ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతం_ శ్రీశ్రీశ్రీ విశ్వకతీర్థ స్వామీజీ

On


జగిత్యాల ఏప్రిల్ 16 (ప్రజా మంటలు)
ఈ పుణ్య భూమిలో పుట్టడం మన పూర్వజన్మ సుకృతమని శ్రీ శ్రీ శ్రీ విశ్వక తీర్థ స్వామీజీ అన్నారు.
ఈ భూమిపై పుట్టిన వారికి ఇద్దరు తల్లులు ఒకరు కన్నతల్లి ఆమెకు పుట్టిన వారిని పోషిస్తుంది మరొకరు భూమాత ఆమె భారత మాత పుట్టిన నుండి గిట్టిన తర్వాత కూడా తన ఒడిలోకే తీసుకుంటుందని శ్రీశ్రీ విశ్వకతీర్థ స్వామీజీ అన్నారు

IMG-20260417-WA0083

ధరూర్ క్యాంప్ బస్తీ హిందూ సమ్మేళన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు గురువారం రాత్రి జిల్లా కేంద్రంలోని ధరూర్ క్యాంప్ గ్రౌండ్లో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరయ్యారు .సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ అప్పాల ప్రసాద్, హిందూ సమ్మేళనం గౌరవాధ్యక్షులు సభాపతి తిగుళ్ల విశ్వనాథ శర్మతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు.

IMG-20260416-WA0175

కార్యక్రమంలో భాగంగా గోపూజ నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామీజీ మాట్లాడుతూఈ భూమిపై జన్మించడం మన పూర్వ పుణ్య సుకృతం అని కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు దేవతలే నిర్మించిన స్థానము హిందుస్థానమని ఇక్కడ పుట్టిన వారు హిందువులని ఆయన అన్నారు. 600 సంవత్సరాల క్రితం విగ్రహాలను దేవాలయాలను ధ్వంసం చేస్తున్నప్పుడు ఆ దృశ్యం చూసిన పది సంవత్సరాల పాప విలవిలలాడిందని అలాంటి ఆధ్యాత్మిక భావన ఉన్న దేశం మన దేశం అని అన్నారు.

IMG-20260416-WA0176

ఎందరో ఋషులు మహనీయులు మునులు జన్మించిన మనదేశంలో సంతు నాందేవ్ ఒక్కరు అని ఆయన ఒక రోజు ప్రయాణిస్తున్న సమయంలో ఎండ సమయంలో ఓ చెట్టు కింద ఆగి తన వెంట తెచ్చుకున్న రొట్టెలు తిందామని అనుకున్న సమయంలో అక్కడికి కుక్క వచ్చి ఆ రొట్టెను లాక్కొని వెళ్లిందని సంతు నాందేవ్ అది చూసి బాధపడుతూ అది  వారం రోజుల కింద రొట్టె దానిని నేతిలో ముంచుకొని తినాల్సిందని కానీ కుక్క ఆ ఎండు రొట్టెను తిన్నట్లయితే దానికి నొప్పి కలుగుతుందని భావించి నేతిని తీసుకొని పరిగెత్తారని గుర్తు చేశారు. ఆ కుక్కలోనే భగవంతుని చూసిన వారని అన్నారు. అంతేకాకుండా సంత్ ఏకనాథ్ కాశి లోని గంగా జలాలను 108 కలశాలలో సేకరించి రామేశ్వరంలోని పరమశివుని పూజించడానికి కావడి పై పాదయాత్రగా తీసుకుని వెళుతుండగా మార్గమధ్యంలో ఓ గాడిద దాహం వేస్తూ పడిపోయి ఉండడాన్ని చూసి పరమశివునికి అభిషేకించాల్సిన గంగా నది జలాలను గాడిదకు సమర్పించి గాడిదలో శివుడిని చూసుకున్న మహనీయుడని గుర్తు చేశారు. చెట్టును పుట్టను పూజించడం చీమలకు చక్కరవేయడం మన సంస్కృతి అని గొప్ప సంస్కృతి మన మన సనాతన ధర్మము నుండి వచ్చిందని అన్నారు.

IMG-20260416-WA0174

కార్యక్రమంలో ప్రధాన వక్తగా పాల్గొన్న అప్పాల ప్రసాద్ సామాజిక సమరసత వేదిక రాష్ట్ర కన్వీనర్ మాట్లాడుతూ రాబోయే శతాబ్దం భారతీయ  శతాబ్దమని అన్నారు. సుగంధ ద్రవ్యాల వ్యాపారం చేసిన ఎన్నో దేశాలతో మన దేశం పడవల్లో వ్యాపారం చేసిందని ఆయా దేశాల సంస్కృతులు అంతరించినప్పటికీ ప్రస్తుతం హిందూ సంస్కృతి మాత్రమే కొనసాగుతున్నదని అన్నారు. కుటుంబం విచ్చిన్నమైతే హిందూ దేశం ప్రపంచంలోనే ఉండదని అన్నారు. హిందూ సమ్మేళనం అనేది ఒక ఉద్యమం 7,50,000 గ్రామాలను కలిపి లక్ష హిందు సమ్మేళనాలు కులాలకు అతీతంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇది భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అన్నారు. కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు జైశ్రీరామ్ అని పలికే ఏకైక దేశం భారతదేశమని ఇద్దరు స్త్రీపురుషుల కళ్యాణం ప్రపంచమంతా చూస్తుందని వారే సీతారాములని సీతారాముల కల్యాణాన్ని ప్రపంచంలోని దేశాలన్నీ చూసి పండుగ జరుపుకుంటున్నారని అన్నారు. ఇండోనేషియా ముస్లిం దేశమైనప్పటికీ అధికారులు తమ కార్యాలయంలో శ్రీరామ పట్టాభిషేకం చిత్రాలు ఉంచుకుంటారని గుర్తు చేశారు. ఒకప్పుడు పాకిస్తాన్ అధ్యక్షుడు ఇండోనేషియా వచ్చినప్పుడు ఆంజనేయుని భారీ విగ్రహం చూసి ఇండోనేషియా రాష్ట్రపతిని ఉద్దేశించి మాట్లాడుతూ మనం ముస్లింలము హిందూ దేవుడైన ఆంజనేయుని విగ్రహం ఎందుకు ఏర్పాటు చేస్తారని అడగగా ఇండోనేషియా రాష్ట్రపతి జవాబిస్తూ తాము మొదట హిందువులమని తదుపరి మతం మార్చుకున్నామని తాము శ్రీరాముని ఆంజనేయుని మాత్రం మార్చుకోలేదని చెప్పడంతో పాకిస్తాన్ అధ్యక్షుడు వీస్తూ పోయాడు అన్నారు.

 

కార్యక్రమంలో భాగంగా సిద్ధార్థ పాఠశాల డైరెక్టర్ హరిచరణ్ రావు నేతృత్వంలో వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు ఎంతగానో ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో నాందిగా సంగనభట్ల నరేందర్ శర్మ దంపతులచే హనుమాన్ చాలీసా పఠన కార్యక్రమం జరిగింది.

 ధరూర్ క్యాంప్ బస్తి హిందూ సమ్మేళన కార్యనిర్వాహణ కమిటీ అధ్యక్షులు విశ్రాంత తాసిల్దార్ రాజ్ మనోహర్ రెడ్డి ఉపన్యాసకురాలు జ్యోత్స్న ,విశేష సంఖ్యలో హిందూ బంధువులు మహిళలు హిందూ సమ్మేళనం కమిటీ సభ్యులు పాల్గొన్నారు.

Tags
Join WhatsApp

More News...

Local News 

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్

మొక్కజొన్న కొనుగోలు ప్రక్రియ పారదర్శకంగా నిర్వహించాలి   ధాన్యం కొనుగోళ్లు వేగవంతం చేయాలి   రాష్ట్ర సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్    జగిత్యాల మే 8(ప్రజా మంటలు) జిల్లా కేంద్రంలోని బీట్ బజార్‌లో ఏర్పాటు చేసిన మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్, జగిత్యాల ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్ కుమార్,జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ తో కలిసి శుక్రవారం పరిశీలించారు.      సంక్షేమ శాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ కొనుగోలు...
Read More...
Local News 

ఈవీఎం గోదాము  తనిఖీ భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్

ఈవీఎం గోదాము  తనిఖీ  భద్రత ఏర్పాట్లు, సిసి కెమెరాల పనితీరులను పరిశీలించిన జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ జగిత్యాల మే 8( ప్రజా మంటలు)రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ఆదేశాల మేరకు శుక్రవారం రోజున జిల్లా ఎన్నికల అధికారి మరియు జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ దరూర్ క్యాంప్ లో గల  ఈవీఎం లను భద్రపరిచిన గోదామును  తనిఖీ చేసిన జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్.   జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ ప్రతినెల...
Read More...
Local News 

కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్‌లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు

కరీంనగర్ PMJ జ్యువెలరీ షాప్‌లో కాల్పులతో దోపిడీ – 5 మంది నిందితుల కోసం 12 బృందాల గాలింపు కరీంనగర్ మే 03 (ప్రజా మంటలు): కరీంనగర్ జ్యోతినగర్‌లోని PMJ జ్యువెలరీ షాప్‌లో పట్టపగలే సంచలన దోపిడీ జరిగింది. ఐదుగురు దుండగులు తుపాకులతో షాప్‌లోకి చొరబడి సిబ్బందిపై కాల్పులు జరిపి, భారీగా బంగారు ఆభరణాలు దోచుకుని పరారయ్యారు. గాయపడిన సిబ్బందిని ఆసుపత్రికి తరలించగా, వారి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. ఘటన స్థలాన్ని కేంద్ర మంత్రి...
Read More...
Local News 

కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక

కవితపై విమర్శలు చేస్తే ఊరుకోం: టీఆర్ఎస్ నేతల హెచ్చరిక హైదరాబాద్, మే 03 (ప్రజా మంటలు): తెలంగాణ రక్షణ సేన (టీఆర్ఎస్) రాష్ట్ర నాయకులు నిర్వహించిన ప్రెస్ మీట్‌లో బీఆర్ఎస్ నాయకత్వంపై తీవ్ర విమర్శలు గుప్పించారు. టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు శ్రీకాంత్ గౌడ్ మాట్లాడుతూ, కవిత గారి పెరుగుతున్న ప్రజాదరణను చూసి బీఆర్ఎస్ నేతలు భయపడుతున్నారని వ్యాఖ్యానించారు.కవిత గారిపై కేపీ వివేకానంద చేసిన వ్యాఖ్యలను...
Read More...
Local News  Crime 

డీసీపీవో హరీష్‌పై కఠిన చర్య – సేవల నుంచి తొలగింపు

డీసీపీవో హరీష్‌పై కఠిన చర్య – సేవల నుంచి తొలగింపు జగిత్యాల, మే 02 (ప్రజా మంటలు): జగిత్యాల జిల్లా డీసీపీవో ఎం. హరీష్‌ను సేవల నుంచి శాశ్వతంగా తొలగిస్తూ జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ ఉత్తర్వులు జారీ చేశారు. అధికార దుర్వినియోగం, మహిళా ఉద్యోగులపై వేధింపులు, హాజరు రికార్డుల్లో మార్పులు వంటి ఆరోపణలు ఆయనపై నిర్ధారణ కావడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు.ఈ అంశాలపై గతంలోనే హరీష్‌కు...
Read More...
Local News 

సురభి గోశాల, తాటిపల్లిలో భక్తిశ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు

సురభి గోశాల, తాటిపల్లిలో భక్తిశ్రద్ధలతో సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతాలు జగిత్యాల మే1(ప్రజా మంటలు)సురభి గోశాలలో నిర్వహించిన సామూహిక శ్రీ సత్యనారాయణ స్వామి వ్రతం విజయవంతంగా, ఎంతో భక్తి శ్రద్ధలతో ముగిసింది. 11 మంది దంపతులు కలసి, ఒకే సంకల్పంతో, ఒకే భక్తితో వ్రతం నిర్వహించడం చూడటం నిజంగా హృదయానికి హత్తుకునే అనుభూతనీ నిర్వాహకులు అన్నారు. మొదట గోమాతకు పూజలు చేసి, అనంతరం శ్రీకృష్ణ పరమాత్ముని...
Read More...
State News 

సర్వోదయ తెలంగాణ” – ఉచిత విద్య, వైద్యం, 4 లక్షల ఉద్యోగాల హామీ!

సర్వోదయ తెలంగాణ” – ఉచిత విద్య, వైద్యం, 4 లక్షల ఉద్యోగాల హామీ!   హైదరాబాద్ మే 02 (ప్రజా మంటలు):    తెలంగాణలో కొత్త రాజకీయ శక్తిగా “తెలంగాణ రక్షణ సేన”ను ప్రారంభించిన కల్వకుంట్ల కవిత, సర్వోదయ తెలంగాణ లక్ష్యంగా ముందుకు వెళ్తున్నట్లు ప్రకటించారు. ఈ వేదిక ద్వారా రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలపై పోరాటం చేస్తామని మీట్ ది ప్రెస్ లో  తెలిపారు. “సర్వోదయ తెలంగాణ కోసం పాంచజన్యం మార్గంలో...
Read More...
Local News 

ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు

ఘనంగా శ్రీ వేణుగోపాల స్వామి బ్రహ్మోత్సవాల ప్రత్యేక వేడుకలు  శ్రీ నరసింహ స్వామి జయంతి ప్రత్యేక వేడుకలు    జగిత్యాల ఏప్రిల్ 30 (ప్రజా మంటలు)  పట్టణంలోని శ్రీ వేణుగోపాలస్వామి ఆలయంలో గురువారం ఉదయం 11 గంటలకు బ్రహ్మోత్సవ వేడుకల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలను నిర్వహించి అనంతరం శ్రీ లక్ష్మీనరసింహ జయంతి సందర్భంగా స్వామివారికి ప్రత్యేక అభిషేకాలు నిర్వహించారు. ఈ బ్రహ్మోత్సవాల్లో భాగంగా   నవగ్రహ పూజా  అలాగే సంతాన గోపాల హోమ పూజా కార్యక్రమంలో...
Read More...
Local News 

కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం 

కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్ కుమార్ కు ప్రతిష్టాత్మక దళిత రత్న పురస్కారం     కోరుట్ల, ఏప్రిల్ 30(ప్రజా మంటలు) జగిత్యాల జిల్లా కోరుట్ల పట్టణానికి చెందిన సీనియర్ న్యాయవాది  బైరి విజయ్ కుమార్ దళిత రత్న పురస్కారం అందించారు. గురువారం  హైదరాబాద్‌లోని రవీంద్ర భారతిలో డా. బాబు జగ్జీవన్ రామ్, డా. బి.ఆర్. అంబేద్కర్ జయంతి ఉత్సవాల కమిటీ ఆధ్వర్యంలో కోరుట్ల బార్ అసోసియేషన్ సీనియర్ న్యాయవాది బైరి విజయ్...
Read More...
Local News 

సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత

సినీ దర్శకుడు బండి రఘురాం కన్నుమూత హైదరాబాద్, ఏప్రిల్ 30 (ప్రజా మంటలు): జగిత్యాలకు చెందిన సినీ దర్శకుడు బండి రఘురాం ఏప్రిల్ 28న కన్నుమూశారు. హైదరాబాద్‌లోని యూసుఫ్‌గూడలో నివాసముంటున్న ఆయన సాయంత్రం పార్క్‌లో నడుస్తూ ఒక్కసారిగా కుప్పకూలిపోయారు. గుండెపోటుతో మృతిచెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయన మృతి సినీ, జర్నలిజం వర్గాల్లో తీవ్ర విషాదాన్ని నింపింది.రఘురాం జగిత్యాలకు చెందిన బండి...
Read More...
Local News 

ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు

ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ ఎస్ ఎస్ సి ర్యాంకర్లకు అభినందనలు జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు) జిల్లా కేంద్రానికి చెందిన ఎస్ ఎస్ ఎస్ ఎం హై స్కూల్ కు చెందిన సింగిడి చక్రిత 561/600, ఎంబారి చరణ్ 547/600 బుధవారం విడుదలైన ఎస్ఎస్సి ఫలితాలలో ఉత్తమ మార్కులు సాధించినారు. 500 పైబడి 45 శాతం విద్యార్థులు ఫలితాలు సాధించారు. 100% విద్యార్థులు ఉత్తీర్ణత...
Read More...
Local News 

ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం

ఎస్ఎస్ఎస్సి లో578/600 మార్కులు సాధించిన పాలెపు హాసిని శర్మను అభినందించిన పాఠశాల యాజమాన్యం జగిత్యాల ఏప్రిల్ 29 ( ప్రజా మంటలు)  పొలాస గ్రామానికి చెందిన పాలెపు రాజు కూతురు పాలెపు హాసిని శర్మ జిల్లా కేంద్రంలోని శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాలలో చదువుచున్నది. బుధవారం విడుదలైన ఎస్ఎస్ఎస్సి ఫలితాలలో 578/600 మార్కులు సాధించింది. ఈ సందర్భంగా శ్రీనిధి ఒలంపియాడ్ పాఠశాల కరస్పాండెంట్ ఎం రాజేందర్ ప్రిన్సిపల్ మేఘమాల డైరెక్టర్
Read More...