రవీంద్ర ప్లే స్కూల్లో ఈరోజు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

On
రవీంద్ర ప్లే స్కూల్లో ఈరోజు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు

(సిరిసిల్ల రాజేంద్ర శర్మ - 9963349493/9348422113)

జగిత్యాల మార్చి 26( ప్రజా మంటలు) : 

పట్టణంలోని స్థానిక రవీంద్ర ప్లే స్కూల్లో ఈరోజు గ్రాడ్యుయేషన్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు.

ఈ కార్యక్రమంలో భాగంగా యూకేజీ పూర్తిచేసుకుని ఫస్ట్ క్లాస్ లోకి అడుగుడుతున్న విద్యార్థులందరికీ సర్టిఫికెట్స్ పంపిణీ చేశారు.

ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి స్థానిక ఎంఈఓ గాయత్రి మేడం మాట్లాడుతూ..... గ్రాడ్యుయేషన్ డే అన్నది డిగ్రీ పూర్తి అయిన వారికి మాత్రమే జరిగేది కానీ ప్రీ ప్రైమరీ లెవెల్ లో జరుపుకోవడం చాలా ఆనందదాయకం అని మాట్లాడారు.

ఈ కార్యక్రమంలో అర్హులైన విద్యార్థులందరికీ పట్టాలని ఇచ్చి సత్కరించారు.

ఈ కార్యక్రమంలో ట్రస్మా జిల్లా అధ్యక్షులు బి. శ్రీధర్ రావు పాఠశాల డైరెక్టర్ బి. హరిచరన్ రావు కే. సుమన్ రావు కే. కిషన్ జే రాజు జే .మౌనిక లతోపాటు అధిక సంఖ్యలో పోషకులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

Tags