ఎపిస్టీన్‌తో లేఖల వ్యవహారం: హరిదీప్ సింగ్ పూరి వివరణపై సందేహాలు
మాజీ సమాచార ప్రధాన కమిషనర్ యశ్వంత్ సిన్హా పేరు కూడా
హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
జెఫ్రీ ఎపిస్టీన్‌కు సంబంధించిన కేసు డాక్యుమెంట్లు, ఈమెయిల్ రికార్డులపై తాజాగా బయటకొచ్చిన ఫోటోలు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి గతంలో ఇచ్చిన వివరణలపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. అలాగే మాజీ ప్రధాన సమాచార కమీషనర్ యశ్వర్ధన్ సిన్హా పేరు కూడా బయటపడింది.
మొదటి ఫోటోలో కనిపిస్తున్న ఈమెయిల్ ప్రకారం, 2014 అక్టోబర్ 24న అంబాసిడర్‌గా రిటైర్ అయిన తరువాత కూడా హరిదీప్ సింగ్ పూరి ఒక మహిళకు వీసా సహాయం చేయాలంటూ ఎపిస్టీన్ నెట్‌వర్క్‌కు సంబంధించిన వ్యక్తులను సంప్రదించినట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో రిటైర్డ్ అంబాసిడర్ పరమోద్ బజాజ్ ద్వారా ప్రక్రియ కొనసాగినట్లు ఈమెయిల్‌లో పేర్కొనబడింది.
ఈ నేపథ్యంలో, “ఎపిస్టీన్‌ను నేను కేవలం ప్రొఫెషనల్ పనుల కోసమే, అది కూడా డిజిటల్ ఇండియా సంబంధిత అంశాలపై మాత్రమే కలిశాను” అని పూరి గతంలో చేసిన ప్రకటనకు విరుద్ధంగా ఈ డాక్యుమెంట్లు ఉన్నాయనే వాదనలు వినిపిస్తున్నాయి.
ముఖ్యంగా గమనించాల్సిన అంశం ఏమిటంటే,
జెఫ్రీ ఎపిస్టీన్ ఇప్పటికే 2008లో మహిళల అక్రమ రవాణా (women trafficking) కేసులో శిక్ష అనుభవించాడు. అలాంటి వ్యక్తి నేపథ్యం తెలియదని చెప్పడం ఎంతవరకు సమంజసం అన్న ప్రశ్నలు ఇప్పుడు తలెత్తుతున్నాయి. ఒక సీనియర్ డిప్లొమాట్‌గా పనిచేసిన వ్యక్తికి, అంతర్జాతీయ స్థాయిలో చర్చకు వచ్చిన ఎపిస్టీన్ నేర చరిత్ర తెలియకపోవడం నమ్మశక్యమా అన్న సందేహం వ్యక్తమవుతోంది.
ఇక రెండవ ఫోటోలో ఉన్న అమెరికా కోర్టు డాక్యుమెంట్‌లో,
ఎపిస్టీన్ ఐలాండ్‌కు సంబంధించిన ఒక బాధితురాలి వాంగ్మూలంలో “YK Sinha” అనే పేరు ప్రస్తావనకు వచ్చింది. ఆ డాక్యుమెంట్ ప్రకారం, యశవర్ధన్ కుమార్ సిన్హా (Y K Sinha - 07-11-2020 నుండి 03-10-2023 వరకు చీఫ్ ఇన్ఫర్మేషన్ కమిషనర్) ఎపిస్టీన్ నెట్‌వర్క్‌తో ఏదో రూపంలో సంబంధం ఉన్నట్టు బాధితురాలు పేర్కొన్నట్టు ఉంది. అయితే ఇది ఆమె వాంగ్మూలంలో వచ్చిన ఆరోపణ మాత్రమే, ఇప్పటివరకు న్యాయపరంగా నిర్ధారణ కాలేదు.
ఈ మొత్తం వ్యవహారంలో రెండు కీలక ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి:
- ఎపిస్టీన్ 2008లోనే నేరస్తుడిగా శిక్ష పొందిన విషయం తెలియదని చెప్పడం ఒక సీనియర్ డిప్లొమాట్‌కు ఎంతవరకు సమంజసం?
- వీసా సహాయం లాంటి వ్యక్తిగత అంశాల్లో ఎపిస్టీన్ నెట్‌వర్క్‌ను ఎందుకు ఆశ్రయించాల్సి వచ్చింది?
ప్రస్తుతం ఈ డాక్యుమెంట్లు పబ్లిక్ డొమైన్‌లోకి రావడంతో,
హరిదీప్ సింగ్ పూరి, యశ్వంత్ సిన్హా ఈ అంశాలపై మరింత స్పష్టమైన వివరణ ఇవ్వాల్సిన అవసరం ఉందన్న డిమాండ్ బలపడుతోంది. ఇది కేవలం వ్యక్తుల పరువు అంశం మాత్రమే కాకుండా, దేశ ప్రతిష్ఠకు సంబంధించిన విషయమని రాజకీయ, పౌర వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
ఈ వ్యవహారంపై సంబంధిత వ్యక్తుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉందని పరిశీలకులు పేర్కొంటున్నారు.
గమనిక : ఈ వార్తలో ప్రస్తావించిన అంశాలు ఫోటోలలో కనిపించిన డాక్యుమెంట్లు, ఆరోపణల ఆధారంగా రూపొందించబడ్డాయి. న్యాయస్థానాల్లో తుది నిర్ధారణ అయ్యే వరకు ఇవి ఆరోపణలుగానే పరిగణించాలి.
👉
More News...
<%- node_title %>
<%- node_title %>
అజ్మీర్ దర్గాకు కవిత చాదర్ పంపిన కవిత.. కొత్త రాజకీయ సంకేతాలా?
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత రాజస్థాన్‌లోని అజ్మీర్ షరీఫ్ దర్గాకు చాదర్ పంపించారు. రాజకీయంగా కొత్త పార్టీ ఆవిర్భావం దిశగా అడుగులు వేస్తున్న నేపథ్యంలో ఈ చర్యకు ప్రాధాన్యం ఏర్పడింది.మంగళవారం హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని తెలంగాణ జాగృతి కార్యాలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించిన కవిత, ఆ చాదర్‌ను... రేవంత్ రెడ్డి యాంటీ అంబేడ్కర్: కవిత సంచలన వ్యాఖ్యలు – తెలంగాణ అంబేడ్కర్ భిక్షే
హైదరాబాద్, ఏప్రిల్ 14 (ప్రజా మంటలు):
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంబేడ్కర్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా పనిచేస్తున్నారని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు గుప్పించారు. అంబేడ్కర్‌కు వ్యతిరేకిగా ఈ దేశంలో ఎవరైనా ఉంటే అది రేవంత్ రెడ్డే అని ఆమె ఆరోపించారు.ది యునైటెడ్ ఫోరం ఫర్ ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్... శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా స్వామివారి కల్యాణ వేడుకలు
జగిత్యాలఏప్రిల్ 12(ప్రజా మంటలు) శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయం లో ఆదివారం శ్రవణా నక్షత్రం పురస్కరించుకొని పద్మావతి అలివేలు మంగ సహిత శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఉత్సవ మూర్తులను ప్రత్యేక వేదికపై ఉంచి కళ్యాణాన్ని నిర్వహించారు. ఆలయాన్ని సర్వాంగ సుందరంగా అలంకరించారు. భక్తులు... విలేకరి ముసుగులో వసూళ్లు.. కత్తితో బెదిరించి ₹42వేలు దోపిడి – వేములవాడలో నకిలీ జర్నలిస్టు అరెస్ట్
వేములవాడ, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
విలేకరుల ముసుగులో కొందరు నకిలీ జర్నలిస్టులు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ వసూళ్లకు పాల్పడుతున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా వేములవాడ పట్టణంలో జరిగిన ఒక సంఘటనలో నకిలీ జర్నలిస్టుగా నటించిన వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.
వేములవాడ టౌన్ సీఐ బి. వీర ప్రసాద్ తెలిపిన... ఇంటర్ ఫలితాల్లో మెరిసిన ఆణిముత్యం – గుంటుకుల సహస్ర
గొల్లపల్లి, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం పరీక్షా ఫలితాల్లో గొల్లపల్లి మండలానికి చెందిన లోత్తునూర్ గ్రామ విద్యార్థిని గుంటుకుల సహస్ర తన ప్రతిభను చాటుకుంది. తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు విడుదల చేసిన ఫలితాల్లో మొత్తం 470 మార్కులకు గాను 467 మార్కులు సాధించి జగిత్యాల పట్టణంలో ప్రథమ స్థానం దక్కించుకుంది.ప్రస్తుతం... వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కృషి –కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
సమాజంలో వెనకబడిన వర్గాల అభ్యున్నతికి కాంగ్రెస్ సర్కార్ కట్టుబడి ఉందని కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేశ్ అన్నారు. తెలంగాణ తోటి, మెహతార్ కమ్యూనిటీ సంఘం 12వ వార్షికోత్సవ వేడుకలు ఆదివారం బొల్లారం కొత్త బస్తీలోని కమ్యూనిటీ హాల్‌లో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కంటోన్మెంట్ ఎమ్మెల్యే శ్రీగణేష్ ముఖ్య అతిథిగా... మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం అధ్యక్షునిగా డాక్టర్ రమేష్
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
టీఎన్‌జీవో మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయిస్ ఫోరం హైదరాబాద్ జిల్లా అధ్యక్షునిగా సికింద్రాబాద్ గాంధీఆస్పత్రి ఫిజియోథెరపీ విభాగ వైద్యుడు డాక్టర్ పల్లాటి రమేష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. టీఎన్‌జీవో యూనియన్ హైదరాబాద్ జిల్లా అధ్యక్షకార్యదర్శులు విక్రమ్, శ్రీనివాస్, కోశాధికారి బాలరాజుల నేతృత్వంలో సంఘ కార్యాలయంలో ఆదివారం జరిగిన ఎన్నికల్లో నూతన... స్కై ఫౌండేషన్ ఆధ్వర్యంలో 298వ అన్నదానం
సికింద్రాబాద్, ఏప్రిల్ 12 ( ప్రజామంటలు):
హైదరాబాద్ నగరంలో ఆకలితో అలమటిస్తున్న అనాథలు, నిరాశ్రయుల కోసం స్కై ఫౌండేషన్ ఆదివారం 298వ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించింది. ఫౌండేషన్ సభ్యులు వాహనంలో వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ, ఫుట్‌పాత్‌లపై నివసించే నిరుపేదలను గుర్తించి వారికి ఆహారాన్ని పంపిణీ చేశారు.
ఈ సందర్భంగా ఫౌండేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ వై. సంజీవ... ఇంటర్ ఫలితాల్లో ప్రభుత్వ జూనియర్ కళాశాల మార్కుల ప్రభంజనం
ఇబ్రహీంపట్నం, ఏప్రిల్ 12 (ప్రజా మంటలు):
ఇబ్రహీంపట్నంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థులు ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర ఫలితాల్లో రాష్ట్రస్థాయి మార్కులు సాధించి తమ ప్రతిభను మరోసారి చాటారు.
ద్వితీయ సంవత్సరం ఫలితాలు:MPC: ఎం. లవిష – 979/1000BiPC: కె. నవీన – 971/1000CEC: కె. రతిక – 935/1000... బాలీవుడ్ గానకోకిల ఆశా భోస్లే కన్నుమూత – 92 ఏళ్ల వయసులో సంగీత యుగానికి ముగింపు
ప్రఖ్యాత బాలీవుడ్ గాయని Asha Bhosle (92) కన్నుమూశారు. గుండెపోటుతో ముంబైలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆమె మరణించినట్లు కుటుంబ సభ్యులు ధృవీకరించారు. ఆమె మరణంతో భారతీయ సినీ సంగీతంలో ఒక మహా యుగానికి ముగింపు పలికినట్టైంది.
ఎనిమిది దశాబ్దాల పాటు సాగిన ఆమె సంగీత ప్రయాణంలో 12,000కు పైగా పాటలు పాడి కోట్లాది అభిమానుల... భార్యను కాపురానికి పంపలేదని అత్తను కరెంట్ షాక్‌తో హత్యాయత్నం నిందితుడు అరెస్ట్ – రిమాండ్‌కు తరలింపు
గొల్లపల్లి, ఏప్రిల్ 11 (ప్రజా మంటలు):
భార్యను తిరిగి కాపురానికి పంపలేదనే కోపంతో అత్తను కరెంట్ షాక్‌తో చంపేందుకు ప్రయత్నించిన ఘటన వెంగటూరు మండలంలో చోటుచేసుకుంది.వెల్గటూర్ మండలం జగదేవపేట గ్రామానికి చెందిన గాగిరెడ్డి మల్లారెడ్డి (48) తన భార్య పద్మతో గత కొన్నేళ్లుగా వివాదాలు కొనసాగుతున్నాయి. భర్త హింసను భరించలేక పద్మ తన పిల్లలతో... ఘనంగా మహాత్మా జ్యోతిరావు ఫూలే జయంతి వేడుకలు సామాజిక అసమానతనలు తొలగించడమే పూలే ఆశయం
జగిత్యాల ఏప్రిల్ 11 (ప్రజా మంటలు)మహాత్మ జ్యోతిబా పూలే ఆశయాలను, ఆలోచనలను ఆచరించాలి - రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
శనివారం సమీకృత జిల్లా కలెక్టరేట్ సమావేశం మందిరంలో జిల్లా వెనుకబడిన తరగతుల అభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన శ్రీ మహాత్మ జ్యోతిబా పూలే 200వ జయంతి వేడుకల్లో రాష్ట్ర... 