కష్టపడిన ప్రతి కార్యకర్తకు అండగా నిలుస్తాం రాష్ట్ర మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల ఏప్రిల్ 11 ( ప్రజా మంటలు)
ప్రజల మధ్యలో ఉంటాం.. మరో మారు అధికారంలోకి వస్తాం..
జీవన్ రెడ్డి పై మంత్రి మరో మారు ఫైర్..
రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
పార్టీ కోసం పనిచేసిన ప్రతి కార్యకర్తకు కాంగ్రెస్ పార్టీ అండగా నిలుస్తుందని రాష్ట్ర సాంఘీక సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. జగిత్యాల జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ పదవి ప్రమాణ స్వీకారం, అభినందన సభ జగిత్యాల జిల్లా కేంద్రంలో ని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్ లో రాష్ట్ర గ్రంథాలయ పరిషత్ అధ్యక్షులు రియాజ్ అహ్మద్ దినేష్ తో ప్రమాణస్వీకారం చేయించారు.
జరిగిన కార్యక్రమానికి మంత్రి అడ్లూరి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
ఈ సందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా పనిచేస్తూ గెలిచిన, ఓడిన ప్రజల మధ్యనే ఉంటూ ముందుకు సాగానని అన్నారు. అనేక అవమానాలు ఎదుర్కొంటూ ఎన్నికల్లో ఓటమి చెందిన అధైర్య పడకుండా కాంగ్రెస్ పార్టీ జెండాను నమ్ముకొని ముందుకు సాగినట్లు మంత్రి తెలిపారు. పార్టీలో కమిట్మెంట్ గా పని చేశాను కనుక నేడు క్యాబినెట్ లో పని చేసే అవకాశం దక్కిందని మంత్రి అడ్లూరి అన్నారు.
బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో తనకు అనేక ఆఫర్లు ఇచ్చిందని అయినప్పటికీ ఏలాంటి ఆఫర్లను లొంగకుండా కాంగ్రెస్ పార్టీలో కొనసాగానని మంత్రి అడ్లూరి అన్నారు. జగిత్యాల జిల్లాలో పనిచేస్తున్న ప్రతి కార్యకర్తకు సరైన సమయంలో గుర్తింపు లభిస్తుందని ఎవరు నిరాశ పడవద్దని మంత్రి అన్నారు.
రాష్ట్రంలో రేవంత్ పాలన పోవాలి.. మార్పు రావాలి అని జీవన్ రెడ్డి నినాదం ఎత్తుకున్నారని ఎందుకు మార్పు రావాలి అని మంత్రి ప్రశ్నించారు. రాష్ట్రంలో సన్నబియ్యం పథకం అమలు చేస్తున్నందుకు మార్పు రావాలా.. ? అర్హులకు రేషన్ కార్డు లు అందించినందుకు మార్పు రావాలా..? నిరుపేదలకు ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చినందుకు మార్పు రావాలా.. ? మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించినందుకు మార్పు రావాలా ..? అని జీవన్ రెడ్డిని మంత్రి అడ్లూరి ప్రశ్నించారు.
ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతాం
కాంగ్రెస్ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చుతామని రానున్న రోజుల్లో నిత్యం ప్రజల మధ్య ఉంటూ రాష్ట్రంలో మరో మారు అధికారంలోకి వస్తామని మంత్రి లక్ష్మణ్ కుమార్ అన్నారు. 2029లో సైతం రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందని రేవంత్ రెడ్డి మంత్రి అడ్లూరి స్పష్టం చేశారు.
కొత్తగా గ్రంధాలయ సంస్థ చైర్మన్ గా ఎన్నికైన సంగనభట్ల దినేష్ కు మంత్రి శుభాకాంక్షలు తెలిపారు.
జిల్లాలోని అన్ని గ్రంథాలయాలను ఆధునికరిస్తా

జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన దినేష్ తనపై ఉంచిన నమ్మకాన్ని వమ్ము చేయకుండా జిల్లాలోని అన్ని గ్రంధాలయాలను ఆధునీకరిస్తానని ప్రతిజ్ఞ చేశారు జగిత్యాల జిల్లాను రాష్ట్రంలోని ఆదర్శవంతమైన జ్ఞాన జిల్లాగా తీర్చిదిద్దడమే తన ఆశయమని పేర్కొన్నారు ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న జిల్లా కేంద్ర గ్రంథాలయ భవనాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తిచేయాలని అక్కడ అత్యాధునిక డిజిటల్ వసతులు ఏసి రీడింగ్ రూములు వైఫై సదుపాయం కల్పించాలని ఈ సందర్భంగా మంత్రిని కోరారు
పేద విద్యార్థులకు ఉచితంగా స్టడీ మెటీరియల్ అందించేలా ప్రణాళికలు రూపొందిస్తామని వెల్లడించారు.
కార్యక్రమంలో ప్రభుత్వ విఫ్ ఆది శ్రీనివాస్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్, జగిత్యాల మున్సిపల్ చైర్మన్ సమిండ్ల వాణి, ధర్మపురి మున్సిపల్ చైర్ పర్సన్ వేముల నాగలక్ష్మి,పిసిసి ప్రధాన కార్యదర్శి దుద్దిళ్ల శ్రీను బాబుతో పాటు ధర్మపురి మున్సిపల్ వైస్ చైర్మన్ ఇందారపు రామయ్య జగిత్యాల మాజీ మున్సిపల్ చైర్మన్ గిరి నాగ భూషణం తాజా మాజీ మున్సిపల్ చైర్ పర్సన్ అడువాల జ్యోతి మాజీ జిల్లా గ్రంధాలయ చైర్మన్ డాక్టర్ చంద్రశేఖర్ గౌడ్, బండ శంకర్ జగిత్యాల జిల్లాకు చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలు పాల్గొన్నారు.
More News...
<%- node_title %>
<%- node_title %>
మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
జగిత్యాల మే 8(ప్రజా మంటలు)
జిల్లా కేంద్రంలోని బీట్ బజార్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.
సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
కొనుగోలు... ఈవీఎం గోదాము తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
జగిత్యాల మే 8( ప్రజా మంటలు)రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల ఈవీఎం లను భద్రపరిచిన గోదామును తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.
జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్
ప్రతినెల... కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్‌లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు
కరీంనగర్ మే 03 (ప్రజా మంటలు):
కరీంనగర్ జ్యోతినగర్‌లోని PMJ జ్యువెలరీ షాప్‌లో పట్టపగలే సంచలన దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో షాప్‌లోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి, భారీగా బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి... కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక
హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు):
తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను... డీసీపీవో హరీష్‌పై కఠిన చర్య – సేవల నుంచి తొలగింపు
జగిత్యాల, మే 02 (ప్రజా మంటలు):
జగిత్యాల జిల్లా డీసీపీవో ఎం. హరీష్‌ను సేవల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, మహిళా ఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు వంటి ఆరోపణలు ఆయనపై నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ అంశాలపై గతంలోనే హరీష్‌కు... సురభి గోశాల, తాటిపల్లిలో భక్తిశ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు
జగిత్యాల మే1(ప్రజా మంటలు)సురభి గోశాలలో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విజయవంతంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ముగిసింది. 11 మంది దంపతులు కలసి, ఒకే సంకల్పంతో, ఒకే భక్తితో వ్రతం నిర్వహించడం చూడటం నిజంగా హృదయానికి హత్తుకునే అనుభూతనీ నిర్వాహకులు అన్నారు.
మొదట గోమాతకు పూజలు చేసి, అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముని... సర్వోదయ తెలంగాణ” – ఉచిత విద్య, వైద్యం, 4 లక్షల ఉద్యోగాల హామీ!
హైదరాబాద్ మే 02 (ప్రజా మంటలు):
తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా “తెలంగాణ రక్షణ సేన”ను ప్రారంభించిన కల్వకుంట్ల కవిత, సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై పోరాటం చేస్తామని మీట్ ది ప్రెస్ లో
తెలిపారు.
“సర్వోదయ తెలంగాణ కోసం పాంచజన్యం మార్గంలో... ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు
జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు) పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా నవగ్రహ పూజా అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో... కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం
కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు)
జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్... సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత
హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు):
జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి... ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత... ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం
జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్ 