పంతం నెగ్గించుకొన్న MLA సంజయ్: 35 సీట్లతో పై చేయి.
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ టికెట్ల లొల్లి
జీవన్ రెడ్డి వర్గంలో తీవ్ర అసంతృప్తి – కార్యకర్తల ఆగ్రహం
జీవన్ రెడ్డి నిర్ణయం కొరకు ఎదిరి చూపు?
జగిత్యాల ఫిబ్రవరి 03 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు తీవ్ర వివాదానికి దారితీసింది. టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందంటూ సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తోంది. ఈ నేపథ్యంలో జీవన్ రెడ్డి నివాసం ముందు ఆశావహులు ఆగ్రహావేశాలతో నినాదాలు చేస్తూ ఆందోళనకు దిగారు.
సీట్ల పంపిణీపై చిచ్చు
మొత్తం 50 వార్డుల్లో
- ఎమ్మెల్యే సంజయ్ వర్గానికి 30 సీట్లు,
- సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గానికి కేవలం 20 సీట్లు మాత్రమే కేటాయించడంపై జీవన్ రెడ్డి వర్గీయులు మండిపడుతున్నారు.
అంతేకాక, జీవన్ రెడ్డి వర్గానికి కేటాయించిన 29 సీట్లలో మళ్లీ 5 సీట్లను ఎమ్మెల్యే వర్గానికి మార్చడం పరిస్థితిని మరింత ఉద్రిక్తం చేసింది.
“ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు అన్యాయం”
సంవత్సరాలుగా పార్టీ కోసం పనిచేసిన, కండువా మోసిన ఒరిజినల్ కాంగ్రెస్ కార్యకర్తలకు బీ-ఫారమ్‌లు ఇవ్వకుండా, ఇటీవల పార్టీ మారిన వారికి టికెట్లు ఇచ్చారని కార్యకర్తలు ఆరోపించారు.
“ఎమ్మెల్యే సంజయ్ మా కడుపు కొట్టాడు” అంటూ ఆవేదన వ్యక్తం చేసిన వారు, అవసరమైతే ఆయన ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు.
పోలీసుల భారీ బందోబస్తు
టికెట్ల వివాదం నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఎమ్మెల్యే సంజయ్ క్యాంపు కార్యాలయం, నివాసం వద్ద పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.
మారిన అభ్యర్థుల జాబితా
కాంగ్రెస్ పార్టీ లిస్టులో మారిన అభ్యర్థులు ఇలా ఉన్నారు:
- 26వ వార్డు: వీరబత్తిని పద్మజ → గొల్లపల్లి మాధవి లత
- 27వ వార్డు: బింగి సుమ → జుంబర్తి గంగలక్ష్మి
- 29వ వార్డు: తోపారపు లావణ్య → ఆరుముల్ల తేజస్విని
- 35వ వార్డు: జీనత్ పర్వీన్ → అజార్ ఫాతిమా
- 39వ వార్డు: హనుమండ్ల జయశ్రీ → బొలుసాని శ్రీనివాస్
అధిష్టానం వైఖరిపై ప్రశ్నలు
ఈ పరిణామాలతో జీవన్ రెడ్డిని కాంగ్రెస్ అధిష్టానం పట్టించుకోవడం లేదన్న భావన ఆయన వర్గంలో బలంగా వ్యక్తమవుతోంది. వయసు మీదపడిన జీవన్ రెడ్డి పట్ల కొత్త కాంగ్రెస్ నాయకత్వం చూపుతున్న నిర్లక్ష్యాన్ని ఆయన ఎలా ఎదుర్కొంటారన్నది రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.
కీలక నిర్ణయం రేపటికి?
జగిత్యాల మున్సిపాల్టీపై తన పట్టును నిలుపుకోవడానికి
- స్వతంత్ర లేదా పోటీ అభ్యర్థులను నిలబెడతారా?
- లేక మౌనంగా తప్పుకుంటారా?
- లేక మరో రాజకీయ ఎత్తు వేస్తారా?
అన్నది రేపటి వరకు తేలనుంది.
More News...
<%- node_title %>
<%- node_title %>
పంతం నెగ్గించుకొన్న MLA సంజయ్: 35 సీట్లతో పై చేయి.
జీవన్ రెడ్డి వర్గంలో తీవ్ర అసంతృప్తి – కార్యకర్తల ఆగ్రహం
జీవన్ రెడ్డి నిర్ణయం కొరకు ఎదిరి చూపు?
జగిత్యాల ఫిబ్రవరి 03 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు తీవ్ర వివాదానికి దారితీసింది. టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందంటూ సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తిని... రావి నారాయణ రెడ్డికి తెలంగాణలో సముచిత స్థానం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
భూమి–భుక్తి–వెట్టిచాకిరి విముక్తి పోరాట వీరుడికి ప్రభుత్వ గౌరవం
హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచితమైన స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశాల్లో... హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం
హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):
ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్... లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం
గొల్లపల్లి, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్‌లో సోమవారం లయన్స్ క్లబ్ గొల్లపల్లి, లీడ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోటివేటివ్ స్పీకర్ కెప్టెన్ డా. లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి విద్యార్థుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపారు.... అంగరంగ వైభవంగా బుగ్గారం పోచమ్మల జాతర – రథోత్సవం
బుగ్గారం / గొల్లపల్లి ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం శ్రీ ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మల జాతర, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ జిల్లాలతో పాటు అంతర్‌రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తజనం తండోప తండాలుగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఆలయ కమిటీ చైర్మన్... మొదటిరోజు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)జిల్లాలో సోమవారం 17 (జనరల్ మరియు ఒకేషనల్) పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో భాగంగా ఈరోజు జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలలో ఉదయం 1409 మంది విద్యార్థులకు గాను 1312 మంది విద్యార్థులు హాజరైనారు.
జనరల్ విభాగంలో... గ్రీవెన్స్ డే సందర్భంగా పలు ఫిర్యాదులను పరిశీలించిన జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)బాధితులకు సత్వర న్యాయం జరిగేలా చూడాలని అధికారులకు ఆదేశం
ప్రతి సోమవారం ప్రజల సౌకర్యార్థం నిర్వహించే గ్రీవెన్స్ డే లో బాగంగా జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 7గురు అర్జీదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకొని సంబంధిత అధికారులతో ఫోన్... పెట్టుబడుల పేరుతో తెలంగాణ ప్రజలను మోసం చేస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం
మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది
పెట్టుబడులపై Fact Check
(వివరాలు కింది టేబుల్ లో)
కేంద్ర బడ్జెట్‌లో తెలంగాణకు తీవ్ర అన్యాయం
ఫోన్ ట్యాపింగ్ కేసు – పారదర్శక విచారణ జరగాలి
హైదరాబాద్, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
కాంగ్రెస్ ప్రభుత్వం ప్రకటిస్తున్న వేల కోట్ల పెట్టుబడులు కట్టుకథలేనని తెలంగాణ జాగృతి... అభ్యర్థి మంచోడా చెడ్డోడా కాదు – ప్రజలకు ఉపయోగపడేవాడే ముఖ్యం : కవిత
మహిళలకు భద్రత లేదు – గన్ కల్చర్ పెరుగుతోంది
హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
మున్సిపల్ ఎన్నికల్లో అభ్యర్థి మంచోడైనా చెడ్డోడైనా కేసీఆర్ ను చూసి ఓటు వేయాలని కేటీఆర్ కోరుతున్నారని కవిత విమర్శించారు.ఇది బీఆర్ఎస్‌లోని రాజరిక, నియంతృత్వ పోకడలకు నిదర్శనమన్నారు.
ఈరోజు జాగృతి ఆఫీస్ లో పాత్రికేయులతో మాట్లాడుతూ, కులం, మతం,... అన్ని శాఖల సమన్వయంతో ఆపరేషన్ స్మైల్-XII విజయవంతం. జిల్లా ఎస్పీ అశోక్ కుమార్
జిల్లా లో 37 మoది బాల కార్మికులకు విముక్తి:జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ జగిత్యాల ఫిబ్రవరి 1 ప్రజా (మంటలు)బాలకార్మిక వ్యవస్థను నిర్మూలించడానికి సంవత్సరంలో రెండు సార్లు ఆపరేషన్ స్మైల్, మరియు ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహించి తప్పిపోయిన బాలలను గుర్తించి వారి తల్లిదండ్రుల వద్దకు చేర్చడానికి జిల్లా వ్యాప్తంగా ఆపరేషన్ స్మైల్ కార్యక్రమం... 44 వ వార్డులో బిజెపి అభ్యర్థికి మద్దతుగా డా. భోగ శ్రావణీ ప్రచారం
జగిత్యాల ఫిబ్రవరి 1 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికలలో భాగంగ జగిత్యాల పట్టణంలోని 44వ వార్డ్ భారతీయ జనతా పార్టీ బలపరిచిన అభ్యర్థి ఆర్మూర్ పద్మ-శ్రీకాంత్ కు మద్దతుగా ఇంటింటి ప్రచారంలో పాల్గొన్న బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డా .బోగ శ్రావణి
ఈ కార్యక్రమంలో పట్టణ ప్రధాన కార్యదర్శి ఆముద రాజు, బీజేవైఎం... 