క్యాన్సర్ మరణశాసనం కాదు –మెగాస్టార్ చిరంజీవి
–కిమ్స్ హాస్పిటల్ లో ఇంటర్నేషనల్ క్యాన్సర్ డే
(పి కోటేశ్వర్)
సికింద్రాబాద్, పిబ్రవరి 04 ( ప్రజామంటలు) :
క్యాన్సర్ అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదని, ముందస్తుగా గుర్తిస్తే ఈ వ్యాధిని కూడా జయించి సాధారణ జీవితం గడపవచ్చని పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.
ఈ సందర్భంగా చిరంజీవి మాట్లాడుతూ క్యాన్సర్ అంటేనే జీవితం ముగిసిందన్న భయం ప్రజల్లో ఉందని, కానీ అనేక మంది క్యాన్సర్‌ను జయించి సాధారణ జీవితానికి తిరిగి వస్తున్నారని తెలిపారు. జీవనశైలి ఆధారంగానే అనేక వ్యాధులు వస్తున్నాయని, అందువల్ల ప్రతి ఒక్కరూ ఆరోగ్యంపై జాగ్రత్తలు పాటించాలని చిరంజీవి సూచించారు.
లక్షణాలు కనిపిస్తే ఆలస్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలని కోరారు. చిన్నారుల్లో కూడా క్యాన్సర్ కేసులు పెరుగుతుండటం ఆందోళనకరమని పేర్కొన్నారు.కార్యక్రమంలో సీనియర్ కన్సల్టెంట్ సర్జికల్ ఆంకాలజిస్ట్ డా. ముధు దేవరశెట్టి మాట్లాడుతూ.. గతంలో వయస్సు పైబడిన వారిలో ఎక్కువగా కనిపించిన క్యాన్సర్ ఇప్పుడు చిన్న వయసు వారిలోనూ వస్తోందన్నారు. జన్యుపరమైన లోపాలు, వంశపారంపర్య కారణాలు, రేడియేషన్ ప్రభావం, రసాయన పదార్థాల వినియోగం, మద్యం, ధూమపానం, ఒత్తిడి వంటి అంశాలు క్యాన్సర్‌కు ప్రధాన కారణాలుగా మారుతున్నాయని ఆయన తెలిపారు.
ప్రజల్లో అవగాహన లోపం కారణంగా చాలా మంది చివరి దశలోనే ఆసుపత్రులకు వస్తున్నారని చెప్పారు.క్యాన్సర్‌పై అవగాహన పెంచేందుకు కిమ్స్ హాస్పిటల్స్‌లో ‘క్యాన్సర్ ఫైట్ సపోర్ట్ గ్రూప్’ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. చికిత్స పొందిన రోగులు సమాజంలోకి వచ్చి ధైర్యం కలిగించేలా ఈ గ్రూప్ పనిచేస్తుందని వివరించారు.
ఆధునిక చికిత్సలతో క్యాన్సర్‌ను సమర్థవంతంగా ఎదుర్కొనే అవకాశం ఉందని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో కిమ్స్ మెడికల్ డైరెక్టర్ డా. సంబిత్ సాహు, మెడికల్ ఆంకాలజిస్ట్ డా. నరేందర్ కుమార్ తోట, క్యాన్సర్‌ను జయించిన వారు, చికిత్స పొందుతున్న రోగులు పాల్గొన్నారు.
––
More News...
<%- node_title %>
<%- node_title %>
మున్సిపల్ ఎన్నికల్లో బీసీలకు ప్రాధాన్యం ఇచ్చాం : జిల్లా BRS అధ్యక్షులు
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో జిల్లా బీఆర్‌ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు మాట్లాడారు. ఈ సందర్భంగా జిల్లాలోని జగిత్యాల, మెట్‌పల్లి, కోరుట్ల, రాయికల్, ధర్మపురి మున్సిపాలిటీలలో బీఆర్‌ఎస్ అభ్యర్థుల నామినేషన్ ప్రక్రియ పూర్తి చేసి బి-ఫారాలు అందజేశామని తెలిపారు. జనరల్ స్థానాల్లోనూ బీసీ... తెలంగాణ అధ్యయన కమిటీల సభ్యులతో కవిత
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన అధ్యయన కమిటీలతో నేటి నుంచి వరుస సమావేశాలు నిర్వహించనున్నారు. తెలంగాణ సమగ్రాభివృద్ధి, సబ్బండ వర్గాల వికాసం, సామాజిక తెలంగాణ సాధన లక్ష్యంగా 50 అధ్యయన కమిటీలను తెలంగాణ జాగృతి ఏర్పాటు చేసింది.
రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని బ్లూ ప్రింట్ రూపొందించే... “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనంపై హక్కుల కమీషన్ కేసు
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సభ్యులు (న్యాయ విభాగం) సివడి ప్రవీణ గారు, నమస్తే తెలంగాణ దినపత్రికలో 04.02.2026న ప్రచురితమైన “విద్యార్థులే.. స్వీపర్లు!” అనే వార్తా కథనాన్ని ఆధారంగా తీసుకొని స్వయంచాలక (సూవో-మోటు) విచారణ చేపట్టారు.
హైదరాబాద్‌లోని అనేక ప్రభుత్వ, ఎయిడెడ్ పాఠశాలల్లో స్వీపర్లు అందుబాటులో లేకపోవడంతో, 1వ... జగిత్యాల మున్సిపాలిటీ పోటీలో ఉన్న ప్రధాన పార్టీల అభ్యర్థులు
జగిత్యాల ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
బిఆర్ఎస్ - బీజేపీ | కాంగ్రెస్ మూడు ప్రధాన పార్టీల నుండి పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు, వార్డుల వారిగా..
వార్డు
రిజర్వేషన్
BRS
BJP
కాంగ్రెస్
1
BC(G)
నిమిషకవి వంశీకృష్ణ
పుప్పాల రాజేష్
అనిల్ కుమార్ కూసరి
2
UR(W)
వొడ్డినేని సంధ్య కుమారి
కాశెట్టి... ఐల్నేని ఆసుపత్రి వారి సౌజన్యముతో క్యాన్సర్ పై అవగాహన సదస్సు
జగిత్యాల ఫిబ్రవరి 4 (ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని వాల్మీకి ఆవాసం గీతావిద్యాలయం గ్రౌండ్ లో బుధవారం ప్రపంచ క్యాన్సర్ దినోత్సవం పురస్కరించుకొని అవగాహన కార్యక్రమం నిర్వహించారు. క్యాన్సర్ వలన అనారోగ్యము మరణాలు తగ్గించడమే అవగాహన యొక్క ముఖ్య లక్ష్యం అని వైద్యులు పేర్కొన్నారు. డా వంశీ చేతన ప్రముఖ ఆంకాలజిస్ట్, డా వినీల ,డా... క్యాన్సర్ మరణశాసనం కాదు –మెగాస్టార్ చిరంజీవి
(పి కోటేశ్వర్)
సికింద్రాబాద్, పిబ్రవరి 04 ( ప్రజామంటలు) :
క్యాన్సర్ అనేది దేవుడు ఇచ్చిన శాపం కాదని, ముందస్తుగా గుర్తిస్తే ఈ వ్యాధిని కూడా జయించి సాధారణ జీవితం గడపవచ్చని పద్మవిభూషణ్ మెగాస్టార్ చిరంజీవి అన్నారు. కిమ్స్ హాస్పిటల్స్ సికింద్రాబాద్ ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన అంతర్జాతీయ క్యాన్సర్ అవగాహన దినోత్సవ కార్యక్రమంలో ఆయన
ఈ... రూ.15 లక్షల లంచంతో తీసుకొంటూ పట్టుబడ్డ జీహెచ్ఎంసీ ఎస్‌ఈ
హైదరాబాద్, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
హైదరాబాద్ కూకట్పల్లి జీహెచ్ఎంసీ జోనల్ కార్యాలయంలో ఏసీబీ అధికారులు ఆకస్మిక దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సూపరింటెండింగ్ ఇంజనీర్ చిన్నారెడ్డి కాంట్రాక్టర్ నుంచి రూ.15 లక్షల లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు.
పెండింగ్‌లో ఉన్న బిల్లుల క్లియరెన్స్ కోసం లంచం డిమాండ్ చేసినట్లు ఏసీబీ వర్గాలు తెలిపాయి.... కేఎల్‌ఎస్‌ఆర్ ఇన్‌ఫ్రా: దివాళా కంపెనీకి వేల కోట్ల పనులు ఎలా? కెటిఆర్ ప్రశ్న
హైదరాబాద్ ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
దివాళా తీసినట్లు ప్రకటించిన కే ఎస్ ఎల్ ఆర్ ఇన్ఫ్రాటెక్ కాని 6వేల కోట్ల పనులను ఇచ్చిందని, ఇది cm రేవంత్ రెడ్డి బినామీ సంస్థ అని, బిఆర్ఎస్ కార్యనిర్వహక అధ్యక్షులు కేటీఆర్ పత్రిక సమావేశంలో ఆరోపించారు. ఈ ప్రశ్న నేను కాదు, సుప్రీంకోర్టు గత జనవరి 23... జగిత్యాల రాజకీయాల్లో మాటల యుద్ధం:జీవన్ Vs సంజయ్
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల రాజకీయాలు మరోసారి వేడెక్కాయి. ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ కొట్టివేయడంతో, ఆయన “అభివృద్ధి కోసమే కాంగ్రెస్ ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్నా” అని స్పష్టం చేశారు. తాను బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేనని, పార్టీ మారలేదని అఫిడవిట్, పార్టీ ఫండ్ చెల్లింపుల... స్పీకర్ క్లిన్ చిట్: జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ బీఆర్‌ఎస్‌లోనే
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌పై బీఆర్‌ఎస్ పార్టీ దాఖలు చేసిన అనర్హత పిటిషన్‌ను అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కొట్టివేశారు. ఎమ్మెల్యే పార్టీ మారినట్లు నిరూపించే ఆధారాలు లేవని స్పష్టంగా పేర్కొన్నారు.
అభివృద్ధి కోసమే కాంగ్రెస్‌తో సమన్వయం – డా. సంజయ్ స్పష్టం
ఈ తీర్పుపై... పక్కింటి సంసారంలో చిచ్చు పెట్టడం మానుకో: మాజీ మంత్రి జీవన్ రెడ్డి
జగిత్యాల, ఫిబ్రవరి 04 (ప్రజా మంటలు):
అభివృద్ధి అంటే పక్కింటికి కన్నం వేయడమా? అంటూ జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్‌పై మాజీ మంత్రి జీవన్ రెడ్డి తీవ్ర వ్యాఖ్యలు చేశారు. జగిత్యాల జిల్లా కేంద్రంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు.
జగిత్యాల ఎమ్మెల్యే పార్టీ ఫిరాయింపు అంశంపై స్పీకర్ ఇప్పటికే స్పష్టమైన తీర్పు ఇచ్చారని, ఎమ్మెల్యే... జగిత్యాల మున్సిపాలిటీ – ప్రధాన పార్టీల అభ్యర్థుల జాబితా
జగిత్యాల ఫిబ్రవరి 03 (ప్రజా మంటలు):
ప్రధాన పార్టీలు – బీజేపీ (BJP), కాంగ్రెస్, బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు.(వార్డు – రిజర్వేషన్ – అభ్యర్థి పేరు – పార్టీ)
🔹 వార్డు 1 (BC-G)
అనిల్ కుమార్ కుసారి – INC
నిమిషకవి వంశీకృష్ణ – BRS
పుప్పాల రాజేష్ – BJP
🔹... 