ధర్మపురి యోగానంద నరసింహ ఏకాంతోత్సవం
ధర్మపురి యోగానంద నరసింహ
ఏకాంతోత్సవం
రామ కిష్టయ్య సంగన భట్ల
ధర్మపురి మార్చ్ 30 :
నృసింహస్వామి క్షేత్రంలో నిర్వహిస్తున్న బ్రహ్మోత్సవాలలో భాగంగా శని వారం రాత్రి చాలా సేపటి వరకు నిర్వహించిన శ్రీ లక్ష్మీ సమేత యోగానంద నరసింహుని ఏకాంతోత్సవ వేడుకలు నేత్ర పర్వంగా సాగాయి.
స్వామి ఏకాంతోత్సవ సందర్భంగా, మహారాష్ట్ర లోని బిలోలికి చెందిన భక్తులు హర్గుల్ వార్ శంకర్ ప్రతి ఏటి లాగే సమర్పించిన వివిధ పుష్పాలతో ఆకర్షణీయంగా స్వాముల మూల విరాట్టులను అలంకృతుల గావించారు. రాత్రి 9.30 గంటలకు ప్రారంభమై రాత్రి చాలా సేపటి వరకు కొనసాగిన స్వామివారి ఏకాంతోత్సవ కార్యక్రమంలో ముందుగా ప్రధానాలయంలో, స్వామి ఉత్సవ మూర్తులను అలంకరించి, గరుడ స్థంభం వద్ద నిలిపి, ప్రత్యేక ఉత్సవ పూజలొనరించారు. వేద, శాస్త్ర, పురాణ, నృత్య, సంగీత, వాద్య, మౌన అదిగా గల సప్త ఆవరణ ప్రదక్షిణ లలో బోయీలు, భక్తులు స్వామివారిని ప్రధానాలయం చుట్టూ ఏడు ప్రదక్షిణలు తిప్పగా, భక్తులు అనుసరించారు.
దేవస్థానం పౌరోహితులు పురుషోత్తమా చార్య , ఆస్థాన వేద పండితులు బొజ్జా రమేశర్మల మార్గ నిర్దేశకత్వంలో దేవస్థానం ఎసి, ఈఓ శ్రీనివాస్ సంకటాల, వివిధ ఆలయాల అర్చకులు నంబి శ్రీనివాసాచార్య. రమణాచార్య, నరసింహ మూర్తి, అశ్విన్, వంశీలు సంప్రదాయ కార్యక్రమాలను నిర్వహించారు. సప్త ప్రదక్షిణల అనంతరం సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దిన ఆలయ ప్రాంగణానగల మంటపం లోని ఊయలలో లక్ష్మీ, కళ్యాణ యోగానంద నృసింహుని పవళింపు గావించి, అలౌకికానంద భరితులైన భక్తజన సమక్షంలో కన్నుల పండువగా వైకుంఠ నాథుని, లక్ష్మీదేవి ఏకాంత వేడుకలను సాంప్రదాయ రీతిలో నిర్వ హించారు. పవళింపు సేవ, నీరాజనం, మంత్రపుష్పం, ప్రసాద వితరణాదులను నిర్వహించారు. విశేషార్చనలు చేశారు. వేదవిదుల మహదాశీర్వచనాన్ని గావించి, ప్రసాద వితరణ చేశారు.
ఘనంగా వేంకటేశ్వర పుష్పయాగం
బ్రహ్మోత్సవాలలో భాగంగా శని వారం రాత్రి శ్రీవేంకటేశ్వర స్వామి పుష్ప యాగాన్ని నిర్వహించారు.
లోక కళ్యాణార్థం ఉత్సవ పరిసమాప్తి సందర్భంగా కలియుగ వేలుపైన వెంకన్న ప్రీతికై దేవస్థాన యాజ్ఞకులు పురుషోత్తమా చార్య , వేదపండితులు బొజ్జా రమేశశర్మ, ఆచార్యత్వంలో ఆలయ ఉప ప్రధానార్చకులు నేరేళ్ళ శ్రీనివాసా చార్య, మోహనా చార్య, విజయ్,భక్తి శ్రద్ధాసక్తులతో వాసుదేవ ద్వాదశాక్షరీ గోపాల పూజ యుక్త (నాగవెల్లి) పుష్ప యాగం కార్యక్రమాన్ని నిర్వహించారు. వేంకటేశ్వర మందిరంలోని మంటపంలో, పంచవర్ణాలతో చక్రాబ్జమును చిత్రించి, పుష్పాలం కృత శోభాయమాన పీఠమందు వేంకటనాథుని వేంచేపు చేసి, నలువైపులా ద్వార కుంభాలనుంచి రుక్, యజుర్, సామాధర్వణ వేదాలతో, శాస్త్ర సంగీతాది కళలతో స్వామిని సేవించారు.
ఈఓ శ్రీనివాస్, సూపరింటెండెంట్ కిరణ్ కుమార్, సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్, సిబ్బంది పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
అందెశ్రీ కీర్తి తెలంగాణ చరిత్రలో శాశ్వతం:రేవంత్ రెడ్డి
హైదరాబాద్, నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిన కవులు, కళాకారులలో అందెశ్రీ పేరు ఎన్నటికీ చెరిగిపోదని, రాష్ట్ర చరిత్రలో ఆయన స్థానం శాశ్వతమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. రవీంద్రభారతిలో జరిగిన అందెశ్రీ స్మారక సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు.
రేవంత్ రెడ్డి మాట్లాడుతూ,వజ్రాలపై దశాబ్దాలు చర్చించినా కోహినూర్కు పోటీ లేకపోయినట్టే,... జగిత్యాల జిల్లా నూతన డీసీసీ అధ్యక్షునికి ఆత్మీయ సన్మానం
జగిత్యాల, నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ తాజాగా ప్రకటించిన జిల్లా కమిటీ అధ్యక్షుల్లో భాగంగా జగిత్యాల జిల్లా డీసీసీ అధ్యక్షుడిగా, మాజీ మంత్రి వర్గీయుడైన, గాజంగి నందయ్య నియమితులయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరై ఇందిరా భవన్లో నందయ్యను ఘనంగా సన్మానించారు.... తెలంగాణ జిల్లాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుల ప్రకటన
హైదరాబాద్ నవంబర్ 22 (ప్రజా మంటలు):
తెలంగాణలో డీసీసీ అధ్యక్షులను కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు అధ్యక్షులను ప్రకటించింది.డీసీసీల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలకు సగానికి పైగా కేటాయించింది.
ఇక్కడ తెలంగాణ కొత్తగా ప్రకటించిన DCC అధ్యక్షుల జాబితా ను సులభంగా చదవగల టేబుల్ ఫార్మాట్లో అందిస్తున్నాను:
తెలంగాణ – జిల్లావారీ... ఇయ్యాల సికింద్రాబాద్ లో భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు) :
సర్దార్ వల్లభాయ్ పటేల్ 150 వ జయంతిని పురస్కరించుకొని సికింద్రాబాద్ లో నేడు ఆదివారం ఉదయం భారీ యూనిటీ మార్చ్ ర్యాలీ నిర్వహించనున్నారు. శనివారం సీతాఫల్మండిలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశలో బీజేపీ నాయకులు, జిల్లా యువజన శాఖ అధికారులు వివరాలు వెల్లడించారు.
ఉదయం 10 గంటలకు సీతాఫల్మండి... బీపీ పెరగడంతో నరాలు చిట్లి యువకుడు మృతి
ఇబ్రహీంపట్నం నవంబర్ 22 (ప్రజ మంటలు దగ్గుల అశోక్)
జగిత్యాలజిల్లా ఇబ్రహీంపట్నం మండలం యామాపూర్ గ్రామానికి చెందిన చెని ప్రసాద్(38) s/o చెని చిన్న దేవయ్య కుమారుడు బీపీతో మెదడు లో నరాలు చితికి పోవడంతో గత నాలుగు రోజుల క్రితం నిజామాబాద్ ప్రైవేటు ఆసుపత్రిలో లో చేర్పించారు.ఎలాంటి ట్రీట్మెంట్ కి స్పందించకపోవడంతో నిన్న రాత్రి... గౌహతి టెస్ట్: దక్షిణాఫ్రికా తొలి రోజు 247 పరుగులు
గౌహతి నవంబర్ 22:
భారత్తో జరుగుతున్న రెండో టెస్ట్ మ్యాచ్ తొలి రోజు ఆట ముగిసే సమయానికి దక్షిణాఫ్రికా తన తొలి ఇన్నింగ్స్ లో 6 వికెట్ల నష్టానికి 247 పరుగులు చేసింది.
ఓపెనర్లు ఐడెన్ మార్క్రామ్ మరియు రియాన్ రికల్డన్ జట్టుకు మంచి ఆరంభాన్ని ఇచ్చారు.
మార్క్రామ్ 38 పరుగులకు, రికల్డన్ 35 పరుగులకు... అమీర్పేట్లో రూ.25 కోట్ల ప్రభుత్వ భూమిని కాపాడిన హైడ్రా
పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ కోట నీలిమ హర్షం..
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
అమీర్పేట్ డివిజన్లో రూ.25 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని హైడ్రా అధికారులు రక్షించారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమ తెలిపారు. పార్కు కోసం దశాబ్దాల క్రితం కేటాయించిన 1500 గజాల స్థలాన్ని... కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్
సికింద్రాబాద్, నవంబర్ 22 (ప్రజామంటలు):
సికింద్రాబాద్ భోలక్ పూర్ లోని కృష్ణవేణి టాలెంట్ స్కూల్ లో శనివారం వెజిటేబుల్ డే సెలబ్రేషన్స్ ఘనంగా నిర్వహించారు. నర్సరీ,ఎల్ కేజీ, యూకేజీ చిన్నారి విద్యార్థులకు ఈ సందర్బంగా వెజిటేబుల్స్ ప్రాముఖ్యత గురించి వివరించారు.
దైనిందిన ఆహారంలో కూరగాయలను ఖచ్చితంగా తినాలని, వాటి వలన ఆరోగ్యం బాగుంటుందని, వెజిటేబుల్స్ లోని... కోరుట్ల తాళ్ళచెరువు ఫిల్టర్ బెడ్ పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ )బి రాజా గౌడ్
కోరుట్ల నవంబర్ 22(ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కోరుట్ల మండల కేంద్రంలోని తాళ్లచెరువు ఫిల్టర్ బెడ్ ను శనివారం పరిశీలించిన అదనపు కలెక్టర్ (లోకల్ బాడీ) బి.రాజ గౌడ్
పట్టణం లోని పట్టణ ప్రజలకు సకాలంలో నీరు అందించాలి. ఫిల్టర్ బెడ్ ను మరియు నీరు యొక్క స్వచ్ఛతను ఎప్పటికప్పుడు పరిశీలించాలని మున్సిపల్ అధికారులకు ఆదేశించారు.... కోటీ రూపాయల భూమిని ₹16 లక్షలకు ఇచ్చేది లేదంటూ ఆగ్రహించిన రైతులు
సంగారెడ్డి నవంబర్ 22,(ప్రజా మంటలు):సంగారెడ్డి జిల్లాలోని చౌటకూర్ మండలం శివ్వంపేట గ్రామంలో మంగళవారం ఉదయం ఉద్రిక్తత చోటుచేసుకుంది. ట్రిపుల్ ఆర్ రోడ్ ఏర్పాటుకు అవసరమైన భూ సేకరణ నోటీసులు అందజేయడానికి వచ్చిన అధికారులను రైతులు పంచాయతీ కార్యాలయంలో బంధించారు.
భూసేకరణ నోటీసులు అందించడానికి వచ్చిన అధికారులు
ట్రిపుల్ ఆర్ రోడ్ నిర్మాణం కోసం ఎకరాకు... 3లక్షల రూపాయల LOC అందజేసిన ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
హైద్రాబాద్ నవంబర్ 22(ప్రజా మంటలు)బీర్ పూర్ మండల తుంగురూ గ్రామానికి చెందిన ఉయ్యాల సుజాత అనారోగ్యం తో బాధపడుతూ నరాల సంబంధిత వైద్య చికిత్స చేసుకోలేక ఆర్థిక ఇబ్బందులతో బాధపడుతూ ఉండగా విషయాన్ని రంగంపేట నాయకులు డ్రైవర్ శేఖర్ ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్ దృష్టికి తీసుకురాగా ముఖ్యమంత్రి సహాయ నిది ద్వారా నిమ్స్ లో... రిపోర్టర్ షఫీ ఆరోగ్య పరిస్థితి ఆసుపత్రిని సందర్శించి వైద్యులను అడిగి తెలుసుకొన్న ఎమ్మెల్యే డా.సంజయ్ కుమార్
హైదరాబాద్ నవంబర్ 22(ప్రజా మంటలు)
జగిత్యాల ఐ న్యూస్ రిపోర్టర్ షఫీ అనారోగ్యంతో హైదరాబాద్ బంజారాహిల్స్ లోని రెనోవ హాస్పిటల్లో చికిత్స పొందుతుండగా షఫీ ని ఆస్పత్రి లో పరామర్శించి ఆరోగ్య పరిస్థితిని వైద్యులతో అడిగి తెలుసుకున్నారు జగిత్యాల ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ 