చేసి దక్షిణ భారత దేశంలోనే జానపద సాహిత్యంపై మొట్టమొదటి పి.హెచ్.డి ఉస్మానియా విశ్వ విద్యాలయం నుండి సంపాదిం చాడు. సంస్కృతంలో ఎం.ఎ. చేసి అందులో కూడా డాక్టరేట్ పొందా డు.
ఉస్మానియా విశ్వ విద్యాలయంలో 1951లో ఉపన్యాసకుడిగా చేరి క్రమంగా పదోన్నతుల ద్వారా తెలుగుశాఖకు డీన్‌గా, అధ్యక్షు డిగా విధులు నిర్వర్తించాడు. ఆయన మార్గదర్శకత్వంలో 37 మంది పిహెచ్.డి పట్టాలు పొందా రు. రామరాజు పర్యవేక్షణలో కేతవరపు రామకోటిశాస్త్రి, కోవెల సుప్రసన్నాచార్య, ముదిగొండ వీరభద్ర శాస్త్రి, అక్కిరాజు రమాపతి రావు, అనంతలక్ష్మి, కాళిదాసు పురుషోత్తం, రవ్వా శ్రీహరి వంటి వారు తమ పరిశోధనలు చేసి డాక్టరేట్ పట్టాలను పొందడం గమనార్హం. 1983లో ప్రొఫెసర్‌గా పదవీ విరమణ చేశాడు.
1994లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్, 1995లో భారత ప్రభుత్వం నుండి నేషనల్ ప్రొఫెషనల్‌షిప్, 2001లో సనాతన ధర్మ ఛారిటబుల్ ట్రస్ట్ వారి శివానంద ఎమినెంట్ సిటిజన్ అవార్డ్, 2003లో శ్రీ రాజా లక్ష్మీ పురస్కారం,2006/2007లో పొట్టి శ్రీరాములు తెలుగు విశ్వ విద్యాలయం వారి 'విశిష్ట పురస్కారం', 2009లో సి.పి.బ్రౌన్ అకాడెమీ వారి తెలుగు భారతి పురస్కారం అందుకున్నాడు.
ప్రాచీన సంస్కృతాంధ్ర గ్రంథాల్ని పరిశీలించి, పరిష్కరించి మొదటి సారిగా వెలుగులోకి తేవడానికి విశేష కృషి చేశాడు. సంస్కృతంలో పీహెచ్‌డీ చేసి 'సంస్కృత సాహిత్యానికి ఆంధ్రుల సహకారం' అనే గ్రంథంగా తన వ్యాసాన్ని ప్రచురించాడు. తాళపత్ర గ్రంథాల్ని సేకరించి పలు వ్యాసాల ద్వారా వాటిని పరిచయం చేశాడు. సంస్కృత భాషా సాహిత్యాలకు ఆంధ్రులు చేసిన సేవను గూర్చి విడిగా ఒక పెద్ద పరిశోధన గ్రంధ రచనే చేశాడు. శరత్ చంద్ర ఛటర్జీ, మున్షీ ప్రేమ్‌చంద్ వంటి అగ్ర రచయితల రచనలను తొలిసారిగా తెలుగులోకి అనువదించి సాహిత్యాభి మానులకు పరిచయం చేశాడు. ఉర్దూ, హిందీ, ఆంగ్ల భాషలలో మంచి ప్రావీణ్యం ఉన్న పండితుడు రామరాజు గురు గోవింద్ సింగ్ చరిత్ర, జాతక కథలను హిందీ నుండి తెలుగులోకి అనువదించాడు. ఉర్దూ-తెలుగు నిఘంటువును కూడా రూపొందిం చాడు. ఆంగ్లంలో దేశంలోని వివిధ ప్రాంతాలలో అనేక ఉపన్యాసాలు ఇస్తూ, అనేక పుస్తకాలు వ్రాసాడు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు యాభైకి పైగా విశ్వ విద్యాలయాలతో అనుబంధం కలిగి ఉండి, పలు యూనివర్సిటీలకు విజిటింగ్ ప్రొఫెసర్‌గా పని చేశాడు. తెలుగు జానపద అధ్యయనాల గాడ్‌ఫాదర్ గా కీర్తించబడే ఆచార్య రామరాజు, 2010, ఫిబ్రవరి 8 న హైదరాబాదులో మరణించాడు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఏసీబీకి చిక్కిన కాకతీయ యూనివర్సిటీ పీఎస్ ఎస్ఐ శ్రీకాంత్
హన్మకొండ జనవరి 08 (ప్రజా మంటలు):
కాకతీయ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఎస్ఐ శ్రీకాంత్ ఏసీబీ అధికారుల వలకు చిక్కాడు. పేకాట కేసులో నిందితుడికి అనుకూలంగా వ్యవహరించేందుకు రూ.15 వేల లంచం డిమాండ్ చేసి స్వీకరిస్తున్న సమయంలో హన్మకొండ ఏసీబీ అధికారులు ఆయనను రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు.
పేకాట కేసును తేలిక చేయాలని... జేఎన్టీయూహెచ్ ఇంజినీరింగ్ కళాశాలలో 10000 Coders క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్ విజయవంతం
జగిత్యాల | జనవరి 08 (ప్రజా మంటలు):
జేఎన్టీయూహెచ్ యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, జగిత్యాలలో బి.టెక్ విద్యార్థుల కోసం 10000 Coders ఆధ్వర్యంలో క్యాంపస్ రిక్రూట్మెంట్ డ్రైవ్‌ను విజయవంతంగా నిర్వహించినట్లు కళాశాల ప్రిన్సిపాల్ డా. జి. నరసింహ తెలిపారు.
ఈ క్యాంపస్ డ్రైవ్‌లో భాగంగా ముందుగా 10000 Coders సంస్థ హెచ్ఆర్ ప్రతినిధి పి.... ప్రభుత్వ పాఠశాలల బలోపేతానికి కొత్త విద్యా విధానం : సీఎం రేవంత్ రెడ్డి
హైదరాబాద్, జనవరి 08 (ప్రజా మంటలు):
తెలంగాణలో ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేట్ విద్యా సంస్థలకు ధీటుగా తీర్చిదిద్దేందుకు ప్రత్యేక విద్యా విధానాన్ని త్వరలో అమలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తెలిపారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి రోహిత్ ఠాకూర్ నేతృత్వంలోని ప్రతినిధి బృందం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో... రోడ్డు భద్రత నియమాలు పాటించడం మనందరి భాద్యత * జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)
జిల్లాలో రహదారి భద్రతపై ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ఆధ్వర్యంలో“జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026” బైక్ ర్యాలీ కార్యక్రమం నిర్వహించారు.
గురువారం జాతీయ రోడ్డు భద్రత మాసోత్సవం – 2026 బైక్ ర్యాలీని జిల్లా కేంద్రంలో జిల్లా కలెక్టర్... విద్యుత్ సమస్య ఎదురైన వెంటనే సంస్థ టోల్ ఫ్రీ నెంబర్ 1912 ను సంప్రదిస్తే త్వరతగతిన సమస్యని పరిష్కరిస్తాం ఏఈ. సంతోష్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు) విద్యుత్ శాఖ ఆధ్వర్యంలో గురువారం స్థానిక తైసిల్ చౌరస్తాలో 'ప్రజా బాట' కార్యక్రమంలో భాగంగా విద్యుత్ వినియోగ దారులకు అవగాహన కల్పించారు. విద్యుత్ ప్రమాదాల నివారణపై ఏఈ సంతోష్, రాంజీ నాయక్ మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు భద్రత నియమాలు పాటిస్తూ జాగ్రత్త వహించాలని, నాణ్యమైన విద్యుత్
వినియోగదారులకు... జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ కరువు హై కోర్ట్ న్యాయవాది వి.రఘునాథ్
జగిత్యాల జనవరి 8 ( ప్రజా మంటలు)నేడు మన దేశంలో న్యాయం కోసం ఆరాటపడే జర్నలిస్టులకు, న్యాయవాదులకు రక్షణ లేకుండా పోయిందని సీనియర్ హై కోర్టు న్యాయవాది వి.రఘునాథ్ అన్నారు. జగిత్యాలలో ఆయన గురువారం విలేఖరులతో మాట్లాడారు.
దేశంలో నాలుగవ స్తంభం జర్నలిస్ట్ లని పేర్కొన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా న్యాయవాదులను, జర్నలిస్టులను... జాతీయ సదస్సులో పాల్గొన్న వెనుగుమట్ల ఉపాధ్యాయుడు
గొల్లపల్లి జనవరి 8 (ప్రజా మంటలు) నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ ఇండియా భాగస్వామ్యంతో అకాడమీ ఫర్ సైన్స్, టెక్నాలజీ అండ్ కమ్యూనికేషన్ (ఏఎస్‌టీసీ) అనే సంస్థ ‘ఈనాడు’తో కలిసి గురువారం హైదరాబాద్‌లో ‘శాస్త్ర విజ్ఞానాన్ని ప్రయోగశాల నుంచి సమాజంలోకి తీసుకెళ్లడంలో సమాచార పాత్ర - వికసిత్ భారత్-2047 నిర్మాణం’ అనే ఇతివృత్తంతో,మాజీ ఉపరాష్ట్రపతి
సైన్స్... మేడారం జాతరకు కేసీఆర్‌కు ఆహ్వానం
సిద్ధిపేట, జనవరి 08 (ప్రజా మంటలు):మేడారం సమ్మక్క–సారలమ్మ మహా జాతర సందర్భంగా మాజీ ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కే. చంద్రశేఖర్ రావును జాతరకు హాజరుకావాల్సిందిగా రాష్ట్ర మహిళా మంత్రులు ఆహ్వానించారు.
రాష్ట్ర దేవాదాయ ధర్మదాయ మరియు అటవీ శాఖ మంత్రి కొండా సురేఖ, పంచాయతీ రాజ్, మహిళా మరియు శిశు సంక్షేమ... బ్రాహ్మణులపై దాడికి నిరసనగా డిజిపి కి బ్రాహ్మణ సంఘాల నాయకుల ఫిర్యాదు.
హైదరాబాద్ జనవరి 8 ( ప్రజా మంటలు)బాసర శ్రీ జ్ఞాన సరస్వతి దేవాలయంలో గోదావరి హారతి అర్చకులుగా పనిచేస్తున్న బ్రహ్మశ్రీ దీక్షిత్ సాయి కళాధర్ శర్మ పై మూడు రోజుల క్రితం కొందరు దుండగులు పథకం ప్రకారం దారుణంగా దాడి చేశారు పరుష పదజాలంతో దూషిస్తూ చాలా ఘోరంగా పిడిగుద్దులతో దాడి చేశారు.
ఇటీవల... శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో ఘనంగా విశ్వక్సేన ఇష్టి గణపతి అభిషేకం
జగిత్యాల జనవరి 8 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలోని శ్రీ రుక్మిణి సత్యభామ సమేత మదన వేణుగోపాల స్వామి వారి ఆలయంలో శ్రీ ధనుర్మాస ఉత్సవ సందర్భంగా లోక కళ్యాణార్థమై భగవత్ భాగవత ఆచార్య అనుగ్రహ ప్రాప్తికై, గురు వారం 8 వ రోజు నవహనీక, ఏకకుండాత్మక, విశ్వ క్షేనఇష్టి మూలమంత్ర హవనం , గణపతి... భోలక్‌పూర్‌లో మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ పర్యటన
సికింద్రాబాద్, జనవరి 8 (ప్రజా మంటలు):
మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ గురువారం భోలక్‌పూర్ ప్రాంతంలో పర్యటించారు. ఈ సందర్భంగా వివిధ అపార్ట్మెంట్లలో నివసిస్తున్న ప్రజలతో ఆయన ఆత్మీయంగా మమేకమై వారి సమస్యలు, అభిప్రాయాలను తెలుసుకున్నారు. స్థానికులు ఆయనను శాలువాతో ఘనంగా సన్మానించారు.
ఈ కార్యక్రమంలో ప్రత్యేక ఆకర్షణగా, కేవలం పది నిమిషాల్లోనే ఒక యువతి... కవితపై తప్పుడు ప్రచారం చేస్తే ఊరుకునేది లేదు: తెలంగాణ జాగృతి
హైదరాబాద్ జనవరి 08 (ప్రజా మంటలు)::
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితపై తీన్మార్ మల్లన్న తప్పుడు, అసత్య ప్రచారం చేస్తున్నాడని తెలంగాణ జాగృతి నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో రాష్ట్ర అధికార ప్రతినిధి శ్రీకాంత్ గౌడ్, నాయకులు ఆనంద్, మాధవి మీడియాతో మాట్లాడారు.
అగ్గిపెట్టె... 