క్రమశిక్షణతో ఉండడం తప్పా: జీవన్ రెడ్డి
ఎటు తేల్చుకోలేని జీవన్ - డిల్లీకి ఫిర్యాదు అంటూ ముగింపు
జగిత్యాల, ఫిబ్రవరి 3 (ప్రజా మంటలు):
నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించడమే నా తప్పా? అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ—కష్టకాలంలో పార్టీని నమ్ముకుని పనిచేసిన కార్యకర్తలకు అండగా నిలవడం తన బాధ్యత అన్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం పనిచేసిన వారి పేర్లను టికెట్ల కోసం ప్రతిపాదించడమే తాను చేసిన పని తప్పా? అని నిలదీశారు.
బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేతో కలిసి మున్సిపల్ ఎన్నికల టికెట్లపై చర్చించడం క్రమశిక్షణ కాదా? అని ప్రశ్నించారు. పార్టీ ఫిరాయింపు చట్టం కింద నోటీసులు ఎదుర్కొన్న ఎమ్మెల్యే, స్పీకర్‌కు తాను ఇంకా బీ ఆర్ ఎస్ ఎమ్మెల్యేనని అఫిడవిట్ ఇచ్చిన విషయం గుర్తు చేశారు. అలాంటి వ్యక్తిని గాంధీ భవన్లో జరిగిన అంతర్గత సమావేశానికి ఆహ్వానించడం ఎంతవరకు సమంజసం అని ప్రశ్నించారు.
జగిత్యాలలో 2019 మినహా అన్ని మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగిరిందని, టీఆర్ఎస్ పాలనలో పదేళ్లు పోరాటం చేసిన కార్యకర్తలు ఇప్పుడు పక్కకు నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. జీవితంలో ఒక్కసారి కూడా కాంగ్రెస్ జెండా పట్టని వారికి బీ ఫారాలు ఇవ్వడం వల్ల కార్యకర్తల్లో తీవ్ర నిరాశ నెలకొందన్నారు.
ప్రస్తుతం జగిత్యాల మున్సిపాలిటీలో 50 వార్డుల్లో కనీసం 40 గెలుస్తామనే విశ్వాసం ఉందన్నారు. అయినప్పటికీ, తుది జాబితాలో చేర్పులు–మార్పులు ఎలా జరుగుతున్నాయో కార్యకర్తలకు స్పష్టత లేదని విమర్శించారు.
రాయికల్‌లో ఏకాభిప్రాయంతో జాబితా ఇచ్చినా, సగానికి పైగా కాంగ్రెస్ేతరులకు బీ ఫారాలు ఇవ్వడంతో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షుడు పోటీ నుంచి తప్పుకోవాల్సి వచ్చిందన్నారు. పదేళ్లుగా పార్టీ కోసం కష్టపడ్డ కార్యకర్తల హక్కులు కాలరాస్తే సహించేది లేదని స్పష్టం చేశారు.
దేశవ్యాప్తంగా రాహుల్ గాంధీ ‘జై బాపు, జై భీమ్, జై సంవిధాన్’ నినాదంతో రాజ్యాంగ పరిరక్షణ కోసం పోరాడుతుంటే, ఇక్కడ మాత్రం అవకాశవాదులకు ప్రాధాన్యం ఇవ్వడం ఏ విధమైన పార్టీ సిద్ధాంతమని ప్రశ్నించారు.
కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసిన నిజమైన కార్యకర్తలకు జరుగుతున్న అన్యాయాన్ని అఖిల భారత కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ, మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్తానని జీవన్ రెడ్డి తెలిపారు. తన వ్యక్తిగత విషయాల కోసం కాదు, కాంగ్రెస్ జెండా మోసిన కార్యకర్తల హక్కుల కోసమే తాను మాట్లాడుతున్నానని స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బి.ఎల్.ఓ లు తమ విధులను జాగ్రత్తగా నిర్వహించాలి జిల్లా అదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత
జగిత్యాల ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు)పట్టణంలోని ఓ ఫంక్షన్ హాల్ లో మంగళవారం నిర్వహించిన సమావేశంలో బి.ఎల్.ఓ లు తమ విధులను జాగ్రత్తగా నిర్వహించాలనిఅదనపు కలెక్టర్ (రెవిన్యూ) బి.ఎస్. లత పేర్కొన్నారు.
ఓటరు జాబితా సవరణ ప్రక్రియలో బి.ఎల్.ఓల పాత్ర కీలకమని చెప్పారు. ప్రతి ఇంటిని సందర్శించి అర్హులైన 18 సంవత్సరాలు... క్రమశిక్షణతో ఉండడం తప్పా: జీవన్ రెడ్డి
జగిత్యాల, ఫిబ్రవరి 3 (ప్రజా మంటలు):
నాలుగు దశాబ్దాలుగా కాంగ్రెస్ పార్టీ కోసం క్రమశిక్షణ గల కార్యకర్తగా పనిచేస్తూ, రాహుల్ గాంధీ ఆలోచనలకు అనుగుణంగా వ్యవహరించడమే నా తప్పా? అని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ప్రశ్నించారు.
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ—కష్టకాలంలో పార్టీని నమ్ముకుని... జగిత్యాల మాల జంగం పురోహితులచే రాజరాజేశ్వర స్వామి పల్లకి సేవ
జగిత్యాల ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు) మాల జంగం కు చెందిన వేల్పుల వంశస్థులకు మంగళవారం రాజరాజేశ్వర స్వామి పల్లకి సేవ నిర్వహించారు. ఈ సందర్భంగా మంచినీళ్ల భావి వద్ద గల శ్రీ మడేలేశ్వర స్వామి ఆలయంలో పురాని పేటకు చెందినమాల జంగం కుల మహేశ్వర పురోహితులు లక్కం శివనాథం, మురళీదాస్, మోహన్, కోదాది... జగిత్యాల పట్టణ బి ఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు వెంకటేశ్వరరావు కు శుభాకాంక్షలు తెలిపిన దావా వసంత
జగిత్యాల ఫిబ్రవరి 3 (ప్రజా మంటలు)జిల్లా బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశాల మేరకు పట్టణ బిఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడిగా ఎన్నికైన వెంకటేశ్వరరావు జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ ని మర్యాదపూర్వకంగా కలవగా వారికి శాలువ కప్పి శుభాకాంక్షలు తెలియజేయడం జరిగింది.
మున్సిపల్ ఎలక్షన్లో బిఆర్ఎస్ పార్టీ... రాయికల్ మున్సిపల్ బి ఆర్ఎస్ అభ్యర్థులకు బీఫాంలు అందజేసిన దావా వసంత
రాయికల్ ఫిబ్రవరి 3 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కేసీఆర్ నాయకత్వంలో బిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరియు జగిత్యాల రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల ఇన్చార్జ్ బిఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు కల్వకుంట్ల విద్యాసాగర్ రావు ఆదేశానుసారం రాయికల్ పట్టణ మున్సిపల్ ఎన్నికల అభ్యర్థులకు బిఆర్ఎస్ పార్టీ బీ ఫాములు... పంతం నెగ్గించుకొన్న MLA సంజయ్: 35 సీట్లతో పై చేయి.
జీవన్ రెడ్డి వర్గంలో తీవ్ర అసంతృప్తి – కార్యకర్తల ఆగ్రహం
జీవన్ రెడ్డి నిర్ణయం కొరకు ఎదిరి చూపు?
జగిత్యాల ఫిబ్రవరి 03 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపల్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ టికెట్ల కేటాయింపు తీవ్ర వివాదానికి దారితీసింది. టికెట్ల పంపిణీలో అన్యాయం జరిగిందంటూ సీనియర్ నేత జీవన్ రెడ్డి వర్గం తీవ్ర అసంతృప్తిని... రావి నారాయణ రెడ్డికి తెలంగాణలో సముచిత స్థానం కల్పిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
భూమి–భుక్తి–వెట్టిచాకిరి విముక్తి పోరాట వీరుడికి ప్రభుత్వ గౌరవం
హైదరాబాద్ ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
భూమి కోసం, భుక్తి కోసం, వెట్టిచాకిరి విముక్తి కోసం పోరాడిన సమరయోధుడు రావి నారాయణ రెడ్డికి తెలంగాణ సమాజంలో ప్రభుత్వం సముచితమైన స్థానం కల్పిస్తుందని ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. రావి నారాయణ రెడ్డి చరిత్రను పాఠ్యాంశాల్లో... హుస్నాబాద్ పట్టణాన్ని రాష్ట్రంలో రోల్ మోడల్ చేస్తా - పొన్నం
హుస్నాబాద్ ఎన్నికల ప్రచారంలో మంత్రి పొన్నం ప్రభాకర్
హుస్నాబాద్, ఫిబ్రవరి2,(ప్రజా మంటలు):
ఈనెల 11 వ తేదీన జరిగే ఎన్నికల్లో హుస్నాబాద్ లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలని 20 లోస్థానాలు గెలిపించి తనకు మరింత బలాన్ని ఇవ్వాలని హుస్నాబాద్ పట్టణంను ప్రత్యేక ప్రణాళిక ద్వారా అభివృద్ధి చేస్తున్నామని ,గత ప్రభుత్వంలో 10 సంవత్సరాల్లో ఒక్క డబుల్... లయన్స్ క్లబ్, లీడ్ ఇండియా ఆధ్వర్యంలో విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమం
గొల్లపల్లి, ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
గొల్లపల్లి మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో సోమవారం లయన్స్ క్లబ్ గొల్లపల్లి, లీడ్ ఇండియా ఫౌండేషన్ సంయుక్తంగా విద్యార్థులకు వ్యక్తిత్వ వికాస కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన మోటివేటివ్ స్పీకర్ కెప్టెన్ డా. లయన్ బుర్ర మధుసూదన్ రెడ్డి విద్యార్థుల్లో ఉత్సాహం, ఆత్మవిశ్వాసాన్ని నింపారు.... అంగరంగ వైభవంగా బుగ్గారం పోచమ్మల జాతర – రథోత్సవం
బుగ్గారం / గొల్లపల్లి ఫిబ్రవరి 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా బుగ్గారం మండల కేంద్రంలో సోమవారం శ్రీ ముత్యాల పోచమ్మ – నల్ల పోచమ్మల జాతర, రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. వివిధ జిల్లాలతో పాటు అంతర్రాష్ట్రాల నుంచి వేలాదిగా భక్తజనం తండోప తండాలుగా తరలివచ్చి అమ్మవార్లను దర్శించుకున్నారు.
ఆలయ కమిటీ చైర్మన్... మొదటిరోజు ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షలు ప్రశాంతం
జగిత్యాల ఫిబ్రవరి 2 ( ప్రజా మంటలు)జిల్లాలో సోమవారం 17 (జనరల్ మరియు ఒకేషనల్) పరీక్ష కేంద్రాల్లో జరుగుతున్న ఇంటర్మీడియట్ ప్రాక్టికల్ పరీక్షల్లో భాగంగా ఈరోజు జరిగిన పరీక్షలు ప్రశాంతంగా ముగిశాయి. ఈ రోజు జరిగిన ప్రాక్టికల్ పరీక్షలలో ఉదయం 1409 మంది విద్యార్థులకు గాను 1312 మంది విద్యార్థులు హాజరైనారు.
జనరల్ విభాగంలో... 