పర్యావరణ రక్షణలో అందరి భాగస్వామ్యం ఉండాలి
నేడు జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం
(డిసెంబర్ 2వ తేదీ )
--డాక్టర్. వై. సంజీవ కుమార్,
ఫౌండర్ & ప్రెసిడెంట్,
స్కై ఫౌండేషన్.
9393613555,
9493613555.
సృష్టిలో జీవం మనుగడ తీసుకునే శ్వాస మీద ఆధారపడి ఉంటుంది. ఆ శ్వాస పర్యావరణంపైనా ఆధారపడుతుంది. ఆ పర్యావరణం కాలుష్యం అయితే జీవం మనుగడ ప్రమాదంలో పడుతుంది, ఉనికే లేకుండా పోతుంది. అలాంటి కాలుష్యాన్ని నియంత్రించుకోవడానికి అవగాహనా కలిపించే విధంగా . ప్రతి సంవత్సరం డిసెంబర్ 2న జరుపుకునే జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవం జరుపుకుంటారు.
పర్యావరణం కాలుష్యమైతే గాలి, నీరు, నేల ప్రమాదకరంగా మారుతుంది, జీవించే ప్రాణులు తీసుకునే శ్వాస, ఆహారం అన్ని హానికరంగా మారుతాయి. ముఖ్యంగా కాలుష్యం పెరగడానికి కారణాలు కర్మాగారాలు, వాహనాలు, చెత్త మరియు రసాయనాలు వంటి వివిధ వనరులు. కాలుష్యం పర్యావరణ వ్యవస్థల సహజ సమతుల్యతను దెబ్బతీస్తుంది,
రసాయనాలు, ప్లాస్టిక్‌లు లేదా వ్యర్థాలు వంటి హానికరమైన పదార్థాలు నదులు, సరస్సులు, మహాసముద్రాలు వంటి నీటి వనరులను కలుషితం చేసినప్పుడు నీటి కాలుష్యం సంభవిస్తుంది. కలుషితమైన నీరు జలచరాలను ప్రభావితం చేస్తుంది, పర్యావరణ వ్యవస్థలకు హాని కలిగిస్తుంది. త్రాగడానికి, ఇతర వినియోగాలకు, నీటిపారుదల కోసం దానిపై ఆధారపడే అందరికి తీవ్రమైన ఆరోగ్య ప్రమాదాలను కలిగిస్తుంది.
హానికరమైన రసాయనాలు, వ్యర్థాలు, ఇతర పదార్థాలు నేల సారాన్ని, నాణ్యతను క్షీణింపజేసినప్పుడు నేలలో కాలుష్యం చేరుతుంది, కలుషితమైన నేల మొక్కల పెరుగుదలను ప్రభావితం చేస్తుంది, వ్యవసాయ ఉత్పాదకతను తగ్గిస్తుంది, పండించే పంటలో నాణ్యత తగ్గుతుంది, నేలలో నివసించే జీవులకు హాని కలిగిస్తుంది.
ట్రాఫిక్, నిర్మాణం, పారిశ్రామిక యంత్రాలు, పెద్ద పెద్ద ధ్వనులతో వచ్చే సంగీతం, పెద్ద అర్థనాదాహాలతో నడిపే వాహనాలు కలిగించే హానికరమైన అధిక స్థాయి శబ్దాన్ని శబ్ద కాలుష్యంగా మారుతుంది. పర్యావరణాన్ని ప్రభావితం చేస్తుంది, మనుషులమీద, జంతువుల మీద తీవ్ర ఒత్తిడి ఏర్పడి వినికిడి లోపానికి దారితీస్తుంది. వాతావరణంలోకి హానికరమైన వాయువులు, కణాలు , కార్బన్డయాక్సిన్ కలిగిన పేలుడు పదార్థాలు, వివిధ రసాయనాలను విడుదల చేయడం వాయు కాలుష్యం కాలుష్యం ఏర్పడి శ్వాసకోశ వ్యాధులు, గుండె జబ్బులు, క్యాన్సర్ వంటి తీవ్రమైన ఆరోగ్య సమస్యలకు దారితీస్తుంది.
మనిషి ప్రాణానికి కారణం అవుతుంది. వాతావరణ మార్పును వేగవంతం చేయడంలో వాయు కాలుష్యం కీలక పాత్ర పోషిస్తుంది. మానవులలో ఆరోగ్య సమస్యలు, జంతువుల అకాల మరణాలు, మొక్కల పెరుగుదల, ఆహారంలో విటమిన్లు లోపించడం లాంటి సమస్యలకు దారితీస్తుంది.
ప్రతి ఒక్కరు కాలుష్య నియంత్రణ గురించి ఆవాహన పెంచుకోవాలి, ఇతరులకు అవహగాన కలిపించాల్సిన బాధ్యత ఉంది. కాలుష్యం గురించి అవగాహన పెంచడం. వివిధ రకాల కాలుష్యాలు - గాలి, నీరు, నేల మరియు శబ్దం మరియు ఆరోగ్యం, పర్యావరణ వ్యవస్థలు, వాతావరణంపై వాటి హానికరమైన ప్రభావాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడం. భోపాల్ గ్యాస్ విషాద బాధితులను గౌరవించడం 1984లో జరిగిన విషాదకరమైన భోపాల్ గ్యాస్ విపత్తులో ప్రాణాలు కోల్పోయిన వారికి, బాధితులైన వారిని స్మరించుకోవడానికి, పరిశ్రమలలో కఠినమైన భద్రతా చర్యల అవసరాన్ని నిర్దిష్టంగా చెప్పాలి.
పరిశుభ్రమైన పద్ధతులను ప్రోత్సహించడం పరిశ్రమలు, వ్యాపారాలు , వ్యక్తులు వ్యర్థాలను తగ్గించడం, పునరుత్పాదక ఇంధన వనరులను ఉపయోగించడం వంటి పర్యావరణ అనుకూల పద్ధతులను ఉపయోగించేలా ప్రోత్సహించడం. పర్యావరణ విధానాలకు మద్దతు ఇవ్వడం కాలుష్యాన్ని తగ్గించడం, సహజ వనరులను రక్షించడం లక్ష్యంగా చట్టాలకు, నిబంధనలకు మద్దతు ఇవ్వాలి. సమాజ భాగస్వామ్యాన్ని ప్రోత్సహించాలి,
చెట్ల పెంపకం కార్యక్రమాలు, శుభ్రపరిచే ప్రచారాలు, రీసైక్లింగ్ కార్యక్రమాలు వంటి పర్యావరణ పరిరక్షణ ప్రయత్నాలలో సమాజాలను చురుకుగా పాల్గొనేలా ప్రేరేపించేలా చర్యలు తీసుకోవాలి. మానవాళికి, సమస్త జీవకోటికి నష్టం కలిగించే వాటి పట్ల ప్రభుత్వ చట్టాలు కఠినంగా రూపొందించాలి, అమలుపరచాలి. చిన్నప్పటినుంచే విద్యార్థులకు కాలుష్యం, పర్యావరణం గురించి బోధించాలి, ప్రతి ఒక్కరికి అవగాహనా కలిపించాలి. -------
More News...
<%- node_title %>
<%- node_title %>
తుమ్మేనాల ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయురాలు శిరీష కు ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం
ధర్మపురి సెప్టెంబర్ 5( ప్రజా మంటలు )మండలంలోని "తుమ్మేనాల" ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయురాలుగా పనిచేస్తున్న "సముద్రాల శిరీష" జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ సందర్భంగా ఉత్తమ ఉపాధ్యాయురాలుగా ఎంపికైంది.
శనివారం జిల్లా కేంద్రంలో ఉత్తమ ఉపాధ్యాయ పురస్కార కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు డా. సంజయ్ కుమార్ జిల్లా అదనపు కలెక్టర్ రాజా గౌడ్ జిల్లా విద్యాధికారి... సమస్యల పరిష్కారం కోసం ఛలో హైదరాబాద్
జగిత్యాల సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు)జిల్లా జేఏసీ ఆధ్వర్యంలో ఛలో హైదరాబాద్ పోస్టర్ ఆవిష్కరణఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల కాంట్రాక్టు ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం టీజీఈజేఏసీ రాష్ట్ర చైర్మన్ మారం జగదీశ్వర్ మరియు సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాస్ రావు ల పిలుపు మేరకు సెప్టెంబర్ 10న నిర్వహించనున్న... ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా సీఎం చేతుల మీదుగా అవార్డు స్వీకరించిన మల్యాల ప్రిన్సిపల్ శివరామకృష్ణ
మల్యాల సెప్టెంబర్5 (ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా మల్యాల మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ప్రిన్సిపల్ గా విధులు నిర్వహిస్తున్న మోతే శివరామకృష్ణ జాతీయ ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేతుల మీదుగా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు పొందారు. విద్యార్థుల సర్వతోముఖ అభివృద్ధికి కళాశాల అభివృద్ధికి ఆయన చేసిన కృషికి... తెలంగాణ నీటి హక్కులను హరిస్తున్నా సీఎం మౌనమెందుకు?
హక్కులు కాపాడాల్సిన ముఖ్యమంత్రే ఏపీకి వంత పాడటం దౌర్భాగ్యం
కృష్ణా జలాల్లో తెలంగాణకు అన్యాయానికి మొదటి ముద్దాయి బీఆర్ఎస్సే
హైదరాబాద్, సెప్టెంబర్ 5 (ప్రజా మంటలు):కృష్ణా జలాల విషయంలో తెలంగాణ ప్రయోజనాలకు అన్యాయం జరుగుతున్నప్పటికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి మౌనం వహిస్తున్నారని తెలంగాణ రక్షణ సేన రాష్ట్ర నాయకులు కామెర నవీన్‌కుమార్ ఆరోపించారు. కృష్ణా నదీ... శ్రీ కృష్ణాష్టమి సందర్భంగా "రుద్రాంగి ఈశాన్వి" గోపిక వేషధారణ
జగిత్యాల సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు)జిల్లా కేంద్రంలో శ్రీకృష్ణ జన్మాష్టమి పురస్కరించుకొని విద్యాసంస్థల్లో పాఠశాల చిన్నారులచే కృష్ణాష్టమి జన్మ వేడుకల్లో భాగంగా ఉట్టికొట్టే కార్యక్రమం తో పాటు శ్రీకృష్ణుని గోపిక వేషధారణలు అలరించాయి.
ఇదిలా ఉండగా రుద్రాంగి రాఘవేంద్ర శ్రీవిద్య కూతురు రుద్రంగి ఈశాన్వి గౌతమ్ మోడల్ స్కూల్ లో నిర్వహించిన కృష్ణాష్టమి వేడుకల్లో... రైతు రాజ్యం రావాలంటే కేసీఆర్‌ను మళ్లీ అధికారంలోకి తీసుకురావాలి
రాయికల్, సెప్టెంబర్ 4 (ప్రజా మంటలు):
రాష్ట్ర ప్రభుత్వ వెయ్యి రోజుల పాలనలో రైతులకు ఇచ్చిన హామీలు అమలు కాలేదని ఆరోపిస్తూ, రైతు సమస్యల పరిష్కారం కోసం పోరాటాన్ని ఉధృతం చేయాలని బీఆర్ఎస్ పార్టీ పిలుపునిచ్చింది. పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు రాయికల్ పట్టణంలో బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, రైతులు భారీ ర్యాలీ నిర్వహించారు.... సీఎం రేవంత్ రెడ్డి నమ్మకాన్ని నిలబెట్టుకుంటా - విజయలక్ష్మి
హైదరాబాద్ సెప్టెంబర్ 03 (ప్రజా మంటలు):
తెలంగాణ రాష్ట్ర ప్రణాళికా బోర్డు వైస్ చైర్‌పర్సన్‌గా, క్యాబినెట్ మంత్రి హోదాతో తనకు కీలక బాధ్యతలు అప్పగించిన కాంగ్రెస్ అధిష్ఠానానికి, రాష్ట్ర నాయకత్వానికి రుణపడి ఉంటానని గద్వాల్ విజయలక్ష్మి తెలిపారు. ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని ఆమె పేర్కొన్నారు.
తనకు ఈ బాధ్యతలు... త్రాగునీటి సమస్య పై ఆర్డీవోకు వినతి పత్రం అందజేసిన బిజెపి నాయకులు
గుంతకల్ సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు)ప్రజా సమస్యల పైన స్థానిక గుంతకల్ ఆర్డీవో కి వినతి పత్రం అందించిన బిజెపి నాయకులు ఈ సంవత్సరం తక్కువ వర్షం నమోదు కావడం వలన పట్టణంలో దాదాపుగా వారానికి ఒకసారి నీళ్లు వదలడం జరుగుతుంది. అందువలన పట్టణ ప్రజలు తాగడానికి మరియు వాడుకోవడానికి నీళ్ల కోసం చాలా... జగిత్యాల మున్సిపాలిటీ ఎజెండాపై మాజీ కౌన్సిలర్ జయశ్రీ ఫిర్యాదు
జగిత్యాల, సెప్టెంబర్ 3 (ప్రజా మంటలు):
జగిత్యాల మున్సిపాలిటీలో డీజిల్, వాహనాల రిపేర్లు, పండుగల ఏర్పాట్లు, వాహనాల కొనుగోళ్లు, పాత బిల్లుల చెల్లింపులు తదితర అంశాల్లో ప్రజాధనం దుర్వినియోగం జరుగుతోందని ఆరోపిస్తూ మాజీ కౌన్సిలర్ హనుమండ్ల జయశ్రీ రాష్ట్ర మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్‌మెంట్ శాఖ కమిషనర్‌కు ఫిర్యాదు చేశారు. మున్సిపాలిటీ ఎజెండాలో పొందుపరిచిన... జగిత్యాల బీజేపీలో ముదిరిన అంతర్గత విభేదాలు
జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):
జగిత్యాల జిల్లా బీజేపీలో చాలాకాలంగా అంతర్గతంగా కొనసాగుతున్న విభేదాలు ఇప్పుడు బహిరంగ రాజకీయ పోరుగా మారుతున్న సంకేతాలు కనిపిస్తున్నాయి. నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ వ్యవహారశైలిపై కొందరు సీనియర్ నాయకులు, కార్యకర్తలు అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇటీవల రహస్య సమావేశం నిర్వహించినట్లు ప్రచారం జరుగుతోంది. జగిత్యాల, కోరుట్ల నియోజకవర్గాలకు చెందిన... బ్రాహ్మణ సంక్షేమానికి ప్రభుత్వం పూర్తి సహకారం - ఆర్థిక మంత్రి భట్టి
హైదరాబాద్, సెప్టెంబర్ 2 (ప్రజా మంటలు):
తెలంగాణ బ్రాహ్మణ సంక్షేమ పరిషత్‌కు పెండింగ్‌లో ఉన్న నిధులను వెంటనే విడుదల చేయాలని పరిషత్ చైర్మన్ బసవరాజు శ్రీనివాస్ కోరారు. రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి దుదిళ్ల శ్రీధర్‌బాబు నేతృత్వంలో రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి, ఆర్థిక శాఖ మంత్రి మల్లు భట్టి విక్రమార్కను కలిసి ఆయన ఈ మేరకు... ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు విడుదల చేయాలని ఎమ్మెల్యేకు వినతి
జగిత్యాల, సెప్టెంబర్ 2 (ప్రజామంటలు):
పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరుతూ తెలంగాణ రాష్ట్ర డిగ్రీ, పీజీ కళాశాలల అసోసియేషన్ ప్రతినిధులు జగిత్యాల ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్‌కు వినతిపత్రం అందజేశారు.
స్థానిక రామకృష్ణ డిగ్రీ కళాశాల కరస్పాండెంట్, రాష్ట్ర సంఘం ప్రధాన కార్యదర్శి యాద రామకృష్ణ, నలంద డిగ్రీ... 