జగిత్యాల శ్రీ కోదండ రామాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ zp ఛైర్పర్సన్ దావా వసంత ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో స్వామి వారికి వెండి ఆభరణాల సమర్పణ
జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావా వసంత సురేష్ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా జీవన్ రెడ్డి కి ఆలయ కమిటీ సభ్యులు, భక్తులు ఘన స్వాగతం పలికారు. మేళతాళాల నడుమ, “జై శ్రీరామ్” నినాదాలతో ఆలయ ప్రాంగణం మార్మోగింది. భక్తులు సేకరించిన విరాళాలతో తయారు చేసిన వెండి ఆభరణాలు — స్వామి కిరీటం, దనుస్సు, ఖడ్గం, సీతమ్మ వారికి హారం — స్వామివారికి సమర్పించారు. అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వచనాలు చేశారు.
తరువాత మాట్లాడిన జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ, “జగిత్యాల ప్రసిద్ధ కోదండ రామాలయం భక్తుల భక్తిశ్రద్ధలకు నిలువెత్తు నిదర్శనం. కార్తీక పౌర్ణమి రోజున భక్తులు స్వామివారికి కిరీటం సమర్పించడం హర్షణీయమైన విషయం. శ్రీరాముడు ఆదర్శ పురుషుడు. మనందరం ఆయన విలువలను అనుసరించి సమాజంలో ఐక్యత, శాంతి నెలకొల్పాలి,” అన్నారు.
అలాగే ఆయన దేవాలయ ఆస్తుల పరిరక్షణపై ప్రత్యేకంగా ప్రస్తావిస్తూ, “రాజకీయాలకు అతీతంగా భక్తులు దేవాలయాల రక్షణలో ముందుండాలి. విద్యానగర్ రామాలయం పునర్నిర్మాణం భక్తుల స్వయంకృషితో సాధ్యమైందని,” అన్నారు.
జగిత్యాల కోదండ రామాలయానికి రూ.20 లక్షలు, విద్యానగర్ రామాలయానికి రూ.20 లక్షలు — మొత్తం రూ.40 లక్షలు మంజూరు అయ్యాయని, త్వరలో పనులు ప్రారంభమవుతాయని తెలిపారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
బెంగాల్ లో SIR భయం.. ఎనిమిది మంది ఆత్మహత్యలు: TMC ఆరోపణ
కోల్‌కతా, నవంబర్ 05:
పశ్చిమ బెంగాల్‌లో ఓటర్ జాబితా ప్రత్యేక పునర్విమర్శ (SIR) నేపథ్యంలో ఆందోళన పెరుగుతోంది. ఈ భయంతో ఇప్పటివరకు రాష్ట్రంలో ఎనిమిది మంది ఆత్మహత్యలు చేసుకున్నారని టీమ్‌సీ (TMC) ఆరోపించింది.
తాజాగా దక్షిణ 24 పరగణాల జిల్లాలోని భాంగర్ ప్రాంతానికి చెందిన సఫికుల్ గాజీ (57) అనే వ్యక్తి తన అత్తింటి వద్ద... “హర్యానా ఎన్నికల్లో లక్షల ఫేక్ ఓట్లు”: రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు
నవంబర్ 05, న్యూఢిల్లీ (ప్రజా మంటలు):
హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విస్తృత స్థాయిలో ఓటర్ల మోసం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నేత, ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. బ్రెజిల్ ఫోటోగ్రాఫర్ తీసిన ఒక మహిళా ఫోటోను వాడి, అదే చిత్రం 22 మంది ఓటర్లుగా ఎన్నికల జాబితాలో కనిపించిందని ఆయన వెల్లడించారు.
రాహుల్ గాంధీ... కడుపుతో ఉన్న కూతురిని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన తల్లిదండ్రులు – ప్రేమ వివాహం నేపథ్యంగా ఉద్రిక్తత
జగిత్యాల నవంబర్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజరాంపల్లిలో తల్లిదండ్రులే కూతుర్ని కిడ్నాప్ చేసేందుకు ప్రయత్నించిన సంఘటన కలకలం రేపింది.
ప్రియాంక తన తల్లిదండ్రులు, అక్క భర్త గుంజే కుమార్ మీద కిడ్నాప్ ప్రయత్నం మరియు మరణ బెదిరింపులపై ఫిర్యాదు చేసింది. తానూ తన భర్త రాకేష్ కూడా ప్రాణభయంతో ఉన్నామని,... ఆలూరు గ్రామ మత్స్య పారిశ్రామిక సహకార సంఘం ఏర్పాటు కోసం జీవన్ రెడ్డి కి వినతి
ముదిరాజ్ వృత్తి కుటుంబాలకు న్యాయం చేయాలంటూ మాజీ మంత్రి కలెక్టర్ కు లేఖ
జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్‌లో రాయికల్ మండలం, ఆలూరు రెవెన్యూ గ్రామ పరిధిలో మత్స్య పారిశ్రామిక (ముదిరాజ్) సహకార సంఘం ఏర్పాటు కోసం మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డికి... పోల్ బాల్ ఆలయంలో సామూహిక సత్యనారాయణ స్వామి వ్రతాలు
సికింద్రాబాద్,నవంబర్ 05 (ప్రజా మంటలు):
కార్తిక పౌర్ణమి సందర్భంగా బుధవారం సికింద్రాబాద్ పద్మారావు నగర్ లోని శ్రీ పోల్ బాల్ హనుమాన్ శివాలయంలో భక్తులు సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించారు. పవిత్ర కార్తీక మాసంలో వచ్చే పౌర్ణమి రోజున శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు ఆచరించడం ఎంతో విశేషమైన భాగ్యం అని వేద... జగిత్యాల శ్రీ కోదండ రామాలయంలో మాజీ మంత్రి జీవన్ రెడ్డి, మాజీ zp ఛైర్పర్సన్ దావా వసంత ప్రత్యేక పూజలు
కార్తీక పౌర్ణమి సందర్భంగా భక్తి శ్రద్ధలతో స్వామి వారికి వెండి ఆభరణాల సమర్పణ
జగిత్యాల (రూరల్) నవంబర్ 05 (ప్రజా మంటలు):
జగిత్యాల పట్టణంలోని శ్రీ కోదండ రామాలయంలో కార్తీక పౌర్ణమి సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్‌పర్సన్ దావా వసంత సురేష్ ప్రత్యేక పూజలు చేశారు.
ఈ సందర్భంగా... సిక్కింకు ప్రత్యామ్నాయ హైవే ప్రణాళిక – ఎంఫీ ఇంద్రా హాంగ్ సుబ్బా, BRO చర్చలు
సిక్కింకు ప్రత్యామ్నాయ హైవే మార్గంపై చర్చ – ఎంఫీ ఇంద్రా హాంగ్ సుబ్బా, BRO డైరెక్టర్ జనరల్ సమావేశం
ఉత్తర సిక్కింకు నిరంతర రవాణా, భద్రతా బలపాటుకు ప్రాధాన్యత
గ్యాంగ్‌టాక్: నవంబర్ 05 :
సిక్కింకు చెందిన లోక్‌సభ సభ్యుడు ఇంద్రా హాంగ్ సుబ్బా రాష్ట్రంలోని కీలక రోడ్డు మౌలిక సదుపాయాల అభివృద్ధి ప్రాధాన్యతలపై బోర్డర్... రేపిస్టులపై శిక్ష సమాజం ఇంకా కఠినత కోరుతున్నదా?
రేపిస్టులకు ఏ శిక్ష సరైనది? జయలలిత ప్రతిపాదన నుంచి నేటి సమాజ ఆలోచనలు
చెన్నై / హైదరాబాద్ నవంబర్ 0 5:
సమాజాన్ని కుదిపేసే అత్యాచార ఘటనలు వస్తూనే ఉన్నాయి. తాజాగా కోయంబత్తూరులో 20 ఏళ్ల విద్యార్థినిపై జరిగిన సామూహిక అత్యాచారం మళ్లీ ఒక ప్రశ్నను ముందుకు తెచ్చింది — రేపిస్టులకు సరైన శిక్ష ఏది?... కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం – ముగ్గురు తెలంగాణవాసుల మృతి
హల్లిఖేడ్ సమీపంలో వ్యాను, కారు ఢీకొన్న ఘటన
బెలగావి జిల్లా, కర్ణాటక నవంబర్ 05:
కర్ణాటక రాష్ట్రంలోని బెలగావి జిల్లా హల్లిఖేడ్ సమీపంలో ఈరోజు ఉదయం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో ముగ్గురు తెలంగాణవాసులు మృతి చెందారు. సమాచారం ప్రకారం, హైదరాబాద్ నుండి గోవా వైపు వెళ్తున్న కారును ఎదురుగా వస్తున్న వ్యాను ఢీకొట్టడంతో ప్రమాదం... చేవెళ్ల రోడ్డు ప్రమాదంపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ సుయో మోటో కేసు
అధికారుల నిర్లక్ష్యం, రోడ్డు భద్రతా లోపాలపై ఆందోళన వ్యక్తం చేసిన కమిషన్
హైదరాబాద్: నవంబర్ 05 (ప్రజా మంటలు):
రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలంలోని మీర్జాగూడ సమీపంలో ఇటీవల జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో 19 మంది మృతి చెందిన విషాద ఘటనపై తెలంగాణ మానవ హక్కుల కమిషన్ (TGHRC) సుయో మోటో కేసు (HRC... ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వం సంచలన నిర్ణయం — సంస్కరణల కమిటీ ఏర్పాటుకు జీవో జారీ
ప్రొఫెసర్ కంచ ఐలయ్య, ప్రొఫెసర్ కోదండరాంలకు స్థానం
హైదరాబాద్, నవంబర్ 04:
తెలంగాణ ప్రభుత్వం రాష్ట్రంలోని ఫీజు రీయింబర్స్‌మెంట్ విధానంలో సంస్కరణలు చేపట్టేందుకు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ సంబంధంగా మంగళవారం ప్రభుత్వం ఒక కమిటీ ఏర్పాటు చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేసింది.
ఫీజు రీయింబర్స్‌మెంట్ చెల్లింపుల్లో జాప్యాలు తగ్గించేందుకు తెలంగాణ ప్రభుత్వం సంస్కరణల... ఈశాన్య రాజకీయాల్లో కొత్త మార్పు సంకేతం — హిమంత బిశ్వ శర్మకు సవాల్ విసిరిన కొత్త మైత్రి కూటమి!
కొత్త రాజకీయ కూటమి అవతరించిన ఈశాన్య భారతదేశంలో, NEDA భవిష్యత్తుపై ప్రశ్నలు ఉత్పన్నమయ్యాయి. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని కూటమికి ఇది పెద్ద సవాలుగా మారే సూచనలు కనిపిస్తున్నాయి.
న్యూఢిల్లీ, నవంబర్ 04:
ఈశాన్య భారత రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. అసోం సీఎం హిమంత బిశ్వ శర్మ నేతృత్వంలోని **నార్త్... 