మల్కాజ్‌గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ

On
మల్కాజ్‌గిరిలో బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ

సిరిసిల్ల. రాజా విక్రాంత్ శర్మ - 9963349493/ 9348322113. 

హైదరాబాద్ 19 ఏప్రిల్ (ప్రజా మంటలు) : 

మల్కాజ్‌గిరి నియోజకవర్గంలోని ఆనంద్ బాగ్, బృందావన్ గార్డెన్‌లో ఈరోజు బ్రాహ్మణ ఆత్మీయ సమ్మేళనం మరియు కృతజ్ఞత అభినందన సభ ఘనంగా నిర్వహించబడింది. 

నేరేడ్మెట్ ప్రాంతంలో బ్రాహ్మణ భవన నిర్మాణం కోసం ఒక ఎకరం స్థలం (భూమి) కేటాయింపును సాధించిన సందర్భంగా, మల్కాజ్‌గిరి శాసనసభ్యులు మర్రి రాజశేఖర్ రెడ్డి ని బ్రాహ్మణ సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఘనంగా సన్మానించాయి.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మర్రి రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ....

  • బ్రాహ్మణులకు భూమి కేటాయించే అవకాశం లభించడం తనకు ఎంతో ఆనందంగా ఉందని, ఈ సేవ ద్వారా తమ రుణాన్ని కొంతవరకు తీర్చుకున్నానని తెలిపారు.
  • ఈ కార్యక్రమాన్ని యజ్ఞంతో సమానంగా భావిస్తూ, బ్రాహ్మణ సమాజ అభివృద్ధికి తాను ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటానని స్పష్టం చేశారు.

అలాగే,

ఈ కార్యక్రమానికి సహకరించిన తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు మరియు మేడ్చల్–మల్కాజ్‌గిరి ఇన్‌చార్జ్ మంత్రి శ్రీ దుద్దిళ్ల శ్రీధర్ బాబు కు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రిటైర్డ్ ముఖ్య కార్యదర్శి ఐ.వై.ఆర్. కృష్ణారావు ఐఏఎస్, శ్రీ రుద్రవీణ బాలసుబ్రమణ్యం, నంద ప్రసాద్, శైలజ, గిరిజ, సూర్యకుమారి, సుధా, భాస్కరరావు, రాజకుమార్, రమణ చారి, కిరణ్ కుమార్, మాధవరావు, సుబ్రహ్మణ్యం, మల్లాది చంద్రమౌళి, సుధాకర్ శర్మ, ప్రభాకర్ రావు, రాంబాబు, శేషాద్రి తదితర ప్రముఖులు పాల్గొన్నారు.

అదనంగా, బ్రాహ్మణ సంఘాల నాయకులు, టీం ఆచార్య సభ్యులు, మాజీ కార్పొరేటర్లు జగదీష్ గౌడ్, మురుగేష్, బీఆర్ఎస్ నాయకులు బద్దం పరుశురాం రెడ్డి, జేఏసీ వెంకన్న, మేకల రాము యాదవ్, సంపత్ యాదవ్, హేమంత్ పటేల్, వంశీ, సాయి గౌడ్ మరియు బ్రాహ్మణ సమాజానికి చెందిన పెద్ద సంఖ్యలో సభ్యులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.

ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా బ్రాహ్మణ సమాజం ఏకతాటిపైకి వచ్చి, సమాజ అభివృద్ధికి కలిసికట్టుగా పనిచేయాలనే సంకల్పాన్ని పునరుద్ఘాటించింది.

Tags
Join WhatsApp

More News...

Local News 

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి   ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి   రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్    జగిత్యాల మే 8(ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బీట్ బజార్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.      సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనుగోలు...
Read More...
Local News 

ఈవీఎం గోదాము  తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఈవీఎం గోదాము  తనిఖీ  భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల మే 8( ప్రజా మంటలు)రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల  ఈవీఎం లను భద్రపరిచిన గోదామును  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.   జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రతినెల...
Read More...
Local News 

కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్‌లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు

కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్‌లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు కరీంనగర్ మే 03 (ప్రజా మంటలు): కరీంనగర్ జ్యోతినగర్‌లోని PMJ జ్యువెలరీ షాప్‌లో పట్టపగలే సంచలన దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో షాప్‌లోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి, భారీగా బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి...
Read More...
Local News 

కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక

కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను...
Read More...
Local News  Crime 

డీసీపీవో హరీష్‌పై కఠిన చర్య – సేవల నుంచి తొలగింపు

డీసీపీవో హరీష్‌పై కఠిన చర్య – సేవల నుంచి తొలగింపు జగిత్యాల, మే 02 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా డీసీపీవో ఎం. హరీష్‌ను సేవల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, మహిళా ఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు వంటి ఆరోపణలు ఆయనపై నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ అంశాలపై గతంలోనే హరీష్‌కు...
Read More...
Local News 

సురభి గోశాల, తాటిపల్లిలో భక్తిశ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

సురభి గోశాల, తాటిపల్లిలో భక్తిశ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జగిత్యాల మే1(ప్రజా మంటలు)సురభి గోశాలలో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విజయవంతంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ముగిసింది. 11 మంది దంపతులు కలసి, ఒకే సంకల్పంతో, ఒకే భక్తితో వ్రతం నిర్వహించడం చూడటం నిజంగా హృదయానికి హత్తుకునే అనుభూతనీ నిర్వాహకులు అన్నారు. మొదట గోమాతకు పూజలు చేసి, అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముని...
Read More...
State News 

సర్వోదయ తెలంగాణ” – ఉచిత విద్య, వైద్యం, 4 లక్షల ఉద్యోగాల హామీ!

సర్వోదయ తెలంగాణ” – ఉచిత విద్య, వైద్యం, 4 లక్షల ఉద్యోగాల హామీ!   హైదరాబాద్ మే 02 (ప్రజా మంటలు):    తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా “తెలంగాణ రక్షణ సేన”ను ప్రారంభించిన కల్వకుంట్ల కవిత, సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై పోరాటం చేస్తామని మీట్ ది ప్రెస్ లో  తెలిపారు. “సర్వోదయ తెలంగాణ కోసం పాంచజన్యం మార్గంలో...
Read More...
Local News 

ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు

ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు  శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు    జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు)  పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా   నవగ్రహ పూజా  అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో...
Read More...
Local News 

కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం 

కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం     కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది  బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం  హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్...
Read More...
Local News 

సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత

సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి...
Read More...
Local News 

ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు

ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత...
Read More...
Local News 

ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం

ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)  పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్
Read More...