బీ అర్ ఎస్ కు కే కే గుడ్ బై  కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు

On
బీ అర్ ఎస్ కు కే కే గుడ్ బై   కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటించారు

బీ అర్ ఎస్ కు కే కే గుడ్ బై 
కాంగ్రెస్ లో చేరుతున్నట్లు ప్రకటన 

హైదరాబాద్ మార్చ్ 29: కాంగ్రెస్‌లో చేరడంపై బీఆర్ఎస్ (BRS) రాజ్యసభ ఎంపీ, పార్టీ సెక్రటరీ జనరల్ కే. కేశవరావు స్పష్టమైన  ప్రకటన చేశారు. కాంగ్రెస్ తనకు సొంత ఇళ్లులాంటిదని, తీర్థయాత్రలకు వెళ్లిన వారు ఎప్పటికైనా ఇంటికే చేరుతారని.. తాను కూడా తన సొంత ఇల్లు కాంగ్రెస్‌లో చేరుతానని స్పష్టం చేశారు.

53ఏళ్లు కాంగ్రెస్‌లో పని చేశానని అన్నారు. బీఆర్ఎస్‌లో తాను పని చేసింది కేవలం పదేళ్లు మాత్రమేనని తెలిపారు. తెలంగాణ కోసమే బీఆర్ఎస్‌లో చేరానని అన్నారు. కాంగ్రెస్ పార్టీయే తెలంగాణ ఇచ్చిందన్నారు. తాను మొదటిసారి కాంగ్రెస్ రెండో ప్రాధాన్యత ఓట్లతోనే రాజ్యసభకు ఎన్నికయ్యానని కేశవరావు తేల్చిచెప్పారు.

ఆయన కూతురు గద్వాల విజయలక్ష్మి హైదరబాద్ మేయర్ గా ఉన్నారు.ఆమె కూడా కాంగ్రెస్ లో చేరుతున్నట్లు వార్తలు వచ్చాయి. గతవారం కాంగ్రెస్ ఇంచార్జీ దిపా మున్షీ కేశవరావు ఇంటికి వచ్చి సంప్రదింపులు చేసిన విషయం తెల్సిందే.

Tags