కాంగ్రెస్ నేతలకు షుగర్ ఫ్యాక్టరీ ఒక ఎన్నికల స్టంట్. చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డీ మాటలు.
- ఎంపి అభ్యర్థి బాజిరెడ్డి గోవర్దన్ రెడ్డి.
(సిరిసిల్ల. రాజేంద్ర శర్మ - 9348422113/9963349493).
జగిత్యాల జిల్లామార్చి 26(ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణ బి యల్ యన్ గార్డెన్స్ లో జగిత్యాల రూరల్,అర్బన్ మండల ముఖ్య కార్యకర్తల మరియు జగిత్యాల పట్టణ దేవి శ్రీ గార్డెన్స్ లో జగిత్యాల పట్టణ ముఖ్య కార్యకర్తల సమావేశానీకి హాజరై కార్యకర్తల్ని ఉద్దేశించి మాట్లాడుతూ..... నిజామాబాద్ పార్లమెంట్ లో గులాబీ జెండా ఎగరేయాలని,పార్లమెంట్ లో తెలంగాణ వాణి నీ వినిపించాలంటే బి అర్ ఎస్ గెలవాలని,కాంగ్రెస్ బీజేపీ డూప్లికేట్ పార్టీలు అని,అరచేతిలో స్వర్గం చూపే పార్టీ కాంగ్రెస్,బి అర్ ఎస్ పార్టీ నీ ఎన్నికల్లో ఎదుర్కోలేక నే తప్పుడు కేసులు,అరవింద్ ఒక సోషల్ మీడియా యాక్టర్ అని,ప్రజల చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డి మాటలు, గెలిప్తే ఈప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా బి అర్ ఎస్ నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి బాజిరెడ్డి గోవర్ధన్ రెడ్డి , జిల్లా పార్టీ అధ్యక్షులు కల్వకుంట్ల విద్యా సాగర్ రావు ,జిల్లా పరిషత్ చైర్మన్ దావా వసంత సురేష్ ,మాజీ మంత్రి రాజేశం గౌడ్.ఈ కార్యక్రమంలో పట్టణ,మండల పార్టీ అధ్యక్షులు గట్టు సతీష్, బాల ముకుందం,ఎంపీపీ సంధ్యారాణి సురేందర్ నాయక్, జడ్పీటీసీ మహేష్,వైస్ చైర్మన్ గోలి శ్రీనివాస్,మాజీ ఎ యం సి ఛైర్మెన్ రాధ రవీందర్ రెడ్డీ,దశరథ రెడ్డి,శీలం ప్రియాంక ప్రవీణ్,యూత్ అధ్యక్షులు సురేందర్ రెడ్డి, కత్రోజ్ గిరి,మహిళ అధ్యక్షురాలు కచ్చు లత,
మాజీ సర్పంచులు,కౌన్సిలర్ లు,ఎంపీటీసీ లు, నాయకులు,యూత్ నాయకులు,మహిళ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
ఎమ్మేల్యే డా.సంజయ్ మాట్లాడుతూ.... జగిత్యాల పట్టనము,రూరల్ మండలం లో బి అర్ ఎస్ పార్టీ కి మెజారిటీ ఇచ్చి ఇక్కడి నాయకులు గెలుపు లో ప్రముఖ పాత్ర వహించారు...
పార్టీ కార్యకర్తలకు ఎల్లప్పుడూ వెన్నంటి ఉంటా...
రాజకీయం నా వృత్తి వైద్యం నా ప్రవృత్తి అని అన్నారు...
వేరే పార్టీ లకు వెళ్ళే ఆలోచన లేదని,వట్టి పుకార్లు మాత్రమే అని,కెసిఆర్ నాయకత్వం లో పనిచేసి ఎంపి స్థానం గెలిపిస్తం అని అన్నారు...
ప్రతి పక్ష నాయకుడు నియోజకవర్గ అభివృద్ధికి నిధులు మంజూరు కోసం ముఖ్యమంత్రి నీ కలవడం పరిపాటి అని అన్నారు. కాళేశ్వరం దండగా అన్న నాయకులు నేడు 30 లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయే పరిస్తితికి కారణం...
మిషన్ భగీరథ ద్వారా 30 సం,రాలు మూలకు పడ్డ ధరూర్ క్యాంపు ట్యాంక్ ను బాగు చేసుకున్నాం...
900 మీటర్లు యావర్ రోడ్డు వెడల్పు చేశాం,అండర్ గ్రౌండ్ డ్రైనేజీ ఏర్పాటు చేశాం అని అన్నారు...
4500 డబల్ బెడ్ రూం ఇండ్ల ను నిర్మించామని అన్నారు...
కొన్ని మౌలిక సదుపాయాలు కల్పన మిగిలి ఉందని,నిదులు కూడా మంజూరు అయ్యాయని అన్నారు..
కాళేశ్వరం ప్రాజెక్ట్ లో పిల్లర్ రిపేర్ చేయకపోవడం వల్ల నేడు వేసవిలో నీటి కొరత వచ్చే పరిస్తితి ఉంది అని అన్నారు...
పంటలు ఎండితే కాంగ్రెస్ ప్రభుత్వం కారణం అని అన్నారు.
ఎంపి అభ్యర్థి బాజీ రెడ్డి మాట్లాడుతూ....
ప్రజలకు ఏమి చేయని అరవింద్ కు ఎందుకు ఓటు వేయాలి.
అరవింద్ మండలంలో ఏ ప్రాంతం లో తిరిగాడు,ప్రజల కష్టాలు చూసారా,కనీసం నిదులు మంజూరు చేశారా అని ప్రశ్నించారు...
ఎంపి నీ చేసింది ప్రజలకు ఆ ప్రాంతం అభివృద్ధి చేయాలని,అంతే కానీ కెసిఆర్ ,కవిత నీ తిట్టడానికి కాదు అని అన్నారు..
షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తమని శ్రీదర్ బాబు,జీవన్ రెడ్డి అంటున్నారు.అని,ఫ్యాక్టరీ పాత డోర్ లు తెరవడం తప్ప వారు చేసేది ఏమీ లేదు అని ఎద్దేవా చేశారు.ప్రజలకు చెవిలో పువ్వులు పెట్టే విధంగా జీవన్ రెడ్డీ మాటలు...వారికి షుగర్ ఫ్యాక్టరీ గురించి మొత్తం తెలుసు..గతంలో వారు సభ్యులు గా ఉన్నారు.
మోసపూరిత మాటలు చెప్పే నాయకుల పట్ల నాయకులు,ప్రజలు అప్రమత్తంగా ఉండాలి.గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ గా ఉండి ప్రశ్నించే గొంతుక అని చెప్పి నిరుద్యోగుల ను మోసం చేశారు అని అన్నారు.ఇందిరమ్మ రాజ్యం లో రుణ మాఫీ చేస్తామని రేవంత్ హామీ ఇచ్చి,రైతులను మోసం చేస్తున్నారు అని అన్నారు.మేదిగడ్డ పిల్లర్ కుంగితే రిపేర్ చేసుడు మాని,
ఇసుక అమ్మకం చేయవచ్చు అని, నీరు లేకపంటలు పండక పోతే బోనస్ ఇచ్చుడు తప్పుతది అని కాంగ్రెస్ వక్ర పూరిత ఆలోచన..అరచేతిలో స్వర్గం చూపే ప్రయత్నం కాంగ్రెస్ పార్టీది...
కాంగ్రెస్,బిజెపి లకు నాయకులు లేకా బి అర్ ఎస్ నుండి పార్టీ పిరాయించిన వారికి టికెట్ ఇస్తున్నారు.మాజీ ఎంపి కవిత నిజామాబాద్ పార్లమెంట్ కి ఎం చేసింది, ఎన్ని నిదులు మంజూరు చేసింది ప్రజలకు తెలుసు.ఎన్నికల్లో బి అర్ ఎస్ పార్టీ నీ ఎదుర్కొలేక నే రేవంత్,మోడీ ఇద్దరూ అక్రమ కేసులు నమోదు చేస్తున్నారు...కాంగ్రెస్,బిజెపి రెండు డూప్లికేట్ పార్టీలు.మోడీ, రాహుల్ ఇద్దరు ఢిల్లీలో కొట్లాడితే, రేవంత్ రెడ్డి మాత్రం బడే బాయి చోటే భాయ్ అని మోడీ నీ అంటున్నారు అని ప్రజలు గమనించాలని అన్నారు.నన్ను గెలిపిస్తే ఈ ప్రాంతం తరపున ప్రశ్నించే గొంతుక అవుతా,ప్రాంత అభివృద్ధికి కృషి చేస్తా అని అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే రాజకీయాల్లో కొనసాగుతా:?
జగిత్యాల / హైదరాబాద్ డిసెంబర్ 22 ప్రజా మంటలు:
జగిత్యాల నియోజకవర్గ ప్రజల చిరకాల కోరిక అయిన యావర్ రోడ్డు విస్తరణపై జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డితో సీఎం కార్యాలయంలో ప్రత్యేకంగా చర్చించారు.
ఈ సందర్భంగా యావర్ రోడ్డు విస్తరణ జరిగితేనే మళ్లీ రాజకీయాల్లో కొనసాగుతా అని ఎమ్మెల్యే... TDF-USA అట్లాంటా సహకారంతో పరమల ప్రభుత్వ స్కూల్ భవనం ప్రారంభం
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం (TDF) యూఎస్ఏ అట్లాంటా చాప్టర్ సౌజన్యంతో కామారెడ్డి జిల్లా లింగంపేట్ మండలం పరమల గ్రామంలో నూతన ప్రభుత్వ పాఠశాల భవనం, అదనపు క్లాస్‌రూమ్స్‌ను ప్రారంభించారు. టిడిఎఫ్–మన తెలంగాణ బడి ప్రాజెక్టులో భాగంగా తెలంగాణ డెవలప్మెంట్ ఫోరం అందించిన ఆర్థిక సహాయంతో ఈ నిర్మాణాలు పూర్తయ్యాయి.... గద్వాల జిల్లా ప్రజల సమస్యలపై కవిత ఘాటు ప్రశ్నలు
జోగులాంబ గద్వాల జిల్లా డిసెంబర్ 21(ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో చేపట్టిన జనం బాట కార్యక్రమంలో భాగంగా తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత గారు గద్వాల జిల్లాలో విస్తృతంగా పర్యటించారు. బీచుపల్లి బ్రిడ్జి వద్ద జాగృతి నాయకులు, నడిగడ్డ హక్కుల పోరాట సమితి నేతలు ఆమెకు ఘన స్వాగతం పలికారు. అనంతరం బీచుపల్లి... తిమ్మాపూర్ జడ్పీ హైస్కూల్‌లో అభివృద్ధి పనులకు శంకుస్థాపన
ధర్మపురి డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
ధర్మపురి మండలం తిమ్మాపూర్ గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో మాధవరం కృష్ణారావు – ఆండాళ్ దేవి ల జ్ఞాపకార్థం వారి కుమారుడు మాధవరం విష్ణు ప్రకాశరావు (అమెరికన్ తెలుగు అసోసియేషన్ కార్యవర్గ సభ్యులు) ఆధ్వర్యంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన జరిగింది. ఈ సందర్భంగా పాఠశాలలో... గాంధీ పేరు మార్పుపై కాంగ్రెస్ నిరసనలు అర్థరహితం : బీజేపీ నేత రాజేశ్వరి
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజామంటలు):
ఉపాధి హామీ పథకం పేరు మార్పును రాజకీయంగా మలిచి కాంగ్రెస్ నాయకులు చేస్తున్న నిరసనలు అర్థరహితమని బీజేపీ ఓబీసీ మోర్చా రజక సెల్ రాష్ట్ర కన్వీనర్ మల్లేశ్వరపు రాజేశ్వరి అన్నారు. ఆమె ఆదివారం సికింద్రాబాద్ లో మీడియాతో మాట్లాడుతూ..పథకం పేరు మారిందని గాంధీని అవమానించారంటూ చేస్తున్న ఆరోపణలు సిగ్గుచేటన్నారు.
ఉపాధి... నిరాశ్రయులకు స్కై ఫౌండేషన్ వారిచే దుస్తులు పంపిణి
సికింద్రాబాద్, డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
హైదరాబాద్ నగరంలో రోడ్ల పక్కన ఫుట్ పాత్ ల మీద జీవనం సాగిస్తున్న నిరాశ్రయులు, సంచారజాతుల కుటుంబాలకు స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో దుస్తులు కార్యక్రమము నిర్వహించారు.
సామాజిక బాధ్యతతో నిరంతరం విభిన్న సేవ కార్యక్రమాలు కొనసాగిస్తున్నారు. దుస్తులు అందుకున్న నిరాశ్రయులు, సంచారజాతులవారు స్కై ఫౌండేషన్ కి కృతఙ్ఞతలు ఎల్కతుర్తి మండల సర్పంచ్ ల ఫోరం అధ్యక్షుడిగా పుల్లూరి శ్రీధర్ రావు ఏకగ్రీవ ఎన్నిక
ఎల్కతుర్తి డిసెంబర్ 21 ప్రజా మంటలు
ఎల్కతుర్తి మండలంలోని నూతన సర్పంచుల ఐక్యతకు ప్రతీకగా సర్పంచ్ ల ఫోరం కమిటీని ఏర్పాటు చేయగా ఆ కమిటీ అధ్యక్షుడిగా వీరనారాయణపూర్ గ్రామానికి చెందిన పుల్లూరి శ్రీధర్ రావును సర్పంచులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.
ఎల్కతుర్తి మండల కేంద్రంలోని వ్యవసాయ మార్కెట్ కమిటీ భవన్ లో నిర్వహించిన సమావేశానికి, కాంగ్రెస్... యాక్సిడెంట్ కు గురైన వ్యక్తిని సిపిఆర్ చేసి ఆసుపత్రికి తరలించిన పోలీసులు
జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని న్యూ బస్టాండ్ చౌరస్తా వద్ద ఆగి ఉన్న ఆటోకు TVS XL అనే టూ వీలర్ పైన వస్తున్నటువంటి వ్యక్తి ఆదివారం సాయంత్రం యాక్సిడెంట్ గురి కాగా అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ పోలీసులు యాక్సిడెంట్స్ ని గమనించి అక్కడే డ్యూటీలో ఉన్న ట్రాఫిక్ జిల్లా కోర్ట్ లో జాతీయ లోక్ ఆదాలత్, అందరి సహకారంతోనే సత్ఫలితాలు : జిల్లా ప్రధాన న్యాయమూర్తి రత్న పద్మావతి
జగిత్యాల డిసెంబర్ 21 (ప్రజా మంటలు)రాజీ మార్గమే రాజ మార్గమని, పంతాలకు పట్టింపులకు పోయి సమయం, డబ్బు వృదా చేసుకొవద్దనీ, ఆదివారంనాటి జాతీయ లోక్ ఆదాలత్ ను సద్వినియోగం చేసుకుని, రాజీ కుదుర్చుకోవాలని తాము ఇచ్చిన పిలుపుమేరకు ఆదివారం ఉదయం 10-30 నుండి సాయంత్రం వరకు జిల్లా కోర్ట్ లో నిర్వహిస్తున్నజాతీయ లోక్... విద్యారంగం బలోపేతానికి ప్రజా ప్రభుత్వం కృషి — టీఆర్టీఎఫ్ విద్యా సదస్సులో ఐటీ శాఖ మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు
హైదరాబాద్ డిసెంబర్ 21 (ప్రజా మంటలు):
విద్యారంగం బలోపేతానికి రాష్ట్ర ప్రభుత్వం కృత నిశ్చయంతో ఉందని రాష్ట్ర ఐటీ పరిశ్రమల శాఖామాత్యులు దుద్దిళ్ల శ్రీధర్ బాబు స్పష్టం చేశారు. ఆదివారం హైదరాబాద్ నాగోల్ లో తెలంగాణ రాష్ట్ర టీచర్స్ ఫెడరేషన్ (టీఆర్టీఎఫ్) ఏర్పాటై ఎనిమిది దశాబ్దాలు పూర్తయిన సందర్భంగా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కటకం రమేశ్,... నదీ జలాల కోసం మరో ఉద్యమం అవసరం – పాలమూరు ద్రోహాన్ని మరచిపోం: కేసీఆర్
హైదరాబాద్, డిసెంబరు 21 (ప్రజా మంటలు ప్రత్యేక ప్రతినిధి):
సమైక్యాంధ్ర పాలనలో మహబూబ్‌నగర్ జిల్లా తీవ్ర వివక్షకు గురైందని బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు (KCR) సంచలన వ్యాఖ్యలు చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి పాలమూరు ప్రయోజనాలను కాలరాశాయని ఆయన ఆరోపించారు.
తెలంగాణ భవన్‌లో బీఆర్ఎస్ నేతలతో నిర్వహించిన విస్తృత... 