జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీలో మన ఊరు మన ఆత్మగౌరవం

On
జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీలో మన ఊరు మన ఆత్మగౌరవం

(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల మార్చి 31 (ప్రజా మంటలు)

పట్టణంలోని జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ స్థానిక తాటిపల్లి గ్రామంలో మన ఊరు మన ఆత్మగౌరవం (MY VILLAGE MY PRIDE) పేరిట పల్లెదనం ప్రతిబింబించేలా వినూత్న కార్యక్రమం నిర్వహించింది.

ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం గ్రామీణ ప్రాంతాలలోని పిల్లల యొక్క అద్భుతమైన ప్రతిభను వారి తల్లిదండ్రులు మరియు గ్రామస్తులు ముందే ప్రదర్శించడం మరియు పల్లె వాతావరణాన్ని, పల్లె ప్రాముఖ్యతను ఈతరం విద్యార్థులు ప్రత్యక్షంగా చూపించడం.

ఈ కార్యక్రమాన్ని జ్యోతి హై స్కూల్ ఐఐటీ అకాడమీ డైరెక్టర్ బియ్యాల హరి చరణ్ రావు జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించారు.

ఈ సందర్భంగా రైతు యొక్క గొప్పతనం వివరించే విధంగా వేసిన నాటిక ప్రేక్షకులను ఆకట్టుకుంది. అదేవిధంగా తల్లిదండ్రులకు తమ పిల్లలపై గల అమూల్యమైన ప్రేమ గురించి ప్రదర్శించిన నాటిక చూపరులను కంటతడి పెట్టించింది. పల్లె వాతావరణం ప్రకృతి అందాలను చూపించే విధంగా చేసిన నృత్యాలు చూపరులను మంత్రముగ్ధులను చేశాయి.

పలువురు విద్యార్థులు తమ గ్రామం లో ఉన్న ప్రముఖమైన ప్రదేశాలు, విశిష్టత గాంచిన దేవాలయాలు, ప్రభుత్వం నుంచి పొందుతున్న సేవలు, తమ స్కూల్ యొక్క గొప్పతనం గురించి ఇచ్చిన ఉపన్యాసాలు వీక్షకులను ఆకట్టుకున్నాయి.

ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్లు హరి చరణ్ రావు , శ్రీధర్ రావు , రజిత , అజిత , మౌనిక రావు మరియు తాటి పెళ్లి ఎంపిటిసి పూదరి శ్రీనివాస్,పోషకులు బక్కషెట్టి ఆంజనేయులు, శ్రీపాద ప్రశాంత్, అటకం రవి, ఆర్ఎంపీలు శ్రీపాద సత్యం , అబ్దుల్లా మరియు అధిక సంఖ్యలో తల్లిదండ్రులు మరియు తాటిపల్లి ప్రజలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags