జగిత్యాల లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి — జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు

On
జగిత్యాల లో ఘనంగా ఇందిరా గాంధీ వర్ధంతి — జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో నివాళులు

ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం

జగిత్యాల (రూరల్), అక్టోబర్ 31 (ప్రజా మంటలు):
మాజీ ప్రధాని ఇందిరా గాంధీ వర్ధంతిని జగిత్యాల జిల్లా కేంద్రంలోని ఇందిరా భవన్ లో ఘనంగా నిర్వహించారు.
ఈ కార్యక్రమాన్ని మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి ఆధ్వర్యంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, యువజన కాంగ్రెస్ నాయకులు, మాజీ ప్రజా ప్రతినిధులు పాల్గొన్నారు.

ఇందిరా భవన్ నుండి పాత బస్టాండ్ వరకు కాంగ్రెస్ పార్టీ జెండాలు పట్టుకుని ర్యాలీగా తరలి, ఇందిరా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు.
ఇందిరా భవన్‌లో ఇందిరా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి, మౌనం పాటించి స్మరించారు.

ఇందిరా గాంధీ అమర్ రహే, మా బేటా కా బలిదాన్ యాది కరే గా హిందుస్థాన్, జీవన్ రెడ్డి జిందాబాద్” అంటూ నినాదాలు ప్రతిధ్వనించాయి.

ఈ సందర్భంగా మాజీ మంత్రి తాటిపర్తి జీవన్ రెడ్డి మాట్లాడుతూ —“దేశ స్వతంత్ర్యం తరువాత దేశ సమగ్రత కోసం ప్రాణత్యాగం చేసిన నాయకురాలు ఇందిరా గాంధీ.ఖలిస్తాన్ ఉగ్రవాదాన్ని అరికట్టేందుకు చర్యలు చేపట్టి ప్రాణాలు అర్పించారు.పాకిస్తాన్ నుంచి ముప్పు తిప్పికొట్టేందుకు ధైర్యంగా నిలబడి, బంగ్లాదేశ్‌ను సృష్టించారని” అన్నారు.

ఆయన ఇంకా పేర్కొన్నారు —

  • “బ్యాంకులను జాతీయం చేసి సామాన్యులకు అందుబాటులోకి తీసుకురావడం ఇందిరమ్మ ఘనత.”
  • “దున్నేవాడిదే భూమి అని యాజమాన్య హక్కులు ఇచ్చి రైతు గౌరవాన్ని కాపాడారు.”
  • “ప్రతి గ్రామంలో భూమి సేకరించి ఇళ్లను నిర్మించిన ఘనత ఇందిరమ్మదే.
    ఇందిరమ్మ గృహ సముదాయం లేని గ్రామం లేదు.”

“ఇందిరమ్మ ప్రారంభించిన పథకాలు నేటి ప్రభుత్వ పథకాలకు మార్గదర్శకాలు అయ్యాయి.
కుల వృత్తుల అభివృద్ధికి, సామాజిక సమానత్వానికి ఆమెలో నమ్మకం ఉండేది.”

ఇందిరమ్మ రాజ్యం – తెలంగాణలో కాంగ్రెస్ విజయం

జీవన్ రెడ్డి వ్యాఖ్యానిస్తూ —“తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావడం అంటే ఇందిరమ్మ రాజ్యం పునరాగమనం.తాగునీటి సమస్యతో నల్లబడ్డ ప్రాంతంలో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిర్మించి సస్యశ్యామలం చేశారు.
పంటలకు మద్దతు ధర కల్పించేందుకు భారత ఆహార సంస్థ (FCI) ఏర్పాటుచేశారు.”

ఇందిరా గాంధీ ఆశయాలు దేశానికి మార్గదర్శకం.
దేశ సమగ్రత కోసం ప్రాణం అర్పించిన మహానాయకురాలిని ప్రతి భారతీయుడు స్మరించుకోవాలని.”కోరారు.IMG-20251031-WA0025

Join WhatsApp

More News...

Local News  Spiritual  

కొత్త గుడిలో భక్తులకు  దర్శనమిచ్చిన వెంకన్న స్వామి

కొత్త గుడిలో భక్తులకు  దర్శనమిచ్చిన వెంకన్న స్వామి శ్రీగిరి వేంకటేశ్వర స్వామి ఆలయాన్ని పున:ప్రారంభించిన పీఠాధిపతులు పలువురు మంత్రులు, ఉన్నతాధికారుల రాక సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) : సీతాఫల్మండి డివిజన్ శ్రీనివాస్ నగర్ లో శ్రీ ప్రసన్న వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శుక్రవారం  జీర్ణోద్దరణ పూర్వక మహా  సంప్రోక్షణ, అష్ట బంధన మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహించి, ఆలయాన్ని పున ప్రారంభించారు. కంచి...
Read More...
Local News  Spiritual  

నేటి నుంచి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 150వ వార్షికోత్సవాలు 

నేటి నుంచి సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ 150వ వార్షికోత్సవాలు  సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు): సికింద్రాబాద్ క్లాక్ టవర్ ప్రాంతంలోని సెంటినరీ బాప్టిస్ట్ చర్చి 150వ వార్షికోత్సవాలను నవంబర్ 1వ తేదీ నుంచి ఘనంగా నిర్వహిస్తున్నట్లు స్టాండింగ్ కమిటీ, జూబ్లీ స్టీరింగ్ కమిటీ చైర్మన్ రాబర్ట్ సూర్య ప్రకాష్ తెలిపారు. శుక్రవారం చర్చి ఆవరణలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చర్చి సీనియర్ పాస్టర్ డాక్టర్...
Read More...
Local News 

కోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రి క్యాంటీన్ ను సీజ్ చేసిన అధికారులు

కోర్టు ఆదేశాలతో గాంధీ ఆసుపత్రి క్యాంటీన్ ను సీజ్ చేసిన అధికారులు సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) : గాంధీ ఆస్పత్రి ఆవరణలోని  పెషీ కేఫ్‌ను కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఆస్పత్రి అధికారులు సీజ్‌చేశారు. నోటీసులు ఇచ్చినా స్పందించకపోవడంతో గాంధీ హాస్పిటల్‌డెవలప్‌మెంట్‌సొసైటీ (హెచ్‌డీఎస్‌) తరఫున అధికారులు కేఫ్‌ లోని సామాన్లు బయటకు తీయించి తాళం వేశారు. ఓపీ బ్లాక్‌ఎదురుగా ఉన్న ఈ కేఫ్‌కాంట్రాక్టు గడువు 2018లో ముగిసినప్పటికీ,...
Read More...
Local News  Spiritual  

స్కందగిరిలో స్వర్ణరథాన్ని ఆవిష్కరించిన కంచి పీఠాధిపతి

స్కందగిరిలో స్వర్ణరథాన్ని ఆవిష్కరించిన కంచి పీఠాధిపతి సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజామంటలు) : పద్మారావు నగర్ లోని శ్రీ స్కందగిరి సుబ్రహ్మణ్యస్వామి దేవాలయంలో భక్తుల విరాళాలతో రూపొందించిన శ్రీ సుబ్రహ్మణ్యస్వామి స్వర్ణ రథాన్ని శుక్రవారం రాత్రి కంచి కామకోటి పీఠాధిపతి శంకరా చార్య శ్రీ శ్రీ శంకర విజయేంద్ర సరస్వతి స్వామి  ప్రారంభించారు. వేద పండితుల సమక్షంలో శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించారు. స్వర్ణ...
Read More...
Local News 

గొల్లపల్లి మండలం పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ 

గొల్లపల్లి మండలం పోలీసు శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ  (అంకం భూమయ్య) గొల్లపల్లి అక్టోబర్ 31 (ప్రజా మంటలు):   గొల్లపల్లి మండలంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని  రన్ ఫర్ యూనిటీ ఐక్యత  కార్యక్రమం ఎస్ఐ కృష్ణా సాగర్ రెడ్డి ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు పోలీస్ సిబ్బంది,ప్రజా ప్రతినిధులు, విద్యార్థులు, క్రీడాకారులు, ,  యువత ఉత్సాహంగా పాల్గొన్నారు. మండల...
Read More...
Local News 

బుగ్గారం  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ 

బుగ్గారం  పోలీస్ శాఖ ఆధ్వర్యంలో రన్ ఫర్ యూనిటీ  (అంకం భూమయ్య)  గొల్లపల్లి అక్టోబర్ 31 (ప్రజా మంటలు): బుగ్గారం మండలంలో  సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని రన్ ఫర్ యూనిటీ (ఐక్యత పరుగు) కార్యక్రమం  ఎస్ఐ ,జి సతీష్ , ఆద్వర్యంలో ఘనంగా నిర్వహించారు పోలీస్ సిబ్బంది, విద్యార్థులు, క్రీడాకారులు, ప్రజా ప్రతినిధులు, మరియు యువత ఉత్సాహంగా...
Read More...
Local News 

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా  " ఫ్రెషర్స్ డే " వేడుకలు

ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఘనంగా   ఇబ్రహీంపట్నం అక్టోబర్ 31 (ప్రజా మంటలు దగ్గుల అశోక్): ఇబ్రహీంపట్నం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో శుక్రవారం రోజున  " ప్రెషర్స్ డే" వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఇబ్రహీంపట్నం మండల తహసిల్దార్ వరప్రసాద్  హాజరై,మాట్లాడుతూ విద్యార్థి జీవితంలో ఇంటర్మీడియట్ విద్య అనేది చాలా కీలకమైనదని ఈ దశలో విద్యార్థులు ఒక పద్ధతి ప్రకారం...
Read More...
Local News 

పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు - ఎక్కడ లేకున్నా స్మశాన వాటికల్లో కనీస సౌకర్యాలు అవసరం

పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదు - ఎక్కడ లేకున్నా స్మశాన వాటికల్లో కనీస సౌకర్యాలు అవసరం సికింద్రాబాద్, అక్టోబర్ 31 (ప్రజా మంటలు ):  పుట్టిన ప్రతి మనిషికి మరణం తప్పదని, మరణించిన మనిషికి మరణించిన మనిషికి సాంప్రదాయ బద్దంగా  అంతిమ వీడ్కోలు పలికే ప్రదేశమే స్మశానవాటిక (గ్రేవ్ యార్డ్) అని మాజీమంత్రి, సనత్ నగర్ ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ అన్నారు. శుక్రవారం బన్సీలాల్ పేట లోని బోయగూడ లో గల...
Read More...
Local News 

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగిస్తాం :కోట నీలిమ

మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలను కొనసాగిస్తాం :కోట నీలిమ  సికింద్రాబాద్,  అక్టోబర్ 31 (ప్రజా మంటలు):  దివంగత మాజీ ప్రధాని ఇందిరా గాంధీ ఆశయాలను మరవకుండా తాము కొనసాగిస్తామని పిసిసి వైస్ ప్రెసిడెంట్ డా.కోట నీలిమ అన్నారు. ఇందిరా గాంధీ వర్ధంతి కార్యక్రమాన్ని శుక్రవారం బన్సీలాల్ పేట శ్రీనివాస హోటల్ వద్ద నిర్వహించారు. అక్కడున్న ఇందిరాగాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్...
Read More...

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఉత్సాహంగా సాగిన “ రన్ ఫర్ యూనిటీ ” :  జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

జాతీయ ఐక్యత దినోత్సవం సందర్భంగా ఉత్సాహంగా సాగిన “ రన్ ఫర్ యూనిటీ ” :   జెండా ఊపి ప్రారంభించిన జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు) జిల్లా పోలీస్ కార్యాలయంలో శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా  జాతీయ ఐక్యత దినోత్సవం పురస్కరించుకొని  “” రన్ ఫర్ యూనిటీ "(ఐక్యత పరుగు) కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. ఈ కార్యక్రమాన్ని జిల్లా ఎస్పి అశోక్ కుమార్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా...
Read More...

దేశ ఐక్యతకు మార్గదర్శకుడైన వల్లభాయ్ పటేల్   స్ఫూర్తిని స్మరించుకుందాం: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్ 

దేశ ఐక్యతకు మార్గదర్శకుడైన వల్లభాయ్ పటేల్   స్ఫూర్తిని స్మరించుకుందాం: జిల్లా ఎస్పీ  అశోక్ కుమార్  జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు)శ్రీ సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి సందర్భంగా ఘనంగా జాతీయ ఐక్యత దినోత్సవం నిర్వహణ .  రాష్ట్రీయ ఏక్తా దివస్ ని పురస్కరించుకుని ఎస్పీ గారి ఆద్వర్యంలో రాస్ట్రియ ఏక్తా  దివస్ ప్రతిజ్ఞ చేయటం జరిగింది. ఈ ప్రతిజ్ఞాలో భాగంగా మన దేశం యొక్క ఐక్యతను, సమగ్రతను...
Read More...
Local News 

నేరం చేస్తే శిక్ష తప్పదు: జిల్లా  ఎస్పీ  అశోక్ కుమార్   నిందితులకు  శిక్ష పడే విధంగా కృషి చేసిన పిపి లను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ 

నేరం చేస్తే శిక్ష తప్పదు: జిల్లా  ఎస్పీ  అశోక్ కుమార్    నిందితులకు  శిక్ష పడే విధంగా కృషి చేసిన పిపి లను అభినందించి ప్రశంసా పత్రాలు అందజేసిన ఎస్పీ  జగిత్యాల అక్టోబర్ 31 ( ప్రజా మంటలు) ఈ సందర్భంగా ఎస్పీ  మాట్లాడుతూ....నిందితులకు శిక్షపడుటలో పోలీసులతో పాటు పబ్లిక్ ప్రాసిక్యూటర్ల కీలకపాత్రని , పోలీసు అధికారులు,పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, సమన్వయo  తో నేరస్థులకు ఖచ్చితంగా శిక్ష పడేవిధంగా కృషి చేయాలని సూచించారు. ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదు పడేలా కృషి చేసి శిక్షల శాతం పెరిగేలా...
Read More...