అయోధ్య బాలరాముడికి తొలిసారి హోలీ వేడుకలు.
( సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/9348422113).
అయోధ్య మార్చి 24 (ప్రజా మంటలు) :
కొన్ని వేల సంఖ్యలో తరలి వచ్చిన జనం హోలీ తొలి పండుగ కావడంతో అయోధ్య నగరం మొత్తం రంగులమయం అయింది..
అయోధ్యలో రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠ తర్వాత తొలిసారిగా హోలీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.
ఆదివారం ప్రత్యేక పూజలు చేసేందుకు భక్తులు అధిక సంఖ్యలో తరలి వచ్చారు.
జనవరి 22న ప్రధాని నరేంద్ర మోదీ రామ్ లల్లా ప్రాణ ప్రతిష్ఠా కార్యక్రమం జరిగిన సంగతి తెలిసిందే..
హోలీ తొలి పండుగ కావడంతో అయోధ్య నగరం మొత్తం రంగుల మయం అయింది.
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్రం రామ్ లల్ల విగ్రహం మరియు రామాలయం లోని భక్తుల చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. రామ్ లల్లా విగ్రహానికి గులాల్ పూశారు.
భక్తులు స్వామి వారికి ధూప దీపాలను సమర్పించే పవిత్రమైన రోజు కావడంతో శ్రీరాముని దర్శనం కోసం భక్తులు ఆలయానికి తరలి వచ్చారు. మార్చి 24 మరియు 25 తేదీలలో దేశ వ్యాప్తంగా ప్రజలు హోలీని జరుపుకుంటారు.
రామ జన్మభూమి ప్రధాన అర్చకులు ఆచార్య సత్యేంద్ర ఈ విషయాన్ని తెలిపారు.
“ఈసారి మేము హోలీని గొప్పగా, పవిత్రంగా మరియు అంకిత భావంతో జరుపుకుంటాము. ఈ సంవత్సరం హోలీ అద్భుతంగా ఉంటుంది. రామ్ లాల్లాకి గులాల్ పూస్తాం. గుజియా, హల్వా వంటి ప్రముఖ వంటకాలను నైవేద్యం గా పెడతాము.. పండుగ సీజన్ కావడంతో వేలాది మంది భక్తులు తరలి వస్తున్నారు’’ అని తెలిపారు..
More News...
<%- node_title %>
<%- node_title %>
శ్రీ శ్రీనివాస ఆంజనేయ భవాని శంకర దేవాలయంలో ఘనంగా శ్రీ కృష్ణాష్టమి వేడుకలు

ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రజావాణి పలు సమస్యలపై వినతులు స్వీకరించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

పశువైద్యశాల నిర్మాణానికి భూమి పూజ చేసిన ఎమ్మెల్యే డా .సంజయ్ కుమార్

గోధుర్ శ్రీ లక్ష్మి నరసింహ స్వామి గుడికి ₹2 లక్షల నిదుల ప్రొసీడింగ్

గాంధీ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్ళిన పి.వై.ఎల్ నాయకులు

పాత గొడవల నేపధ్యంలో హత్య, ఇద్దరికి జీవిత ఖైదు
.jpeg)
గొల్లపల్లిలో సామూహిక శ్రీ విశ్వకర్మ వ్రతం

బాధితుల సమస్యల పరిష్కారానికే గ్రీవెన్స్ డే_ జిల్లా ఎస్పీ శ్రీ అశోక్ కుమార్

పాక్ జట్టుతో భారత జట్టు కరచాలనం చేయకపోవడంపై పాక్ నిరసన

వక్ఫ్ చట్టంపై స్టే నిరాకరణ - కొన్ని సెక్షన్ల నిలుపుదల - సుప్రీంకోర్టు మధ్యంతర తీర్పు

పేదింటి ఆడబిడ్డ సానియా బేగం వివాహానికి ఎమ్మెల్యే సహాయం

ఎంబిబిఎస్ సీటు సాధించిన అమన్ కాణం కు ₹10, వేలు అందించిన సూరజ్ శివ శంకర్
