బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తికి టికెట్ ఎలా?
బి ఆర్ ఎస్ MLA కాంగ్రెస్ ఇంచార్జి? కాంగ్రెస్,బీఆర్ఎస్ వైఖరిపై కల్వకుంట్ల కవిత తీవ్ర విమర్శలు
హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవ్ రెడ్డికి బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఇది బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకమన్న స్పష్టమైన సంకేతమని ఆమె వ్యాఖ్యానించారు.
బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం రిజర్వేషన్ల కోసం జాగృతి సహా అనేక బీసీ సంఘాలు దీర్ఘకాలంగా పోరాటం చేశాయని తెలిపారు. ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువచ్చి 42 శాతం రిజర్వేషన్ల బిల్లును సాధించామని, అయితే అదే సమయంలో మాధవ్ రెడ్డి సహా మరికొందరు దీనిపై కోర్టులో పిటిషన్ వేశారని గుర్తుచేశారు.
అలాంటి వ్యక్తికి ఇప్పుడు బీఆర్ఎస్ టికెట్ ఇవ్వడం వెనుక పార్టీ మొత్తం ఉన్నట్లు స్పష్టమవుతోందని అన్నారు. బీసీలు రాష్ట్ర జనాభాలో 56 శాతం ఉన్నా, వారి నోటికాడ ముద్ద లాక్కునే ప్రయత్నం చేసిన వ్యక్తికి టికెట్ ఇవ్వడం తీవ్ర అన్యాయమని మండిపడ్డారు.
హరీష్ రావుకు సన్నిహితుడు
మాధవ్ రెడ్డి హరీష్ రావుకు సన్నిహితుడని, ఆయన పర్సనల్ లాయర్ ద్వారానే ఈ కేసు వేయించారని ఆరోపించారు. మొదట ఇది వ్యక్తిగత చర్యగా భావించామని, కానీ ఇప్పుడు పార్టీ టికెట్ ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ బీసీ రిజర్వేషన్లకు వ్యతిరేకమని స్పష్టమైందని కవిత వ్యాఖ్యానించారు.
బీఆర్ఎస్ బీసీల విషయంలో చిత్తశుద్ధితో వ్యవహరించలేదని, పార్టీ స్థాయిలో సమీక్షా సమావేశాలు పెట్టకుండా కేవలం ఫోరమ్‌ల పేరుతో కాలయాపన చేసిందని విమర్శించారు. జనగణన అంశంలో కూడా బీఆర్ఎస్ ప్రజలను గందరగోళానికి గురిచేసిందన్నారు.
బి ఆర్ ఎస్ mla అరికెపూడి గాంధీ నిజామాబాద్ కాంగ్రెస్ ఇంచార్జి?
కాంగ్రెస్ పార్టీపై కూడా కవిత తీవ్ర వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన అరికేపూడి గాంధీని నిజామాబాద్ కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌చార్జ్‌గా నియమించడం ప్రజల తీర్పును అవమానించడమేనని అన్నారు. స్పీకర్ ప్రకటించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కూడా కాంగ్రెస్ ఎన్నికల ఇన్‌చార్జ్‌లుగా నియమించడం రాజ్యాంగ విరుద్ధమని వ్యాఖ్యానించారు.
కాంగ్రెస్‌కు రాజ్యాంగంపై నిజంగా నమ్మకం ఉంటే అరికేపూడి గాంధీని వెంటనే ఇన్‌చార్జ్ పదవి నుంచి తొలగించాలని, స్పీకర్ ఆయనపై అనర్హత వేటు వేయాలని డిమాండ్ చేశారు.
బీసీలకు ఏటా 20 వేల కోట్ల బడ్జెట్ పెడతామని కాంగ్రెస్ చెప్పినా, రెండు బడ్జెట్లలో కలిపి ఏడువేల కోట్లు కూడా కేటాయించలేదని విమర్శించారు. రాబోయే బడ్జెట్ సమావేశాల్లో బీసీ సబ్ ప్లాన్‌పై స్పష్టమైన నిర్ణయాలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.
ఫోన్ ట్యాపింగ్ కేసులో చిన్న అధికారులను మాత్రమే టార్గెట్ చేసి, పెద్ద బాధ్యులను వదిలేస్తున్నారన్న అనుమానాలు వ్యక్తం చేశారు. ప్రభుత్వాలు మారినప్పుడల్లా అధికారులను వేధించకుండా పరిపక్వ రాజకీయాలు అవసరమని సూచించారు.
ఈ నెల 12న హైదరాబాద్ ఆర్టీసీ కళ్యాణ మండపంలో తెలంగాణ ఉద్యమకారుల ఆత్మగౌరవ సభ నిర్వహిస్తున్నట్లు ప్రకటించారు. ఉద్యమకారులు, అమరవీరుల కుటుంబాలు, తెలంగాణ వాదులు పెద్ద సంఖ్యలో హాజరుకావాలని పిలుపునిచ్చారు.
మున్సిపల్ ఎన్నికల్లో మా గెలిపించండి
మున్సిపల్ ఎన్నికల్లో సింహం గుర్తుపై పోటీ చేస్తున్నామని, తమతో పాటు ప్రశ్నించే సీపీఎం, న్యూ డెమక్రసీ, స్వతంత్ర అభ్యర్థులను గెలిపించాలని ప్రజలను కోరారు. పార్టీలు వస్తాయి పోతాయి కానీ ప్రజల హక్కుల కోసం నిలబడే శక్తులే నిలిచిపోతాయని కవిత అన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
ఎపిస్టీన్‌తో లేఖల వ్యవహారం: హరిదీప్ సింగ్ పూరి వివరణపై సందేహాలు
హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
జెఫ్రీ ఎపిస్టీన్‌కు సంబంధించిన కేసు డాక్యుమెంట్లు, ఈమెయిల్ రికార్డులపై తాజాగా బయటకొచ్చిన ఫోటోలు కేంద్ర మంత్రి హరిదీప్ సింగ్ పూరి గతంలో ఇచ్చిన వివరణలపై సందేహాలను లేవనెత్తుతున్నాయి. అలాగే మాజీ ప్రధాన సమాచార కమీషనర్ యశ్వర్ధన్ సిన్హా పేరు కూడా బయటపడింది.
మొదటి ఫోటోలో కనిపిస్తున్న ఈమెయిల్ ప్రకారం,... టీటీడీ ఈఓగా బాధ్యతలు చేపట్టిన ముద్దాడ రవిచంద్ర
తిరుమల, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
టీటీడీ ఈఓగా బాధ్యతలు స్వీకరించనున్న ముద్దాడ రవిచంద్ర తిరుమలకు చేరుకున్నారు. ఆయనకు తిరుమలలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్య చౌదరి, తిరుపతి జేఈవో వీరభద్రం, సీవీఎస్ఓ మురళీకృష్ణ, సీపీఆర్‌ఓ రవి స్వాగతం పలికారు.
ఈరోజు ఉదయం 10 గంటల 8 నిమిషాలకు ముద్దాడ రవిచంద్ర అధికారికంగా టీటీడీ ఈఓగా... బీసీ రిజర్వేషన్లను అడ్డుకున్న వ్యక్తికి టికెట్ ఎలా?
హైదరాబాద్, ఫిబ్రవరి 06 (ప్రజా మంటలు):
బీసీ రిజర్వేషన్లను అడ్డుకునేందుకు పిటిషన్ వేసిన బుట్టంగారి మాధవ్ రెడ్డికి బీఆర్ఎస్ మున్సిపల్ ఎన్నికల్లో టికెట్ ఇవ్వడాన్ని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత తీవ్రంగా విమర్శించారు. ఇది బీసీ రిజర్వేషన్లకు బీఆర్ఎస్ వ్యతిరేకమన్న స్పష్టమైన సంకేతమని ఆమె వ్యాఖ్యానించారు.
బీసీలకు విద్య, ఉపాధి, రాజకీయాల్లో 42 శాతం... ఘాజియాబాద్ బాలికల మృతి కేసు: ‘కొరియన్ సంస్కృతి’ నుంచి దూరం చేశారనే వేదనతో లేఖ
ఘాజియాబాద్ ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):
ఘాజియాబాద్‌లో ముగ్గురు అక్కాచెల్లెలు మృతి చెందిన ఘటనలో కీలక వివరాలు వెలుగులోకి వచ్చాయి. 'ది హిందూ' పత్రిక ప్రచురించిన సమాచారం మేరకు, వారికి లభించిన లేఖ ప్రకారం, తమ మూడేళ్ల చిన్న అర్ధసోదరికి “తమ కొరియన్ సంస్కృతి” నేర్పించనివ్వలేదనే బాధను బాలికలు వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
లేఖలో,... మునిసిపల్ ఎన్నికల్లో బిఆర్ఎస్ పార్టీ జెండా ఎగరవేస్తాం ఎమ్మెల్సీ ఎల్. రమణ
జగిత్యాల ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు)
జగిత్యాల పట్టణంలో పలు వార్డులో BRS పార్టీ అభ్యర్థులకు మద్దతుగా కార్నర్ మీటింగ్లో ఎమ్మెల్సీ ఎల్ రమణ మరియు మాజీ మంత్రి రాజేశం గౌడ్ మాజీ జడ్పీ చైర్మన్ దావ వసంత తో కలిసి ప్రచారం లో గురువారం రాత్రి 7 గంటలకు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్సీ... ఘాజియాబాద్‌లో ముగ్గురు బాలికల ఆత్మహత్య
ఘాజియాబాద్ / ఢిల్లీ, (ప్రజా మంటలు):
ఉత్తరప్రదేశ్‌లోని ఘాజియాబాద్‌లో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు బాలికలు ఆత్మహత్యకు పాల్పడటం దేశవ్యాప్తంగా తీవ్ర విషాదాన్ని కలిగించింది. ఈ సంఘటన కుటుంబాలు, పాఠశాలలు, మానసిక ఆరోగ్య నిపుణులను కలవరపాటుకు గురి చేసింది.
ఈ ఘటనపై స్పందించిన బాలికల తండ్రి, తమ పిల్లల మృతికి కొరియన్ కల్చర్ ప్రభావమే కారణమని... 39వ వార్డులో కాంగ్రెస్ అభ్యర్థి బొలుసాని శ్రీనివాస్ జోరుగా ప్రచారం
జగిత్యాల ఫిబ్రవరి 5 (ప్రజా మంటలు) జగిత్యాల పట్టణంలోని 39 వ వార్డులో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి బోలు సాని శ్రీనివాస్ ఇంటింటా జోరుగా ప్రచారం నిర్వహించారు .ఈ సందర్భంగా చేతి గుర్తుపై తనకు ఓటు వేసి గెలిపించాలని వార్డు ప్రజలను అభ్యర్థించారు.
స్థానిక సమస్యల పరిష్కారంలో తాను వార్డులోనే ఉంటూ సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు.... వరంగల్–కరీంనగర్ జంట నగరాల అభివృద్ధికి బృహత్ ప్రణాళిక: సీఎం రేవంత్ రెడ్డి
కరీంనగర్, ఫిబ్రవరి 05 (ప్రజా మంటలు):
వరంగల్–కరీంనగర్ పట్టణాల సమగ్రాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం విస్తృత ప్రణాళికను రూపొందించిందని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తెలిపారు. రెండు పట్టణాలకు ఔటర్ రింగ్ రోడ్లు పూర్తి చేయడంతో పాటు, వాటిని అనుసంధానించే రహదారులను విస్తరించనున్నట్లు చెప్పారు. రెండు నగరాల మధ్య భారీ డంప్ యార్డు ఏర్పాటు చేసి, అక్కడే విద్యుత్... రాయికల్ పలు వార్డులలో అభ్యర్థులకు మద్దతుగా డా బోగ శ్రావణి ఇంటింట ప్రచారం
రాయికల్ ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)మున్సిపల్ ఎన్నికలలో భాగంగా జగిత్యాల నియోజకవర్గం రాయికల్ మున్సిపల్ 8వ వార్డ్ అభ్యర్థి మచ్చ నారాయణ మరియు 12వ వార్డ్ అభ్యర్థి కల్లెడ చిన్న ధర్మపురి కి మద్దతుగా అదేవిధంగా రాయికల్ పదవ వార్డు అభ్యర్థి ఆడెపు ప్రశాంతి మరియు 11వ వార్డు అభ్యర్థి పుర్రె శ్రీధర్... ఆశీర్వదించండి.. అభివృద్ధి చేసి చూపిస్తా.
జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)తాజా మాజీ మున్సిపల్ ఛైర్పెర్సన్ అడువాల జ్యోతి లక్ష్మణ్ 40వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ అభ్యర్థి
స్థానికంగా ఉంటూ ప్రతి నిత్యం ప్రజల్లో ఉంటా.. జగిత్యాల పట్టణ 40వ వార్డు తన కుటుంబంగా భావిస్తాను. ఎవరికి ఏ ఆపద వచ్చినా తక్షణమే స్పదింస్తా.. మరోమారు ఆశీర్వదించండి.... జగిత్యాల పట్టణం 3వ వార్డులో కారు అభ్యర్థికి జోరుగా ప్రచారం
జగిత్యాల ఫిబ్రవరి 5 ( ప్రజా మంటలు)పట్టణం 3వ వార్డు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి గుమ్మడి సత్యం గౌడ్ కి మద్దతుగా ఇంటింటా తిరిగి ప్రచారం చేసిన జిల్లా తొలి జడ్పీ చైర్పర్సన్ దావ వసంత సురేష్ . ఏ ఇంటి గడప తట్టిన కూడా కేసీఆర్ పై అభిమానం తగ్గలేదని పేద ప్రజల... అనిల్ అంబానీ–ఇప్స్టీన్ ఫైల్ విశ్లేషణ: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలు
అనిల్ అంబాని–జెఫ్రీ ఇప్స్టీన్ ఫైల్: మోదీ, హార్దీప్ సింగ్ పూరి సంబంధాలపై సంక్షిప్తంగా, సమగ్ర విశ్లేషణ
గత రెండు మూడు నెలలుగా, అమెరికాకు చెందిన నేరస్తుడు, దళారీ జాఫ్రీ ఎప్స్టీన్ మరియు అనెక మంది దేశాధినేతలతో, పారిశ్రామికవేత్తలతో, ప్రముఖులతో సంబంధాలు కలిగి ఉన్నాడని, అనేక అరాచకాలు చేశాడని నేరారోపణలు ప్రచారంలో ఉన్నాయి.
.ఇతనికి శిక్ష... 