పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ వ్యతిరేకంగా రైతుల ఆందోళన.. వికారాబాద్‌లో కవిత అరెస్ట్
వికారాబాద్, ఏప్రిల్ 15 (ప్రజా మంటలు):
పరిగి ఇండస్ట్రియల్ కారిడార్ కోసం రైతుల భూములను బలవంతంగా స్వాధీనం చేసుకోవడాన్ని నిరసిస్తూ వికారాబాద్‌లో రైతులు, తెలంగాణ జాగృతి, ధర్మ సమాజ్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. ఆర్డీవో కార్యాలయం ఎదుట ఎండలో కూర్చొని ధర్నా నిర్వహించారు.
ఈ ఆందోళనలో పాల్గొన్న తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత, ధర్మ సమాజ్ పార్టీ నేత విశారదన్ మహరాజ్‌తో కలిసి రైతులకు మద్దతుగా నిలిచారు. ఈ సందర్భంగా పోలీసులుతో వాగ్వాదం చోటుచేసుకుంది. ఆందోళన తీవ్రరూపం దాల్చడంతో కవితను పోలీసులు అరెస్ట్ చేసి బంటారం పోలీస్ స్టేషన్‌కు తరలించారు.
పరిశ్రమల పేరుతో చిన్న, సన్నకారు రైతుల భూములను లాక్కుంటున్నారని కవిత విమర్శించారు. కల్లాపూర్, రాపోల్, భట్ల చందారం గ్రామాల్లో రైతుల భూములు స్వాధీనం చేసుకుంటున్నారని, దాదాపు 1200 ఎకరాలు తీసుకుంటున్నారని పేర్కొన్నారు. అందులో ఎక్కువ భాగం అసైన్డ్ భూములేనని, మిగతా భూములు కూడా ఎస్సీ, ఎస్టీ, బీసీ రైతులవేనని తెలిపారు.
రాష్ట్రంలో రైతుల పరిస్థితి దయనీయంగా ఉందని, కొందరికి మద్దతు ధర లేదని, మరికొందరికి రుణమాఫీ జరగలేదని, ఎక్కడ చూసినా సమస్యలే కనిపిస్తున్నాయని అన్నారు. పరిశ్రమల వల్ల స్థానికులకు ఉద్యోగాలు కూడా దక్కడం లేదని ఆరోపించారు.
రైతుల సమస్యలపై జిల్లా కలెక్టర్‌తో ఫోన్‌లో మాట్లాడిన కవిత, స్వయంగా గ్రామాలకు వెళ్లి రైతుల బాధలు తెలుసుకోవాలని కోరారు. అయితే స్పష్టమైన హామీ ఇవ్వకపోవడంతో ఆందోళన కొనసాగుతుందని తెలిపారు.
ధర్నా సమయంలో జర్నలిస్టులపై పోలీసులు దురుసుగా ప్రవర్తించారని ఆరోపణలు వచ్చాయి. కెమెరాలు లాక్కొని నెట్టేసిన ఘటనలు చోటుచేసుకున్నాయి.
భూసేకరణను నిలిపివేసే వరకు పోరాటం కొనసాగిస్తామని ఆందోళనకారులు స్పష్టం చేశారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల మే 8(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని బీట్ బజార్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కొనుగోలు... ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల మే 8( ప్రజా మంటలు)రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ప్రతినెల... కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్‌లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు
కరీంనగర్ మే 03 (ప్రజా మంటలు):
కరీంనగర్ జ్యోతినగర్‌లోని PMJ జ్యువెలరీ షాప్‌లో పట్టపగలే సంచలన దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో షాప్‌లోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి, భారీగా బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి... కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక
హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను... డీసీపీవో హరీష్‌పై కఠిన చర్య – సేవల నుంచి తొలగింపు
జగిత్యాల, మే 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా డీసీపీవో ఎం. హరీష్‌ను సేవల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, మహిళా ఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు వంటి ఆరోపణలు ఆయనపై నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ అంశాలపై గతంలోనే హరీష్‌కు... సురభి గోశాల, తాటిపల్లిలో భక్తిశ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు
జగిత్యాల మే1(ప్రజా మంటలు)సురభి గోశాలలో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విజయవంతంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ముగిసింది. 11 మంది దంపతులు కలసి, ఒకే సంకల్పంతో, ఒకే భక్తితో వ్రతం నిర్వహించడం చూడటం నిజంగా హృదయానికి హత్తుకునే అనుభూతనీ నిర్వాహకులు అన్నారు.
మొదట గోమాతకు పూజలు చేసి, అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముని... సర్వోదయ తెలంగాణ” – ఉచిత విద్య, వైద్యం, 4 లక్షల ఉద్యోగాల హామీ!
హైదరాబాద్ మే 02 (ప్రజా మంటలు):
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా “తెలంగాణ రక్షణ సేన”ను ప్రారంభించిన కల్వకుంట్ల కవిత, సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై పోరాటం చేస్తామని మీట్ ది ప్రెస్ లో
తెలిపారు.
“సర్వోదయ తెలంగాణ కోసం పాంచజన్యం మార్గంలో... ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవగ్రహ పూజా అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో... కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం
కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్... సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి... ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత... ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్ 