ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక
ఇప్పుడు 'గల్ఫ్' ఎటువైపు - 'గల్ఫ్' పై కాంగ్రెస్ ఆశలు
ఇప్పటికైనా తమ అవసరాలను గుర్తించాలని కార్మికుల కోరిక
హైదరాబాద్ మార్చ్ 28 (ప్రత్యేక ప్రతినిధి) :
రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో తెలంగాణలో గల్ఫ్ కార్మికుల కుటుంబాల ఓటు బ్యాంకు ప్రభావం ఎలా ఉండబోతుంది అనే అంశంపై ఇటీవల ఒక ప్రాథమిక పరిశీలన జరిగింది. గతంలో రాజకీయ వ్యూహకర్తలు ప్రశాంత్ కిశోర్, సునీల్ కొనుగోలు టీములు, వివిధ సర్వే సంస్థలు చేసిన విశ్లేషణలను కూడా పరిగణలోకి తీసుకోవడం జరిగింది.
తెలంగాణ లోని నిజామాబాద్, కరీంనగర్, ఆదిలాబాద్, పెద్దపల్లి, జహీరాబాద్, మెదక్, వరంగల్, హైదరాబాద్ ఎనిమిది లోక్ సభ నియోజకవర్గాల పరిధిలోని 'గల్ఫ్ మైగ్రేషన్ కారిడార్' నుంచి ప్రస్తుతం ఎంత మంది గల్ఫ్ దేశాల్లో నివసిస్తున్నారు, విదేశీ మారక ద్రవ్యం ఎంత పంపించారు, గత పదేళ్లలో ఎంత మంది గల్ఫ్ నుంచి వాపస్ వచ్చారు, వారి పునరావాసం ఎలా ఉన్నది, గల్ఫ్ కార్మికుల ప్రధాన సమస్యలు ఏం ఉన్నాయి, రేషన్ కార్డులలో, ఓటర్ లిస్ట్ లో గల్ఫ్ కార్మికుల పేర్లు ఏ మేరకు తొలగించారు, గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారు కానీ, వారి కుటుంబ సభ్యులు కానీ సర్పంచ్, వార్డు మెంబర్, ఎంపీటీసీ, మున్సిపల్ కౌన్సిలర్, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం లాంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏ మేరకు చురుకుగా పాల్గొన్నారు, ఎంతమంది గెలుపొందారు, వారి రాజకీయ చైతన్యం ఏ మేరకు ఉన్నది అనే విషయాలను పరిశీలించడం జరిగింది.
2023 డిసెంబర్ 7న తెలంగాణలో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం వంద రోజుల్లో గల్ఫ్ కార్మికులకు ఇచ్చిన హామీలలో కొంతవరకు నెరవేర్చింది. గల్ఫ్ దేశాలలో మృతిచెందిన వలస కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపును ఇటీవల వేములవాడలో ప్రారంభించింది. రాష్ట్రంలో తొమ్మిదిన్నర సంవత్సరాలు అధికారంలో ఉన్న టీఆర్ఎస్ (బీఆర్ఎస్), కేంద్రంలో పదేళ్లుగా అధికారంలో ఉన్న బీజేపీ గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి చెప్పుకోదగ్గ సంక్షేమ కార్యక్రమాలు ఏవీ చేపట్టలేదు. దేశానికి అత్యధిక విదేశీ మారకద్రవ్యాన్ని ఆర్జించి పెడుతున్న గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విస్మరించాయి. కేరళ, పంజాబ్ లాంటి రాష్ట్రాల కంటే మెరుగైన ఎన్నారై పాలసీ (ప్రవాసి విధానం) తెస్తామన్న కేసీఆర్, కేటీఆర్ ల హామీలు అటకెక్కాయి. విదేశీ పెట్టుబడులు, ఎన్నారైల పెట్టుబడులపై ఉన్న ప్రేమ ప్రవాసి కార్మికులపై లేదు. గల్ఫ్ నుంచి వాపస్ వచ్చిన వారిని ఆదుకోవడానికి కేంద్రంలోని బీజేపీ, రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వాలు ఎలాంటి పునరావాస కార్యక్రమాలు చేపట్టలేదు.
ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులు రాసిన బహిరంగ లేఖ
ఇటీవల జగిత్యాల పర్యటనకు వచ్చిన ప్రధాని మోదీకి గల్ఫ్ కార్మికులకు సామాజిక భద్రత, సంక్షేమం, కేంద్ర ప్రభుత్వ పక్షాన సౌకర్యాల కల్పన, హక్కుల గురించి వలస కార్మిక నాయకులు బహిరంగ లేఖ రాశారు. గల్ఫ్ జెఏసి చైర్మన్ గుగ్గిల్ల రవిగౌడ్, 'గల్ఫ్ కాంగ్రెస్' అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, ప్రవాసి మిత్ర లేబర్ యూనియన్ నాయకులు సయిండ్ల రాజిరెడ్డి, ఎం. నాగభూషణంలు లేఖపై సంతకాలు చేశారు.
గల్ఫ్ దేశాలలో 88 లక్షల మంది వలస కార్మికులు నివసిస్తున్నారని భారత ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. విదేశీ మారక ద్రవ్యాన్ని పొందే దేశాలలో భారతదేశం ప్రపంచంలోనే అగ్రస్థానంలో ఉన్నది. 2023లో 125 బిలియన్ యుఎస్ డాలర్ల (10 లక్షల 25 వేల కోట్ల రూపాయల) విలువైన విదేశీ మారకాన్ని భారతదేశం పొందింది. ఇది భారతదేశ స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 3.4 శాతం. భారత్ పొందే విదేశీ మారకంలో సగానికి పైగా గల్ఫ్ దేశాల నుంచే లభిస్తున్నది. గమ్యస్థాన గల్ఫ్ దేశాల అభివృద్ధిలో పాలుపంచుకుంటూ భారతదేశానికి అత్యధిక విదేశీ మారక ద్రవ్యం పంపిస్తున్న ప్రవాస భారతీయ కార్మికుల సేవలను గుర్తించాలని మిమ్ములను కోరుతున్నాము.
గత పదేళ్లలో మీరు ప్రధాన మంత్రి హోదాలో సౌదీ అరేబియా, యూఏఈ, ఓమాన్, కువైట్, ఖతార్, బహరేన్ ఆరు అరబ్ గల్ఫ్ దేశాలలో పర్యటించారు. భారత్ - గల్ఫ్ దేశాల మధ్య మీరు చేసుకున్న ద్వైపాక్షిక ఒప్పందాలలో వ్యాపార వాణిజ్య ఒప్పందాలే ఎక్కువ. గల్ఫ్ వలస కార్మికుల సామాజిక భద్రత, సంక్షేమం గురించి పెద్దగా పట్టించుకోలేదు.
కరోనా సందర్బంగా వందే భారత్ ప్లయిట్స్, చార్టర్డ్ ప్లయిట్స్ లలో విదేశాల నుంచి భారత్ కు వచ్చిన మన పౌరుల నుంచి రెండింతలు, మూడింతలు విమాన చార్జీలు వసూలు చేయడం వలన పేద వలస కార్మికులు నష్టపోయారు. కరోనా సందర్బంగా హడావిడిగా వాపస్ వచ్చిన ప్రవాసి కార్మికులకు గల్ఫ్ దేశాల కంపెనీ యాజమాన్యాల నుంచి రావలసిన ఉద్యోగ అనంతర ప్రయోజనాలు (ఎండ్ ఆఫ్ సర్వీస్ బెనిఫిట్స్) పొందేందుకు న్యాయ సహాయాన్ని అందించండి.
భారత ప్రభుత్వం ఈ క్రింది విషయాలపై దృష్టి పెట్టాలని కోరుతున్నాము.
- ప్రవాసీ భారతీయ బీమా యోజన అనే రూ.10 లక్షల ప్రమాద బీమా పథకంలో సహజ మరణాన్ని చేర్చాలి. బీమా సౌకర్యం అందరికీ ఆన్ లైన్ లో అందుబాటులో ఉంచాలి.
-విదేశీ మారకద్రవ్యం పంపేవారికి బంగ్లాదేశ్ ప్రభుత్వం రెండున్నర శాతం ప్రోత్సాహకం ఇస్తున్నది. భారత ప్రభుత్వం కూడా ఈదిశగా ఆలోచించాలి.
-- హైదరాబాద్ లో సౌదీ అరేబియా, కువైట్ దేశాల కాన్సులేట్ లు (రాయబార కార్యాలయాలు) ఏర్పాటుకు భారత ప్రభుత్వం చొరవ చూపాలి. ఇటీవలనే యూఏఈ కాన్సులేట్ ను ఏర్పాటు చేశారు.
-- గల్ఫ్‌లోని భారతీయ వలస కార్మికులకు బీమా, పెన్షన్‌తో కూడిన సమగ్ర సామాజిక భద్రతా పథకాన్ని అమలు చేయాలి.
- వాపస్ వచ్చిన వలసదారుల కోసం పునరేకీకరణ, పునరావాసం పథకాన్ని రూపొందించండి.
- ఎమిగ్రేషన్ యాక్టు 1983 ని ఆధునికీకరించాలి. చాలా ఏళ్లుగా న్యూ ఎమిగ్రేషన్ బిల్ పెండింగ్ లో ఉన్నది.
-- ద్వైపాక్షిక కార్మిక ఒప్పందాలను క్రమం తప్పకుండా సమీక్షించడానికి గల్ఫ్ దేశాలతో సంయుక్త కమిటీలను ఏర్పాటు చేయాలి.
-- విదేశాలకు ఉద్యోగం కోసం వెళ్లే వారందరికీ ముందస్తు ప్రయాణ అవగాహన శిక్షణ (ప్రీ-డిపార్చర్ ఓరియంటేషన్ మరియు ట్రైనింగ్ - పీడీఓటి ని నిర్బంధంగా అమలు చేయాలి.
- భారత దేశం నుంచి విదేశాలకు వెళ్లే ప్రతి పౌరుడి వివరాలను భారతీయ విమానాశ్రయాల్లో రిజిస్ట్రేషన్ చేయాలి. అలాగే విదేశాల్లోని భారతీయ రాయబార కార్యాలయాల్లో కూడా రిజిస్ట్రేషన్ తప్పనిసరి చేయాలి.
- భారతదేశంలో చదువుకుంటున్న గల్ఫ్ కార్మికుల పిల్లలకు ఆయా విద్యా సంస్థలలో రిజర్వేషన్ కోటా అమలు చేయాలి.
- ప్రస్తుత ప్రభుత్వాలు అమలు చేస్తున్న సామాజిక సంక్షేమ పథకాలలో గల్ఫ్ దేశాలలో నివసిస్తున్న కార్మికులు, గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో ఉన్న వారిని లబ్ధిదారులుగా పరిగణించాలి. రేషన్ కార్డు లేదనే సాకుతో సంక్షేమ పథకాలకు వారిని దూరం చేయొద్దు.
సీఎం ను కలిసిన గల్ఫ్ ఎన్నారైలు
కాంగ్రెస్ పార్టీ ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలను అమలు చేయాలని కోరుతూ టీపీసీసీ ఎన్నారై విభాగం ప్రతినిధులు, గల్ఫ్ సంఘాల నాయకులు మార్చి 2న సీఎం రేవంత్ రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. గల్ఫ్ దేశాల్లో మరణించిన కార్మికుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇచ్చేనందుకు జీవో విడుదల గురించి కసరత్తు చేయాలని సీఎం కార్యదర్శి షానవాజ్ ఖాసీంను రేవంత్ రెడ్డి వెంటనే ఆదేశించారు. గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు, ఎన్నారైల సంక్షేమ బోర్డు, హెల్ప్ లైన్ ఏర్పాటు, గల్ఫ్ మృతుల కుటుంబాలకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా చెల్లింపు హామీల అమలుపై దృష్టి పెట్టాలని చేయాలని వారు కోరారు. దుబాయి పర్యటనకు రావాలని ఆహ్వానించారు.
ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డి నేతృత్వంలో టిపిసిసి ఎన్నారై సెల్ చైర్మన్ డా. బిఎం వినోద్ కుమార్, గల్ఫ్ కాంగ్రెస్ అధ్యక్షులు సింగిరెడ్డి నరేష్ రెడ్డి, టిపిసిసి ఎన్నారై సెల్ ఇంటర్నేషనల్ కన్వీనర్ మంద భీంరెడ్డి, ఓమాన్ లోని ఇండియన్ సోషల్ క్లబ్ తెలంగాణ విభాగం అధ్యక్షులు గుండేటి గణేష్, నేషనల్ వర్కర్స్ వెల్ఫేర్ ట్రస్ట్ చైర్ పర్సన్ సిస్టర్ లిసీ జోసెఫ్ లు గల్ఫ్ సమస్యలను ముఖ్యమంత్రికి వివరించారు. టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షులు, ఎమ్మెల్సీ బి. మహేష్ కుమార్ గౌడ్, వేములవాడ ఎమ్మెల్యే, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, చొప్పదండి ఎమ్మెల్యే మెడిపెల్లి సత్యం, సిరిసిల్ల నియోజకవర్గ కాంగ్రెస్ ఇంచార్జి కేకే మహేందర్ రెడ్డి లు ఆ బృందంలో ఉన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై తెలంగాణ జాగృతి అభ్యర్థుల పోటీ
ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్‌తో కలిసి ముందుకు వెళ్లాలని నిర్ణయం
హైదరాబాద్, జనవరి 28 (ప్రజా మంటలు):
రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ పార్టీ ‘సింహం’ గుర్తుపై తెలంగాణ జాగృతి ఔత్సాహిక అభ్యర్థులు పోటీ చేయనున్నట్లు ప్రకటించారు. ఈ నిర్ణయాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సమక్షంలో ఆల్ ఇండియా... ఎన్నికల నియమవళి పక్కాగా అమలు చేయాలి నామినేషన్ కేంద్రాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
మెట్‌పల్లి/కోరుట్ల జనవరి 28 (ప్రజా మంటలు)మెట్ పెల్లి మరియు కోరుట్ల మున్సిపాలిటీల్లో జరుగుతున్న నామినేషన్ల ప్రక్రియను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా నామినేషన్ల స్వీకరణ ప్రక్రియ సజావుగా, పారదర్శకంగా జరుగుతోందా లేదా అనే విషయాన్ని స్వయంగా పరిశీలించారు.నామినేషన్లు దాఖలు చేసేందుకు వచ్చిన అభ్యర్థులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా... గోదావరి పుష్కరాలకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి శైలజా రామయ్యర్
జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు)2027 లో గోదావరి పుష్కరాలు జరుగనున్న నేపథ్యంలో పుష్కరాలను పకడ్బందీగా నిర్వహించే క్రమంలో బుధవారం జిల్లా కలెక్టర్ లు మరియు సంబందిత అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.
జగిత్యాల జిల్లా నుండి జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు.
ఈ సందర్బంగా దేవదాయ శాఖ ప్రధాన కార్యదర్శి... శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల ఆహ్వాన పత్రిక ధర్మపురి సిఐ కి అందజేత
వెల్గటూరు జనవరి 28 (ప్రజా మంటలు)
జక్కాపురం నారాయణస్వామి వెలగటూరుధర్మపురి సిఐ ఏ. నరసింహ రెడ్డి నీ మర్యాద పూర్వకం గా కలిసి శ్రీ వెంకటేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకీ ఆహ్వానం అందించిన ఆలయ చైర్మన్ చింతల రాజయ్య,సర్పంచ్ భూపల్లి రాజయ్య,ఉపసర్పంచ్ యాగండ్ల గంగయ్య, ప్రధాన అర్చకులు పవన్ కుమార్ ,హరి ప్రశాంత్, ఈ కార్యక్రమం... ఈనెల 30న వెలగటూర్ మండల స్థాయి ( సీఎం కప్) సెకండ్ ఎడిషన్ సెలక్షన్స్
వెల్గటూర్ జనవరి 28 ( ప్రజా మంటలు)
జక్కాపురం నారాయణస్వామి వెల్గటూర్మండల స్థాయి సీఎం కప్ (సెకండ్ ఎడిషన్) సెలక్షన్స్ తేదీ 30 జనవరి 2026 శుక్రవారం రోజున జడ్.పి.హెచ్.ఎస్ వెల్గటూర్ లో నిర్వహించబడతాయని ఎంఈఓ బోనగిరి ప్రభాకర్ తెలిపారు.
మండలంలోని అన్ని గ్రామాల క్రీడాకారిని మరియు క్రీడాకారులు తమ వెంట రిజిస్ట్రేషన్ చేసుకున్న... రైల్వే కోడూరు జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై మహిళ ఆరోపణలు
అమరావతి / రైల్వే కోడూరు, జనవరి 28 (ప్రజా మంటలు):
రైల్వే కోడూరు నియోజకవర్గ జనసేన ఎమ్మెల్యే ఆరవ శ్రీధర్‌పై ఓ మహిళ చేసిన తీవ్రమైన ఆరోపణలు రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతున్నాయి. తనతో 2024 నుంచి 2026 జనవరి 7 వరకు సన్నిహిత సంబంధాలు కొనసాగించిన ఎమ్మెల్యే, పెళ్లి చేస్తానని నమ్మించి మోసం చేశారని,... ఎన్నికలు ప్రశాంతంగా జరిగేందుకు అందరు సహకరించాలి మున్సిపల్ ఎన్నికల కోడ్ నియమావళిని పాటించాలి_ జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్
జగిత్యాల జనవరి 28 ( ప్రజా మంటలు)
ఎన్నికల కోడ్ నియమావళిని అందరు తప్పనిసరిగా పాటించాలని జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ అన్నారు.
బుధవారం జిల్లా కలెక్టరేట్లో మిని సమావేశ హాల్ లో ఏర్పాటు చేసిన వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధుల సమావేశంలో జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పాల్గొన్నారు. వీరితో పాటు జిల్లా అడిషనల్... కరీంనగర్ కార్పొరేషన్‌ను కాంగ్రెస్ కైవసం చేసుకుంటుంది: మంత్రులు
కరీంనగర్, జనవరి 28 (ప్రజా మంటలు):
కరీంనగర్ మున్సిపల్ కార్పొరేషన్‌ను కచ్చితంగా కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంటుందని మంత్రులు ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ టికెట్ ఆశావహులతో నిర్వహించిన ముఖాముఖి సమావేశంలో మంత్రులు శ్రీధర్ బాబు, తుమ్మల నాగేశ్వరరావు, పొన్నం ప్రభాకర్ పాల్గొని మాట్లాడారు.
ఈ సందర్భంగా మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ,... ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులుగా మారం జగదీశ్వర్ ఎన్నికైన సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన జగిత్యాల టిఎన్జీఓ లు
జగిత్యాల జనవరి 28 (ప్రజా మంటలు)ఇటీవల షిరిడి లో నిర్వహించిన అఖిలభారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య 18వ జాతీయ సమావేశాల లో భాగంగా టీఎన్జీవో రాష్ట్ర అధ్యక్షులు మారం జగదీశ్వర్ ఆల్ ఇండియా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య ఉపాధ్యక్షులుగా రెండవసారిఎన్నికైన సందర్బంగా కరీంనగర్ టీఎన్జీవో భవన్ లో కరీంనగర్ జిల్లా... అనంతపురం జిల్లా నూతన జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ కు శుభాకాంక్షలు తెలిపి సత్కరించిన ఎఫ్ సి ఐ స్టేట్ డైరెక్టర్ వన గొంది విజయలక్ష్మి కిరణ్ దంపతులు
అనంతపురం జనవరి ( 28 ప్రజా మంటలు)అనంతపురం జిల్లా కు నూతనంగా బాధ్యతలు తీసుకున్న జాయింట్ కలెక్టర్ విష్ణు చరణ్ ని మర్యాదపూర్వకంగా కలిసి శాలువతో సత్కరించి, పూల బొకే అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు .
బిజెపి మహిళా మోర్చా రాష్ట్ర ఉపాధ్యక్షురాలు మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా..ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎఫ్... మున్సిపాలిటీ నామినేషన్ కేంద్రాలను, పోలింగ్ కేంద్రాలను పరిశీలించిన అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి
జగిత్యాల జనవరి 28 (ప్రజా మంటలు)మున్సిపాలిటీ ఎన్నికల నామినేషన్లు ప్రారంభమైన నేపథ్యంలో కోరుట్ల,రాయికల్ పట్టణాల్లో ఏర్పాటు చేసిన మున్సిపాలిటీ నామినేషన్ స్వీకరణ కేంద్రాలను, పలు పోలింగ్ కేంద్రాల ను అదనపు ఎస్పి అదనపు ఎస్పీ శేషాద్రిని రెడ్డి పరిశీలించారు.
.అక్కడ కొనసాగుతున్న నామినేషన్ ప్రక్రియ, నిర్వహణ తీరు, భద్రతా ఏర్పాట్ల గురించి తెలుసుకున్నారు. నామినేషన్... 