హిందువులపై దాడిని సహించం: బజరంగ్ దళ్
- " హిందూ శక్తి ప్రదర్శన" యాత్రలో లక్షలాదిగా పాల్గొనాలని పిలుపు - విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్..
(సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493)
హైదరాబాద్ మార్చి 28 (ప్రజా మంటలు) :
"తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే హిందువులపై దాడులు పెరిగిపోయాయని.. దాడులు, దౌర్జన్యాలను ఎట్టి పరిస్థితుల్లో సహించబోము" అని భజరంగ్ దళ్ హెచ్చరించింది.
రాష్ట్రంలో ఓటు బ్యాంకు రాజకీయాలకు ప్రాధాన్యం కల్పిస్తూ..ముస్లిం సంతుష్టికరణకు పాల్పడుతున్నారని.. ఇది ప్రజాస్వామ్యానికే గొడ్డలి పెట్టు అని ఆందోళన వ్యక్తం చేసింది.
మతమార్పిడి, లవ్ జిహాద్, దేవాలయాల భూముల కబ్జా, గోహత్య వంటి అనేక హిందూ వ్యతిరేక కార్యక్రమాలు పెరిగిపోయాయని ఆందోళన వ్యక్తం చేసింది.
బుధవారం బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్ లో బజరంగ్ దళ్ విలేకరుల సమావేశం నిర్వహించింది.
విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యదర్శి శ్రీ పండరీనాథ్, బజరంగ్ దళ్ రాష్ట్ర కన్వీనర్ శ్రీ శివరాములు మాట్లాడారు.
అంతకుముందు హనుమాన్ జయంతి సందర్భంగా నిర్వహించే వీర హనుమాన్ విజయ యాత్ర వాల్ పోస్టర్, కరపత్రం ఆవిష్కరించారు.
ఏప్రిల్ 23న భాగ్యనగర్ లో భారీ ఎత్తున హనుమాన్ జయంతి కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వారు పేర్కొన్నారు. వీర హనుమాన్ విజయ యాత్ర ర్యాలీలో దాదాపు మూడు లక్షల మంది బజరంగ్దళ్ కార్యకర్తలు పాల్గొని హిందూ శక్తి ప్రదర్శన నిర్వహిస్తారని చెప్పారు. ఈ కార్యక్రమాన్ని దిగ్విజయం చేసేందుకు నగరంలోని హిందువులంతా సహకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.
రాజకీయ పార్టీలకు అతీతంగా ప్రతి హిందువు హనుమాన్ జయంతి మహోత్సవంలో పాల్గొనాలని ఆహ్వానించారు.
ఇటీవల కాలంలో భాగ్యనగర్ తో పాటు, రాష్ట్రంలోని పలు ప్రాంతాలలో హిందువులపై దాడులు రోజురోజుకు పెరిగిపోతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేశారు. దాడులను అడ్డుకొని తగిన రీతిలో జవాబు చెప్పేందుకు బజరంగ్ దళ్ సిద్ధంగా ఉందన్నారు.
భాగ్యనగరం శివారు ప్రాంతంలోని చెంగిచెర్ల పిట్టల బస్తీలో గిరిజనులపై ముస్లిం మూకల దాడిపై రాష్ట్ర ప్రభుత్వం స్పందించకపోవడం దుర్మార్గమన్నారు.
ఫిర్యాదు చేయడానికి పోలీస్ స్టేషన్ కు వెళ్లిన బాధితులపైనే పోలీసులు దాడి చేసి అరెస్టు చేసి రిమాండ్ కు పంపడం ప్రజాస్వామ్య వ్యవస్థలో చీకటి అధ్యయనం అన్నారు. అన్ని మతాలకు సమానమని చెప్పుకునే భాగ్యనగరం నడిబొట్టున చంటి బిడ్డను ఎత్తుకున్న యువకుడి పై జిహాదీ మూకలు దాడికి దిగడం అమానవీయ చర్య అన్నారు. దాడికి పాల్పడిన వారిపై కఠినమైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేసినా ఇప్పటికీ పోలీసులు స్పందించకపోవడం చూస్తుంటే, తెలంగాణలో రాజాకార్ల రాజ్యం ప్రారంభమైందని రుజువు అవుతుందన్నారు. నగరం మొత్తం సీసీ కెమెరాలతో నింపేసి, చీమచిటుక్కుమన్నా నిందితులను, దోషులను కఠినంగా శిక్షిస్తామని చెప్పే పోలీసులు.. చార్మినార్ దగ్గర జరిగిన ఘటన, చెంగిచెర్ల ఘటనల పై ఇంకా నిందితులపై కేసులు నమోదు చేయకపోవడం హిందూ వ్యతిరేక చర్యా అని బజరంగ్ దళ్, విశ్వహిందూ పరిషత్ నేతలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
హిందువుల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా కొన్ని శక్తులు తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయని.. వాటికి తగిన రీతిలో జవాబు చెప్పేందుకు హిందూ సమాజం సిద్ధంగా ఉండాలని వారు సూచించారు. హిందువుల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అయోధ్యలో భవ్యమైన రామ మందిరం నిర్మించుకున్నామని..
ఇక నేడు రామరాజ్యం కోసం హిందూ సమాజం సంఘటితం కావలసిన అవసరం ఆసన్నమైందని పేర్కొన్నారు. సంఘటితమైతేనే హిందూ వ్యతిరేక శక్తులు తోక ముడుస్తాయని, లేదంటే వారి ఆగడాలు రోజురోజుకు పెరిగిపోతాయని పేర్కొన్నారు.
బజరంగ్దళ్ చేపట్టే వీర హనుమాన్ విజయ యాత్రలో భారీ సంఖ్యలో పాల్గొని హిందూ శక్తిని ప్రదర్శిద్దామని వారు పిలుపునిచ్చారు.
సమావేశంలో విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర ఉపాధ్యక్షులు జగదీశ్వర్, ప్రచార ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, భాగ్యనగర్ విభాగ్ కార్యదర్శి వీరేశలింగం , బజరంగ్దళ్ నాయకులు బిరాధర్ రాము, శ్రీకాంత్, రాహుల్ తోపాటు జిల్లా కన్వీనర్లు, కో కన్వీనర్లు, ఇతర బాధ్యులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మెహదీపట్నం రైతు బజార్‌ను సందర్శించిన కవిత – మోడ్రన్ మల్టీ లెవల్ మార్కెట్‌గా అభివృద్ధి చేయాలని డిమాండ్
మెహందీపట్నం డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
మెహదీపట్నం రైతు బజార్‌ను తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు సందర్శించారు. ఈ సందర్భంగా రైతుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వచ్చే రైతులకు కనీస సదుపాయాలు కూడా లేవని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. బోర్డు లేకపోవటంతో చాలా మందికి ఇది రైతు... ప్రజాస్వామ్య బలోపేతానికి ఓటే ఆయుధం: మాజీ మంత్రి రాజేశం గౌడ్
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా అంతర్గాం గ్రామంలోని ప్రభుత్వ పాఠశాల పోలింగ్ కేంద్రంలో మాజీ మంత్రి, తెలంగాణ రాష్ట్ర తొలి ఆర్థిక సంఘం చైర్మన్ జి. రాజేశం గౌడ్ గారు సతీమణి శ్యామలాదేవితో కలిసి ఓటు హక్కును వినియోగించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ప్రతి పౌరుడు తప్పనిసరిగా ఓటు... సీసీ కెమెరాల నూతన నైపుణ్యాలపై భారత్ భవన్‌లో ముగిసిన మూడు రోజుల ప్రదర్శనలు
ఢిల్లీ డిసెంబర్ 14 (ప్రజా మంటలు)ఢిల్లీలో ప్రతి ఏటా సీసీ కెమెరాలపై ఎప్పటికప్పుడు వస్తున్న నూతన పోకడలు వాడే ఉపకరణాలపై ప్రదర్శనలు నిర్వహిస్తారు ఇదిలా ఉండగా ఈనెల 11 12 13 తేదీలలోభారత్ భవన్ మంటపం లో ప్రదర్శనలు నిర్వహించారు.
దీనిలో ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ద్వారా రోబోలు సెక్యూరిటీగా వ్యవహరించడం... ఒక ప్రత్యామ్నాయ సంస్కృతి : ప్రజా కళాకారులు, గ్రంథాలయాలు
నేటి ఆధునిక ప్రపంచానికి దూరంగా,.. నిజమైన ప్రజా ప్రతినిధులతో....
ఈనెల 13న రంగవల్లి విజ్ఞాన కేంద్రం( గ్రంథాలయం) వార్షికోత్సవం వేములవాడ దగ్గర మరియు ఆమె 26వ వర్ధంతిని పురస్కరించుకొని ఒక సమావేశం రంగవల్లి విజ్ఞాన కేంద్రం కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. అందులో నన్ను "ప్రజా గ్రంధాలయాల ఆవశ్యకత" ' విమల మిగతా ముఖ్యులు
సభ... 493 ఓట్ల మెజారిటి తో రాజగోపాల్ రావు విజయం
బీర్పూర్, డిసెంబర్, 14( ప్రజా మంటలు )
బీర్పూర్ మండలం తుంగూర్ గ్రామస్టులు రాజగోపాల్ రావు 30 ఏళ్ల తర్వాత కూడా మళ్లీ ఓటేసి అక్కున చేర్చుకున్నారు.
35 ఏళ్ల నాడు ఆ గ్రామంలో ప్రజాప్రతినిధి కావడం..అప్పటి పరిస్థితులకు ఇబ్బంది పడ్డ ఆయన ఎంతో ఆవేదనతో ఊరు విడిచి వెళ్లిపోయారు. దీంతో మళ్లీ వచ్చి ఆయన... జగిత్యాల జిల్లాలో 2వ విడత గ్రామపంచాయతీ ఎన్నికలు పూర్తి
జగిత్యాల (రూరల్) డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లాలో గ్రామపంచాయతీ ఎన్నికల రెండో విడత పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. 7 మండలాల్లో కలిపి మొత్తం 2,08,168 ఓట్లు ఉండగా 1,63,074 ఓట్లు పోలవ్వడంతో 78.34 శాతం పోలింగ్ నమోదు అయ్యింది. బీర్పూర్, జగిత్యాల, జగిత్యాల రూరల్, కొడిమ్యాల, మల్యాల, రాయికల్, సారంగాపూర్ మండలాల్లో ఆదివారం... ఒకే కుటుంబం నుండి ముగ్గురు వార్డు సభ్యుల గెలుపుపై గ్రామస్తుల హర్షం
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లాలో జరిగినరెండో విడత పంచాయతీ ఎన్నికల్లో ఒకే కుటుంబం నుండి ముగ్గురు గెలిచిన సంఘటన గ్రామస్తులను ఆశ్చర్యానికి గురి చేసింది. ఆ కుటుంబం పైన ప్రజలకు విశ్వాసం వెరసి ఒకే కుటుంబం నుండి ముగ్గురు అభ్యర్థులు గెలవడం ఆ కుటుంబం పై ఉన్న విశ్వాసం అని గ్రామస్తులు... ఎంటర్టైన్మెంట్ కోసం గంటకు ₹10 కోట్లు ఖర్చు – సింగరేణి నిధులు దుర్వినియోగం
హైదరాబాద్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు):
"జాగృతి జనం బాట" కార్యక్రమంలో భాగంగా బషీర్‌బాగ్ ప్రెస్ క్లబ్లో నిర్వహించిన ప్రెస్మీట్లో తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. సీఎం గంట ఎంటర్టైన్మెంట్ కోసం పది కోట్ల రూపాయలు ఖర్చు చేశారని, అది కూడా సింగరేణి కార్మికుల... రెండో విడత 7 మండలాల్లోని గ్రామపంచాయతీ ఎన్నికలు ప్రశాంతం
జగిత్యాల డిసెంబర్ 14 (ప్రజా మంటలు)జిల్లాలో రెండో విడత నిర్వహించిన గ్రామపంచాయతీ పోలింగ్ కేంద్రాలను జిల్లా కలెక్టర్ బి సత్యప్రసాద్ సందర్శించి పోలింగ్ సరళిని అడిగి తెలుసుకున్నారు. ఆయనతోపాటు జగిత్యాల ఆర్డీవో మధుసూదన్ గౌడ్ డిపిఓ రఘువరన్ తదితరులు ఉన్నారు. ఇదిలా ఉండగా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా జిల్లా ఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు... రెండో విడత గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే గెలుస్తారు ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్
జగిత్యాల రూరల్ డిసెంబర్ 14 (ప్రజా మంటలు) మండలం అంతర్గాం గ్రామంలో ఎమ్మెల్యే సంజయ్ కుమార్ దంపతులు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు.సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం మద్దతు ఇచ్చిన అభ్యర్థులే ఎక్కువ శాతం గెలుస్తారని ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు.జగిత్యాల నియోజకవర్గంలో... సత్యమే గెలుస్తుంది – ఓట్ల చోరీకి వ్యతిరేకంగా కాంగ్రెస్ పోరాటం : రాహుల్ గాంధీ
న్యూ డిల్లీ డిసెంబర్ 14:
“సత్యమనే నినాదంతో మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వాన్ని గద్దెదించుతాం” అని కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ స్పష్టం చేశారు. అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఓట్ల చోరీకి పాల్పడుతోందని, ఆ ప్రక్రియలో ఎన్నికల సంఘం (EC) కూడా కేంద్రంతో చేతులు కలిపి పనిచేస్తోందని ఆయన తీవ్ర ఆరోపణలు చేశారు.
ఓట్ల... 