జీవన్ రెడ్డి పార్టీ మార్పు – రాజకీయ సమీకరణాల్లో కొత్త మలుపా? లేక ముగింపుకు నాంది?
గత వైభవం – ప్రారంభంలో శక్తివంతమైన ఎదుగుదల
జగిత్యాలపై అధిక భావోద్వేగం – బలమా? బలహీనతా?
తెలంగాణ రాజకీయాల్లో అప్పుడప్పుడూ వ్యక్తిగత నిర్ణయాలు పెద్ద చర్చలకు దారి తీస్తాయి. అలాంటి నిర్ణయాల్లో ఒకటి జీవన్ రెడ్డి కాంగ్రెస్ పార్టీని వీడి బీఆర్ఎస్లో చేరుతారనే ప్రచారం,. వెనుక ఉన్న రాజకీయ లెక్కలు, వ్యక్తిగత పరిస్థితులు, స్థానిక వర్గ రాజకీయాలు— అన్ని కలిసి చూస్తే ఇది కేవలం పార్టీ మార్పు కాదు, ఒక దీర్ఘకాల రాజకీయ ప్రయాణంలో కీలక మలుపుగా కనిపిస్తోంది.
గత వైభవం – ప్రారంభంలో శక్తివంతమైన ఎదుగుదల
జీవన్ రెడ్డి రాజకీయ జీవితాన్ని పరిశీలిస్తే, ప్రారంభ దశలోనే మంచి అవకాశాలు దక్కాయి. 1981 లో మల్యాల పంచాయతీ సమితి అధ్యక్షులుగా, 1983 లో తెలుగు దేశం పార్టీ నుండి, మొదటిసారి ఎమ్మెల్యేగా గెలవడమే కాకుండా, మంత్రి వర్గంలో స్థానం పొందడం ఆయన రాజకీయ ప్రతిభకు నిదర్శనం. అయితే, ఆ విజయాన్ని స్థిరమైన ఆధిపత్యంగా మార్చుకోవడంలో మాత్రం ఆయన పూర్తిగా సక్సెస్ కాలేకపోయారు.
1980ల నుంచే జగిత్యాల నియోజకవర్గం వర్గ రాజకీయాలకు కేంద్రమైంది. ఒక దశలో ఆయన ప్రభావం ఉన్నప్పటికీ, తర్వాతి కాలంలో వరుసగా ఎదురైన రాజకీయ ప్రతిబంధకాలు ఆయన స్థాయిని తగ్గించాయి.
జగిత్యాల రాజకీయ వాస్తవం – వర్గాల ఆధిపత్య పోరు
జగిత్యాల నియోజకవర్గంలో ప్రధానంగా వెలమ, రెడ్డి వర్గాల మధ్య పోటీ కీలక పాత్ర పోషించింది. 1983 నుండి 2014వరకు ఈ ప్రాంతంలో అధికారం మారుతూ వచ్చినా, ఒక వర్గం పూర్తిగా ఆధిపత్యం చెలాయించలేకపోయింది.
గతంలో వేల రాజకీయ ఆధిపత్యం ఉన్న ఈ నియోజకవర్గం 1983 ఎన్నికల్లో రెడ్డి వర్గానికి దక్కింది. ఆతరువాత, 1985,1994, 2009, ఎన్నికలలో బీసీ వర్గాలకు చెందిన గుడిసెల రాజేశం గౌడ్, ఎలుగందుల రమణ విజయం సాధించి జీవన్ రెడ్డికి చెక్ పెట్టారు.
అంటే వేలం నాయకత్వం. పరిస్థితులకు అనుకూలంగా బీసీలకు మద్దతు ప్రకటించడంతో, రెడ్డి వర్గానికి ఎదురుదెబ్బ తలిగింది. కానీ, పదకొండు సార్లు పోటీ చేసిన జీవన్ రెడ్డి 6 సార్లు గెలిచి వెలమ వర్గాన్ని 2018 వరకు అడ్డుకున్నారు.
అయితే 2018 తర్వాత పరిస్థితులు మారాయి. వెలమ వర్గం ప్రభావం పెరగడంతో, బీసీ నాయకులలో ఐక్యత లేకపోవడం, BRS పార్టీ వెలమ నాయకులకే ప్రాధాన్యత ఈయడంతో, జీవన్ రెడ్డి శకానికి ముగింపు పలికినట్లు అయింది.
జీవన్ రెడ్డి వరుస పరాజయాలు ఎదుర్కొన్నారు. 2023 ఎన్నికల్లో కూడా ఓటమి పాలవడం ఆయన రాజకీయ భవిష్యత్తుపై ప్రశ్నార్థక చిహ్నం పెట్టింది.
కాంగ్రెస్లో అసంతృప్తి – మార్పుకు దారితీసిన కారణం
జీవన్ రెడ్డి పార్టీ మార్పుకు ప్రధాన కారణం కాంగ్రెస్లో పెరిగిన అసంతృప్తి. ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ గెలిచిన నాయకులకు మాత్రమే ప్రాధాన్యం ఇవ్వడం, ఓడిపోయిన వారికి తక్కువ అవకాశాలు ఇవ్వడం ఆయనను నిరాశకు గురిచేసింది.
అంతేకాకుండా, స్థానికంగా కొత్త నాయకత్వాన్ని ప్రోత్సహించడం, ఇతర నేతలను ముందుకు తేవడం వల్ల ఆయన స్థానం క్రమంగా బలహీనపడింది. ఈ నేపథ్యంలో ఆయన చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో చివరకు పార్టీని వీడే నిర్ణయం తీసుకున్నారు.
బీఆర్ఎస్లో భవిష్యత్తు – అవకాశాలా? లేక అనిశ్చితి?
బీఆర్ఎస్లో చేరడం ద్వారా జీవన్ రెడ్డి రాజకీయంగా పునరుద్ధరణ పొందుతారా అన్నది పెద్ద ప్రశ్న. ప్రస్తుతం ఆయన వయస్సు 75 ఏళ్లు. రాజకీయాల్లో వారసత్వం లేకపోవడం కూడా ఒక పెద్ద లోపంగా కనిపిస్తోంది.
కుటుంబ సభ్యులను రాజకీయాల్లోకి తీసుకురాకపోవడం వల్ల ఆయన తర్వాత నాయకత్వం కొనసాగించే వ్యక్తి లేరు. ఇది పార్టీలు కూడా పెద్దగా ప్రాధాన్యం ఇవ్వకపోవడానికి ఒక కారణంగా మారుతోంది. పార్టీలో కూడా, రెండవ తరం నాయకత్వాన్ని ఆయన ప్రోత్సహించలేదు.
పట్టణ ఓటర్లు – కీలక బలహీనత
జీవన్ రెడ్డి రాజకీయాల్లో మరో ముఖ్యమైన అంశం పట్టణ ఓటర్ల మద్దతు లేకపోవడం. జగిత్యాల పట్టణంలో ఆయనకు ఎప్పుడూ స్పష్టమైన మెజార్టీ రాలేదు. గ్రామీణ ఓట్లతో గెలిచిన సందర్భాలు ఉన్నా, పట్టణ ఓటర్లు మాత్రం ఆయనకు అనుకూలంగా లేరు.
ఇది భవిష్యత్తులో మరింత పెద్ద సవాలుగా మారే అవకాశం ఉంది.
నియోజకవర్గాల పునర్విభజన – కొత్త సవాళ్లు
వచ్చే ఎన్నికల ముందు నియోజకవర్గాల పునర్విభజన జరిగే అవకాశం ఉంది. జగిత్యాల నియోజకవర్గం స్వరూపం మారితే, జీవన్ రెడ్డి ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అన్నది పెద్ద ప్రశ్న.
ఒకవేళ పట్టణ కేంద్రంగా నియోజకవర్గం మారితే, ఆయన గెలుపు అవకాశాలు మరింత తగ్గే అవకాశం ఉంది. రిజర్వేషన్ మార్పులు కూడా ఆయన రాజకీయ లెక్కలను పూర్తిగా మార్చేయవచ్చు.
జగిత్యాలపై అధిక భావోద్వేగం – బలమా? బలహీనతా?
జీవన్ రెడ్డి రాజకీయాల్లో ఒక ముఖ్యమైన అంశం జగిత్యాలపై ఉన్న అతిప్రేమ. ఆయన అన్నిటిని వదిలి జగిత్యాలకే పరిమితమయ్యారు.
ఈ భావోద్వేగం ఒకవైపు ఆయనకు గుర్తింపునిచ్చినా, మరోవైపు రాజకీయ అవకాశాలను పరిమితం చేసింది. కొత్త ప్రాంతాల్లో ఎదగలేకపోవడం ఆయనకు నష్టంగా మారింది.
తగ్గుతున్న నాయకత్వ ప్రభావం
ప్రస్తుత పరిస్థితుల్లో జీవన్ రెడ్డి కాంగ్రెస్లో ఉన్నా, బీఆర్ఎస్లో ఉన్నా, ఆయన ప్రభావం పరిమితంగానే ఉండే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఆయన పాత్ర ఎక్కువగా మీడియా వ్యాఖ్యలకే పరిమితమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.
రాజకీయంగా చూస్తే, ఇది ఒక శక్తివంతమైన నాయకుడి ప్రయాణంలో చివరి దశగా విశ్లేషకులు భావిస్తున్నారు. పార్టీ మార్పు ఆయనకు కొత్త జీవం పోస్తుందా, లేక ఇది ముగింపుకు నాంది అవుతుందా అన్నది వచ్చే కాలమే తేల్చాలి..
More News...
<%- node_title %>
<%- node_title %>
జర్నలిస్టుల హక్కుల కోసం గాంధీ విగ్రహం వద్ద నిరసన. ఆరు డిమాండ్లపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలి టీయూడబ్ల్యూజే (ఐజేయు) జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటి శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి.
జగిత్యాల,అక్టోబర్ 2(ప్రజా మంటలు)
జర్నలిస్టుల హక్కుల పరిరక్షణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తక్షణమే స్పందించాలని తెలంగాణ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ (టీయూడబ్ల్యూజే) జగిత్యాల జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చీటీ శ్రీనివాసరావు, బెజ్జంకి సంపూర్ణ చారి లు డిమాండ్ చేశారు.ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా జగిత్యాల మంచినీళ్ల బావి... బాపూ ఘాట్లో గాంధీజీకి గవర్నర్ శుక్లా, సీఎం రేవంత్ రెడ్డి నివాళులు
హైదరాబాద్, అక్టోబర్ 02 (ప్రజా మంటలు):
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి సందర్భంగా లంగర్హౌస్లోని బాపూ ఘాట్లో రాష్ట్ర గవర్నర్ శివ ప్రతాప్ శుక్లాతో కలిసి ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గాంధీజీకి నివాళులర్పించారు. మహాత్ముడి విగ్రహానికి పుష్పాంజలి ఘటించి సర్వమత ప్రార్థనల్లో పాల్గొన్నారు.
అనంతరం బాపూ ఘాట్లో ఏర్పాటు చేసిన డిజిటల్ మ్యూజియంను గవర్నర్తో... సిరిసిల్ల సభ విజయాన్ని జీర్ణించుకోలేకే బీఆర్ఎస్ నేతల అక్కసు
కేటీఆర్కు మూడు హోటళ్లు ఎక్కడివి? సమాధానం చెప్పాలి: కొరివి అరుణ్ కుమార్ గాంధీ జయంతికి రక్తదాన శిబిరం
బంజారాహిల్స్ అక్టోబర్ 02 (ప్రజా మంటలు):
గాంధీ జయంతి సందర్భంగా బంజారాహిల్స్లోని తెలంగాణ రక్షణ సేన కార్యాలయంలో మహాత్మా గాంధీ చిత్రపటానికి నాయకులు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా గాంధీజీ దేశానికి చేసిన సేవలను వారు స్మరించుకున్నారు.
అనంతరం టీఆర్ఎస్ యువజన విభాగం ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. కార్యక్రమంలో పలువురు నాయకులు,... పద్మారావు నగర్ లో మహాత్మా గాంధీకి ఘన నివాళి -చిన్నారులకు పండ్ల పంపిణీ
సికింద్రాబాద్, అక్టోబర్ 02 (ప్రజా మంటలు):
జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను పురస్కరించుకుని పద్మారావు నగర్ డివిజన్ కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో శుక్రవారం ఘనంగా నివాళులర్పించారు. గాంధీ ఆసుపత్రి ప్రాంగణంలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర క్రిస్టియన్ మైనారిటీ కార్పొరేషన్ చైర్మన్ దీపక్ జాన్, పద్మారావు... జగిత్యాలలో ఘనంగా మహాత్మా గాంధీ జయంతి వేడుకలు
జగిత్యాల, అక్టోబర్ 2 (ప్రజా మంటలు):
జాతిపిత మహాత్మా గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని పురాణిపేట, మంచినీళ్ల బావి, గాంధీనగర్ ప్రాంతాల్లో గాంధీజీ విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు.
మున్సిపల్ చైర్పర్సన్ సమిండ్ల వాణి శ్రీనివాస్, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గజెంగి నందయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో గాంధీజీ సేవలను స్మరించుకున్నారు. సత్యం,... గాంధీజీ ఆశయాలను ఆచరణలో పెట్టడమే నిజమైన నివాళి: దావ వసంత సురేష్
జగిత్యాల, అక్టోబర్ 2 (ప్రజా మంటలు):
గాంధీ జయంతిని పురస్కరించుకుని జగిత్యాల పట్టణంలోని 44వ వార్డులో మహాత్మా గాంధీ విగ్రహానికి బీఆర్ఎస్ నాయకులతో కలిసి జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ పూలమాల వేసి ఘన నివాళులర్పించారు.
ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దేశానికి స్వాతంత్ర్యం సాధించేందుకు మహాత్మా గాంధీ అహింసా మార్గంలో... సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజుకు ప్రెస్ క్లబ్ ఆర్థిక సాయం
జగిత్యాల అక్టోబర్ 01 (ప్రజా మంటలు):
కరీంనగర్లో వైద్య చికిత్స పొందుతున్న సీనియర్ జర్నలిస్ట్ గాజుల నాగరాజుకు జగిత్యాల ప్రెస్ క్లబ్ సభ్యులు అండగా నిలిచారు. వైద్య ఖర్చుల నిమిత్తం రూ.57,100 ఆర్థిక సహాయాన్ని నాగరాజు కుటుంబ సభ్యులకు అందజేశారు.
వైద్య చికిత్సకు ఆర్థిక సహాయం అవసరమని తెలిసిన వెంటనే స్పందించి, తమ వంతు సహకారం... చలో సిరిసిల్ల సభ విజయవంతం చేసిన జగిత్యాల ప్రజలకు ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ధన్యవాదాలు
జగిత్యాల అక్టోబర్ 01 (ప్రజా మంటలు):
ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారి ‘చలో సిరిసిల్ల’ కార్యక్రమంలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభకు జగిత్యాల నియోజకవర్గం నుంచి భారీ సంఖ్యలో తరలివచ్చి సభను విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలకు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ హృదయపూర్వక... జగిత్యాల లలో జర్నలిస్టుల హక్కుల కోసం అక్టోబర్ 2న నిరసన
జగిత్యాల, అక్టోబర్ 1 (ప్రజా మంటలు):
జర్నలిస్టుల సమస్యల పరిష్కారం, హక్కుల సాధన కోసం అక్టోబర్ 2న దేశవ్యాప్తంగా నిర్వహించనున్న ‘డిమాండ్స్ డే’ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని టీయూడబ్ల్యూజే (ఐజేయూ) జగిత్యాల జిల్లా శాఖ పిలుపునిచ్చింది.
ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ (ఐజేయూ) పిలుపు మేరకు గాంధీ జయంతి సందర్భంగా అక్టోబర్ 2న ఉదయం 10.30 గంటలకు... జగిత్యాల వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం.. రెడ్క్రాస్ ఆధ్వర్యంలో రక్తదానం
జగిత్యాల, అక్టోబర్ 1 (ప్రజా మంటలు):
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం సందర్భంగా ఇండియన్ రెడ్క్రాస్ సొసైటీ జగిత్యాల జిల్లా మేనేజింగ్ కమిటీ ఆధ్వర్యంలో జగిత్యాల జిల్లా కేంద్రంలోని శివగాయత్రి వృద్ధాశ్రమంలో ఉచిత వైద్య శిబిరం నిర్వహించారు.
జిల్లా రెడ్క్రాస్ సొసైటీ చైర్మన్ డాక్టర్ ఆకుతోట శ్రీనివాస్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన శిబిరంలో వైద్యులు డాక్టర్ ఇనుగుర్తి... ఫ్లై దుబాయ్ విమానంలో పైలట్పై కత్తితో దాడి.. తృటిలో తప్పిన పెను ప్రమాదం
న్యూఢిల్లీ సెప్టెంబర్ 30:
దుబాయ్ నుంచి టెల్ అవీవ్కు వెళ్తున్న ఫ్లై దుబాయ్ FZ1073 విమానంలో బుధవారం తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. విమానం గాల్లో ఉండగానే కో-పైలట్, కెప్టెన్పై కత్తితో దాడి చేసినట్లు అధికారులు, ప్రయాణికుల వాంగ్మూలాల ఆధారంగా వార్తలు వెలువడ్డాయి. ఈ ఘటనతో విమానం ఒక్కసారిగా భారీగా ఎత్తు కోల్పోయి అత్యవసర పరిస్థితిని ఎదుర్కొంది.... 