మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత

On
మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత

హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):


తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత బహుజన రాజ్యాధికార సంస్థ కన్వీనర్ గుడిపల్లి రవన్న, మారోజు వీరన్న అనుచరులు కిషన్ నాయక్ సహా పలువురు నాయకులు మద్దతు తెలిపారు.

IMG-20260417-WA0015
ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ, మారోజు వీరన్న అనుచరుల మద్దతు తమకు మరింత శక్తినిస్తుందని అన్నారు. సమావేశంలో మహిళల పాల్గొనడం గమనార్హమని, రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన అవసరం ఉందన్నారు.
మహిళా బిల్లుపై గతంలో పోరాటం చేసి ఆమోదం పొందేలా చేశామని, ఇప్పుడు అదే బిల్లును మళ్లీ పాస్ చేస్తున్నట్లు చెప్పడం ప్రజలను మోసం చేయడమేనని విమర్శించారు. ప్రతి వర్గానికి రావాల్సిన ప్రయోజనాలు అందకపోవడం బాధాకరమని అన్నారు.
తెలంగాణ రాష్ట్రం కోసం అందరం కలిసి పోరాడామని గుర్తు చేస్తూ, అప్పటి నుంచే “బహుజన తెలంగాణ” భావన ఉందని తెలిపారు. ప్రొఫెసర్ జయశంకర్ సూచనల ప్రకారం ముందుగా భౌగోళిక తెలంగాణ సాధించి, తరువాత సామాజిక తెలంగాణ కోసం పోరాటం చేయాలని భావించామని చెప్పారు.


అయితే రాష్ట్రం ఏర్పడి 12 సంవత్సరాలు గడిచినా సామాజిక తెలంగాణ సాధ్యం కాలేదని, ఇంకా అనేక కులాలు రాజకీయాధికారానికి దూరంగా ఉన్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామస్థాయిలో కూడా కొన్ని వర్గాలకు ప్రాతినిధ్యం లేకపోవడం స్పష్టమవుతోందన్నారు.
మారోజు వీరన్న కులాల అస్తిత్వ పోరాటాలకు ప్రాధాన్యతనిచ్చారని, కుల సంఘాల ఏర్పాటులో కీలక పాత్ర పోషించారని కవిత గుర్తుచేశారు. ఆయన చూపిన దారిలో ముందుకు సాగాల్సిన బాధ్యత మనందరిదని అన్నారు.


“అందరికీ అధికారం రావాలన్నది నా లక్ష్యం. నేను ఆ మాట మాట్లాడటం ప్రారంభించినప్పటి నుంచే నాకు కష్టాలు వచ్చాయి. కానీ ప్రతి కష్టాన్ని పాఠంగా తీసుకుంటూ ముందుకు వెళ్తున్నాను,” అని పేర్కొన్నారు.
ఈ నెల 25న కొత్త రాజకీయ శక్తిగా ప్రజల ముందుకు వస్తున్నామని, తెలంగాణ ప్రాంతీయతతో పాటు సామాజిక న్యాయం లక్ష్యంగా పార్టీ పనిచేస్తుందని తెలిపారు.
తెలంగాణ ఉద్యమ సమయంలో బీఆర్ఎస్‌లో చేరిన మాజీ మావోయిస్టులకు న్యాయం జరగలేదని, వారి కోసం కూడా పోరాటం చేస్తామని హామీ ఇచ్చారు.
“మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో ఇక మనల్ని ఆపే శక్తి లేదు. సర్వోదయ తెలంగాణ సాధించడమే నా గోల్,” అని కవిత స్పష్టం చేశారు.

Join WhatsApp

More News...

Local News 

సురభి గోషాలలో గో గ్రాసం పంపిణీ

సురభి గోషాలలో గో గ్రాసం పంపిణీ   జగిత్యాల రూరల్ ఏప్రిల్ 17 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రానికి సమీపంలోని తాటిపల్లి సురభి గోశాలలో గోవుల గ్రాసం గడ్డి, తవుడు, మేత  కోసం ఒక వినూత్న కార్యక్రమాన్ని చేపట్టారు. జగిత్యాల వాస్తవ్యులైన ఊటూరి అశోక్ కుమార్, తాటికొండ శ్రీనివాస్, బాసెట్టి లవ కుమార్, ప్రతినెల అమావాస్య రోజు ఒక్కొక్కరివద్ద 100 చొప్పున, వసూలు చేసి...
Read More...
State News 

ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం

ప్రత్యేక తెలంగాణ అస్తిత్వాల పరిరక్షణకు ‘తెలంగాణ అస్తిత్వ వేదిక’ ఆవిర్భావం    ఆవిర్భావ సభ వివరాలు:* 📅 తేదీ: ఏప్రిల్ 19, 2026 (ఆదివారం)* 🕙 సమయం: ఉదయం 10 గంటలకు* 📌 వేదిక: రవీంద్రభారతి    హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు):    తెలంగాణ భూమి కేవలం భౌగోళిక పరిమితి మాత్రమే కాకుండా వేల సంవత్సరాల సాంస్కృతిక, చారిత్రక, ఆధ్యాత్మిక అస్తిత్వాలకు ప్రతీకగా నిలిచిందని...
Read More...
State News 

మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత

మారోజు వీరన్న అనుచరుల మద్దతుతో జాగృతి పార్టీకి బలమైన ఊపు: కవిత హైదరాబాద్, ఏప్రిల్ 17 (ప్రజా మంటలు): తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పడబోయే కొత్త రాజకీయ పార్టీకి మారోజు వీరన్న అనుచరులు, సీపీయూఎస్ఐ (CPUSI), దళిత బహుజన రాజ్యాధికార సంస్థ మద్దతు ప్రకటించాయి. జాగృతి కార్యాలయంలో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవితను కలిసి సీపీయూఎస్ఐ కేంద్ర కమిటీ కార్యదర్శి కోదండం, రాష్ట్ర కార్యదర్శి వెంకన్న, దళిత...
Read More...
Local News 

జాతీయ వాగ్దేవి పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ

జాతీయ వాగ్దేవి పురస్కారం అందుకున్న మహేశ్వర శర్మ   రాయికల్ ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లా రాయికల్ పట్టణంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల బాలురు కు చెందిన తెలుగు పండితులు చెరుకు మహేశ్వర శర్మ కు కందుకూరి వీరేశలింగం పంతులు స్మారక జాతీయ వాగ్దేవి పురస్కారాన్ని గురువారం ఆచార్య పద్మశ్రీ  కొలకనూరి ఇనాక్ ,  జాతీయ తెలుగు సారస్వత పరిషత్ కార్యనిర్వహక...
Read More...
Local News 

ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం_ శ్రీశ్రీశ్రీ విశ్వకతీర్థ స్వామీజీ

ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం_ శ్రీశ్రీశ్రీ విశ్వకతీర్థ స్వామీజీ జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతమని శ్రీ శ్రీ శ్రీ విశ్వక తీర్థ స్వామీజీ అన్నారు.ఈ భూమిపై పుట్టిన వారికి ఇద్దరు తల్లులు ఒకరు కన్నతల్లి ఆమెకు పుట్టిన వారిని పోషిస్తుంది మరొకరు భూమాత ఆమె భారత మాత పుట్టిన నుండి గిట్టిన తర్వాత...
Read More...
Local News 

అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం

అగ్నిమాపక వారోత్సవాలను పురస్కరించుకొని జగిత్యాల జిల్లా కేంద్రంలో రక్తదాన శిబిరం కార్యక్రమం జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు)  ప్రతి సంవత్సరం ఏప్రిల్ 14 నుండి 20 వరకు వారం రోజులపాటు అగ్నిమాపక అమరవీరుల స్మారక వారోత్సవాలు నిర్వహిస్తారు. ఇందులో భాగంగా జిల్లా కేంద్రంలోని అగ్నిమాపక కేంద్రం ఆవరణలో జిల్లా అగ్నిమాపక శాఖ అధికారి సైదులు ఆధ్వర్యంలో ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ జిల్లా శాఖ   ఈ...
Read More...
Local News 

కెసిఆర్ బహిరంగ సభ వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

కెసిఆర్ బహిరంగ సభ వేదిక నిర్మాణ పనులను పరిశీలించిన జిల్లా ఇన్చార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జగిత్యాల ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు ఈ నెల 20 తేదీన కెసిఆర్ బహిరంగ సభలో సందర్భంగా‌ జగిత్యాల జిల్లా కేంద్రంలోని మిని స్టేడియం లో నిర్వహించనున్న బహిరంగ సభకు స్టేజి నిర్మాణ పనులను జగిత్యాల జిల్లా ఇంఛార్జి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి , ధర్మపురి ఇంచార్జ్ ఎమ్మెల్సీ తక్కలపల్లి రవీందర్ రావు...
Read More...
Local News 

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలి _జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్

ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలను పకడ్బందీగా అమలుచేయాలి _జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ మేడిపల్లి ఏప్రిల్ 16 ( ప్రజా మంటలు)అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలి జిల్లాలో నిర్వహించనున్న ప్రజాపాలన - ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణ ప్రణాళిక మండల స్థాయి సమావేశాలను అత్యంత పకడ్బందీగా, ప్రజా పాలన ప్రతిబింబించేలా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అధికారులను ఆదేశించారు.  ఈ సమావేశాలు చారిత్రాత్మకంగా...
Read More...
Local News 

జగిత్యాల జిల్లాలోని ప్రతిభ కనబర్చిన మైనారిటీ గురుకులం విద్యార్థులకు సన్మానం

జగిత్యాల జిల్లాలోని ప్రతిభ కనబర్చిన మైనారిటీ గురుకులం విద్యార్థులకు సన్మానం         జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)జగిత్యాల జిల్లాలోని తెలంగాణ మైనారిటి రెసిడెన్షియల్ ఎడ్యుకేషనల్ సొసైటి మైనారిటీ గురుకులం విద్యార్థులను అడిషనల్ కలెక్టర్(లోకల్ బాడీస్) శ్రీ. బి.రాజ గౌడ్  ఇంటర్ ఫలితాలో ప్రతిభ కనబర్చిన విద్యార్థులను సన్మానించారు. కుమారి. నేల్లెంకుల నందిత అనే ఇంటర్ మొదటి సంవత్సరం విద్యార్థిని (ఏం.పి.సి.) వార్షిక పరీక్షల ఫలితాల్లో 470...
Read More...
Local News 

సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత

సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడం డ్రైవర్ల ప్రధాన బాధ్యత జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)"అరైవ్ అలైవ్ " కార్యక్రమంలో భాగంగా వాహన డ్రైవర్లకు ఉచిత కంటి పరీక్షలు జగిత్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను తగ్గించి ప్రజలకు సురక్షిత ప్రయాణాన్ని కల్పించాలనే లక్ష్యంతో నిర్వహిస్తున్న “ అరైవ్ అలైవ్" కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతోంది. ఈ కార్యక్రమంలో భాగంగా జిల్లా ఎస్పీ అశోక్ కుమార్,  ఆదేశాల...
Read More...
National  State News 

మహిళ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర* - కల్వకుంట్ల కవిత 

మహిళ బిల్లుకు డీలిమిటేషన్ బిల్లును లింక్ చేయటం పెద్ద కుట్ర* - కల్వకుంట్ల కవిత  - మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్  బిల్లును కాల్చే ప్రయత్నం హైదరాబాద్, ఏప్రిల్ 16 (ప్రజా మంటలు): మహిళల రిజర్వేషన్ల బిల్లుకు డీలిమిటేషన్ అంశాన్ని అనుసంధానం చేయడం పెద్ద కుట్ర అని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. మహిళల భుజాలపై తుపాకీ పెట్టి డీలిమిటేషన్ బిల్లును అమలు చేయాలని కేంద్ర...
Read More...
Local News 

బి.ఆర్.ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయండి

బి.ఆర్.ఎస్ బహిరంగ సభ విజయవంతం చేయండి జగిత్యాల ఏప్రిల్ 15 ( ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఈనెల 20వ తేదీన కేసీఆర్ బహిరంగ సభ గురించి సన్నాహక సమావేశంలో పాల్గొన్న జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు  ఎమ్మెల్సీ ఎల్ రమణ  కోరుట్ల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్  జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ...
Read More...