కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా?
లడాక్ ప్రజా ఉద్యమం నుండి ప్రజల దృష్టి మారాల్చడానికే బిజేపి యత్నం?
కచ్చతీవు రచ్చ ఎన్నికల కోసమేనా?
మనం ఎందుకు బంగ్లాదేశ్ కు ఎక్కువ భూభాగం ఇచ్చాం ?
సిహెచ్ వి ప్రభాకర్ రావు, సీనియర్ జర్నలిస్ట్. 9391533339
రాజకీయాలలో ఎదుటివారికి ప్రాధాన్యత దక్కకుండా, వారి విమర్శలను తొక్కిపట్టే విధంగా కొత్త కథనాలను, ప్రతివిమర్శలను ముందుకు తేవడంలో బిజేపి ని మించిన చాణక్య ఎత్తుగడలు మరేవరి దగ్గర లేవనడంలో అతిశయోక్తి లేదేమో? లడాక్ లో పర్యావరణ ప్రేమికుడు, అక్కడి ప్రజల బాగోగుల కొరకు ఎన్నాళ్లుగానో శ్రమిస్తున్న సోనమ్ వాంగ్ చుక్ గత నెల రోజులుగా చేస్తున్న నిరాహార దీక్షను లెక్కచేయకుండా, ఆయన లేవనెత్తిన అంశాలను పట్టించుకోకుండా, బిజేపి ఇప్పుడు కొత్తగా ఎన్నికల సమయంలో, శ్రీలంక- భారతదేశం లో మధ్య ఎప్పుడో 40 ఏళ్ల క్రితం, 1974 లో జరిగిన కచ్చతీవు ఒడంబడిక గురించి రచ్చ రేపుతుంది.
ప్రధాని నరేంద్ర మోడి బంగ్లాదేశ్ తో కుదుర్చుకొన్న భూమార్పిడి ఒప్పందంలో మనం నష్టపోయిన ప్రాంతం గురించి ఎందుకు మాట్లాడారు. మనకు బంగ్లా దేశ నుండి వచ్చిన భూబయగం కంటే ఎక్కువ భూబయగం మనం ఎందుకు వదులుకున్నామో ఎప్పుడైనా చెప్పారా? అరుణాచల్ ప్రాంతంలో చైనా తిష్ట వేసి వందల ఏకరాల భారత భూబయగంలో కొత్త జనవాసలను నిర్మిస్తుంటే ప్రశ్నించని వారు ఎప్పుడో జరిగిన ఒప్పందాలను ప్రశ్నించడం ఆశ్చర్యానికి గురిచేస్తుందని పరిశీలకులు భావిస్తున్నారు. ఇదంతా దక్షిణాన, ముఖ్యంగా తమిళనాట జరుగుతున్న ఎన్నికల్లో లబ్ది పొందాదానికే అనే విషయం స్పష్టం అవుతుంది.
కచ్చతీవు ను అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీలంకకు అప్పచెపితే, పదేళ్ళ పాలనలో బిజేపి ఎందుకు తిరిగి సీసుకోవడానికి ప్రయత్నంచలేదనే ప్రశ్నకు జవాబు లేదు. అలాగే లడాక్ లో, గత ఎన్నికల్లో బిజేపి వాగ్దానం చేసినట్లు ఆప్రాంతాన్ని 6 వ షెడ్యూల్ లో చేర్చి, రాష్ట్రంగా మార్చి ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేస్తున్న అక్కడి ప్రజల కోరికలను, ఉద్యమాలను ప్రపంచానికి తెలియకుండా అద్దుకొంటున్న మీడియా పై ఎందుకు బిజేపి నాయకత్వం ప్రశ్నించడం లేదు. లడక్ ఉద్యమ నాయకులు ప్రత్యక్షంగా చూస్తూ, అక్కడి పరిస్థితిని అవగాహన చేసుకొంటూ, గతంలో తమ ప్రజలు తిరిగిన దాదాపు 4000 వల చదరపు కి. మి. భూబయగాన్ని చైనా ఆక్రమించిందని చెపుతున్న మాటలకు ఎందుకు బిజేపి నాయకత్వం జవాబివ్వడం లేదో అందరికీ తెలుసు.
కచ్చతీవు అనే దాదాపు 250 హెక్టారాల విస్తీర్ణం గల చిన్న, దీవి రామేశ్వరం నుండి 333 కి. మి. దూరంలో, శ్రీలంక లోని నేడుంతీవి (డేల్ఫ్ ఐలాండ్) నుండి 24 కి. మి. దూరంలో ఉంటుంది. ఈ దీవి జనావాసలకు అనుకూలంగా ఉండకపోవడం తో ఎవరు ఈ దీవిని అంతగా అపట్టించుకోలేదు. కానీ మత్స్యసంపదకు నెలవైన ఈ ప్రాంతంలో ఎప్పుడు భారతదేశ-శ్రీలంక మత్స్యకారుల మధ్య గొడవలు జరడంతో, అప్పటి ఇందిరా గాంధీ-సిరిమావో భాండారనాయకే ప్రభుత్వాలు ఒక ఒడంబడిక కుదుర్చుకొని, కచ్చుతీవిని శ్రీలంకకు అప్పచెప్పారు. ఆసమయంలో అక్కడ ఇతర ఖనిజ సంపద, చములు నిక్షేపాలు ఉన్నాయనే విషయం తెలుసుకొని, ఏఎ సమస్యను ఎంత తొందరగా ముగించుకొంటే అంతా మంచిదని, చమురు నిక్షేపల విషయం శ్రీలంక కు తెలియడానే విషయాన్ని అప్పటి విదేశాంగ శాఖ కార్యదర్శి కేవల సింగ్- తమిళనాడు ముఖ్యమంత్రి కరుణానిధి ల మధ్య జరిగిన లేఖలలో స్పష్టంగా పేర్కొన్నారు.
కన్యాకుమారి ప్రాంతంలోని చమురు నిక్షేపాలు స్వంతం
కచ్చతీవు ఇవ్వడం వల్ల అక్కడి కన్యాకుమారి దగ్గరి
దాదాపు 4000 కి. మీ. విస్తీర్ణంలోని తీరప్రాంతం అంతా భారతదేశ సార్వభౌమాధఏకరం గల ఈఈజెడ్ (ప్రత్యేక ఆర్థిక మండలి)గా శ్రీలంక గుర్తించింది. మనం ఇచ్చింది 280 ఎకరాల (1.6 కి. మీ పొడవు – 300 మీ వెడల్పు) దీవి. ఇది ఉన్న ప్రాంతంలో మత్స్యకారుల మధ్య గోడవలే కాకుండా, స్మగ్లింగ్, మత్తుపదార్థాల రవాణా, చైనా, పాకిస్తాన్ లాంటి దేశాల ఉనికికి నెలవుగా కాకూడదనే అప్పటి ప్రభుత్వాలు ఏఎ ఒప్పందాన్ని చేసుకొన్నట్లు చరిత్ర చెపుతుంది. ఏఎ దీవి ఇవ్వడం వల్ల మనకు 4000 చదరపు కి. మి ల విస్తీర్ణంలో భారతదేశానికి ఈఈజెడ్ ప్రతిపత్తిని శ్రీ లంక ఒప్పుకొందనే వశయాన్ని మరచిపోకూడదు.
లేకుంటే కచ్ లోని మరో “సర్ క్రీక్” లా మారేది ?
కచ్చతీవు సమస్య బిజేపి కి తమిళనాడులో ఓట్లు దండుకోవడానికి ఒక ఆయుధంగా వాడుకొంటుందని తమిళ పార్టీలు భావిస్తున్నాయి. తమిళనాట కాంగ్రెస్-ది ఎం కె కూతమిని దెబ్బతీయడానికి అక్కడి ప్రజలలో విద్వేషాలు రెపడానికి ఏదోక ఆయుధంగా మారుచుకోంటుంది. దక్షిణాన ఉనికి లేని బిజేపి రాజేకీయంగా నిలదొక్కుకొని, ఏదో సాధించాలనుకోవడంలో తప్పు లేదు. కానీ మానిన గాయాలను రేపి, రెండు దేశాల ప్రజలలో ద్వేషం పెంచడానికి చేసే ప్రయత్నాలే సరికాదని తమిళ ప్రజలు భావిస్తున్నారు.
శ్రీలంక ప్రభుత్వం ఏఎ విమర్శలపై స్పందిస్తూ, ఇదొక ముగిసిన అంశామని, దీనిపై ఇప్పుడు చర్చించడం అనవసరమని ప్రకటించింది. అప్పుడు ఏఎ సమస్యను ద్వైపాక్షికంగా పరిష్కరించుకోకుంటే, శ్రీలంక అంతర్జాతీయ కోర్టులు దావా వేస్తే, ఏఎ సమస్య కాశ్మీరీ సమస్యల అయిప్పటికి తేలేది కాదు. ఈ ప్రాంతం రెండు దేశాల మత్స్యకారుల మధ్య రావనకాష్టమలా ఘర్షణలతో మరిన్ని కొత్త సమస్యలకు దారితీసేదని అప్పటి దౌత్యవేత్తలు అంటున్నారు. ఇప్పటికీ గుజరాత్ లోని కచ్ ప్రాంతం లోని “సర్ క్రీక్” సమస్యతో అక్కడి భారతీయ మత్స్యకారులు పాకిస్తాన్ జైళ్ళలో మగ్గుతున్న విషయం మారిచిపోకూడదు.
More News...
<%- node_title %>
<%- node_title %>
హరిహరాలయంలో కార్తీక సోమవారం ఘనంగా పరమ శివునికి అభిషేకాలు
జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు)జగిత్యాల బ్రాహ్మణ వీధి హరిహరాలయంలో కార్తీక సోమవారం చివరి సోమవారం కావడంతో భక్తులు విశేష సంఖ్యలో ఆలయానికి చేరుకొని పరమ శివునికి పంచామృతాలతో అభిషేకించి కార్తీకదీపంలు వెలిగించారు.
ఈ సందర్భంగా అఖిల బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఆలయ అధ్యక్షులు చాకుంట వేణుమాధవ రావు దంపతులు సాంబశివునికి వివిధ... ఖమ్మం జిల్లా లో–జాగృతి జనంబాట పర్యటనలో మాడల్ స్కూల్ ను సందర్శించిన కవిత
ఖమ్మం నవంబర్ 18 (ప్రజా మంటలు):
ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం టేకులపల్లిలోని మోడల్ స్కూల్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ఈరోజు సందర్శించారు. జాగృతి జనంబాట కార్యక్రమంలో భాగంగా విద్యార్థులతో ప్రత్యక్షంగా మాట్లాడి, వారి సమస్యలను తెలుసుకున్నారు.
స్కూల్ హాస్టల్ భవనంలో పెచ్చులూడిన గోడలు, పైకప్పు ఊడిపోవడం వల్ల ప్రమాదకర పరిస్థితి నెలకొన్నట్లు... హైదరాబాద్‌లో బంగారం–వెండి ధరల్లో స్వల్ప మార్పులు
హైదరాబాద్, నవంబర్ 18 (ప్రజా మంటలు):హైదరాబాద్‌లో బంగారం మరియు వెండి ధరలు ఈరోజు స్వల్ప మార్పులతో స్థిరంగా కొనసాగుతున్నాయి. అంతర్జాతీయ మార్కెట్లో ధరల ఊగిసలాట, రూపాయి మార్పిడి విలువ, స్థానిక డిమాండ్ వంటి అంశాలు నగర రేట్లపై ప్రభావం చూపుతున్నాయి. ధరలను స్థానిక వ్యాపారులతో మాట్లాడి సరిపోల్చుకోండి. ఇవి సమాచారం కొరకు మాత్రమే. వాస్తవ... ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌ను కలిసిన కొత్త రూరల్ ఎస్ఐ
జగిత్యాల (రూరల్), నవంబర్ 18 (ప్రజా మంటలు):జగిత్యాల రూరల్ పోలీస్‌స్టేషన్ నూతన ఉపనిర్వాహక అధికారి (SI)గా ఉమా సాగర్ గారు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్ గారిని వారి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి, సన్మాన సూచికగా మొక్కను అందజేశారు.
ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసిన ఉమా సాగర్,... బేగంపేట్‌లో రోడ్డు ప్రమాదం: థార్ వాహనం నుజ్జునుజ్జు, ట్రక్ బోల్తా
బేగంపేట్ బస్ స్టాప్ వద్ద థార్ వాహనాన్ని వెనుకనుంచి ఢీకొట్టిన హెవీ లోడ్ ట్రక్ బోల్తా. గాయపడిన వారు ఆసుపత్రికి తరలింపు. పోలీసులు ఘటన స్థలంలో సహాయక చర్యలు చేపట్టారు. వికటించిన ఐవీఎఫ్ చికిత్స… శంషాబాద్‌లో భార్య మరణం తట్టుకోలేక భర్త ఆత్మహత్య
శంషాబాద్‌లో ఐవీఎఫ్ చికిత్స వికటించడంతో ఎనిమిదో నెల గర్భిణి శ్రావ్య, గర్భంలోని కవలలు మృతి. షాక్ తట్టుకోలేక భర్త విజయ్ ఆత్మహత్య. కుటుంబాన్ని దుఃఖంలో ముంచేసిన హృదయ విదారక ఘటన పూర్తి వివరాలు. ఐ–బొమ్మ పైరసీ వెబ్సైట్ లో సంచలన ప్రకటన
హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):
ఇన్నాళ్లు పోలీసులను చాలెంజ్ చేసిన ibomma సంచలన ప్రకటనను తన వెబ్సైట్ లో పోస్ట్ చేసింది.
ఐ–బొమ్మ తన ప్రకటనలో, “ఈ మధ్యలో మీరు మా గురించి విన్నే ఉంటారు… మొదటి నుంచీ మా విశ్వసనీయ అభిమానులుగా ఉన్నారు… కానీ ఇప్పుడు మా సేవలను నిలిపివేస్తున్నాం. దేశవ్యాప్తంగా మా... ఖమ్మం జాగృతి జనంబాటలో సమస్యలపై కవిత విమర్శలు, పరిశీలనలు
ఖమ్మం జిల్లా వ్యాప్తంగా జాగృతి జనంబాటలో భాగంగా కవిత పర్యటన. మోడల్ స్కూల్ సమస్యలు, సీతారామ ఎత్తిపోతల పథకం ఆలస్యం, సింగరేణి కార్మికుల ఇబ్బందులు, వైరా మార్కెట్ సమస్యలు, ప్రజా సమస్యలపై కీలక వ్యాఖ్యలు. సమగ్ర కథనం 15 దుకాణాలకు ఓపెన్ వేలం వేసి కేటాయించండి. - ప్రజావాణికి వినతి పత్రం సమర్పణ
సికింద్రాబాద్, నవంబర్ 17 (ప్రజామంటలు) :
బన్సీలాల్ పేట డివిజన్ లోని న్యూ బోయిగూడ, ఐడీహెచ్ కాలనీల పరిధిలోని 15 జీహెచ్ఎమ్ సీ షాపింగ్ కాంప్లెక్స్ లల్లోని మొత్తం 15 దుకాణాలకు కొత్తం ఓపెన్ వేలం వేసి, అర్హులకు కేటాయించాలని సికింద్రాబాద్ జీహెచ్ఎంసీ నార్త్ జోన్ అధికారులకు కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు ఐత చిరంజీవి సోమవారం... దార్జిలింగ్ గోర్ఖా సమస్యపై మమతా బెనర్జీ లేఖ – ఇంటర్‌లాక్యూటర్ నియామకం రద్దు చేయాలని కేంద్రానికి విజ్ఞప్తి
హైదరాబాద్, నవంబర్ 17 (ప్రజా మంటలు):పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి ప్రధానమంత్రి నరేంద్రమోదీకి లేఖ రాశారు. దార్జిలింగ్ కొండ ప్రాంతంలోని గోర్ఖా సమస్యలపై చర్చలు నిర్వహించేందుకు కేంద్రం నియమించిన రిటైర్డ్ ఐపీఎస్ అధికారి నియామకాన్ని రద్దు చేయాలంటూ ఆమె పునరుద్ఘాటించారు. గోర్ఖాల సమస్యలను పరిష్కరించడంలో రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించాలనే... తల్లిదండ్రులను వేదిస్తున్న కొడుకులు -ఎస్పీ, ఆర్డీవో లకు ఫిర్యాదులు.
జగిత్యాల నవంబర్ 17 (ప్రజా మంటలు):
కడుపున పుట్టిన పిల్లలే వృద్దాప్యంలో ఉన్న తల్లి దండ్రులను వేధింపులకు గురిచేస్తూ, చంపుత మని బెదిరిస్తూ, చివరకు ఇంట్లోంచి గెంటి వేస్తున్నారు. జగిత్యాల రూరల్ మండలం పొలాస గ్రామానికి చెందిన గుగ్గిళ్ల నర్సవ్వ( 80) అనే వృద్దురాలిని ఆమె నడిపి కొడుకు, కోడలు తన స్వంత ఇంటి లోనుంచి... డెఫ్లింపిక్స్లో స్వర్ణం సాధించిన ధనుష్ శ్రీకాంత్‌కు సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు
జపాన్ డెఫ్లింపిక్స్లో 10 మీటర్ల ఎయిర్ రైఫిల్ విభాగంలో స్వర్ణ పతకం, ప్రపంచ రికార్డు సాధించిన హైదరాబాద్ షూటర్ ధనుష్ శ్రీకాంత్‌కు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అభినందనలు. యువ క్రీడాకారులకు స్ఫూర్తిగా నిలిచిన ధనుష్‌కు ప్రభుత్వ అండ. 