ఇంకెన్నాళ్లీ అంతర్యుద్ధం? కాంగ్రెస్ vs కాంగ్రెస్ — జగిత్యాల వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు

On
ఇంకెన్నాళ్లీ అంతర్యుద్ధం? కాంగ్రెస్ vs కాంగ్రెస్ — జగిత్యాల వేడెక్కుతున్న రాజకీయ సమీకరణాలు

176193767687145 ఏళ్ళ రాజకీయ జీవితం అర్ధంతరంగా ముగిసినా?
పార్టీలో పట్టుకోల్పోతున్నారా?
పదేళ్ల నాయకుడు సంజయ్ తో పోటీ పడలేకపోతున్నారా?

 

జగిత్యాల, అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
జగిత్యాల నియోజకవర్గం ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలోనే అంతర్యుద్ధానికి వేదికగా మారింది. అధికారపక్షంలో ఇలాంటి అంతర్గత యుద్ధం జరగడం కార్య‌కర్త‌ల‌లో, నాయకులలో తీవ్ర ఆందోళన కలిగిస్తోంది.

ఒకదశలో రాష్ట్ర కాంగ్రెస్ పగ్గాలు ఇస్తానన్న, తీసుకొనే ధైర్యం చేయని జీవన్ రెడ్డి, ఎప్పుడూ జగిత్యాల విడువని జీవన్ రెడ్డి ప్రభ మసకబారిపోతుందా? అని ఆయన అనుచరులే ప్రశ్నించుకొంటున్నారు. 

ఆయన తన 45 ఏళ్ళ రాజకీయ జీవితంలో ఎన్ని ఒడిదుడుకులను ఎదుర్కొన్నా, రెండుసార్లు మంత్రిగా ఉన్నా, ఆయన ఒక కొత్త నాయకుణ్ణి తయారు చేయకపోవడమే కాకుండా, ప్రక్కవారినే నమ్మలేని, అభద్రతకు గురవుతూ ఉంటాడని ఆయన అనుచరులే అనుకొంటారు. 

రాష్ట్ర స్థాయిలో అందరికీ పరిచయమే అయినా, అతన్ని అనుసరించే వారు, అతను అనుసరించే నాయకులు లేకపోవడం విశేషం.ఆయన జీవితంలో డిల్లీ కాంగ్రెస్ ఆఫీసు కు వెళ్లిన సందర్భం ఒక్కటే. ఇక ఆయన గాంధీభవన్ దిక్కే చూడరు. అసెంబ్లీ మీడియా పెయింట్ తప్ప, బహుశా ఆయనకు ఇతర ప్రాంతాలతో, నాయకులతో పనిలేనట్లు వ్యవహరిస్తారు. అందుకేనేమో, జగిత్యాల MLA సంజయ్ కుమార్ బిఆర్ఎస్ నుండి గెలిచి, కాంగ్రెస్ లో చేరిన విషయం, పార్టీ ఈయనకు ఏమాత్రం చెప్పలేదు. రాజీనామా చేస్తా అని వేఫిరిస్తే, రెండు రోజుల డ్రామా తరువాత అంతా మరిచిపోయారు.

ఈ నేపథ్యంలో యువతతో పాటు, నిన్నటి వరకు జీవన్ రెడ్డితో ఉన్న, 50 ఏళ్ళక్రితం కాంగ్రెస్ నాయకులు కూడా,ఇప్పుడు సంజయ్ తో కలిసిపోయారు.

2024 ఎన్నికల్లో కాంగ్రెస్ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చినప్పటికీ, జగిత్యాలలో మాత్రం మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఓడిపోవడం అనేక ప్రశ్నలను రేకెత్తించింది. ప్రజల సెంటిమెంట్, స్థానిక రాజకీయ విభజనలు, అంతర్గత పోటీలు అన్నీ కలిసి కాంగ్రెస్ పార్టీని ఇక్కడ బలహీనపరిచాయి.

image (17)

⚔️ జీవన్ రెడ్డి vs డా. సంజయ్ కుమార్ — కాంగ్రెస్‌లో రెండు శక్తులు

బిఆర్ఎస్ పార్టీలో, 2014లో ఎన్నికలకు రెండువారాల ముందు పార్టీలో చేరి, తిక్కట్టు సంపాదించుకొన్న, డా.సంజయ్, అనుభవ రాహిత్యంతో ఓడిపోయినా, రాష్ట్రంలో బి ఆర్ ఎస్ అధికారంలోకి రావడం, నిజామాబాద్ ఎంపీగా కల్వకుంట్ల కవిత గెలవడంతో, స్థానికంగా సంజయ్ బలపడ్డాడు. అధికారిక ప్రొటోకాల్ లేదనే కానీ ఆ ఐదేళ్లు అనధికార ఎమ్మెల్యే గానే అధికారులు పరిగణించారు.

ఆతరువాత, 2018 లో జరిగిన ఎన్నికల్లో కవిత సహకారంతో గెలిచాడు. కానీ ఆమె ఆధిపత్యధోరానిని భరించలేని సంజయ్, కొద్దికొద్దిగా ఆమెకు దూరం అయ్యాడు. అలాగే మిగతా ఎమ్మెల్యేలతో కూడి, ఆమె ఓటమికి తన వంతు పత్రపిషించి, తనకు రాజకీయాలు తెలుసని నిరూపించుకున్నాడు.

ఇక 2023లో, మళ్ళీ టిక్కట్టు పొంది గెలిచినా, పార్టీతో అంతకు ముట్టకుగానే ఉన్నాడు. కవితతో ఉన్న విభేదాల కాల్ కూడా ఈయన బి ఆర్ ఎస్ నుండి బయటకు వచ్చాడని అంటారు. అలాగే 

గత ప్రభుత్వ కాలంలో ఈయన వర్గీయులు చేసిన కాంట్రాక్టులకు సంబంధించి, దాదాపు 350 కోట్ల బిల్లులు పెండింగులో ఉండడం కూడా ,ఈయన్ను కాంగ్రెస్ వైపు మళ్లించాయని ప్రచారం.ఇప్పుడు జగిత్యాలకు మకుటంలేని మహారాజుల, అన్ని తానై రాజకీయాలు చేస్తున్నారు.

1761937676871

కాంగ్రెస్ లో ప్రతిపక్ష ఎమ్మెల్యే సంజయ్ 

ఎన్నికల్లో బి ఆర్ఎస్ టికెట్‌తో గెలిచిన డా. సంజయ్ కుమార్, తరువాత కాంగ్రెస్ ప్రభుత్వానికి మద్దతు ఇస్తున్నానని ప్రకటించినా, పార్టీ ప్రాథమిక సభ్యత్వం ఇంకా స్పష్టతకు రాలేదు.
డా. సంజయ్ మాట్లాడుతూ,“ప్రజల అభివృద్ధే నా లక్ష్యం. పార్టీ పద్ధతులు కంటే ప్రజల అవసరాలు ముఖ్యం,” అని అంటున్నారు.

అయితే ఇది మాజీ మంత్రి జీవన్ రెడ్డి వర్గానికి మింగుడుపడని అంశంగా మారింది. ఆయన పరోక్షంగానే కాకుండా బహిరంగంగానూ సంజయ్ పై విమర్శలు చేస్తున్నారు.
ఇక నియోజకవర్గ స్థాయిలో అధికారులు, ప్రజలు, కార్యకర్తలు డా. సంజయ్‌ను అసలైన అధికారపక్ష ఎమ్మెల్యేగా చూస్తుండడం జీవన్ రెడ్డి స్థాయిని తగ్గించింది.

🧩 అధిష్టానం ఎందుకు జోక్యం చేసుకోవడం లేదు?

జగిత్యాలలో స్పష్టంగా కాంగ్రెస్ పార్టీ రెండు వర్గాలుగా విడిపోయింది.

కాంగ్రెస్ హైకమాండ్ ఈ వివాదంపై ఇప్పటివరకు మౌనం పాటిస్తోంది.ప్రధాన కారణం — డా. సంజయ్ కాంగ్రెస్ అధికారిక సభ్యత్వం రుజువు కాలేదు.
స్పీకర్ ముందు ఆయన ఇంకా బి ఆర్ఎస్ ఎమ్మెల్యేగా నమోదై ఉన్నారు.
అందువల్ల, సాంకేతికంగా కాంగ్రెస్ జోక్యం చేసుకునే స్థితిలో లేదని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

అయితే, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రం జగిత్యాల అభివృద్ధికి నిధులు కేటాయిస్తూ డా. సంజయ్‌కు పరోక్ష ప్రోత్సాహం ఇస్తున్నారనే అభిప్రాయం కాంగ్రెస్ లోపల విస్తరిస్తోంది.

🧨స్థానిక రాజకీయాలు వేడెక్కుతున్నాయి

ఈ అంతర్యుద్ధం కారణంగా పలువురు మాజీ ప్రజాప్రతినిధులు, వార్డు కౌన్సిలర్లు ఇద్దరు నేతల వర్గాలకు దూరంగా ఉండి స్వతంత్ర అభ్యర్థులుగా బరిలోకి దిగేందుకు ప్రయత్నాలు చేస్తున్నారు.
ఇలా కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ కు బలమైన దెబ్బ తగలే అవకాశముందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు.


🔮 భవిష్యత్ దిశ — జీవన్ రెడ్డి & డా. సంజయ్ కుమార్

విశ్లేషకుల అంచనా ప్రకారం:

  • డా. సంజయ్ కుమార్ స్థానికంగా ప్రజా మద్దతు పెంచుకుంటున్నారు. పార్టీ మారకపోయినా, అధికారానుకూల వైఖరి కారణంగా ప్రజా చైతన్యాన్ని నిలబెట్టుకుంటున్నారు.
  • జీవన్ రెడ్డి వర్గం అయితే, ఈ అంతర్యుద్ధం కారణంగా క్రమంగా క్షీణిస్తోంది.
  • కాంగ్రెస్ హైకమాండ్ జోక్యం చేసుకోకపోతే, ఈ విభేదాలు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభావం చూపే అవకాశం ఉంది.

రేపటి రోజుల్లో బి ఆర్ఎస్ నుండి కాంగ్రెస్‌లో చేరిన ఇతర ఎమ్మెల్యేలు కూడా పదవి కోల్పోతే, జగిత్యాల మోడల్ పునరావృతం కావచ్చని పర్యవేక్షకులు చెబుతున్నారు — అంతర్గత విభేదాలు, అధిష్టాన అస్పష్టత, స్థానిక అసంతృప్తి కలిపి కాంగ్రెస్‌కు సవాలుగా మారవచ్చు.

 

Join WhatsApp

More News...

Local News  State News 

కళాకారులకు,కార్మికులకు అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత

కళాకారులకు,కార్మికులకు అండగా ఉంటాం : కల్వకుంట్ల కవిత జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం కరీంనగర్, నవంబర్ 1 (ప్రజా మంటలు): “జాగృతి రాజకీయ వేదికే — కానీ మా రాజకీయాలు ప్రజల కోసం మాత్రమే. సమానత్వం, సామాజిక తెలంగాణ సాధన కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తాం,” అని కవిత గారు స్పష్టం చేశారు. జాగృతి అధ్యక్షురాలు...
Read More...
National  Sports  International  

రేపే మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్

రేపే మహిళల వన్డే ప్రపంచ కప్ క్రికెట్ ఫైనల్ ముంబయి, నవంబర్ 1 (ప్రజా మంటలు): ఐసీసీ మహిళల వన్డే ప్రపంచకప్ ఫైనల్ రేపు (ఆదివారం) డివై పాటిల్ స్టేడియంలో జరగనుంది. భారత్ మరియు దక్షిణాఫ్రికా జట్లు తలపడుతున్న ఈ పోరులో ఏ జట్టు గెలిచినా మొదటిసారిగా ప్రపంచ ఛాంపియన్‌గా అవతరిస్తుంది. ఫైనల్ ముందు శనివారం సాయంత్రం భారత జట్టు కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ మీడియాతో...
Read More...
Crime  State News 

ప్రమాదవశాత్తు ట్యాంకర్ తగిలి ఎఎస్సై మృతి

ప్రమాదవశాత్తు ట్యాంకర్ తగిలి ఎఎస్సై మృతి హైదరాబాద్, నవంబర్ 1 (ప్రజా మంటలు): మేడ్చల్ జిల్లా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పనిచేస్తున్న ఏఎస్సై దేవిసింగ్ రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. వికారాబాద్ జిల్లా పెద్దముల్కు నివాసి అయిన దేవిసింగ్ కొంతకాలంగా పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఏఎస్సైగా విధులు నిర్వహిస్తున్నారు. శనివారం రాత్రి జరిగిన ఈ దుర్ఘటనలో దేవిసింగ్ వాటర్ ట్యాంకర్...
Read More...

తండ్రి పిస్టల్ తో కాల్పులు : ఇంస్టా లొ పోస్ట్ : యువకుని అరెస్ట్

తండ్రి పిస్టల్ తో కాల్పులు :  ఇంస్టా లొ పోస్ట్ : యువకుని అరెస్ట్ దిల్లీ నవంబర్ 01: దీపావళి సందర్భంగా తుపాకీ కాల్పులు చేసి వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన యువకుడిని, అతని తండ్రిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటన ఉత్తర దిల్లీ శాస్త్రి నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది. పోలీసుల సమాచారం ప్రకారం, 22 ఏళ్ల సుమిత్ అనే యువకుడు తన తండ్రి లైసెన్స్‌డ్ తుపాకీతో రెండు...
Read More...
Local News 

హాలోవిన్ సెలబ్రేషన్స్ లో చిన్నా, పెద్దల సందడి

హాలోవిన్ సెలబ్రేషన్స్ లో చిన్నా, పెద్దల సందడి సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజామంటలు): ప్రతి ఏడాది అక్టోబర్ 31న నిర్వహించే హాలోవీన్ వేడుకలు సిటీలోని పలు ప్రాంతాల్లో సందడిగా నిర్వహించారు. గేటేడ్ కమ్యూనిటీ, అపార్ట్ మెంట్ లల్లో చిన్నా,పెద్ద అంతా కలసి హాలోవిన్ వేడుకలను హుషారుగా జరుపుకున్నారు. విద్యార్థులు, యువత భూతాలు, విచిత్ర  వేషదారణతో పాల్గొని సరదాగా గడిపారు. మాస్కులు,కాస్ట్యూమ్ పార్టీలతో సిటీలో పలువురు...
Read More...
Local News 

వేగంగా పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు  : వైద్యుల హెచ్చరిక

వేగంగా పెరుగుతున్న జీర్ణకోశ వ్యాధులు  : వైద్యుల హెచ్చరిక సికింద్రాబాద్, నవంబర్ 01 (ప్రజామంటలు): దక్షిణ భారతదేశంలో జీర్ణకోశ వ్యాధులు వేగంగా పెరుగుతున్నాయని నిపుణులు హెచ్చరించారు. యశోద హాస్పిటల్స్–సికింద్రాబాద్ ఆధ్వర్యంలో యశోద గ్యాస్ట్రోఎంటరాలజీ కాన్ఫరెన్స్–2025 హోటల్‌ మరిగోల్డ్ లో ప్రారంభమైంది. సదస్సును డా. పవన్‌ గోరుకంటి ప్రారంభించారు.అధునాతన ఎండోస్కోపీ, ఇంటర్వెన్షనల్‌ అల్ట్రాసౌండ్‌ విధానాలు యువ వైద్యులకు ఉపయోగకరమని ఆయన అన్నారు. డా. రవి శంకర్ మాట్లాడుతూ..ప్రతి...
Read More...
Local News  State News 

ఇంద్రజాల కళను బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిది

ఇంద్రజాల కళను బతికించుకోవాల్సిన బాధ్యత మనందరిది వరల్డ్ ఫేమస్ మెజీషియన్ సామల వేణుసికింద్రాబాద్ హరిహర కళాభవన్ లో జాదుగర్ సికందర్ షో ప్రారంభం సికింద్రాబాద్, నవంబర్ 01 ( ప్రజామంటలు) : రోజు,రోజుకి అంతరించి పోతున్న ఇంద్రజాల కళను బతికించుకునేందుకు గాను ఇంద్రజాలన్నే నమ్ముకొని జీవిస్తున్న కళాకారులను ప్రోత్సహించాలని వరల్డ్ ఫేమస్  మెజీషియన్ సామల వేణు పిలుపునిచ్చారు. సికింద్రాబాద్ హరిహరకళా భవన్...
Read More...
National  International   State News 

కెనడా, ఫ్రాన్స్ ప్రతినిధి బృందాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ

కెనడా, ఫ్రాన్స్ ప్రతినిధి బృందాలతో సీఎం రేవంత్ రెడ్డి భేటీ హైదరాబాద్, నవంబర్ 1 (ప్రజా మంటలు): తెలంగాణ ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డిని వరుసగా కెనడా మరియు ఫ్రాన్స్ దేశాల ప్రతినిధి బృందాలు మర్యాదపూర్వకంగా కలిశాయి. రాష్ట్రాభివృద్ధి, పెట్టుబడులు, సాంకేతిక సహకారంపై ఈ భేటీలు సాగాయి. 🔹 కెనడా ప్రతినిధి బృందం భేటీ: కెనడా హైకమిషనర్  క్రిస్టోఫర్ కూటర్  నేతృత్వంలోని ప్రతినిధి బృందం ముఖ్యమంత్రిని జూబ్లీహిల్స్...
Read More...
Local News 

మెట్టుపల్లి కోర్టులో నవంబర్ 15 న స్పెషల్ లోక్ అదాలత్.

మెట్టుపల్లి కోర్టులో నవంబర్ 15 న స్పెషల్ లోక్ అదాలత్. మెట్టుపల్లి  నవంబర్ 1 (ప్రజా మంటలు దగ్గుల అశోక్):   మెట్టుపల్లి కోర్టు పరిధిలో ఈ నవంబర్  నెల 15 న నిర్వహిస్తున్న స్పెషల్ లోక్ అదాలత్ ను విజయవంతం చేయాలని మెట్ పల్లి సీనియర్ సివిల్ జడ్జి డి. నాగేశ్వర్ రావు పిలుపునిచ్చారు. శనివారం ఆయన మెట్ పల్లి డివిజన్ పోలీసులతో ప్రత్యేక సమావేశం ఈ...
Read More...

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో విషాదం – తొక్కిసలాటలో 9 మంది మృతి

శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో విషాదం – తొక్కిసలాటలో 9 మంది మృతి ప్రధానాంశాలు: - కాశీబుగ్గ వెంకటేశ్వర ఆలయంలో కార్తీక ఏకాదశి సందర్భంగా తొక్కిసలాట- 9 మంది మృతి, 20 మందికి పైగా గాయాలు- రైలింగ్ విరగడంతో భక్తులు ఒకరిపై ఒకరు పడిపోవడం- ప్రధాని, ముఖ్యమంత్రి సంతాపం- సమగ్ర దర్యాప్తు ఆదేశాలు శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గ నవంబర్ 01: ఈరోజు (శనివారం, నవంబర్...
Read More...

జగిత్యాల జిల్లాలో పంట నష్టం అంచనపై అధికారుల నిర్లక్ష్యంపై జీవన్ రెడ్డి ఆగ్రహం

జగిత్యాల జిల్లాలో పంట నష్టం అంచనపై అధికారుల నిర్లక్ష్యంపై జీవన్ రెడ్డి ఆగ్రహం పత్రికా సమావేశంలో కీలక వ్యాఖ్యలు: రెవెన్యూ, వ్యవసాయ శాఖల మధ్య సమన్వయం లేమి.- ఫీల్డ్ అధికారుల నిర్లక్ష్యం ప్రభుత్వ నమ్మకాన్ని దెబ్బతీస్తోంది.- తడిసిన, మొలకెత్తిన ధాన్యానికి సడలింపులతో కొనుగోలు అవసరం.- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి రైతులను ఆదుకోవాలి. జగిత్యాల (రూరల్) నవంబర్ 01 (ప్రజా మంటలు): సారంగాపూర్ మండలంలోని బట్టపల్లి,...
Read More...
Local News 

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్

వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించిన మార్కెట్ చైర్మన్ బీమా సంతోష్ (అంకం భూమయ్య) గొల్లపల్లి నవంబర్ 01 (ప్రజా మంటలు):  గొల్లపల్లి మండలం రాపల్లి గ్రామంలో  ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (ప్యాక్స్)-గొల్లపల్లి  ఆధ్వర్యంలో  ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని శనివారం మార్కెట్ చైర్మన్ భీమా సంతోష్  ప్రారంభించారు. ఈ సందర్బంగా  మాట్లాడుతూ...మొంథా తుపాన్ కారణంగా నష్టపోయిన రైతులు ఆందోళన చెందవద్దని, ప్రభుత్వం తడిసిన...
Read More...