ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?
ఆగమౌతున్న వలస కార్మికుల బతుకులు ప్రచారానికే పరిమితం అవుతున్న ప్రజాప్రతినిధులు నిజామాబాద్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం - పరిశీలన
ఈ సారైనా గల్ఫ్ కార్మికుల గోసను ప్రభుత్వం పట్టించుకోంటుందా ?
ఆగమౌతున్న వలస కార్మికుల బతుకులు
ప్రచారానికే పరిమితం అవుతున్న ప్రజాప్రతినిధులు
నిజామాబాద్ లో గల్ఫ్ ఓటు బ్యాంకు ప్రభావం - పరిశీలన
హైదరాబాద్ మార్చ్ 28 ( ప్రత్యేక ప్రతినిధి) :
భారతదేశం నిండి గల్ఫ్ దేశాలకు వలస వెళ్ళే కార్మికులలో, కేరలా తరువాత తెలంగాణ వారిదే ఎక్కువ సంఖ్య. అందులో కరీంనగర్, జగిత్యాల, నిజామాబాద్ జిల్లాల నుండి మరి ఎక్కువగా ఉన్నట్లు తెలుస్తుంది. బతుకుతెరువు కొరకు అక్కడికి వెళ్ళిన అనేక బడుగు జీవుల బతుకులు ఆగమయ్యాయనేది, ఇక్కడి గ్రామాలలోని పేద కుటుంబాలను చూస్తే తెలుస్తుంది. పెద్ద దిక్కులేక పిల్లలు చాడుకోక, భార్య వారిని కట్టడి చేయలేక అనేక మంది పిల్లలు చెడు మార్గాలు పట్టిన సందర్భాలు అనేకం. అలాగే దోగా వీసాలతో వెళ్లి మోసపోయి, అక్కడి జైళ్ళలో గడుపుతున్నవారి సంఖ్య కూడా తక్కువేమీ కాదని అంటున్నారు. గతంలో అన్నీ రాజకీయ పార్టీలు, నాయకులు, ప్రజాప్రతినిధులు వీరి బాటుకులను బాగుచేస్తామని, వీరికి శిక్షణ ఇచ్చి మరీ గల్ఫ్ దేశాలకు పంపే ఏర్పాట్లు చేస్తామని హామీలు ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం కూడా వీరిని పట్టించుకోవడం లేదు.
ఇక్కడ బతకాలేమని, గల్ఫ్ దేశాలకు వెళ్ళే వలస కూలీలు లేదా కార్మికులను తయారు చేయడంలో దేశం ఎలాంటి పెట్టుబడి పెట్టడం లేదు. కానీ ఎన్నో గొప్ప గొప్ప చదులు చాడుకొన్నామని, మరిన్ని పెద్ద చదువులకు వెళుతున్నామని అమెరికా లాంటి అభివృద్ధి చెందిన దేశాలకు వెళ్ళే వారికంటే వీరే దేశానికి ఎక్కువ లాభం చేకూరుస్తున్నారు. కానీ వీరిని పట్టించుకొనే దిక్కులేదు. ఆమెరికాల్వనో, ఇంగ్లాండ్ లోనో, ఆస్ట్రేలియాలోనో ఒక్కడు చనిపోతే, దేశంలోని మీడియా అంతా గవగగొలు పెడుతుంది. కానీ దాదాపు ప్రతి రోజు ఏదో ఒక గల్ఫ్ దేశంలో, ఏదో కారణంగా భారతీయ కార్మికుడు చనిపోవడమో, ప్రమాదానికి గురవడంవ జరుగుతుంది. తమ తప్పులేకున్నా, వేల మంది కార్మికులు జైల్లో ఉంటున్నారు. వీరి గురించి మాత్రం ఆ మేధావులకు, నాయకులకు పట్టింపు లేదు.
ఎన్నికలు వచ్చినపుడు మాత్రం అందరూ వీరి గురించి ఉపన్యాసాలు, హామీలు ఇస్తారు. గతం ప్రభుత్వం గల్ఫ్ కార్మికులకు ఏర్పాటు; చేసిన భఏమా సౌకర్యం కూడా ఇప్పుడు లేదట, కానీ వీరు పంపే విదేశీ మారకం మాత్రం కావాలి. ప్రపంచంలో ఉన్న భారతీయులు మన దేశానికి పంపే విధేశీ మారకంలో దాదాపు 60 శాతం గల్ఫ్ కార్మికుల చామటోడ్చిన సంపాదనే అంటే అతిశయోక్తి కాదు. కానీ వారి గురించి ఎవరికి పట్టదు. ఎందుకంటే bbఆరిలో 90 శాతం బహుజన, బీసీ బిడ్డలే. రాష్ట్రంలోని బీఆర్ఎస్ ప్రభుత్వం, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం గత పదేళ్లలో గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిన నేపథ్యంలో... గల్ఫ్ కార్మికుల హక్కుల కోసం శాసన మండలిలో, వివిధ వేదికలలో వారి గొంతుకగా పోరాటం చేసిన జీవన్ రెడ్డి ఈ ఎన్నికల్లో 'గల్ఫ్ ఓటు బ్యాంకు' పై ఆశలు పెట్టుకున్నారు.
భారత దేశంలోని 543 లోక్ సభ నియోజకవర్గాలలో అధిక గల్ఫ్ వలసలు ఉన్న పార్లమెంట్ నియోజకవర్గాలలో నిజామాబాద్ కూడా ఒకటి. ఈ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు ఉపాధి కోసం వెళ్ళేవారిలో 99 శాతం పురుషులే. మహిళల వలస అత్యల్పం. నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గం పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో నిజామాబాద్ అర్బన్ (బీజేపీ), ఆర్మూర్ (బీజేపీ), నిజామాబాద్ రూరల్ (కాంగ్రెస్), బోధన్ (కాంగ్రెస్), బాల్కొండ (బీఆర్ఎస్), కోరుట్ల (బీఆర్ఎస్), జగిత్యాల (బీఆర్ఎస్) ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2024 ఫిబ్రవరి 8న ఎలక్షన్ కమీషన్ ప్రకటించిన గణాంకాల ప్రకారం నిజామాబాద్ పార్లమెంట్ లో 7,99,458 మంది పురుషులు, 8,90,411 మంది మహిళలు,1,088 ట్రాన్స్ జెండర్లు మొత్తం 16,89,957 మంది ఓటర్లు ఉన్నారు.
గల్ఫ్ ఓటు బ్యాంకు
గల్ఫ్ దేశాలలో పనిచేస్తున్న ఒక వలస కార్మికుడు, ఇండియాలో ఉన్న తన కుటుంబ సభ్యులలో కనీసం ఇద్దరినీ ప్రభావితం చేస్తాడని అంచనా. గత పదేళ్లలో గల్ఫ్ దేశాల నుంచి వాపస్ వచ్చి గ్రామాలలో నివసిస్తున్న ఒక కార్మికుడు, కనీసం తాను ఒక్కడైనా ప్రభావితం అవుతాడని మరో అంచనా. ఈ విశ్లేషణ ప్రకారం గల్ఫ్ దేశాలలో ఉన్న కార్మికుల కుటుంబ సభ్యులు, గల్ఫ్ రిటనీలు కలిసి నిజామాబాద్ లోక్ సభ నియోజకవర్గంలో 3,75,255 ఓటు బ్యాంకు ఉన్నదని అంచనా. ఇది మొత్తం ఓట్లలో 22.21 శాతం. అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా గల్ఫ్ ఓటు బ్యాంకు: నిజామాబాద్ అర్బన్ 46,286 (15.45%), నిజామాబాద్ రూరల్ 59,303 (23.33%), బోధన్ 42,243 (19.09%), ఆర్మూర్ 54,946 (26.07%), బాల్కొండ 58,237 (25.85%), కోరుట్ల 57,965 (23.75%). జగిత్యాల 56,275 (23.99%).
ఇక్కడ కాంగ్రెస్, బీజేపీ, బీఆర్ఎస్ పార్టీల మధ్య త్రిముఖ పోటీ ఉంటుంది. బీజేపీ తన అభ్యర్థిగా సిట్టింగ్ ఎంపీ ధర్మపురి అరవింద్ ను ప్రకటించింది. నిజామాబాద్ రూరల్ మాజీ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ ను బీఆర్ఎస్ తన అభ్యర్థిగా ప్రకటించింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన బీఆర్ఎస్ అభ్యర్థి కల్వకుంట్ల కవిత ఈసారి రంగంలో లేకపోవడం, ఢిల్లీ లిక్కర్ స్కాంలో తీహార్ జైలులో ఉండటం వలన బీఆర్ఎస్ శ్రేణుల్లో ఉత్సాహం తగ్గింది. కాంగ్రెస్ అభ్యర్థిగా ఎమ్మెల్సీ టి. జీవన్ రెడ్డిని మార్చి 27న ప్రకటించారు.
ప్రధాన పోటీ మాత్రం కాంగ్రెస్ - బీజేపీ ల మధ్యనే ఉంటుందనే అభిప్రాయం వ్యాపించింది. గల్ఫ్ దేశాలలో బీజేపీ అనుబంధ సంఘాలు చురుకుగా ఉన్నాయి. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల తర్వాత బీఆర్ఎస్ ఎన్నారై విభాగం డీలా పడింది. భారత జాగృతి అన్ని కమిటీలను కల్వకుంట్ల కవిత రద్దు చేశారు. గత పదేళ్లుగా కొంత చురుకుగా, కొంత నిద్రావస్థలో ఉన్న ప్రవాసీ కాంగ్రెస్ శ్రేణులు ఇప్పుడు రెట్టించిన ఉత్సాహంతో పనిచేస్తున్నారు.
టీఆర్ఎస్ కు దూరమైన 'గల్ఫ్'
2015 జూన్ లో బహ్రెయిన్ లో కార్మికులతో సహపంక్తి భోజనాలు చేసిన సందర్భంలో అప్పుడు నిజామాబాద్ ఎంపీగా ఉన్న కల్వకుంట్ల కవిత 'గల్ఫ్ నా ఎనిమిదో సెగ్మెంట్' అని ప్రేమగా చెప్పుకున్నారు. తెలంగాణ ప్రభుత్వం గల్ఫ్ కార్మికుల సంక్షేమాన్ని విస్మరించడంతో.. గల్ఫ్ కార్మికుల కుటుంబాలు తమ కోపాన్ని చూపించారు. ఫలితంగా 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కవిత పరాజయం పాలయ్యారు. ఒయాసిస్సులా ఉన్న ఆమె రాజకీయ జీవితం ఎండమావి గా మారడానికి గల్ఫ్ ఓటు బ్యాంకు ఒక కారణం అయింది.
2019 పార్లమెంట్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ను ముంచిన గల్ఫ్ తుఫాన్
2018 డిసెంబర్ లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో నిజామాబాద్ పార్లమెంట్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేలు గెలిచారు. రాష్ట్రంలో రెండోసారి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడింది. సరిగ్గా నాలుగు నెలల తర్వాత 2019 ఏప్రిల్ లో జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో సిట్టింగ్ టీఆర్ఎస్ ఎంపీ కల్వకుంట్ల కవిత ఓడిపోయారు, బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ గెలిచారు.
నాలుగు నెలల్లోనే ఓటర్లు అనూహ్యామైన, విభిన్నమైన తీర్పు ఇవ్వడానికి గల ప్రధాన కారణాలలో గల్ఫ్ కార్మికుల సమస్య ఒక ప్రధాన కారణం అని తేలింది. టీఆర్ఎస్ రెండోసారి అధికారంలోకి వచ్చి నాలుగు నెలలు అయినా గతంలో ఇచ్చిన ప్రధానమైన హామీలు గల్ఫ్ మృతులకు రూ.5 లక్షల ఎక్స్ గ్రేషియా ఇవ్వకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమానికి రూ.500 కోట్ల బడ్జెట్ కేటాయించకపోవడం, సమగ్ర ఎన్నారై పాలసీ ప్రకటించకపోవడం, గల్ఫ్ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయకపోవడం గల్ఫ్ కార్మికుల కోపానికి కారణమైంది.
చాలా మంది గల్ఫ్ కార్మికుల పేర్లు రేషన్ కార్డుల నుండి, ఓటర్ లిస్టుల నుంచి తొలగించడం, దూర దేశాల నుంచి వచ్చి ఓటెయ్యలేరు అనే కేసీఆర్ తిరస్కార భావన పట్ల గల్ఫ్ కార్మికులు అగ్గిమీద గుగ్గిలం అయ్యారు. టీఆర్ఎస్ పై తమ కోపాన్ని తీర్చుకోవడానికి బీజేపీ సరైన ప్రత్యర్థి అని వారు భావించి తమ కుటుంబ సభ్యుల ద్వారా బీజేపీ అభ్యర్థులకు ఓటు వేయాలని స్మార్ట్ ఫోన్ ల ద్వారా ప్రచారం చేశారు. కొందరికి కాంగ్రెస్ పై అభిమానం ఉన్నా అప్పుడు గెలిచే పరిస్థితి లేనందున బీజేపీ వైపే మొగ్గు చూపారు.
ఈ సారి మాత్రం కాంగ్రెస్ పార్టీ గల్ఫ్ వోట్లను నమ్ముకోండి. గతంలో గెలిచిన బి ఆర్ ఎస్, బిజేపి అభ్యర్థులు ఎవరు కూడా తమకు న్యాయం చేయలేదని వీరు నమ్ముతున్నారు. బిజేపి, బి ఆర్ ఎస్ అభ్యర్థులు ఇద్దరు బీసీలే. అయినా వారిని కాదని కాంగ్రెస్ కు ఎందుకు వోటు వేయాలనే చర్చ గల్ఫ్ కారికుల కుటుంభలలో జరుగున్నట్లు తెలుస్తుంది. ఎవరు గెలిచినా, తమ బతుకుల్లో వెలుగు రావడమే ప్రధానంగా చూస్తున్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవగ్రహ పూజా అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో... కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం
కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్... సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి... ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత... ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో సిద్ధార్థ విద్యా సంస్థల ప్రభంజనం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)
పట్టణంలోని సిద్ధార్థ విద్యా సంస్థలు మరోసారి తమ ప్రతిభను చాటుకుంటూ SSC ఫలితాలలో రాష్ట్ర స్థాయిలో అద్భుత విజయాన్ని సాధించాయి.
ఈరోజు విడుదలైన పదవ తరగతి పరీక్షా ఫలితాలలో రాష్ట్ర స్థాయి లో 591, 590 మార్కులతో జిల్లా స్థాయిలో మొదటి స్థానంలో నిలిచారు. అదే విధంగా... పుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా ఏర్పాటు చేయాలి-రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి ఏప్రిల్ 28 (ప్రజా మంటలు)
రానున్న 2027 గోదావరి పుష్కరాల ఏర్పాట్లపై సమీక్షపుష్కరాలకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం లేకుండా ఏర్పాట్లు చేయాలని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు.2027లో జరగనున్న గోదావరి పుష్కరాల ఏర్పాట్ల నేపథ్యంలో చేపట్టాల్సిన భూసేకరణ (ల్యాండ్ అక్విజిషన్) మరియు దేవాలయ అభివృద్ధి పనులపై టెంపుల్ మాస్టర్... రాష్ట్ర ప్రభుత్వం వాసవి మాత జయంతి ప్రభుత్వ పరంగా నిర్వహించడం హర్షణీయం... - ఎమ్మెల్యే సంజయ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 26 (ప్రజా మంటలు)
శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి మాతా జయంతి సందర్భంగా జగిత్యాల పట్టణం లో ఆర్య వైశ్య సంఘం ఆద్వర్యం లో జయంతి వేడుకల్లో పాల్గొని పోచమ్మ ఆలయం నుండి వాసవి మాత ఆలయానికి వాసవి కన్యకా పరమేశ్వరి మాతని పల్లకిలో తీసుకొచ్చే కార్యక్రమంలో పాల్గొని పల్లకి మోసి ప్రత్యేక... ఘనంగా వాసవీ మాత జయంతి వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు) జిల్లాలోని కలెక్టరేట్ కార్యాలయంలో జిల్లా యువజన మరియు క్రీడల శాఖ ఆధ్వర్యంలో వాసవీ మాత జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి. ఎస్.లత పాల్గొన్నారు.*ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ రెవెన్యూ బి.ఎస్.లత మాట్లాడుతూ* వాసవీ మాత
ఈత సరదాకు వెళ్ళి ప్రాణాల మీదికి తెచ్చుకోవద్దు
బుగ్గారం ఏప్రిల్ 26 ( ప్రజా మంటలు) సర్పంచ్ లు గ్రామాలలో టామ్ - టామ్ చేయించాలి
బుగ్గారం ఎస్సై జి.సతీష్
వేసవి కాలం కదా అని ఈత సరదాతో బావుల్లోకి, చెరువుళ్ళోకి వెళ్ళి ప్రాణాల మీదకి తెచ్చుకోవద్దని జగిత్యాల జిల్లా బుగ్గారం ఎస్సై జి.సతీష్ అన్నారు. ఆదివారం ఆయన సోషల్ మీడియా వేదికగా ఒక... పెళ్లి వేడుకలో విషాదం – సరదా ఈత ప్రాణం తీసింది… 13 ఏళ్ల బాలుడు మృతి
గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజా మంటలు):
పెళ్లి వేడుకలో పాల్గొన్న అనంతరం సరదాగా ఈతకు వెళ్లిన బాలుడు దురదృష్టవశాత్తు ప్రాణాలు కోల్పోయిన ఘటన జగిత్యాల జిల్లాలో విషాదాన్ని నింపింది.బుగ్గారం మండలం బీర్సాని గ్రామానికి చెందిన కాంపెళ్లి రితేష్ (13) గొల్లపల్లి మండలం లోతునూరు గ్రామంలో జరిగిన వివాహ వేడుకకు హాజరయ్యాడు. మధ్యాహ్న సమయంలో స్నేహితులతో... ఘనంగా సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు
.
జగిత్యాల ఏప్రిల్ 26( ప్రజా మంటలు)వాల్మీకి ఆవాసం సేవాభారతి అధ్వర్యంలో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలను ఆదివారం ఉదయం 11 గంటలకు ఘనంగా నిర్వహించారు.
జగిత్యాల పట్టణం ధరూర్ క్యాంపులో గ్రామీణ నిరుపేద విద్యార్థుల కోసం నిర్వహిస్తున్న వాల్మీకి ఆవాసంలో ప్రతి సంవత్సరం వేసవి సెలవుల అనంతరం సామూహిక సత్యనారాయణ స్వామి... 