100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? MLA సంజయ్ కుమార్ ప్రశ్న
రాష్ట్రంలో అత్యధిక నిధులు నా నియోజకవర్గానికి వచ్చాయ్
ప్రజా జీవితం లో ఉన్న వారిపై బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది : సంజయ్
జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు):
100 కోట్ల భూకబ్జా వ్యవహారం లో నాపాత్ర ఏమిటి? మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ మున్సిపల్ ఛైర్మన్ బాగా శ్రావణులు కూడా ఆ వ్యాపారితో సంబంధాలు కలిగి ఉన్నారు.వారందరికీ లేనిది నాకు ఉన్న ప్రత్యేకత ఏమిటో వారే చెప్పాలని ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ప్రశ్నించారు.
మొదటిసారిగా, మొన్నటివరకు BRS కార్యాలయంగా ఉన్న జగిత్యాల మోతే రోడ్డు పార్టీ కార్యాలయంను, కాంగ్రెస్ పార్టీ కార్యాలయంగా మార్చి, అందులో ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ మీడియా సమావేశం నిర్వహించారు.
ప్రజా జీవితం లో బురద జల్లే ప్రయత్నం చేయడం పరిపాటిగా మారింది.నిరాధార ఆరోపణలు చేయటం మానుకోవాలి.73ఏండ్ల క్రితం జరిగిన విషయాన్ని 7 ఏండ్ల క్రితం ఎమ్మెల్యే అయిన నాపై మాజీ మున్సిపల్ చైర్మన్ శ్రావణి గారు ఆరోపణలు అర్థరహితం ఆది వారి విజ్ఞతకే వదిలేస్తున్నానని ఎమ్మెల్యే సంజయ్ అన్నారు.

జగిత్యాలలో నాకు అన్ని వర్గాల స్నేహితులు ఉన్నారు వ్యాపారవేత్తలు కూడా ఉన్నారు.ప్రభుత్వ ఆస్తుల అన్యాక్రాంతం కావడంలో నా మద్దతు ఎప్పటికీ ఉండదు.
నాపై ఆరోపణలు చేసిన మాజీ మున్సిపల్ చైర్మన్ వివాద కాంప్లెక్స్ లో వ్యాపార ప్రారంబానీకి వెళ్లారు. అప్పుడు వారికి ఈ విషయం తెలియదా అని ఆయన ప్రశ్నించారు.
మాజీ మంత్రి జీవన్ రెడ్డి కూడా ఎంపీ ఎన్నికల ఓట్ల సందర్భంగా, వ్యాపారవేత్త ఇంటికి వెళ్ళి అల్పాహారం చేశారు.అప్పుడు కూడా ఆయనకు ఈ విషయం తెలుసు అనుకుంటాను. నా పై అసత్య ఆరోపణలు తీవ్రంగా ఖండిస్తున్నా...ఆరోపణలు చేసే ముందు ఆలోచన చేయాలీ.చట్ట వ్యతిరేక విధానాలకు మద్దతు నాకు నా కుటుంబానికి అవసరం లేదు ఉండదని సంజయ్ తెలిపారు.
నా జీవితం తెరచిన పుస్తకం జగిత్యాల ప్రజలందరికీ తెలుసు
బురద జల్లే ప్రయత్నం చేయడం వల్లనే బురద కడుక్కోవడానికి ప్రజలకు అన్ని విషయాలు తెలియాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది.ఏ విషయం లో నైనా మీడియా ప్రతినిధులకు వివరణ ఇస్తా అసత్య ప్రచారాలు,వార్తలు రాయవద్దని కోరుతున్న.. అన్ని వేళలా ప్రింట్ ఎలక్ట్రానిక్ మిత్రులు అండగా ఉన్నారని తెలిపారు.
రాష్ట్రంలో అత్యధిక నిధులు నా నియోజకవర్గానికి వచ్చాయ్
అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ఫండ్ కింద బ్యాంక్ లోన్ ద్వారా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిధులు సేకరించి జగిత్యాల కు అత్యధికంగా 50 కోట్లు నిధులు మంజూరు చేయగా,ఆర్మూరు 18.70 కోట్లు, బోధన్ 18.70 కోట్లు నిజామాబాద్ కు 32 కోట్లు మాత్రమే మంజూరు చేసిందని సంజయ్ తెలిపారు.
నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రాష్ట్రాలకు అప్పుగా వచ్చింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 7 ఏండ్ల లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది.నేషనల్ హౌసింగ్ బ్యాంక్ ద్వారా రాష్ట్రం జగిత్యాల కు 50 కోట్లు,రాష్ట్ర ప్రభుత్వం నిధులు 12 కోట్లు మొత్తం గా 62.50 లక్షల కోట్లు,రాయికల్ పట్టణ అభివృద్ధి కి 15 కోట్లు మంజూరు చేయటం జరిగిందని అన్నారు.
కేంద్ర ప్రభుత్వం నిధులు మంజూరు చేశారని చెప్పడం వారి అవగాహన లోపం.జగిత్యాల అభివృద్ది కి అందరితో కలిసి పనిచేస్తా...
ప్రజల డబ్బు ప్రజలకు అందించే విదంగా కృషి చేయటం ప్రజా ప్రతినిధులు బాధ్యత
నిధులు తెస్తే ఓర్వలేకనే జగిత్యాల అభివృద్దికి అడ్డం పడే ప్రయత్నం చేస్తున్నారు - సంజయ్
కేంద్రీయ విద్యాలయం.. జగిత్యాల తిప్పన్న పెట్ బ్లాక్ స్పాట్ రోడ్డు, రోళ్ళవాగు పర్యావరణ అనుమతులు పరిష్కారం తదితర ప్రతిపాదనలు ఎంపీ గారి దృష్టికి తీసుకెళ్లడం నా వంతు బాధ్యత..
కేంద్ర రాష్ట్రాలు కలిసి పనిచేస్తే అభివృద్ధి సాధ్యం...
రాజకీయాల్లో విలువలు ప్రదానం...
నష్ట పరిహారం చెల్లించి యావర్ రోడ్డు విస్తరణ చేయటం నా ప్రధాన అతి ముఖ్యమైన లక్ష్యం...
జగిత్యాల ప్రజలు చైతన్య వంతులు వారికి అన్ని తెలుసునని అన్నారు.
138 సర్వే నంబర్ భూమిలో ఉన్న కృష్ణ పెట్రోల్ బంక్,బాలకృష్ణ బార్ స్వాగత్ బార్ లు ఇతర వ్యాపార సముదాయాలు జగిత్యాల మున్సిపల్ భూమికి సంబంధించి చట్ట విరుద్ధం గా ఉన్నట్లయితే అట్టి సముదాయాల పై తగుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ను కోరుతున్నాని , ఆమేరకు లేఖ రాసినట్లు తెలిపారు.
ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గోలి శ్రీనివాస్, బాలే శంకర్, క్యాదసు నాగయ్యా చెట్పల్లి సుధాకర్, ముస్కు నారాయణ రెడ్డి, కుసరి అనిల్, బద్దం జగన్ పంబల రాము, కాంగ్రెస్ నాయకులు దుమాల రాజ్ కుమార్, శ్రీనివాస్, తిరుమలయ్య, బోడ్ల జగదీష్, అహమ్మద్, కోరే గంగమల్లు, రామ్మోహన్ రావు, గుర్రం రాము క్యాదసు నవీన్, కూతురు శేఖర్ అరుముల్ల పవన్, దాసరి ప్రవీణ్, పోతునుక మహేష్, లవంగ రాజేందర్, రామకృష్ణ రెడ్డి, శరత్ రావు, రంగు మహేష్ శ్రీరామ్ భిక్షపతి, ప్రవీణ్ రావు, గౌస్, వంశీబాబు, గంగాధర్, తదితరులు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
పెళ్లి ముందు వరదలో సర్వం కోల్పోయిన కుటుంబానికి కవిత సాయం
వరదలో సర్వం కోల్పోయిన హన్మకొండ కుటుంబానికి రూ.50 వేల సాయం
హన్మకొండ నవంబర్ 08 (ప్రజా మంటలు):
ఇటీవల వరదలతో తీవ్రంగా నష్టపోయిన సమ్మయ్యనగర్ కుటుంబానికి తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత అండగా నిలిచారు.
మొగసాని వెంకటేశ్వర్లు – రజిత దంపతుల కుమారుడు భగత్ వివాహం ఈ నెల 26న జరగాల్సి ఉంది. కానీ... ఎస్.ఎస్. రాజమౌళి కొత్త సినిమా లుక్ విడుదల – పృథ్వీరాజ్ సుకుమారన్ “కుంభ” పాత్రతో చర్చల్లోకి
రాజమౌళి కథ — ఊహలకు అతీతం
హైదరాబాద్ నవంబర్ 08:
దర్శకధీరుడు ఎస్.ఎస్. రాజమౌళి తన కొత్త చిత్రానికి సంబంధించిన తొలి పోస్టర్‌ను విడుదల చేశారు.పృథ్వీరాజ్ సుకుమారన్ “కుంభ” అనే పాత్రలో వీల్‌చెయిర్‌లో కూర్చొని తీక్షణంగా చూస్తూ కనిపిస్తున్నారు.రామాయణం ఆధారంగా నిర్మిస్తున్న “ఎస్.ఎస్.ఎస్.ఎం.బి 2” చిత్రంపై ఊహాగానాలు మరింత వేడెక్కాయి.
ప్రపంచ ప్రఖ్యాత... షేప్ ఆఫ్ మొమో” నేపాలీ చిత్రం మూడు అంతర్జాతీయ చలనచిత్రోత్సవాల్లో
త్రిబేని రాయ్ – ఒక కొత్త స్వరం
గ్యాంగ్టాక్ నవంబర్ 08:
సిక్కిం రాష్ట్రానికి చెందిన యువ దర్శకురాలు త్రిబేని రాయ్ తీసిన తొలి నెపాలి చిత్రం “షేప్ ఆఫ్ మొమో” ఇప్పుడు దేశీయ, అంతర్జాతీయ స్థాయిలో విశేష గుర్తింపు పొందుతోంది. ఈ చిత్రం మూడు ప్రముఖ చలనచిత్రోత్సవాల్లో పోటీలో నిలవడం సిక్కిం సినీమా ప్రపంచానికి... జోహ్రాన్ మమ్దానీపై డీఎస్ఏ ఒత్తిడి – ఇజ్రాయెల్ వ్యతిరేక అజెండా బయటకు!
న్యూయార్క్, నవంబర్ 8:అమెరికాలోని Democratic Socialists of America (DSA) న్యూయార్క్ శాఖ, త్వరలో పదవీ బాధ్యతలు స్వీకరించబోయే మేయర్-ఎలెక్ట్ జోహ్రాన్ మమ్దానీపై తీవ్ర ఒత్తిడి తేవాలని యోచిస్తున్నట్లు లీకైన పత్రాలు వెల్లడించాయి.
Just The News బయటపెట్టిన సమాచారం ప్రకారం, DSA యొక్క “ఆంటీ-వార్ వర్కింగ్ గ్రూప్” జోహ్రాన్ మమ్దానీకి అమలు... ఉప ముఖ్యమంత్రి భట్టి డిల్లీ ఇంటిపై ఐ టి దాడులు – హరీశ్‌రావు సంచలన ఆరోపణలు!
హైదరాబాద్, నవంబర్ 8 (ప్రజా మంటలు):
తెలంగాణ మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే తన్నీరు హరీశ్‌రావు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయి విమర్శలు గుప్పించారు. ఢిల్లీలో మల్లు భట్టి విక్రమార్క ఇంటిపై జరిగిన ఐటీ దాడులు బీజేపీతో ఉన్న గోప్య ఒప్పందంలో భాగమని ఆరోపించారు.
హరీశ్‌రావు మాట్లాడుతూ “భట్టి ఇంట్లో ఐటీ దాడులు జరిగితే... iPhone 18 Air వివరాలు లీక్: మొదటిసారిగా అల్ట్రా-స్లిమ్ డిజైన్‌తో వస్తుందా?
అల్ట్రా-స్లిమ్ డిజైన్‌లో కొత్త తరహా రూపం
హైదరాబాద్ నవంబర్ 08:
ఆపిల్ అభిమానులకు మరో ఉత్సాహకరమైన వార్త. తాజాగా లీకైన సమాచారం ప్రకారం, కంపెనీ తన కొత్త iPhone 18 Air మోడల్‌పై పనిచేస్తోంది. ఈ స్మార్ట్‌ఫోన్ ప్రత్యేకత — అల్ట్రా-స్లిమ్ డిజైన్.
మునుపటి iPhone Air మోడల్ కేవలం 5.6mm మందంతో వచ్చిన విషయం... తిరుమలగిరిలో సీసీటీవీ కెమెరాలను ప్రారంభించిన ఏసిపి
సికింద్రాబాద్ నవంబర్ 08 (ప్రజా మంటలు):
తిరుమలగిరి చిన్నకమేల శ్రీ హనుమాన్ టెంపుల్ యూత్ అసోసియేషన్ సభ్యులు మహేష్, జోసెఫ్, శివ, అనిల్ తదితరులు ఆలయం మరియు పరిసర ప్రాంతాల్లో కొత్త సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి తిరుమలగిరి ACP రమేష్ హాజరై కెమెరాలను ప్రారంభించారు. యువత చూపిన చొరవ ప్రశంసనీయమని అన్నారు.... ACN చానల్ అధినేత అన్వర్ ను పరామర్శించిన MLA సంజయ్
జగిత్యాల నవంబర్ 08 (ప్రజా మంటలు):
జగిత్యాల ACN చానల్ అధినేత అన్వర్ భాయ్ తల్లి మరణించగా, వారి కుటుంబ సభ్యులను ఎమ్మెల్యే డా సంజయ్ కుమార్ పరామర్శించి, తన ప్రగాఢ సానుభూతి తెలిపారు.
ఆయన వెంట నాయకులు అబ్దుల్ ఖాదర్ ముజాహిద్ ఖాజిం అలీ ఫిరోజ్ సర్వర్ మున్నా భాయ్ కుతుబ్ తదితరులు ఉన్నారు.... ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్ కొత్త అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్
సికింద్రాబాద్, నవంబర్ 8 (ప్రజామంటలు):
ఆర్య వైశ్య సంఘం తుకారాంగేట్ నూతన పదవుల నియామకాలు పూర్తయ్యాయి. అధ్యక్షుడిగా మల్లవోలు శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శిగా నాగబండి శ్రీనివాస్, కోశాధికారిగా నూకల నర్సింగ్‌రావు, ఉపాధ్యక్షులుగా కర్ణకోట శ్రీనివాస్, కొడరపు అశోక్ నియమితులయ్యారు.
ఈ సందర్భంగా కొత్త అధ్యక్షుడు మల్లవోలు శ్రీకాంత్ మాట్లాడుతూ... సంఘం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషి... నల్లగుట్ట నాలా స్ట్రెచ్‌లో హైడ్రా స్పెషల్ డ్రైవ్ :: స్టోర్మ్ వాటర్ డ్రెయిన్‌లలో సిల్ట్ తొలగింపు
పనులు పరిశీలించిన కార్పొరేటర్ చీర సుచిత్ర శ్రీకాంత్
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :
గత వారం రోజులుగా నల్లగుట్ట నాలా స్ట్రెచ్ ప్రాంతంలో హైడ్రా ఆధ్వర్యంలో చేపట్టిన ప్రత్యేక డ్రైవ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా స్టోర్మ్ వాటర్ డ్రెయిన్‌లలో పేరుకున్న సిల్ట్, చెత్తను తొలగించే పనులను సిబ్బంది చేస్తున్నారు. రామ్గోపాలపేట డివిజన్ కార్పొరేటర్ చీర... తెలంగాణ పునర్నిర్మాణంలో సీఎం రేవంత్ కీలకపాత్ర ::: పీసీసీ వైస్ ప్రెసిడెంట్ డా. కోట నీలిమ
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) :
తెలంగాణ పునర్నిర్మాణంలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి కీలకపాత్ర పోషిస్తున్నారని పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్‌నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ ఇన్‌చార్జి డాక్టర్ కోట నీలిమ అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డి జన్మదినం సందర్భంగా శనివారం సనత్‌నగర్ నియోజకవర్గంలోని పలు డివిజన్లలో జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు.
శ్యామలకుంటలో కంజర్ల విజయలక్ష్మి యాదవ్ ఆధ్వర్యంలో... గాంధీ మెడికల్‌కాలేజీలో ఇంటెన్సివ్ ఆర్థోపెడిక్స్ పీజీ టీచింగ్ ప్రోగ్రాం
సికింద్రాబాద్, నవంబర్ 08 (ప్రజామంటలు) : గాంధీ మెడికల్‌కాలేజీ ఆర్థోపెడిక్స్‌విభాగం ఆధ్వర్యంలో ఐఓఏ ఆర్థోపెడిక్స్‌పోస్ట్‌గ్రాడ్యుయేట్‌టీచింగ్‌ప్రోగ్రాం విజయవంతంగా నిర్వహించారు. రెండు రోజులపాటు జరిగిన ఈ ఇంటెన్సివ్ అకాడెమిక్ కార్యక్రమంలో రాష్ట్రవ్యాప్తంగా వచ్చిన 200 మందికి పైగా పీజీ విద్యార్థులు పాల్గొన్నారు.
విద్యార్థులకు క్లినికల్‌నైపుణ్యాలను, డయగ్నస్టిక్‌అవగాహనను పెంపొందించేలా రూపొందించిన ఈ కార్యక్రమంలో పేషెంట్‌ఎగ్జామినేషన్, క్లినికల్‌చర్చలు, కేస్‌బేస్డ్‌డిస్కషన్‌లు, హ్యాండ్స్‌ఆన్‌ట్రైనింగ్‌వంటి అంశాలు... 